
బెయిల్ పొందిన ఖైదీలను డిమాండ్ చేసిన పెనుకొండ సబ్‌జైలు అధికారులు!
పెనుకొండ: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది పెనుకొండ సబ్‌జైలు అధికారుల తీరు. రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ ఇచ్చినా... విడుదలకు మాత్రం సబ్‌జైలు అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒకే ఊరికి చెందిన కొందరు రిమాండ్ ఖైదీలను విడుదల చేసేందుకు రూ.8 వేల విలువైన కుర్చీ డిమాండ్ చేశారు. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్‌జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా, వారు తీసుకువెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కొత్తచెరువు మండలానికి చెందిన కొందరిని నెల రోజుల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్‌జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వారికి బెయిల్ లభించగా, ఆ పత్రాలను తీసుకుని ఖైదీల బంధువులు సబ్‌జైలుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది సబ్‌జైలుకు రూ.8 వేల విలువైన కుర్చీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రిమాండ్ ఖైదీల బంధువులు ఆ కుర్చీ కొనుగోలు చేసి సబ్ జైలుకు తీసుకువచ్చి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment