
లక్నో: కుర్చీలో కూర్చొని సేద తీరుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు 35 ఏళ్ల జిమ్ ట్రైనర్. అందరూ చూస్తుండగానే క్షణాల్లో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని షహీద్ నగర్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని అదిల్‌గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదిల్ మృతితో కుంటుబసభ్యులతో అందరూ షాక్‌కు గురయ్యారని అతని స్నేహితుడు పరాగ్ చౌదరి తెలిపాడు. అదిల్‌కు సొంతంగా జిమ్ ఉండేదని, జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ప్రతిరోజు జిమ్‌కు వెళ్లేవాడని తెలిపాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడని పేర్కొన్నాడు. అదిల్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
एक और मौत LIVE-
— Narendra nath mishra (@iamnarendranath) October 19, 2022
कल ग़ाज़ियाबाद में 35 साल का एक जिम ट्रेनर सामान्य दिनों की तरह अपनी कुर्सी पर बैठा और वहीं हार्ट अटैक से उसकी मौत हो गई। सेकंड में मौत pic.twitter.com/7TX5di258X
చదవండి: ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదిన యువకుడు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment