chair
-
కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల?
పెనుకొండ: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది పెనుకొండ సబ్‌జైలు అధికారుల తీరు. రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ ఇచ్చినా... విడుదలకు మాత్రం సబ్‌జైలు అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒకే ఊరికి చెందిన కొందరు రిమాండ్ ఖైదీలను విడుదల చేసేందుకు రూ.8 వేల విలువైన కుర్చీ డిమాండ్ చేశారు. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్‌జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా, వారు తీసుకువెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్తచెరువు మండలానికి చెందిన కొందరిని నెల రోజుల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్‌జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వారికి బెయిల్ లభించగా, ఆ పత్రాలను తీసుకుని ఖైదీల బంధువులు సబ్‌జైలుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది సబ్‌జైలుకు రూ.8 వేల విలువైన కుర్చీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రిమాండ్ ఖైదీల బంధువులు ఆ కుర్చీ కొనుగోలు చేసి సబ్ జైలుకు తీసుకువచ్చి అందజేశారు. -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్‌ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్‌ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్‌రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!
శరీరంలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా తేడా ఉండదు కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే మాత్రం మొత్తం శరీరాకృతే మారిపోతుంది. అందుకే మొదట పొట్ట తగ్గించుకోవాలి అనుకునేవారు.. ఇలాంటి బ్యాలెన్స్ చైర్‌ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వ్యాయామ పరికరం.. నడుము, తొడభాగాలను తగ్గించడంతో పాటు ఉదర కండరాలను దృఢంగా మారుస్తుంది. దీనిపై కూర్చున్నప్పుడు అటూ ఇటూ ఒరిగేందుకు వీలుగా రూపొందింది ఇది. దీని కింద అమర్చుకోవడానికి ఒక గుండ్రటి రింగ్ కూడా లభిస్తుంది. అలాగే ఇరువైపులా సపోర్టింగ్ కోసం హ్యాండిల్స్ ఉంటాయి. నిజానికి ఆ హ్యాండిల్స్ లేకుండా కూడా ఇందులో కూర్చుని బాలెన్స్ చేసుకోవచ్చు. ఈ చైర్లో కూర్చుని.. ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. శరీర సౌష్టవాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ చైర్స్ మార్కెట్లో రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, ఆరెంజ్ వంటి రంగుల్లో దొరుకుతున్నాయి. ధర 152 డాలర్లు. అంటే 12,647 రూపాయలు. (చదవండి: ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!) -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
ఛీ..ఛీ.. చిల్లర పంచాయితీ!
తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ కోసం ప్రొఫెసర్లు యాదగిరి, కనకయ్య మధ్య వాదులాట గల్లీ లొల్లిని తలపించింది. ఇది చాలదన్నట్లుగా వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోవడం.. పైగా బయట నుంచి దళిత సంఘాలు వర్సిటీలోకి రావడం మరీ విడ్డూరంగా మారింది. వెరసి అందరూ కలిసి అత్యున్నత విద్యాసంస్థ మర్యాదను దిగజార్చే ప్రయత్నం చేశారంటూ విద్యావర్గాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. చివరికి తమ అదుపాజ్ఞలో పనిచేసే సిబ్బందే ఏకంగా రిజిస్ట్రార్ చాంబర్, వీసీ చాంబర్ గదులకు తాళం వేసే వరకు వెళ్లడం ఎంత పరువు తక్కువో.. తమ స్థాయిని ఎంత దిగజార్చుకున్నారో ఆ కుర్చీల్లో కూర్చుండే అధికారుల విజ్ఞతకే తెలియాలి. నిజామాబాద్: రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పదవుల కోసం కొట్లాటలు నడుస్తుండడం సర్వసాధారణం. కానీ తెలంగాణ వర్సిటలో మాత్రం అంతకుమించి అన్నట్లుగా రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో ఎడతెగని రగడ కొనసాగుతుండడం విస్తుగొలుపుతోంది. వీసీ రవీందర్ గుప్తా వ్యవహార శైలి, అక్రమ నియామకాల నేపథ్యంలోనే రిజిస్ట్రార్ పదవి విషయంలో నువ్వానేనా అనేవిధంగా పంచాయితీ నెలకొన్నట్లు వర్సిటీ వర్గాలు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి. రెండేళ్ల కాలంలో ఏకంగా ఆరుగురు రిజిస్ట్రార్లు పదిసార్లు కుర్చీలు మార్చుకున్న పరిస్థితి నెలకొంది. మళ్లీ తా జాగా సోమవారం వర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ విషయమై ఆ చాంబర్లో మూడు గంటల పాటు లొల్లి నడిచింది. పాలకమండలి తీర్మానం మేరకు రిజిస్ట్రార్‌గా నియమితులైన యాదగిరి కుర్చీలో కూర్చున్నా రు. ఇదే సమయంలో కనకయ్య వచ్చి తనను వీసీ రిజిస్ట్రార్‌గా నియమించారని, తనకే కుర్చీలో కూ ర్చునే అధికారం ఉందని వాదించారు. పాలకమండలి, ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వండతోనే రిజిస్ట్రార్ బా ధ్యతలు తీసుకున్నట్లు యాదగిరి తెలిపారు. ఈ క్ర మంలో విద్యార్థి సంఘాలన్నీ అక్కడకు వచ్చి రిజిస్ట్రార్ యాదగిరికి మద్దతుగా నిలిచాయి. బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు, ఒక్క విద్యార్థి సంఘం మాత్రం కనకయ్యకు మద్దతుగా నిలిచాయి. చివరకు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. రిజిస్ట్రార్ ఎవరో తేలేవరకు వీసీ, రిజిస్ట్రార్ చాంబర్లకు తాళాలు వేయాలని నిర్ణయించారు. మొత్తాని కి రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయిలో పదవి కోసం కొ ట్లాడుకున్న మాదిరిగా చాలాసేపు వ్యవహారం కొనసాగడం విశేషం. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గొ డవ చేయించే విధంగా సంస్కృతికి బీజం వేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ లో రిజిస్ట్రార్ కుర్చీ విషయమై చిల్లర పంచాయితీ నెలకొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమాల పుట్ట పగులుతుందనేనా..? వర్సిటీకి అత్యున్నతమైన పాలకమండలి తీర్మానాలను అమలుచేసే విషయంలో వీసీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండడం గమనార్హం. ఇప్పటికే కనకయ్యతో కలిసి వీసీ అక్రమ నియామకాలు చేయడం, విచ్చలవిడిగా సుమారు రూ. 40కోట్ల మేర అధికారిక అనుమతి లేకుండా ఖర్చులు చేయడం, అడ్వాన్సులు చెల్లించడం తదితర వ్యవహారాలపై విచారణకు ఇప్పటికే ఈసీ ఐదుగురు సభ్యుల కమిటీ నియమించింది. ఈ కమిటీ ఒక్కరోజు విచారణ చేస్తేనే రూ. కోటి మేర అక్రమ చెల్లింపులు వెలుగుచూశాయి. కమిటీ విచారణ నేపథ్యంలో 55వ పాలకమండలి తీర్మానాలపై వీసీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ తర్వాత 56, 57 పాలకమండలి తీర్మానాలపైనా స్టే తెచ్చుకునేందుకు వీసీ ప్రయత్నాలు చేస్తున్నారు. వీసీని ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారో కానీ, ఉన్నత విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. అక్రమాలు బయట పడతాయనే వీసీ ఇష్టం వచ్చినట్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ లేకుండానే కనకయ్య యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రమోషన్ పొందాడని, అదేవిధంగా సర్వీసు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాడనే విషయమై విచారణకు ఈసీ తీర్మానం చేసింది. అదేవిధంగా పీహెచ్డీ ప్రవేశాలపై సైతం కనకయ్య అక్రమాలు చేసినట్లు ఈసీ నిర్ణయించింది. ఈ వ్యవహారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక వీసీ రవీందర్‌గుప్తా, కనకయ్య చేసిన అక్రమ నియామకాలపైనా, విచ్చలవిడిగా చేసిన ఖర్చులపైనా విచారణ చేస్తే అన్నీ బయటకొస్తాయనే వీరిద్దరూ కలిసి రిజిస్ట్రార్‌గా మరొకరు ఉండేందుకు అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు ఈసీ సభ్యులు తెలిపారు. ఇక వర్సిటీ ల్యాప్‌టాప్‌ను రెండేళ్లుగా తనవద్దనే ఉంచుకున్న కనకయ్య ఇప్పటివరకు అప్పగించకపోవడం విశేషం. మొత్తంమీద అక్రమ వ్యవహారాలను పాలకమండలి సభ్యులు బట్టబయలు చేయకుండా చేసేందుకే ఈ తెగింపు చర్యలకు వీసీ రవీందర్, కనకయ్య పాల్పడుతున్నట్లు వర్సిటీలో తీవ్రచర్చ జరుగుతోంది. -
నితీశ్ కుమార్‌పై కుర్చి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
-
Bihar: నితీశ్ కుమార్‌పై దాడికి యత్నం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సోమవారం దాడికి యత్నం జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలో సమాధాన్ యాత్ర సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విరిగిన కుర్చీ ముక్కను సీఎం నితీశ్‌పైకి విసిరేశాడు ఓ యువకుడు. అయితే టైంకి ఆయన ఆగిపోవడంతో.. అది పక్కన పడింది. వెంటనే అది గమనించిన ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని రౌండప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. ప్రజలతో ఆయన మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ఈ దాడికి పాల్పడగా.. పారిపోయిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనలకు గానూ అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి యత్నానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. #WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR — ANI (@ANI) February 13, 2023 -
28 లక్షల ఖరీదైన కుర్చీని చూస్తారా?
రత్నఖచిత సింహాసనాలు కొత్తకాదు. బంగారం లేదా వెండితో తయారు చేసిన సింహాసనాలకు రకరకాల రత్నాలను పొదిగి తీర్చిదిద్దడమూ కొత్తకాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏకరత్న సింహాసనం. భారీ పరిమాణంలోని అమెథిస్ట్ రత్నంతో దీనిని తయారు చేశారు. ఇందులో కుర్చుంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట! ఎందుకంటే, ఈ కుర్చీని జ్యోతిశ్శాస్త్ర నిపుణుల ప్రకారం, శని దోషాలను నివారించే అమెథిస్ట్ రత్నంతో తయారు చేశారు. ‘ఒక చిన్న రాయిని తెచ్చుకొని ఇంట్లోనో లేక ఆభరణాల్లో పొదిగించుకుని పెట్టుకునే కంటే, ఆ రాతి మీదే కూర్చుంటే ఇంకెంత లాభం వస్తుంది!’ అని చెప్పారు. జపాన్‌కు చెందిన ఫ్యాక్టరీ–ఎమ్ అధినేత కొయిచి హసెగావా ఇంగ్లిష్ అక్షరం ‘ఎల్’ ఆకారంలో ఉండే పెద్ద అమెథిస్ట్ రాతిని లోహంతో బిగించి ఈ కుర్చీని తయారు చేశారు. కుర్చీ మొత్తం బరువు 99 కేజీలు ఉంటే, దీనిలో పొదిగిన రాయి బరువే 88 కేజీలు. దీని ధర కూడా అంతే భారీగా ఉంటుంది. రూ. 28 లక్షలు పెట్టి కొన్నప్పటికీ.. ఈ కుర్చీలో కనీసం పది నిమిషాలు కూడా కూర్చోలేము. ఈ రాతిని అరకొరగా మాత్రమే సానపెట్టారు. అందువల్ల దీని ఉపరితలం గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. కాబట్టి, దీనిపై కూర్చోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే, ఇలాంటి కుర్చీని మీరు కూడా తయారు చేయించుకోండి. 本当に座れるアメジスト椅子を製作したので見てください☺️✨ pic.twitter.com/whnsW2mwDF — factory-M (@factory___m) December 18, 2022 -
ఫిర్యాదు చేసేందుకు వచ్చి....ఏకంగా పోలీస్ అధికారి సీటులో కూర్చొని....
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చిలో కూర్చొన్న వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తి బిల్డర్ సురేష్ పాండురంగ పాటిల్ అలియాస్ చౌదరి అని, మాన్పాడ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఈ వీడియోని షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో రాణి నహీం హై తో క్యా హుమా యే బాద్షా ఆజ్ భీ లకోన్ దిలోన్ పే రాజ్ కర్తా హై (నాకు రాణి లేకపోయినప్పటికీ లక్షల హృదయాలను పాలిస్తున్నాడు) అనే డైలాగ్ వస్తుంది. అంతేగాదు సదరు వ్యక్తి తన స్నేహితులతో కలిసి తుపాకీ ఊపుతూ ఫోజ్ పెట్టిన మరో వీడియోని కూడా జోడించి మరీ పోస్ట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏ పోలీస్టేషన్లో షూట్ చేశాడో అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగిగా నటించడం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి నేరాలకు గాను కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...బిల్డర్ సురేష్ మాన్పాడ పోలీస్ స్టేషన్లో నరబలి, మూఢనమ్మకాలకు పేరుతో ఓ వ్యక్తి చేతిలో రూ. 19 లక్షలు పొగొట్టుకున్నానంటూ ఫిర్యాదు చేశాడు. ఆ తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆ డబ్బులు వసూలు చేసుకునేందుకు పోలీస్టేషన్‌కి వచ్చినప్పుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వివిధ పోలీస్టేషన్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాగే అతని వద్ద నుంచి లైసెన్సు తుపాకిని, మెర్సిడేజ్ కారు, కొడవలి, ఐదు లైవ్ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నారు. Man Shoots Video From Cop's Chair, Gets Locked Up At Same Police Station https://t.co/Fe9ToXGilt pic.twitter.com/fsAICzuthK — NDTV News feed (@ndtvfeed) November 1, 2022 (చదవండి: దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ కిటికిలో తల పెట్టి...) -
కుర్చీలో కూర్చొని కుప్పకూలిన జిమ్ ట్రైనర్.. క్షణాల్లో..!
లక్నో: కుర్చీలో కూర్చొని సేద తీరుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు 35 ఏళ్ల జిమ్ ట్రైనర్. అందరూ చూస్తుండగానే క్షణాల్లో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని షహీద్ నగర్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని అదిల్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదిల్ మృతితో కుంటుబసభ్యులతో అందరూ షాక్‌కు గురయ్యారని అతని స్నేహితుడు పరాగ్ చౌదరి తెలిపాడు. అదిల్‌కు సొంతంగా జిమ్ ఉండేదని, జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ప్రతిరోజు జిమ్‌కు వెళ్లేవాడని తెలిపాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడని పేర్కొన్నాడు. అదిల్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. एक और मौत LIVE- कल ग़ाज़ियाबाद में 35 साल का एक जिम ट्रेनर सामान्य दिनों की तरह अपनी कुर्सी पर बैठा और वहीं हार्ट अटैक से उसकी मौत हो गई। सेकंड में मौत pic.twitter.com/7TX5di258X — Narendra nath mishra (@iamnarendranath) October 19, 2022 చదవండి: ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదిన యువకుడు.. వీడియో వైరల్.. -
కొన్న రేటు రూ. 500.. అమ్మింది ఏమో రూ. 16 లక్షలకు!!!
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి.. ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే. ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన. ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం. చదవండి: వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన! -
అధికారులపై కేంద్రమంత్రి దాడి.. తలుపులు మూసి కుర్చీ తీసుకొని..
భువనేశ్వర్: కేంద్రమంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వ అధికారులపై దాడి చేసి, వారిని గాయపరిచారు. మయూర్భంజ్ జిల్లాలో ఈ సంచలనాత్మక సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మయూర్భంజ్ జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టరు అశ్వినికుమార్ మల్లిక్, సహాయ డైరెక్టరు దేవాశిష్ మహాపాత్రో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మీపోషీ దగ్గరున్న పార్టీ కార్యాలయానికి సదరు అధికారులను రప్పించుకుని, మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి, అధికారుల మధ్య జరిగిన చర్చ వేడెక్కడంతో మంత్రి తన అనుచరులతో కార్యాలయం తలుపులు మూయించి, అధికారులను దుర్భాషలాడి అక్కడి కుర్చీతో వారిపై దాడికి పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో అశ్వినికుమార్ మల్లిక్ ఎడమ చేయి విరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టరు దృష్టికి వెళ్లగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు దాఖలు చేస్తే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణ అవాస్తవమని మంత్రి విశ్వేశ్వర టుడు ఖండించారు. -
మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?
ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఏం అమ్మాలన్నా, కొనాలన్నా అంతర్జాతీయ మార్కెట్లతో చిటికలో పని జరిగిపోతుంది. ఒకచోట తయారైన వస్తువులు మరోచోట విక్రయం జరగుతుంది. గ్రామాల్లోని వస్తువులు దేశం దాటి ప్రపంచమంతా ప్రయాణిస్తుంటాయి. తాజాగా ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్లింది. ఖండాలు దాటిన జర్నీ ఆ కుర్చీ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అసలు ఇది 7000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి ఎలా వెళ్లిందో దీని వెనక కథ ఎంటో తెలుసుకుందాం. జర్నలిస్ట్ సునందన్ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్ సీటింగ్ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో ‘బాలు లోఖండే సవ్లాజ్’ అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. ‘ఇది వింత కాదా’ అంటూ తన ట్విటర్లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా? కాగా కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్ గ్రామానికి చెందిన టెంట్‌హౌజ్ బాలు లోఖండేకు చెందినది. ఇటీవల ప్లాస్టిక్ కుర్చీలకు డిమాండ్ పెరగంతో టెంట్‌హౌజ్ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. .అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు చేరింది. చదవండి: వైరల్: సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు!! View this post on Instagram A post shared by Sunandan Lele (@lelesunandan) -
కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ చరిత్రలు చూసే ఉంటాం. ఒళ్లుగగుర్పొడిచే సైకో కిల్లర్స్ కథనాలూ చదివే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కథలో కిల్లర్ మనిషి కాదు, ఒక కుర్చీ. అవును.. ఆ కుర్చీలో ముచ్చటపడి కూర్చున్నా.. పంతం పట్టి కూర్చున్నా మరణం మాత్రం తప్పదు. ఎంతటి వీరుడైనా ఆ కుర్చీలో కూర్చుంటే కోరి గండం తెచ్చుకున్నట్లే. ప్రమాదం ఎటునుంచైనా వస్తుంది. కబళించే తీరుతుంది. అందులో కుర్చున్నవారికి ఆ రోజు గడవదు. మరో రోజు ఉండదు. వందలమంది ప్రాణాలు తీసిన ‘బస్బే స్టూప్ చైర్’ చరిత్రను వణికించిన ఓ మిస్టరీ.. 17వ శతాబ్దంలో థామస్ బస్బే అనే ఓ చిల్లర దొంగ అమితంగా ఇష్టపడిన ఈ కుర్చి.. అతడి మరణానంతరం అందులో కూర్చున్నవారి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ కుర్చీ చరిత్ర తెలియాలంటే.. ముందుగా థామస్ బస్బే కథ తెలుసుకోవాలి. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లోని త్రిస్క్ అనే ప్రాంతంలో నివాసముండే డానియల్ ఔటీ కుమార్తె ఎలిజిబెత్ ఔటీని పెళ్లి చేసుకున్నాడు థామస్ బస్బే. డానియల్ ఔటీ.. ఓ దొంగ కావడంతో అల్లుడు థామస్ కూడా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. కొంతకాలం సాఫీగా సాగిన బస్బే కాపురంలో విభేదాలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న డానియల్ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేయాలని.. బస్బే ఇంటికొచ్చాడు. మామగారు వచ్చిన కాసేపటికి ఇంటికి చేరుకున్న బస్బే.. తన మామ తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చోవడం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. ఆ కోపంతోనే డానియల్‌ని చంపేశాడు బస్బే. నేరనిర్ధారణతో 1706లో అతనికి ఉరిశిక్ష ఖరారైంది. దాంతో ఎలిజబెత్.. థామస్ బస్బే ఇంటిని ఖాళీ చేసి.. ఫర్నీచర్ మొత్తం ఓ హోటల్‌కు అమ్మేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది. ఉరి శిక్షపడిన థామస్ బస్బే చివరి కోరికగా తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చుంటానని కోరాడు. దాంతో ఉరి తీయడానికి ముందు పోలీసులు బస్బేని ఆ హోటల్‌కి తీసుకెళ్లారు. ఆ కుర్చీలో కాసేపు కూర్చుని చాలా భావోద్వేగానికి గురయ్యాడట థామస్ బస్బే. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని ఉరి తీశారు. కథ అక్కడే ఆరంభమైంది. బస్బే చివరి కోరిక తెలుసుకున్న జనం.. ఆ కుర్చీని చూడటానికి హోటల్‌కి ఎగబడటం మొదలుపెట్టారు. ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించిన హోటల్ యాజమాన్యం.. హోటల్‌కి ‘ద బస్బే స్టూప్ ఇన్’ అని పేరు మార్చింది. దాంతో హోటల్‌కి జనాలు క్యూకట్టారు. ఆ కుర్చీలో కూర్చుని బస చేసి.. గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా కూర్చున్నవారంతా ఏదో కారణంతో చనిపోసాగారు. తొలుత ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. వారంతా బస్బే కుర్చీలో కుర్చొన్నవారే. ఆ మరునాడే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని కొందరు భావిస్తే.. కొందరు మాత్రం ఇదంతా కుర్చీ పనే అంటూ వాదించారు. అది కుర్చీ కాదు బస్బే ఆత్మ అంటూ నమ్మడం మొదలుపెట్టారు. 1894లో వరుస మరణాలు వారి వాదనను బలపరచాయి. హోటల్ లాభార్జనవైపు నడవడంతో అందులో పబ్ కూడా పెట్టింది యాజమాన్యం. కుర్చీని హోటల్ నుంచి పబ్‌లోకి మార్చారు. ఆ కుర్చీలో కుర్చుని మద్యం తాగిన ఓ వ్యక్తి మరునాడు హోటల్ వెనుకవైపు స్తంభానికి శవమై వేలాడాడు. అది ఆత్మహత్యని భావించేవారికంటే.. కుర్చీ చంపేసిందనే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఆ ప్రచారం కూడా హోటల్‌కు లాభాలనే తెచ్చిపెట్టింది. కొందరు ఔత్సాహికులు ఆ కుర్చీతో ‘డేర్’ గేమ్’ ఆడటం మొదలుపెట్టారు. సాహసవీరులు అందులో కూర్చోవడానికి పోటీపడేవారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు పందెం కాసి మరీ ఆ కుర్చీలో కూర్చున్నారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి హోటల్‌కి చెడ్డపేరు రావడం మొదలైంది. దాంతో హోటల్ యజమాని టోనీ ఎర్న్‌షా ఇకపై అందులో ఎవరూ కుర్చోకూడదని కుర్చీని హోటల్ సెల్లార్లోకి మార్పించాడు. అయితే, ఓ రోజు హోటల్‌కు సామాన్లు తీసుకొచ్చిన ఓ డ్రైవర్.. సెల్లార్లో ఉన్న ఆ కుర్చీలో కుర్చున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్‌షా ఆ కుర్చీని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీలో కూర్చోకూడదనే ఉద్దేశంతో కుర్చీని నేలపైన ఉంచకుండా గోడకు వేలాడదీశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు కూడా. అందులో ‘కుర్చీని కనీసం ముట్టుకొనే సాహసం కూడా చెయ్యొద్ద’నే హెచ్చరికా ఉంటుంది. మ్యూజియంలో ఉన్నది అసలు కుర్చీ కాదా? అయితే మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బెస్బే ఉరి సమయంలో కుర్చున్న అసలు కుర్చీ కాదని, ఈ డమ్మీ కుర్చీ కేవలం 138 ఏళ్ల కిందటిదేనని, 1840లో తయారుచేసినదని చెప్పుకొచ్చాడు ఫర్నీచర్ హిస్టోరియన్ ఆడమ్ బావెట్. అతను చెప్పిందే నిజమైతే.. ఎందరో ప్రాణాలు తీసేసిన బెస్బే అసలు కుర్చీ ఏమైనట్లు? హోటల్ నిర్వాహకులు అసలు కుర్చీని దాచిపెట్టారా? అనేది నేటికీ తేలలేదు. చదవండి: ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..! -
పాపం.. కుర్చీ విరిగిపోయి.. ఒక్కసారిగా కూలబడింది.. తర్వాత!
-
విషాదం: విధి నిర్వహణలో.. కూర్చున్న కుర్చీలోనే..
జగ్గంపేట: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న పాణింగపల్లి జయశంకర్ విధి నిర్వహణలో మృతి చెందారు. మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందారు. ఆయన మృతదేహానికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
వెదురు చక్రం కరోనా హీరో
కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్. హాస్పిటల్లో ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ల కోసం ఇది బాగా పని కొస్తుందని ఈశాన్య రాష్ట్రాల హాస్పిటళ్లు ఈ ఫర్నిచర్ మీద ఆసక్తి చూపిస్తున్నాయి. వెదురు మంచం, వీల్ చెయిర్, కంప్యూటర్ టేబుల్, రైటింగ్ టేబుల్, ఐవీ ఫ్లూయిడ్స్ స్టాండ్... మొదలైన వస్తువులను వెదురుతో చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌కు అవసరమైన ఫర్నిచర్ అంతటినీ వెదురుతోనే చేస్తున్నారు. ఒక పేషెంట్‌కు వాడిన వస్తువులను మరొకరికి వాడాల్సిన పని ఉండదు. ఒకసారి వాడిన తర్వాత వీటిని కాల్చేయవచ్చు. ఈ ఫర్నిచర్ రూపకర్త ఓ ప్రొఫెసర్. పేరు రవి మోకాశి పూనేకార్. అతడు గువాహటిలో ఐఐటీలో ప్రొఫెసర్. పదేళ్ల నాటి ప్రయోగం ఈశాన్య రాష్ట్రాల్లో 140 రకాల వెదురు చెట్లు పెరుగుతాయి. చాలా త్వరగా పెరిగే జాతులున్నాయి. నరికిన కొద్దీ పక్కన పిలకలు వేస్తూ పెరుగుతాయి. కాబట్టి సహజ వనరులను వృథా చేయడమనేది ఉండదు. వెదురు కలపతో పేషెంట్లకు అవసరమైన ఫర్నిచర్‌ను తయారు చేయడం ద్వారా పర్యావరణ హితమైన వస్తువులను వాడడం, ఒకసారి వాడిన వాటిని మరొకరికి వాడకుండా శుభ్రత పాటించడం సాధ్యమవుతుంది... అన్నారు రవి మోకాశి పూనేకార్. నిజానికి అతడు పదేళ్ల కిందట హాస్పిటళ్లలో వినియోగానికి ఇది మంచిదనే ఉద్దేశంతో వెదురు ఫర్నిచర్‌కు రూపకల్పన చేశాడు. వాటిని పరిశీలించిన నిపుణులు బాగా ఉపయోగపడతాయని, మంచి ప్రయత్నం అని ప్రశంసలైతే ఇచ్చారు. వాటిని హాస్పిటళ్ల కోసం తయారు చేయించుకోవడం మాత్రం జరగలేదు. ఇప్పుడు కోవిడ్ కష్టకాలంలో ఒకరికి వాడిన వస్తువులను మరొకరు వాడడానికి పేషెంట్లు ఏ మాత్రం ఇష్టపడకపోవడంతో హాస్పిటళ్లు, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు కూడా ఒకసారి వాడి కాల్చి పడేసే వెదురు ఫర్నిచరే బెస్ట్ అంటున్నారు. తన ఫార్ములా ఇప్పుడు ఉపయోగపడుతోందనే సంతోషం కంటే కోవిడ్ కారణంగా వడ్రంగులకు చేతి నిండా పని దొరుకుతోందని సంతోషిస్తున్నారు ప్రొఫెసర్. -
వైరల్: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన
-
వైరల్: పిల్లిని కాపాడి మంచి పని చేశారు
ఎలా వెళ్లిందో ఏమోగానీ ఓ పిల్లి ఎత్తున ఉన్న గోడపై కూర్చుంది. అంతవరకూ బాగానే ఉన్నా దానికి అక్కడి నుంచి కిందికి ఎలా రావాలో అర్థం కాలేదు. ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ సహాయం కోసం అరవసాగింది. ఇది గమనించిన ఓ పెద్దాయన దాన్ని చూసి జాలిపడి పిల్లిని కిందకు రప్పించేందుకు పథకం రచించాడు. అనుకున్నదే తడవుగా వెంటనే ఓ ప్లాస్టిక్ కుర్చీని చేతులోకి తీసుకున్నాడు. దాన్ని పైకెత్తి పట్టుకుని, పిల్లి అందులోకి వచ్చేంతవరకు అలానే పట్టుకుని నిలబడ్డాడు. మొదట పిల్లి కుర్చీలోకి రావాలా వద్దా అని కాసేపు తటపటాయించింది. తర్వాత దానికి ఏమర్థమైందో ఏమో కానీ వెంటనే కుర్చీలోకి దూకి కూర్చుంది. దీంతో ఆ వ్యక్తి కుర్చీని నెమ్మదిగా కిందకు దించాడు. వెంటనే పిల్లి అక్కడ నుంచి చెంగున నేలపైకి దూకి ఆనందంతో సందులోకి పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత ఆదరణను సంపాదించుకుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా పిల్లిని కాపాడిన వ్యక్తికి నెటిజన్లు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పిల్లిని కాపాడి ఎంత మంచి పని చేశారని ఆ వ్యక్తిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. -
వైరల్: టిక్‌టాక్ చైర్ ఛాలెంజ్
టిక్‌టాక్‌లో తమ నటన, ముఖకవలికలతో చాలా మంది యూజర్లు వీడియోలు తీస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ టిక్‌టాక్ వీడియోల్లో తమ ప్రతిభను కనబరుస్తున్న యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన సంఘటనలు చాలానే చూశాం. కొంతమంది టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరించటంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా టిక్‌టాక్ యూజర్లు సరికొత్త ఛాలెంజ్‌ను తీసుకోవచ్చి వారి టాలెంట్‌ను పరీక్షించుకుంటున్నారు. అదే కోవలో వచ్చిన వినూత్న ఛాలెంజ్ పేరే ‘టిక్‌టాక్ చైర్ చాలెంజ్’. ఓ టిక్‌టాక్ యూజర్ ఈ చైర్ ఛాలెంజ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ చైర్ చాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని ఎలా చేయాలంటే.. గోడకు మూడు అడుగుల దూరంలో నిలబడాలి. తర్వాత గోడవైపు వంగి తలను ఆ గోడకు తాకించి స్థిరంగా ఉంచాలి. గోడకు మనిషికి మధ్యలో ఒక చైర్ పెట్టి ఎటువంటి సాయం లేకుండా రెండు చేతులతో చైర్‌ను తమ చెస్ట్‌కు హత్తుకొని పైకి లేపాలి. ఈ క్రమంలో చైర్ గోడకు తగలకూడదు. ఛాలెంజ్ చేసేవారు తమ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముగించాలి. ఈ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘కేవలం మహిళలు మాత్రమే ఈ చైర్ ఛాలెంజ్‌ను పూర్తి చేయగలరని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్‘ ఇది ఒక నకిలీ ఛాలెంజ్ ’ అంటూ కామెంట్ చేశాడు. ‘నా భర్త చేయలేడు’ అని ఫన్నిగా మరో నెటిజన్ ట్వీట్ చేశారు. కేవలం సోషల్ మీడియాలో సంచలనం కోసమే ఇలాంటి ఛాలెంజ్‌లు క్రియేట్ చేస్తున్నారని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను ప్రముఖులు విజయవంతంగా పూర్తి చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. -
ఛెయిర్ హుషార్
యోగా వయసు మళ్లినవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే యోగా సాధనలో కుర్చీని ఉపయోగిస్తారని అనుకోవడం కరెక్ట్ కాదు. యోగాసన సమయంలో కుర్చీని ఉపయోగించడం వల్ల శరీరంలో జాయింట్స్ ఓపెన్ అయి మజిల్స్ ఫ్రీ అవుతాయి. కఠినమైన ఆసనాలు చేయడానికి ముందు 2 లేక 3 వారాల పాటు కుర్చీ ఆసరాతో సాధన చే సినట్టయితే ఫ్లెక్సిబులిటీ, భంగిమలో ఖచ్చితత్వం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆసనంలో మరింత ఎక్కువ సమయం ఉండేందుకు కూడా వీలవుతుంది. సాధనలో సపోర్ట్‌గా వినియోగించే కుర్చీని రిఫరెన్స్ ఛెయిర్ అని పిలుస్తాం. 1. తాడాసన కాళ్లు రెండూ సమంగా సౌకర్యవంతమైన స్థితిలో ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పక్క నుంచి పైకి తీసుకెళ్లి మునివేళ్ల మీద నుంచుని మడమలను వీలైనంత పైకి తీసుకెళ్లాలి. ఎడమచేత్తో కుర్చీని పట్టుకుని కుడిచేతిని పక్క నుంచి పైకి స్ట్రెచ్ చేయాలి. కాలి మడమలు పైకి లేపి ముని వేళ్ల మీద నిలబడాలి. కుర్చీ సపోర్ట్ వల్ల బ్యాలెన్స్ తప్పడం, తూలడం ఉండదు. తిరిగి ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. అంటే కుర్చీని కుడివైపునకు తిప్పుకుని కుడి చేత్తో పట్టుకుని ఎడమచేతిని పైకి స్ట్రెచ్ చేయాలి. కాలి మడమలను పైకి లేపాలి. మూడు లేక నాలుగు శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ సమస్థితికి రావాలి. ఉపయోగాలు: వెన్నెముక అలైన్ మెంట్‌కి, వెన్నుపూసల మధ్యలో ఖాళీ పెరగడానికి డిస్క్‌ల ఎలాస్టిసిటీ పెరగడానికి ఉపయుక్తం. కంప్రెషర్ సమస్య తగ్గిస్తుంది. 1/ఎ ఈ సీక్వెన్స్‌లో భాగంగా వెన్నెముకని పక్కలకి స్ట్రెచ్ చేయడం కోసం పైకి తీసుకెళ్లిన చేతిని చెవికి ఆనించి నడుం నుంచి పై భాగాన్ని వ్యతిరేక దిశలో పక్కకు వంచే ప్రయత్నం చేయాలి. 2. వృక్షాసన ఆసనంలో నిలబడి...ఎడమ కాలిని కుర్చీలో ఉంచి తొడ కీలు నుంచి మోకాలి వరకూ ఓకే లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. పాదాన్ని కుర్చీలో పక్కకి స్ట్రెయిట్‌గా ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకెళ్లి, 3 లేదా 4 శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ పక్క నుంచి చేతులు కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో వైపునకు కూడా చేయాలి. పొడవుగా ఉన్నవారు కుర్చీ బ్యాక్‌పై నుంచి కాలు తీసుకెళ్లి కుర్చీ సీట్లో పాదం పెట్టవచ్చు. తక్కువ హైట్ ఉన్నవారైతే కుర్చీని పక్కకు తిప్పి కుర్చీ చేతి మీదుగా కాలు తీసుకెళ్లి కుర్చీ సీట్లో పాదం పెట్టవచ్చు. ఉపయోగాలు: వెన్నెముకను స్ట్రెచ్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్‌ను నివారించవచ్చు. ఈ భంగిమను పదే పదే సాధన చేయడం, ఆసనంలో క్రమబద్ధంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎక్కువ సేపు ఉండడం వల్ల మెదుడుకు ఆక్సిజన్ సరఫరా బాగా మెరుగవుతుంది. క్రానియల్ నెర్వస్ సిస్టమ్‌కి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుదలకీ మంచిది. కైఫోసిస్ (స్పైన్ పైభాగం ఓ పక్కకి వంగడం, లోడోసిస్ (స్పైన్ కింద భాగం పక్కకి వంగడం) స్కోలియోసిస్ (స్పైన్ మధ్యభాగం పక్కకి వంగడం) వంటి సమస్యలకి ఉపయుక్తం. సమన్వయం సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
చిన్నారికి వీల్‌చైర్ వితరణ
‘సాక్షి’కి స్పందన హసన్‌బాద(రామచంద్రపురం రూరల్): ‘సాక్షి’లో ఈ నెల 28వ తేదీన ప్రచురితమైన ’పాపం ఇక్కట్లే’ కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్యోత్సS్న వీల్‌చైర్ అందజేశారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తను వాట్స్ప్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళిపాలానికి చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టుకు పంపించారు. దానికి స్పందించిన ట్రస్ట్ అధినేత రాపతి జగదీష్ బాబు తమ ప్రతినిధి ఓరుగంటి సుబ్రహ్మణ్యం ద్వారా రూ. 5 వేలు విలువ చేసే వీల్ చైర్‌తో పాటు, రూ. 2 వేల నగదు గురువారం హసన్‌బాదలో పాప ఇంటివద్ద అందజేశారు. జ్యోత్సS్న వైద్య ఖర్చులకోసం నెలనెలా కొంత నగదు ట్రస్టు తరఫున అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ ఉన్నారు. -
కుర్చీలకు అతుక్కుపోతే... ఖల్లాస్!
టెన్ టు ఫైవ్ జాబ్! ఉదయం 10 గంటలకు వెళితే, సాయంత్రం అయిదింటికల్లా ఎంచక్కా ఇంటి ముఖం పట్టేయడానికి వీలుండే ఉద్యోగం! సినిమాకెళ్ళాలన్నా, షికారుకెళ్ళాలన్నా... సాయంత్రం సమయమంతా మన చేతుల్లోనే! జీవిత భాగస్వామితో తీరికగా గడపడానికీ, పిల్లల్ని దగ్గరుండి చదివించుకోవడానికీ ఇంతకు మించి వీలున్న టైమ్ ఇంకేం ఉంటుంది. నిజమే! కానీ, టెన్ టు ఫైవ్ జాబ్ అంటూ... ఆఫీసులో పూర్తిగా కుర్చీలకే అతుక్కుపోయి కదలకుండా గడిపేస్తున్నారా? కాగితాల దగ్గర నుంచి కాఫీ దాకా ప్రతీదీ ఆఫీస్ బాయ్ తీసుకువస్తుంటే, కూర్చొన్నచోట నుంచి కదలడం లేదా? పోనీ ఎంతసేపూ పని... పని... అంటూ కంప్యూటర్‌కే కళ్ళప్పగించి, కుర్చీలో నుంచి లేవడం లేదా? అయితే, మీరు వెంటనే మీ పని తీరు మార్చుకోవాల్సిందే! ఇలా ఒళ్ళు కదలకుండా ఒకే చోట ఉండిపోయే జీవనశైలి ఇటీవల పెరిగిపోతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకమైన జీవనశైలి వల్ల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి. అటూ ఇటూ తిరుగుతూ చురుకుగా పని చేయకుండా, సుద్దపప్పులా ఒకే చోట కూర్చొండిపోతే, సగటు ఆయుః ప్రమాణం కన్నా ముందుగానే కన్నుమూసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నాయి. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో దాదాపు పది లక్షల మంది వయోజనులపై, ఏకంగా 16 అధ్యయనాలు జరపగా తేలిన సారాంశం ఇది. ఇలా కుర్చీలకే అతుక్కుపోవడమనేది ఇప్పుడు ‘విశ్వవ్యాప్తమైన మహమ్మారి’ అని అధ్యయనవేత్తలు ప్రకటించారు. శారీరకంగా శ్రమ చేయకపోవడమనేది ‘ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య’ అని స్పష్టం చేశారు. ఇవి వస్తాయ్! ఇలా చేస్తే పోతాయ్! కదలకుండా ఒకేచోట కూర్చొని పని చేసే శైలి వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్, మతిమరుపు, చివరకు క్యాన్సర్ కూడా రావచ్చని తేలింది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేని ఈ రోగాలు రావడానికి ప్రధాన కారణం - శారీరక శ్రమ చేయకపోవడమే అని బ్రెజిల్‌కు చెందిన ఒక పరిశోధక డాక్టర్ గారు ప్రకటించారు. అందరూ చెప్పుకొనే స్థూలకాయ సమస్యలాగా ఇది పైకి కనిపించదు కానీ, నిజానికి అంత కన్నా పెద్ద సమస్య. మన దేశంలో ఏటా దాదాపు 90 వేల మంది చురుకుదనం లేని జీవనశైలి వల్ల ఇలాంటి రోగాలు వచ్చి, చనిపోతున్నారట! అదే గనక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 53 లక్షల మంది మరణిస్తున్నారట! ఇది దాదాపుగా ధూమపాన వ్యసన బాధితులై, మరణిస్తున్నవారి సంఖ్యకు సమానం. గట్టిగా మాట్లాడితే, ఇవన్నీ నివారించదగిన రోగాలే! వీటి ముప్పు తప్పించుకోవడానికి కూడా ఒక చిట్కా ఉంది. రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు ఇలా కూర్చొని పనిచేస్తుంటే, తద్వారా వచ్చే ముప్పు తప్పించుకోవడానికి కనీసం రోజూ ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి. ఆ మాట కూడా అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అలాగని శారీరక వ్యాయామం అంటే, మరీ బెంబేలెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. వేగంగా నడవడం, కాసేపు బైక్ రైడింగ్ చేయడం, సైక్లింగ్ లాంటి సింపుల్ పనులు చేసినా చాలట! ఇలా శారీరక వ్యాయామం చేయడం వల్ల వయసు మీద పడకుండానే రకరకాల వ్యాధులతో చనిపోయే ప్రమాదం కనీసం 60 శాతం మేర తగ్గుతుంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు తమ తాజా అధ్యయనంలో తేల్చిన విషయం ఇది. చురుకుగా పని చేయకుండా అలా కూర్చొండిపోవడం అలవాటు అయితే, 20 ఏళ్ళ కాలవ్యవధిలో మరణానికి దగ్గర అవుతారట! అదే గనక రోజూ కనీసం 60 నుంచి 75 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రోజూ రెండు గంటలు వ్యాయామం చేయగలిగితే, మరీ బెస్టు! మొన్న మొన్నటి దాకా అయితే, రోజుకు కనీసం 30 నిమిషాల వంతున వారానికి అయిదు రోజుల పాటు వేగంగా నడవడంతో సహా ఎక్సర్సైజ్ చేస్తే మేలని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) సిఫార్సులు పేర్కొన్నాయి. అయితే, ఒళ్ళు అలవని పని శైలి అన్నది ప్రపంచవ్యాప్త మహమ్మారి అయిందని కొత్త అధ్యయనాలు వెల్లడించడంతో, సిఫార్సులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ అరగంట బదులు, అంతకు రెట్టింపు సమయం ఎక్సర్సైజ్ చేయమనాల్సి వచ్చింది. కూర్చొనే ఉంటే ఏమవుతుందట? ఒంటికి శ్రమ ఇవ్వకుండా కదలకుండా కూర్చోవడం, దానికి తోడు వ్యాయామం కూడా చేయకపోతే - బరువు పెరగడం ఖాయం. దాంతో, స్థూలకాయం వస్తుంది. పైగా, చురుకుగా, హుషారుగా పనిచేయకపోవడం వల్ల శరీరానికి శ్రమించే అలవాటు తప్పుతుంది. మన శారీరక వ్యవస్థ కూడా బద్ధకంగా తయారవుతుంది. రోజూ చేయాల్సిన జీవక్రియల్లో కూడా సత్తా తగ్గుతుంది. ఊపిరితిత్తులతో గాలి పీల్చుకొనే సామర్థ్యం తగ్గుతుంది. మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చే గాలిని బట్టే ఆక్సిజన్‌తో కూడిన రక్తం మన శరీర అవయవాలకు అందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే, మన జీర్ణక్రియ, గ్లూకోజ్ - ఫ్రక్టోజ్‌లుగా చక్కెర విడిపోవడం లాంటివన్నీ కూడా ఇబ్బందుల పాలవుతాయి. ఈ క్రియారాహిత్యం వల్ల దీర్ఘకాలంలో ఇంకా సమస్యలు వస్తాయి. కీళ్ళనొప్పుల లాంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. తీరిక లేదా? ఇలా చేయండి! నిజం చెప్పాలంటే - ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలనీ, మరొకటనీ... డెస్క్ జాబ్ చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఎక్సర్సైజ్ చేయడానికి రోజుకు ఒక గంట విడిగా తీరిక దొరకడం లేదని కొందరు వాపోతుంటారు. వాళ్ళకీ ఒక ఉపాయం ఉంది. ఇలా డెస్క్ జాబ్ చేసేవాళ్ళందరూ రోజూ ఉదయం పూట కాసేపు రన్నింగ్ చేయాలి. లేదంటే, సైకిల్ తొక్కడమో, ఆఫీసు దగ్గరైతే సైకిల్ మీద వెళ్ళి రావడమో చేయాలి. అందరూ ఆచరించదగిన మరో చిట్కా ఏమిటంటే - ఆఫీసులో ఉన్నప్పుడు కుర్చీకే పరిమితం కాకుండా, ప్రింట్ తీసుకోవడం కోసం ప్రింటర్ దాకా స్వయంగా వెళ్ళి, రావడం అలవాటు చేసుకోవాలి. ప్రతి గంటసేపటికీ ఒక అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అప్పుడు కంప్యూటర్ ముందు నుంచి, కుర్చీలో నుంచి లేచి, సెక్షన్లో కాస్త అటూ ఇటూ పచార్లు చేసి, కాళ్ళు సాగదీయాలి. కప్పు కాఫీ తాగే మిష మీద అయినా లేచి, కాఫీ మిషన్ దిశగానో, ఆఫీసు బయట కాఫీ షాపు వైపో నాలుగు అడుగులు వేయాలి. మధ్యాహ్న భోజన సమయంలోనైనా అన్నం తిన్న తరువాత కాసేపు లేచి, అటూ ఇటూ తిరిగి రావాలి. అలా రోజూ కనీసం ఒక గంటసేపైనా శారీరక శ్రమ చేయాలి. దానివల్ల అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మధ్యవయసు దాటినవారు, వృద్ధులు సర్వసాధారణంగా పెద్దగా శారీరక శ్రమ చేయరు. పైగా, ఎక్కువగా టీవీకే కళ్ళు అప్పగించేస్తుంటారు. అది కూడా రిస్కే! సో... తాజా ట్రెండ్‌ను గుర్తించి, శారీరక వ్యాయామానికి ఓటేయడం ఎంతైనా బెటర్! ముఖ్యంగా, డెస్క్ జాబ్‌కే పరిమితమైనవారు ఈ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ ట్రెండ్‌ను గమనించడం ఆరోగ్యకరం! బమ్చిక్... బమ్చిక్... చెయ్యి బాగా! * తాజా పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే - మధ్యవయస్కులు శారీరకంగా ఫిట్‌గా ఉండడం మరీ అవసరం. ధూమపానం తరువాత వాళ్ళకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించేది - శారీరకంగా ఫిట్‌గా లేకపోవడమే! * రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం తరువాత అతి ఎక్కువ ప్రాణాంతకం - వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడమే! అలాగే, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కన్నా దీనివల్లే ఎక్కువ మంది త్వరగా మరణించే ప్రమాదం ఉంది. * ఎక్కువ సేపు కదలకుండా కుర్చీకే అతుక్కుపోవడం తగ్గించాలి. అలాగే, వీలైనంత మేర శారీరక శ్రమ చేయాలి. * గాలి పీల్చుకొనే సామర్థ్యం పెరిగేలా ఊపిరితిత్తులతో వ్యాయామం చేయాలి. లేదంటే, వృద్ధాప్యం రావడాని కన్నా ముందే కన్ను మూసే ప్రమాదం ఎక్కువట! టీవీతోనూ తిప్పలు! ఆఫీసులో కదలకుండా కూర్చొని చేసే పని పద్ధతికి తోడు ఇటీవల ఇళ్ళల్లో చాలామంది అదే పనిగా టీవీ చూస్తూ, కూర్చుంటున్నారు. ఆడవారైనా, మగవారైనా రోజూ సగటున 3 గంటలు టీవీకి కళ్ళప్పగించి, కదలకుండా కూర్చుంటున్నారని ఒక లెక్క. పొగ తాగడం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారో, దాదాపు అంత మంది ఇలా క్రియారహితంగా, చలనం లేకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, స్థూలకాయం కన్నా ఇలా కదలక, మెదలక కూర్చోవడమే మరీ డేంజర్ అని అధ్యయనవేత్తలు కదలని కుర్చీ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. రోజు మొత్తం మీద నాలుగేసి గంటల వంతున కదలకుండా కూర్చొనేవారితో పోలిస్తే, ఎనిమిదేసి గంటలు కుర్చీకే అతుక్కుపోయేవారికి ప్రమాదం 59 శాతం ఎక్కువట! -
కనికరం లేని ‘ఖాకీలు’
తాడేపల్లి రూరల్ : చంకన చంటి బిడ్డతో.. కడుపులో మరో బిడ్డతో ఓ భక్తురాలు సీతానగరం పుష్కర ఘాట్ స్నానానికి వచ్చి ఎండ తీవ్రతకు దుస్తులు మార్చుకునే షెడ్డు నీడన నిలబడిపోయింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న ఓ జోనల్ అధికారిణి, మహిళా కానిస్టేబుల్ కూర్చుని ఉన్నారు. కనీసం ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చునేందుకు కూడా తావు ఇవ్వకుండా వాటిపై వాటర్ బాటిల్, విస్తరాకులు పెట్టి ఉంచారు. సేవాభావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా కొందరు కిందిస్థాయి సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. -
శరీరానికి... మనస్సుకి.. వజ్రం
లైఫ్ వజ్రం కలకాలం నిలిచే ఉంటుంది. అలాగే వజ్రాసనాల వల్ల వచ్చే ఆరోగ్యం కూడా. యోగాలో అత్యంత ముఖ్యమైన ఆసనంగా దీన్ని పరిగణిస్తారు. ధ్యానం చేసేవాళ్లు ఈ ఆసనంలో ఉండే ధ్యానం చేయడం మనం గమనించవచ్చు. వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం అన్నట్టే... దీని వల్ల వచ్చే లాభాలకు సాటి ఇదే తప్ప మరొకటి కాదు. ఎక్కువ మంది చేయగలదీ... సులభ సాధనతో ఆరోగ్యానికీ సానపెట్టేది అయిన వజ్రాసన గురించిన విశేషాలు ఈ వారం... వజ్రాసన మోకాళ్ల మీద నిలబడి పాదాలు మడమలు కలిపి ఉంచి... మడమల మీద రెండు పిరుదులు ఆనించి కూర్చోవాలి. మడమలు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. రెండు చేతులూ ముందు మోకాళ్ల మీద సౌకర్యంగా పెట్టుకొని, తల నిటారుగా ఉంచాలి. కళ్లు మూసి ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు ఆసనంలో ఉండే ప్రయత్నం చేయాలి. సాధన చేసే కొద్దీ 20 నుంచి 30 నిమిషాల వరకు కూర్చోగలుగుతారు. ప్రారంభ సాధకులు కూర్చోవడంలో ఇబ్బందిగా ఉంటే (యాంకెల్స్) చీలమండల కింద ఒక మెత్తని దిండును ఉంచుకోవాలి. అవసరమైతే సీటు భాగానికి, కాఫ్ మజిల్స్‌కి మధ్యలో కూడా ఒక మెత్తని దిండుని ఉంచవచ్చు. దీని వల్ల మోకాళ్ల మీద పడే భారం తగ్గుతుంది. ఉపయోగాలు: వజ్రాసనంలో కూర్చున్నప్పుడు నడుము కింది భాగాలైన కాళ్లలోకి రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. పెల్విక్ రీజియన్... అంటే కడుపు, పొత్తి కడుపు భాగాలకు రక్తప్రసరణ ఎక్కువ అవుతుంది. అందువల్ల భోజనం చేసిన తరువాత ఈ ఆసనంలో కూర్చున్నట్లయితే జీర్ణవ్యవస్థవైపు రక్తప్రసరణ సాధారణంగా జరిగే దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకి సంబంధించిన గ్రంథుల అవయవాలు మరింత ప్రేరేపింపబడి... అరుగుదల బాగా జరుగుతుంది. ఎసిడిటీ, అల్సర్లు, ఉదరకోశ సమస్యలు, మలబద్దకం నివారణకు... పిరుదుల భాగం తగ్గడానికి ఈ ఆసనం మహత్తరంగా ఉపయోగపడుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. వికృష్ట వజ్రాసన పాదాలు రెండూ విడదీసి, ఆ మధ్యలో (ఖాళీ ప్రదేశంలో) పిరుదుల భాగాన్ని పూర్తిగా భూమి మీద ఆనించి, కూర్చున్నట్లయితే దానిని వికృష్ట వజ్రానం అంటారు. అలా కాకుండా రెండు కాళ్ల వేళ్లూ నిలబెట్టి ఉంచి రెండు మడమలూ కలిపి ఉంచి, ఆ మడమల మీద కూర్చున్నట్లయితే దానిని అంగుష్ట వజ్రాసనమని పిలుస్తారు. సుప్త వజ్రాసన వజ్రాసనంలో కూర్చుని వెనుకకు వెళ్లి, మోచేతులు భూమి మీద ఆనించి, ఆ సపోర్ట్‌తో వీపుని కూడా భూమి మీద నెమ్మదిగా ఆనించి, అక్కడ నుండి మెడ, తల భాగాలను నేల మీద ఆనించి, చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్లి స్ట్రెచ్ చేసి ఉంచినా లేదా చేతులు రెండూ కట్టుకుని తల కింద పెట్టుకుని పడుకున్నా... దానిని సుప్త వజ్రాసనం అంటారు. వీరాసన విడదీసి ఉంచిన పాదాల మధ్యలో కూర్చున్న తరువాత వెనుకకు ఒరిగి, రెండు మోచేతులూ భూమి మీద ఆనించి, రెండు అరచేతులూ సీటు పక్కన భూమి మీద ఉంచి భూమికి నొక్కుతూ, వీపు భాగాలని తరువాత మెడ భాగాలని ఆ తరువాత తల భాగాన్ని భూమి మీద ఉంచి, చేతులు రెండూ వెనుకకు స్ట్రెచ్ చేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆసనం పూర్తి స్థితిలో వీపుపై భాగాలే కాకుండా వీపు మధ్య భాగం, కింద భాగం కూడా భూమి మీద ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. మోకాళ్లు రెండూ దూరంగా కాకుండా వీలైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే మోకాళ్లు గాలిలోకి లేవకుండా పూర్తిగా భూమి మీదనే ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. ఉపయోగాలు పిరుదుల (హిప్స్) భాగాలను, తొడ భాగాలను తగ్గించుకోవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. తొడ కండరాలను శక్తివంతంగా గుంజడం జరుగుతుంది కాబట్టి వెరికోస్ వెయిన్స్ సమస్యకు పరిష్కారంగాను, డెజైస్టివ్ పవర్ పెరగడానికీ ఉపయోగపడుతుంది. జాగ్రత్తలు మోకాలు సమస్య ఉన్నవారు ఎంతవరకు సాధ్యపడితే అంతవరకే చేయాలి. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
చక్రాలే చెయిర్లైతే...
మనసుండాలే కానీ... మనిషి తెలివికి, ప్రతిభకి ఎలాంటి కొలమానం సరిపోదు. ఎందుకంటారా? ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటగా టైర్లను అసలు ఎందుకు తయారు చేశారు? వాహనాల కోసం. అవునా, మరి అవి పాడయితే ఎలా? వాటిని ఎలాగూ వాహనాలకు అమర్చలేం.. ఇక్కడే మనిషి తెలివి ఉపయోగపడేది. ఆ పాడైన టైర్లను కుర్చీలు, బల్లలు, సెంటర్ టేబుల్స్‌గా తయారు చేసి వాడుకోవచ్చు. కావలసినవి: పాత టైరు, దళసరి కార్డ్‌బోర్డు, నాలుగు కాళ్ల పీట, జనపనార, గ్లూ తయారీ: ముందుగా సెంటర్ టేబుల్ తయారీకి... కార్డ్‌బోర్డు ముక్క టైరు సెంటర్ హోల్ సైజుకు అనుగుణంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్లూతో ఆ కార్డ్బోర్డును టైరుకు అతికించాలి. తర్వాత టైరుకు పూర్తిగా గ్లూను పూయాలి. ఇప్పుడు జనపనారను టైరు చుట్టూ చుట్టాలి. గ్లూ రాశాం కాబట్టి.. చుట్లు ఊడిపోవు. తర్వాత ఈ టైరును నాలుగు కాళ్ల పీటపై పెట్టి అతికించాలి. ఇప్పుడు ఈ సెంటర్ టేబుల్‌ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే జనపనార చుట్టకుండా కూడా వీటికి ఏదైనా రంగు వేసి, వాటిపై కార్డ్‌బోర్డు లేదా గ్లాస్ బోర్డు పెట్టి సెంటర్ టేబుల్‌గా వాడుకోవచ్చు. అంతేనా ఫొటోలో కనిపిస్తున్న విధంగా చెయిర్, సోఫాల్లా మార్చుకోవచ్చు. -
దయ చూపని ఢిల్లీ ప్రభుత్వం!
న్యూఢిల్లీః సహాయం అడిగితే చీదరింపులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి 'వీల్స్' అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. చివరికి సీఎంనే కలసి తన గోడు వెళ్ళబోసుకుందామనుకున్న వికలాంగ వ్యక్తికి... అక్కడా కనికరం కలుగలేదు. తన వీల్ ఛైర్ విరిగిపోయిందని, కొత్త ఛైర్ కొనిమ్మని ఢిల్లీ పెద్దల కాళ్ళా వేళ్ళా పడినా పట్టించుకున్నవారే లేకపోయారు. దేశ రాజధాని నగరంలో ఓ వికలాంగ వ్యక్తికి ఎదురైన ఛీత్కారాలు సాధారణ ప్రజలకు, చూపరులకు ఆందోళన కలిగించాయి. కొత్త వీల్ ఛైర్ కోసం ఆరు నెలలపాటు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరిగినా అధికారుల మనసు కరుగలేదు. రెండుకాళ్ళూ లేక వీల్ ఛైరే ఆధారంగా బతుకుతున్న రాజా.. తకు కొత్త వీల్ ఛైర్ కావాలంటూ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాడు. అయతే ప్రభుత్వంనుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. చివరికి పెద్ద బాస్ (సీఎం కేజ్రీవాల్) నే కలసి తన బాధను వివరిద్దామనుకున్నాడు. అక్కడకూడా తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాజా.. చివరికి చేసేది లేక వెనుదిరిగాడు. అనంతరం రాజా కష్టాలను విన్న ఓ మనసున్న మారాజు అతడికి వీల్ ఛైర్ ను బహూకరించాడు. ఢిల్లీ పౌరుడు, ఫిల్మ్ మేకర్.. గౌరవ్ ఆగ్రే బహూకరించిన ఛైర్ తో అతని కళ్ళలో చూసిన ఆనందాన్ని వర్ణిస్తూ అతడి ఫొటోలను గౌరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్!
న్యూయార్క్: పురాతన, చారిత్రక నాణేలు, వస్తువులు, అపురూప చిత్రాలు, వజ్రాలు ఇలా కొన్ని ప్రత్యేక వస్తువులు వేలం పాటలో వేలు, లక్షల కోట్ల రూపాయల ధర పలకడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేవలం ఓ చెక్క కుర్చీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే దాని వెనుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరించి, వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన హ్యారీపోటర్ కథ ఉంది. అందుకే ఆ కుర్చీ అంత ధర పలికింది. హ్యారీపోటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను ఆకట్టుకున్న బ్రిటిష్ రచయిత జెకె రోలింగ్ వాడిన కుర్చీ వేలంలో 2 కోట్ల 63 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. రోలింగ్ ఆ కుర్చీలోనే కూర్చొని హ్యారీపోటర్ లోని మొదటి రెండు వ్యాల్యూమ్ లు రాయడమే ఆ కుర్చీకి అంత డిమాండ్ రావడానికి కారణం. రోలింగ్ కు ఆమె తల్లి 1930 శకం నాటి ఓ మిస్ మ్యాచ్ కుర్చీని (ఇంట్లోని నాలుగు సరిపోలని కుర్చీల్లో ఒకదాన్ని) బహుమతిగా ఇచ్చిందట. న్యూయార్క్ లో నిర్వహించిన వేలంలో ఇప్పుడా ఓక్ కుర్చీ 2 కోట్ల 63 లక్షల రూపాయల ధర పలికినట్లు హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఏభై ఏళ్ళ వయసున్న రచయిత రోలింగ్ 1997, 1998 ల్లో ప్రచురితమైన 'హ్యారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్', 'హ్యారీపోటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్' రెండు సిరీస్ ను ఆ కుర్చీలోనే కూర్చొని రాసిందట. కుర్చీని ఆక్షన్ కు ఇచ్చిన రోలింగ్ తాను టైప్ రైటర్ ముందు కూర్చొనేందుకు అదే కుర్చీని వాడానని, నా రచనలకు ఆ కుర్చీ ఎంతో సహాయపడిందని తెలుపుతూ కుర్చీతోపాటు ఓ లేఖను కూడ రాసి ఇచ్చినట్లు ఆక్షన్ హౌస్ తెలిపింది. అయితే ఎంతో గుర్తుగా ఉన్న ఆ కుర్చీని వీడేందుకు చాలా బాధ అనిపించినా దాని అమ్మకం వెనుక అంతకంటే ప్రముఖమైన కారణం ఉందని తెలిపింది. గులాబీ, బంగారు, ఆకుపచ్చ రంగు పెయింట్ చేసిన పదాలతో అలంకరించిన ఆ కుర్చీని 2002 లో నేషనల్ సొసైటీకి విరాళంగా ఇచ్చినట్లు ఆమె తెలిపింది. మాంత్రిక జగతి, పురాణాలతో కూడిన పిల్లల సాహిత్యాన్నిరాసిన చరిత్ర ఆ కుర్చీకి ఉందని, అందుకే ఆ కుర్చీ అంతటి ప్రాముఖ్యతను పొందిందని ఆక్షన్ హౌస్ తెలిపింది. -
‘అడవి’లో ఘోరం
క్వారీ బండరాయి పడి ఇద్దరి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పెనుమూరు మండలం అడవిపల్లిలో ఘటన మృతులు యాదమరి మండలం గొల్లపల్లివాసులు పత్తాలేని క్వారీ యాజమాన్యం సాక్షి, చిత్తూరు/సిటీ/పెనుమూరు/యాదమరి: క్వారీ ప్రమాదంలో యాదమరి మండలం పావుకూరు గొల్లపల్లికి చెందిన సురేష్(28), కన్నయ్య(38) మృతి చెందారు. కందన్, జీ సురేశ్‌బాబు(32) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పెనుమూరు మండలం అడవిపల్లి క్వారీలో బుధవారం చోటుచేసుకుంది. కూలీలు..గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి దళితవాడకు చెందిన వారు పనికోసం అడవిపల్లి క్వారీకి వెళుతుంటారు. వారం, పదిరోజులు భార్యాబిడ్డలకు దూరంగా అడవిలోనే ఉంటారు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే 11 మంది సోమవారం పనికి వెళ్లారు. బుధవారం కూడా ఉదయం 6.30 గంటలకు క్వారీకి వెళ్లారు. ఉదయం 9.45-10 గంటల మధ్యలో 30 అడుగుల ఎత్తున్న చిట్టాబ్రౌన్ రకానికి చెందిన గ్రానైట్ గుండును బ్లాస్ట్ చేసేందుకు రంధ్రాలు వేశారు. గుండు కింద మట్టి అధికంగా ఉండడంతో బ్లాస్ట్ చేసినా గుండు కిందకు పడదని భావించి మట్టిని తవ్వేందుకు కూలీలు ప్రయత్నించారు. సురేష్, కన్నయ్య సమ్మెటతో మట్టిదిబ్బలు పగులగొడుతున్నారు. మిగిలిన వారు గుండు కింద మట్టిని తొలగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గుండు నై చీలి పగిలిపోయి ఒక్కసారిగా సురేష్, కన్నయ్యపై పడి కింద ఉన్న కూలీలపై పడింది. క్షణాల్లో సురేష్, కన్నయ్య ప్రాణాలు వదిలారు. మిగిలిన కూలీలు అరగంటపాటు మట్టిని తవ్వి హిటాచీ సాయంతో బండరాళ్లను తొలగించారు. టిప్పర్ రాకుండా యాజమాన్యం అడ్డు ఘటన జరిగిన తర్వాత మృతులను, గాయపడిన వారిని టిప్పర్‌లో వేసుకుని చిత్తూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు క్వారీ నుంచి టిప్పర్ రాకుండా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. సమస్యను ఇక్కడే పరిష్కరించుకుందాం’ అని చెప్పబోయారు. దీంతో సెల్వనాథన్ అనే కూలీతో పాటు తక్కిన కూలీలు గొడవచేసి టిప్పర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన మృతదేహాలను మధ్యాహ్నం 3 గంటల వరకు టిప్పర్‌లోనే ఉంచారు. గాయపడిన సురేష్‌బాబు, కందన్‌కు చికిత్స చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో మిన్నంటిన రోదనలు క్వారీ ప్రమాద ఘటనను తెలుసుకున్న గొల్లపల్లి వాసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులైన సురేష్, కన్నయ్యను చూసి వారి బంధువులు, పిల్లలు గుండెలలిసేలా రోదించా రు. సురేష్ తల్లిదండ్రులు చిన్నబ్బులు, సింగారమ్మ ఆయన భార్య శైలజను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ‘లే సురేశా,లెయ్ నాన్నా’ అంటూ సురేష్ తండ్రి అక్కడ కన్నీరుమున్నీరయ్యారు. సురేష్‌కు కుమారుడు నితీష్, కుమారై అర్చన ఉన్నారు. కన్నయ్య ప్రమాదవార్త తెలుసుకుని అతని భార్య బుజ్జి స్పృహ కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు. కన్నయ్య కుమారై మహేశ్వరి తండ్రి మృతదేహం వద్ద బోరున ఏడుస్తూ ఉండిపోయింది. కుమారుడు కిరణ్ బెంగళూరులో క్వారీ పనిచేస్తున్నాడు. రెండురోజుల కిందట అడవిపల్లి క్వారీకి వచ్చి ఒక రోజు తండ్రికి సాయంగా పనిచేశాడు. తండ్రి మరణవార్తను తె లుసుకుని స్వగ్రామానికి బయలు దేరాడు. ఆ చిన్నారికేం తెలుసు...నాన్న ఇక రాడని..! కొడుకు చనిపోయాడని సురేష్ తల్లి సింగారమ్మ, భర్త దూరమయ్యాడని శైలజ, కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక సురేష్ తండ్రి చిన్నబ్బులు గొల్లుమన్నారు. నాన్నమ్మ ఒడిలో కూర్చున్న సురేష్ కుమాైరె అర్చన మాత్రం వారు ఎందుకు ఏడుస్తున్నారో! ‘నాన్న పనికి పోయాడు...పండ్లు, మిఠాయిలు తీసుకుని ఇంటికి మళ్లీ వస్తాడు’ అనేలా అలా ఉండిపోయింది. రోదనల మధ్యలోనే నాన్నమ్మ ఒడిలో నిదురపోయింది. ఎంటెక్ చేశాడు...రాళ్లు కొట్టే పనికి పోతున్నాడు గాయపడిన సురేష్‌బాబు హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. సెయింట్‌మెరీస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేరాడు. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాడు. బతుకుదెరువు కోసం క్వారీ పనికి వెళుతున్నాడు. ఈ ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా నడుము, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. కనీస జాగ్రత్తలు ఏవీ? క్వారీ వద్ద యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కూలీలకు హెల్మెట్లు, చేతులకు గ్లౌజులు ఇవ్వలేదు. అంత పెద్దరాళ్లను పగులగొట్టే ముందు ఇంజినీర్లు పర్యవేక్షణ తప్పనిసరి. కూలీలు మినహా అక్కడ మరో వ్యక్తి ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగితే చిత్తూరుకు వచ్చేంత వరకు ప్రథమ చికిత్స కూడా ఉండదు. ప్రమాదం నుంచి బయటపడిన కూలీల్లో వినోద్, లాజర్, సంపత్, ప్రభు, సెల్వనాథన్, దుర్గయ్య, రాజ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పాకాల సీఐ రాఘవన్, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి, ఆర్ఐ మహేశ్వరి, వీఆర్వో కోదండరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. -
ఆర్టీసీ ధనుర్మాస టూర్ ప్యాకేజీలు
విజయవాడ, న్యూస్‌లైన్ : ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాల దర్శనానికి ఆర్టీసీ కృష్ణా రీజియన్ శ్రీకారం చుట్టింది. మంగళగిరిలోని పానకాల స్వామి దేవస్థానం, జగ్గయ్యపేట దగ్గరలోని వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, తిరమలగిరి, జమలాపురంలోని వెంకటేశ్వరస్వామి, మధిరకు సమీపంలోని నెమలి వేణుగోపాల్‌స్వామి ఆలయూలను ఒక్కరోజులోనే దర్శించుకునే అవకాశం కల్పించింది. ప్రతి ఆదివారం, నెలలోని ముఖ్య రోజుల్లో వేకువజామున ఆరు గంటలకు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరి తిరిగి అదేరోజు రాత్రి 9 గంటలకు బస్టాండ్‌కు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకు పెద్దలకు రూ.325 (డీలక్స్), రూ.290 (ఎక్స్‌ప్రెస్), పిల్లలకు రూ.245 (డీలక్స్), రూ.220 (ఎక్స్‌ప్రెస్) టికెట్‌గా నిర్ణయించారు. 24 గంటల్లో పారిజాతత్రయం ప్రతి ఆదివారం ఒక్కరోజులో మూడు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పించారు. ఏలూరులోని ద్వారకా తిరుమల (చినతిరుపతి), తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, విశాఖ జిల్లా సింహాచలంను ఒకేరోజు దర్శించుకోవచ్చు. ఉదయం 4 గంటల సమయంలో బయల్దేరి మరుసటి రోజు 4 గంటలకు బస్టాండ్‌కు తిరిగి వచ్చే విధంగా ఏర్పాటుచేశారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయూణించే పెద్దలకు రూ.940, పిల్లలకు రూ.715 టికెట్ ధర నిర్ణయించారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పట్టిసీమకు టూర్ ప్యాకేజీ గోదావరి పరవళ్లు, పట్టిసీమ ప్రకృతి సోయగాలను కనులారా వీక్షించేందుకు రీజియన్‌లో జనవరి 15వ తేదీ వరకు ప్రతి ఆదివారం టూర్ ప్యాకేజీని నిర్ణయించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి వేకువజామున మూడు గంటల సమయంలో ప్రారంభమై రాత్రికి విజయవాడకు చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.375 టికెట్‌గా వసూలు చేస్తారు. గోదావరిలో బోటు షికారుకు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.350 చెల్లించాలి. వివరాలకు సెంట్రల్ మార్కెంటింగ్ సెల్ నంబర్ 9959225475లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. -
మోడీ కుర్చీకి భలే డిమాండు!
ఒక కుర్చీ విలువ ఎంత ఉంటుంది.. మహా అయితే వెయ్యి రూపాయలో, ఇంకా అయితే పదివేలో అంతేకదా. కానీ, ఆగ్రాలో మాత్రం ఒక కుర్చీని దక్కించుకోడానికి కొంతమంది పోటీలు పడి దాని విలువను ఏకంగా లక్షా పాతిక వేల రూపాయలు చేసేశారు!! అవును, అది అలాంటి ఇలాంటి కుర్చీ కాదు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూర్చున్న కుర్చీ మరి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో మోడీ దానిమీద కూర్చున్నారట. అందుకే ఆ కుర్చీని దక్కించుకోడానికి బీజేపీ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఇప్పటివరకు రూ. 1.25 లక్షల బిడ్ వేశారు. ఈ పోటీలో ఇంకా చాలామంది ఉన్నారండోయ్. మరో ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ, ఆగ్రా ఎంపీ రాంశంకర్ కతేరియా లక్ష రూపాయల చొప్పున బిడ్లు వేశారు. అయితే.. ఆరోజు ర్యాలీకి ఫర్నిచర్ అందించిన కాంట్రాక్టరు, బీజేపీ కార్పొరేటర్ అయిన ప్రమోద్ ఉపాధ్యాయ మాత్రం, అసలు ఆ కుర్చీని ఎవరికీ ఇచ్చేది లేదని పట్టుపడుతున్నారట. ఆరోజు కార్యక్రమంలో ఉపయోగించిన కుర్చీల్లో కొన్నింటిని తనకు అమ్మాలని పార్టీ కార్యకర్త ఒకరు సదరు కాంట్రాక్టరును అడగడంతో మోడీ కుర్చీ కోసం పోటీ మొదలైంది. కానీ కాంట్రాక్టర్ ప్రమోద్ నిరాకరించడంతో గుజరాత్ సీఎం కూర్చున్న కుర్చీకి రెండు వేల రూపాయలు ఇస్తానని ఆ కార్యకర్త అప్పటికప్పుడు ఆఫర్ చేశాడు. ఆ పోటీ కాస్తా అలా పెరుగుతూ పోయి ఏకంగా లక్షల వరకు వెళ్లింది! మోడీయా మజాకా మరి!! -
అమరిక: సేదతీర్చే సంచులు
కుర్చీ ఎలా ఉండాలి? కూర్చుంటే లేవాలనిపించనంత సౌకర్యంగా ఉండాలి. సౌకర్యం అంటే కుర్చీ ఆకారానికి అనుగుణంగా మనం కూర్చోవడం కాదు, కూర్చున్నవాళ్లు ఎటు కదిలినా అటు సర్దుకుపోయేటట్లు ఉండాలి. ఇలా రూపొందినదే బీన్ బ్యాగ్. ఇదేమిటి ఇసుక బస్తాలాగ ఉంది... అని ముఖం చిట్లించిన వాళ్లు కూడా ఒకసారి కూర్చున్నారంటే ఆ క్షణం నుంచే బీన్‌బ్యాగ్ ప్రియులైపోతుంటారు. మార్కెట్లోకి వచ్చిన ఒక ప్రయోగం విజయవంతం అయితే ఇక తిరుగేముంది! ఆ ఫార్ములాకి సృజనాత్మకత జోడించి రకరకాల మోడల్స్‌లో తయారుచేస్తారు. అలా రూపొందినవే ఇక్కడ కనిపిస్తున్న రకరకాల బీన్బ్యాగ్లు. ఇక్కడ నిద్రపోతున్న బిడ్డని చూడండి... అలాగే ఈ బిడ్డ పడుకున్న బీన్బెడ్ని కూడ . బిడ్డ నిద్రలో దొర్లి కిందపడకుండా రక్షణగా చిన్న బెల్ట్ కూడా ఉంది ఈ బెడ్‌కి. ఇదే పాపాయి పెద్దయిన తర్వాత ఈ బీన్బెడ్ని ఏం చేయాలి అనే మీమాంస కూడా అక్కర్లేదు, పక్కనే దానిని సోఫాగా ఉపయోగించిన పెద్ద పాపాయి కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇలాంటివే రకరకాల బీన్ బ్యాగ్‌లున్నాయి. త్రీ సీటర్ సోఫా మోడల్, సోఫాకమ్ బెడ్ మోడల్, రిక్లెయినర్ మోడల్... వీటిలో మీకు ఏది నచ్చితే అది, మీ ఇంటికి ఏది నప్పితే దానిని తెచ్చుకోవడమే. వీటికి ఉపయోగించే మెటీరియల్ ఎక్కువ కాలం మన్నుతుంది. కాబట్టి పెట్టిన డబ్బు వృథా కాదు. ఇంట్లో చిన్న పిల్లలుంటే కామిక్ బొమ్మ బీన్బ్యాగ్ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.