penukonda
-
జైలు నుంచి బయటకు రావాలంటే ఇదేం కోరిక..
-
కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల?
పెనుకొండ: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది పెనుకొండ సబ్‌జైలు అధికారుల తీరు. రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ ఇచ్చినా... విడుదలకు మాత్రం సబ్‌జైలు అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒకే ఊరికి చెందిన కొందరు రిమాండ్ ఖైదీలను విడుదల చేసేందుకు రూ.8 వేల విలువైన కుర్చీ డిమాండ్ చేశారు. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్‌జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా, వారు తీసుకువెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్తచెరువు మండలానికి చెందిన కొందరిని నెల రోజుల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్‌జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వారికి బెయిల్ లభించగా, ఆ పత్రాలను తీసుకుని ఖైదీల బంధువులు సబ్‌జైలుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది సబ్‌జైలుకు రూ.8 వేల విలువైన కుర్చీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రిమాండ్ ఖైదీల బంధువులు ఆ కుర్చీ కొనుగోలు చేసి సబ్ జైలుకు తీసుకువచ్చి అందజేశారు. -
కూటమి నేతల అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
పెనుకొండలో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వీరంగం
-
మంత్రి వర్సెస్ ఎంపీ
పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. పట్టు కోసం బీకే ప్రయత్నాలు అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సామాజిక వర్గాలపై కన్ను హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నోరు మెదపని పార్టీ పెద్దలు పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు పెనుకొండ సభ.. కర్ణాటక నుంచి మద్యం బాటిళ్లు
-
సీఎం జగన్ కృషి వల్లే నాసిన్ ప్రాజెక్ట్ సాకారం: MLA శంకర్ నారాయణ
-
మంత్రి ఉషాశ్రీచరణ్ ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు
-
ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.. దుండగుడి పేరు గణేష్‌గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని,. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. నా హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్చి ఉంది నాపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలని డిమాండ్ చేశారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. డిటోనేటర్ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే శంకర్ నారాయణ చెప్పారు. ఇదీ చదవండి: ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర: మంత్రి కాకాణి -
సవితమ్మపై అసహనం.. ఓవరాక్షన్ చేస్తే దెబ్బలు తింటారు.. బీకే మౌనం!
పెనుకొండ (సత్యసాయి జిల్లా): జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. బీకే పార్థసారథి అల్లుడు, కర్ణాటకకు చెందిన శశిభూషణ్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది అగ్ర నాయకులు పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఓ పార్టీకి జిల్లా అధ్యక్షుడు అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వర్గపోరుకు ఆజ్యం పోస్తూ కింది స్థాయి కార్యకర్తలు ప్రత్యక్షంగా ఆయనపై నోరు పారేసుకునే దుస్థితి నెలకొంది. మరో వైపు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న మడకశిర నియోజకవర్గంలో అగ్రవర్ణాల అధిపత్యాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకలాపాలకు దళితులు దూరమయ్యారు. ఇందుకు బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేదికగా మారింది. రెండ్రోజుల క్రితం పరిగిలో.. నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్రలను బీకే పార్థసారథి చేపట్టారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం పరిగి మండలం బీర లింగేశ్వరాలయం నుంచి పైడేటి వరకూ సాగిన పాదయాత్రకు సవితమ్మ వర్గీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విషయం గిట్టని బీకే... తన పక్కనే నడుస్తున్న సవితమ్మపై అసహనానికి గురయ్యారు. విషయాన్ని గుర్తించిన సవితమ్మ ప్రధాన అనుచరుడు వెంటనే బీకేపై రెచ్చిపోయాడు. ప్రధాన నాయకుడిని ఉద్దేశించి ఓవరాక్షన్ చేస్తే దెబ్బలు తింటారని హెచ్చరించాడు. నీ చేత ఏమీ కాదంటూ సవాల్ విసిరాడు. భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తల మధ్య అలా మాట్లాడడంతో బీకే మౌనం వహించి, తలదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మడకశిర: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర వేదికగా బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా స్థాయి నాయకులందరూ పాల్గొన్న ఈ వేడులకు అందరూ ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన వర్గీయులు దూరంగా ఉన్నారు. దళితులను కాదని.. మడకశిర నియోజకవర్గంలో ఈరన్నకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్గా టీడీపీ అధిష్టానం ఆయనను నియమించింది. ఆ సమయంలో పార్టీ పటిష్టతకు ఆయన శ్రమించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈరన్నను తొలగిస్తూ పార్టీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి అప్పగించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఈరన్నకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రతి అంశంలోనూ ఈరన్న ఎదుగుదలను పూర్తి స్థాయిలో అణచివేశారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ముద్రించిన కరపత్రాల్లో దళిత నాయకుల పేర్లు లేకపోవడంపై ఈరన్న, ఆయన వర్గీయులు అసహనానికి గురయ్యారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేని, దళిత నేతలను అవమానించేలా వారి పేర్లు లేకుండా కరపత్రాల ముద్రణ కాస్త వివాదాస్పదమైంది. దీంతో టీడీపీకి దళితుల అవసరం తీరిపోయిందని, గుండుమల గుత్తాధిపత్యం కింద తాము ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేమంటూ శతజయంతి వేడుకలకు దళిత నాయకులు మూకుమ్మడిగా దూరమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఈరన్న లేని లోటు ఈ ఉత్సవాల్లో స్పష్టంగా కనబడింది. సోషల్ మీడియా వేదికగా వర్గపోరు బీకే, సవితమ్మ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమాలు వేదికగా రోజూ ఒకరిపై ఒకరు పోస్టింగ్‌లు చేస్తుండడం చర్చానీయాంశమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు వర్గాలు ప్రత్యక్ష దాడులకు తెగబడడం ఖాయమని ఆ పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు బహిరంగంగానే పేర్కొంటున్నారు. -
సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్ పంచాయితీ!
పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం. సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనే గొప్ప.. నాకే కావాలి గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పెనుకొండ టీడీపీలో ముసలం..
సాక్షి, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వరుస కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు మాట అటుంచితే పార్టీ టికెట్ పార్థుడికి దక్కడం కష్టమేనన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సవిత ధీమా రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితలో ఆశలు రేకెత్తాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన ఆమె.. ఇతర జిల్లాల్లోనూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఇమేజ్ను పెంచుకునే చర్యలు ముమ్మరం చేశారు. కలిసొచ్చిన రాజకీయ శత్రువు.. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం సవితకు కలిసొచ్చింది. పార్థుడిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసి నిమ్మలలో వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీకే ప్రతి సమావేశంలోనూ నిమ్మలను అవమానపరుస్తూ వచ్చారు. దీంతో పార్థుడి ఓటమే లక్ష్యంగా కిష్టప్ప తన రాజకీయ అస్త్రాలను ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో సవితకు కిష్టప్ప మద్దతు ఇస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తన కుమారులు అంబరీష్, శిరీష్‌లో ఎవరో ఒకరికి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కిష్టప్ప పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి లేక పెనుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి కుమారులను బరిలో దించేందుకు కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా తన భార్యకు పార్టీ టికెట్ దక్కించుకునేందుకు సవిత భర్త వెంకటేశ్వర చౌదరి పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలు పెట్టారు. కానీ బీకే మాత్రం అధిష్టానానికి తనపైనే ఎంతో గురి ఉందని, ప్రజల్లోనూ తనకే పట్టు ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాతోనే పార్టీలో ఏ ఒక్కరినీ ఆయన ఖాతరు చేయడం లేదు. ఎడమొహం.. పెడమొహం.. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బీకే పార్థసారథి ఓ కార్యక్రమాన్ని చేపడితే దానికి ప్రతిగా సవిత మరో కార్యక్రమానికి పిలుపునిస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకూ బీకే వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు సవితమ్మ గ్రూపులోకి చేరారు. ఇక ఏదైనా కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. అంతటితో ఆగకుండా దూషణల పర్వానికి తెర తీస్తున్నాయి. ఇటీవల పెనుకొండలోని బోయగేరిలో పార్థుడి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ పార్థుడి ముఖ్య అనుచరుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాడు. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. పోటాపోటీగా కార్యాలయాలు.. పెనుకొండలో టీడీపీ నాయకులు రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. తన స్వగృహంలోనే పార్థుడు కార్యాలయం నిర్వహిస్తుండగా.. ప్రతిగా ఎన్టీఆర్ సర్కిల్లో సవితమ్మ చేత మరో కార్యాలయాన్ని ఆమె వర్గీయులు ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా పోటాపోటీగా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర విభేధాలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ( చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి ) -
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం
సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్ కొట్టాడు. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ (ఎంటెక్) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు. ఆయన చదువు డిసెంబర్లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు. చదవండి: (పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు) -
వీడియో: ఆ తల్లి కుక్కలా చేయలేదు.. పాముతో పోరాడి చిలుకలు..
మనుషులైనా జంతువులైనా సరే ఐకమత్యంతో ఉంటే కొన్ని సందర్భాల్లో ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా కొన్ని చిలుకలు ఐకమత్యంతో ఉండి.. పాము తరమిమేసి తమ ప్రాణాలను నిలుపుకున్నాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, జిల్లాలోని పెనుగొండలో ఓ కొబ్బరిచెట్టుపై కొన్ని చిలుకలు గూడుకట్టుకున్నాయి. కాగా, చిలుకల గూడును ఎక్కడి నుంచి పసిగట్టిందో ఏమో ఓ పాము వాటిని చినేందుకు చెట్టుపైకి ఎగబాకింది. ఆ సమయంలో పాము రాకను గమనించిన చిలుకలు తమ ప్రాణాలను కాపాడుకునేందు సర్వశక్తులొడ్డాయి. ఐకమత్యంతో పోరాటం చేశాయి. చెట్టుపై ఉన్న పాము బుసలుకొడుతూ చిలుకలను కాటువేసేందుకు ప్రయత్నించగా అక్కడున్న చిలుకలన్నీ ఐకమత్యంతో పామును ఎదుర్కొన్నాయి. పాముపై చిలుకలన్నీ కలిసి ముప్పెటదాడి చేశాయి. దీంతో, చేసేదేమీ లేక పాము తోకముడిచింది. కాగా, చిలుకల ఐకమత్యంపై నెటిజన్లు స్పందిస్తూ.. కలిసి పోరాడితే ఎంతటి కష్టానైనా జయించవచ్చని నిరూపించాయంటూ ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది! -
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ నేత సవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్న సీబీఐ
-
టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. బెంగళూరు నుంచి సీబీఐ అధికారులు నేరుగా టీడీపీ నేత సవిత ఇంటికి చేరుకున్నారు. సోదాల్లో ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టు పనుల్లో అక్రమాలపై భాగంగానే ఈ సోదాలు చేపట్టారు. టీడీపీ నేత సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. -
లోకేష్ పై పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఫైర్
-
దారి దోపిడీ ముఠా అరెస్ట్
పెనుకొండ: చిల్లర ఖర్చులకు దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గురువారం అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. గురువారం పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె వెల్లడించారు. రొద్దం మండలానికి చెందిన కురుబ శబరీష్ ప్రస్తుతం పరిగిలో ఉంటున్నాడు. హిందూపురం రూరల్ కొట్నూరుకు చెందిన భరత సింహారెడ్డి, మరో మైనర్ బాలునితో కలసి రాత్రి వేళ, తెల్లవారుజాము సమయాల్లో 44వ జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహనాల డ్రైవర్లను కత్తితో బెదిరించి, సెల్ఫోన్లు, నగదు అపహరించుకెళ్లేవారు. ఈ ఏడాది జూలై 8న అనంతపురం జిల్లా రాప్తాడు, కియా, సోమందేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దోపిడీలు సాగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్, కియా ఎస్ఐ వెంకటరమణ, సోమందేపల్లి ఎస్ఐ విజయకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కురుబ శబరీష్, భరతసింహారెడ్డి, మరో మైనర్ బాలుడు చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించి, గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్ఫోన్లు, పల్సర్‌బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. శబరీష్, భరతసింహారెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్ఐలు రమే‹Ùబాబు, వెంకటరమణ, విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: పరిటాల శ్రీరామ్ మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?) -
ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా
పెనుకొండ: ‘రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. అందుకే జనమంతా వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అండగా నిలుస్తూ అపూర్వ విజయాన్ని అందిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చివరకు తన సొంత నియోజకవర్గం ‘కుప్పం’లోనూ ఉనికి కోల్పోవడంతో రోడ్డుపై కూర్చుని ‘డ్రామా’కు తెరతీశారు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అర్హత ఉంటే చాలు పథకం ఇంటికే నడిచి వస్తోందని, అందువల్లే ‘కుప్పం’ ప్రజలూ వైఎస్సార్ సీపీ వెంట నడుస్తున్నారన్నారు. ఈక్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారన్నారు. దీంతో చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. టీడీపీ కేడర్ కూడా వైఎస్సార్ సీపీలో చేరుతోండటంతో ఏం చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. టీడీపీ నేతలే అక్కడున్న వైఎస్సార్ సీపీ నేతల ఫ్లెక్సీలు చించి నానా హంగామా చేస్తే వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారని, దీంతో టీడీపీ నేతలే దాడి దిగారన్నారు. కానీ చంద్రబాబు, అతని అనుచరులు కుప్పంలో వైఎస్సార్ సీపీ శ్రేణులే...టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారన్నారు. అంతేకాకుండా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ నిందలు వేశారని, ఇది చంద్రబాబు దిగుజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇక ‘కుప్పం’ ఘటనను సాకుగా చూపుతూ పలుచోట్ల టీడీపీ నేతలు శాంతిర్యాలీ పేరుతో జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమానికి సిద్ధమయ్యారన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని తన సొంత సర్వేలోనూ తేలడంతో చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు తెరలేపారన్నారు. జగనన్న ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు తప్పును, చేతగాని తనాన్ని కప్పిపుచ్చడానికి ఆ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి ధర్నాల పేరుతో నానా యాగీ చేస్తున్నారని, ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్పితీరుతారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సోమందేపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ వెంకటరత్నం, ఉప సర్పంచ్ వేణు, నాయకులు నరసింహమూర్తి, అశోక్, రామాంజనేయులు, ఇమాంవలి, వైస్ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, ఎస్ఎం బాషా, ఎంపీ నాగరాజు, ట్రాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు) -
పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?
ఇంట్లో నుంచి కాలు బయటపెడితే అనుచరుల హంగామా...పార్టీ నేతల స్వాగతాలు. అధిష్టానానికి తమగురించి చెప్పాలంటూ నాయకుల వినతులు. ఒకప్పుడు బీకే పార్థసారథి హవా ఇది...ఇప్పుడు మొత్తం మారిపోయింది. అధిష్టానం పట్టించుకోవడం లేదు. పైగా టికెట్ యూత్‌కేనంటూ తేల్చేసింది. వైరివర్గం ఫుల్‌జోష్‌లో ఉంది. మాట్లాడించే కార్యకర్త లేడు. కలిసి నడిచే నాయకుడు కరువు. పేరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడే అయినా...మాట చెల్లడం లేదు. సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకే పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తిగా డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బాబు ‘బాది’పోయాడా.. ఇటీవల చంద్రబాబు సోమందేపల్లిలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి బీకే పార్థసారథి పూర్తిగా నిరుత్సాహపడినట్లు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. 2024లో పెనుకొండ టికెట్‌పై చంద్రబాబు గానీ, లోకేష్ గానీ హామీ ఇవ్వకపోగా, ఈ సారి యువతకే అవకాశమని స్పష్టం చేయడంతో బీకే దిక్కుతోచని స్థితిలో పడ్డారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీకే పార్థసారథి ఇప్పటికే 2, 3 సార్లు చంద్రబాబును, లోకేష్‌ను కలసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అందువల్లే నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. దీంతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. చీలిన నాయకులు, కార్యకర్తలు.. పెనుకొండలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బీకే వ్యవహారశైలి, ఆయన అల్లుడి అజమాయిషీ నచ్చని తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. గతంలో బీకేకు అనుకూలంగా ఉన్న వారే ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్నారు. సొంతంగా గుంపుకట్టి పార్టీ కార్యక్రమాలు వేరుగా చేస్తున్నారు. బలప్రదర్శనతో అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ చుట్టూ్ట తిరిగిన వారంతా బాయ్ బాయ్ బీకే అంటూ వ్యతిరేక వర్గంలో చేరిపోయారు. బీకేకు పోటీగా కార్యక్రమాలు చేస్తూ నిరసన నిప్పు రాజేస్తున్నారు. ప్రోత్సహిస్తున్న అధిష్టానం.. బీకే వ్యతిరేక వర్గాన్ని టీడీపీ అధిష్టానమే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమందేపల్లికి రాగా...బీకే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీకే వ్యతిరేక వర్గం ‘కియా’ కార్ల పరిశ్రమ వద్దే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ఆహ్వానించింది. క్రమశిక్షణ ముఖ్యమని పదేపదే చెప్పే చంద్రబాబు కూడా బీకే వైరి వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అనంతరం సోమందేపల్లి కార్యక్రమానికి వచ్చారు. దీంతో భంగపడిన బీకే అధినేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిడ్డ లేదా అల్లుడికైనా... తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన పెద్ద కుమార్తెకు గానీ, లేదా కుడి భుజంగా ఉంటున్న అల్లుడు శశిధర్‌కు గానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీకే... చంద్రబాబు, లోకేష్‌ను కోరినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి బయోడేటాలను పార్టీ నేతలకు అందించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇది కూడా బీకేకు ఆశించిన ఫలితం కనిపించేలా లేదని సమాచారం. ఎంపీగా వెళ్దామంటే... అసెంబ్లీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయగా...బీకే హిందూపురం ఎంపీ టికెట్ అయినా అడుగుదామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వాల్మీకి వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ అడ్డుగా నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు అధినేత చంద్రబాబు కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలని ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యే బీకే ...తన రాజకీయ భవిష్యత్తును తలచుకుని మదన పడుతున్నట్లు చర్చ సాగుతోంది. ఆయన అనుచరులు సైతం తమ నాయకుడు పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. -
రైతు పక్షపాతి సీఎం జగన్
పెనుకొండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎమ్మెల్యే అధ్యక్షతన వైఎసార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. నియోజకవర్గ పరిశీలకుడు మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్ హాజరయ్యారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు రాయితీతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు గిట్టుబాటు ధరతో పంటలు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమాతో రైతులను ఆదుకుంటున్నారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎన్నికల హామీలు అమలు చేశారన్నారు. పెనుకొండకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారని, ఏకంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదన్నారు. ఆరోగ్యశ్రీ కింద 2400 జబ్బులను చేర్చి వైద్యాన్ని పేదలకు మరింత దగ్గర చేశారన్నారు. వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1.45 లక్షల కోట్లు, పెనుకొండ నియోజకవర్గంలో రూ.835 కోట్లు జమ చేశారన్నారు. జగనన్న కేబినెట్‌తోపాటు స్థానిక సంస్థల పదవుల్లో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకపక్ష గెలుపే జగనన్న పాలనకు నిదర్శమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న మరోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. విమర్శించడమే టీడీపీ పని.. సంక్షేమ పథకాల ద్వారా జగనన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నా టీడీపీ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. పచ్చమీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంతోపాటు ఆయన హయాంలో ప్రతి పథకంలోనూ ప్రజల సొమ్మును దోపిడీ చేశారన్నారు. దీంతో ప్రజలు ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. ధీరుడు జగన్మోహన్రెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ధీరుడని, ఇంత వరకు ఇలాంటి నాయకుడిని దేశంలోనే చూడలేదని నియోజకవర్గ పరిశీలకుడు నర్సేగౌడ పేర్కొన్నారు. వాల్మీకులను ఇతర కులాలను ఎస్టీ, ఓబీసీల్లో చేర్చే విషయమై సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్లీనరీకి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు అవకాశవాది.. చంద్రబాబు అవకాశవాది అని, ఆయన పాలన∙చీకటిమయమని ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో పెనుకొండలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరులు మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున, మార్కెట్‌యార్డ్ వైస్ చైర్మన్ పైడేటి రమణ, కన్వీనర్లు నాగలూరుబాబు, నారాయణరెడ్డి, తిమ్మయ్య, బీకే.నరసింహమూర్తి, లక్ష్మీనరసప్ప, తయూబ్, ఎంపీపీలు గీత, గంగమ్మ, ప్రమీల, సవిత, చంద్రశేఖర్, జెడ్పీటీసీలు గుట్టూరు శ్రీరాములు, డీసీ అశోక్, జయరాంనాయక్, పరిగి శ్రీరాములు, ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ఫారూఖ్ఖాన్, వైస్ చైర్మన్లు నందిని, సునీల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణరెడ్డి, సంగీత,నృత్య అకాడమీ డైరెక్టర్ సువర్ణ, సర్పంచ్‌లు నాగమూర్తి, అశ్వత్థప్ప, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకరరెడ్డి, గుట్టూరు ఆంజనేయులు, ప్రభాకర్, గోరంట్ల మార్కెట్‌యార్డు చైర్మన్ బూదిలి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..) -
అనంతపురం జిల్లా: పెనుకొండలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
Chandrababu: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదు
సాక్షి, అమరావతి: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే ఆప్యాయంగా పలకరిస్తారా అని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి బాధితుల పరామర్శకు వెళ్లినపుడు ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా. 62మంది చనిపోతే బాధ ఉండదా?, సీఎంను పొగుడుతారా?, గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా?, ఏం మనుషులు వీళ్లు. సభ్యత, సంస్కారం లేకుండా ఉన్నారు. బుద్ధి, జ్ఞానం లేకపోతేనే ఇటువంటి ఆలోచనలు వస్తాయి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘మిమ్మల్ని దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, మా ఏసుక్రీస్తు వచ్చాడని ప్రజలు పొగుడుతారా’ అని సీఎంను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల వల్ల వరదలొచ్చి 62 మంది చనిపోయారని, రూ.6 వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంటు సాక్షిగా అన్న మాటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలిసో, తెలియకో ప్రజలు ఓట్లేస్తే వారి ప్రాణాలు బలగొంటున్నారని విమర్శించారు. పెనుకొండ ఫలితాలపై బాబు ఆగ్రహం: పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవటం ఏమిటని అనంతపురం జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుకొండ ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. -
అనంతపురం జిల్లా నాయకుల్ని అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలో ఘనవిజం సాధించినందుకు మంత్రి శంకరనారాయణను, జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ అభినందించారు. కాగా, పెనుకొండ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడిన, ప్రలోభపెట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. ఫలితంగా 20 వార్డులున్న నగర పంచాయతీలో ఏకంగా 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ జిల్లా నేతలంతా పెనుకొండలోనే మకాం వేసి కుట్ర రాజకీయాలు చేసినా ఆ పార్టీ రెండు స్థానాల (1,3వార్డులు)ను మాత్రమే దక్కించుకోగలిగింది. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్) చదవండి: (అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్) -
పెనుగొండలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
టీడీపీ నేతల బరితెగింపు
పెనుకొండ(అనంతపురం జిల్లా): టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారుల్లో వెళుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఓటర్లను భారీఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలు ఎర వేస్తున్నారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ తదితరులు మూడు వారాలుగా పెనుకొండలోనే మకాం వేశారు. ఒక్కొక్కరు ఒక్కో వార్డు బాధ్యతలు తీసుకుని, ఆ పరిధిలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఇదివరకే ఒకటో వార్డులో స్వయాన బీటీ నాయుడు వాహనంలోనే మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా జంకకుండా టీడీపీ నేతలు ప్రలోభపర్వం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న వార్డుల్లో ఏకంగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా పంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రచారం చివరిరోజైన శనివారం రోడ్‌షోలకు ఎస్పీ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ రోడ్‌షో నిర్ణయాన్ని ఉపసంహరించుకుని..ప్రచారానికే పరిమితమయ్యారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వంద వాహనాలతో పట్టణంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు మించి చేస్తున్న హడావుడి, ఆగడాలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
పెనుకొండకు సీఎం జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు
-
అక్రమ పదోన్నతులు: ‘సాక్షి’ కథనంతో కలకలం
పెనుకొండ మండలంలో పనిచేసిన ఓ సెకండరీ గ్రేడ్ టీచర్... స్కూల్ అసిస్టెంట్‌గా (ఇంగ్లిష్) పదోన్నతి పొందాలనుకున్నాడు. ఎంఏ ఇంగ్లిష్ చదివాల్సి ఉన్నా.. అంత ఓపికలేక ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చి ప్రమోషన్ పొందాడు. తాజాగా నకిలీ బాగోతాలన్నీ తవ్వుతుండగా ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నాడు. అనంతపురం విద్య: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన అయ్యవార్ల గుట్టు రట్టవుతోంది. అడ్డదారిలో పదోన్నతులు పొందిన టీచర్ల వ్యవహారంపై ‘సారూ... ఇదేమి తీరు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో విద్యాశాఖలో కలకలం రేగింది. గుర్తింపు లేని వర్సిటీల నుంచి ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన వారి వివరాలన్నీ తక్షణమే తనకు అందించాలని డీఈఓ కే.శామ్యూల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అలగప్ప, భారతీయార్, మధురై కామరాజ్, వినాయక మిషన్స్ తదితర వర్సిటీల్లో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసినట్లు సర్టి ఫికెట్లు అందజేసిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి అక్రమం..మరొకటి సక్రమం... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి తప్పనిసరిగా ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఉండాలి. అయితే నకిలీ సర్టిఫికెట్లతో కొందరు తక్షణమే పదోన్నతి తీసుకున్నారు. తిరిగి మరో దఫా అదే పీజీని మరో వర్సిటీ నుంచి ఒరిజినల్‌గా పూర్తి చేశారు. ఇలా ఆరుగురు ఎంఏ ఇంగ్లిష్‌ను రెండు దఫాలు పూర్తి చేసినట్లు ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదు చేయించుకున్నారు. నకిలీ పీజీ సర్టిఫికెట్‌ను అసలు పీజీ సర్టిఫికెట్‌గా మార్చేందుకు ఎత్తుగడ వేశారు. పదోన్నతి దక్కినప్పుడు నమోదు చేసిన సర్టిఫికెట్, వర్సిటీ.. తాజాగా నమోదు చేసిన సర్టిఫికెట్ వేర్వేరుగా ఉండటం గమనార్హం. సింగిల్ సబ్జెక్టు పేరుతో... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి ఎంఏ ఇంగ్లిష్ /లేదా డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ తప్పనిసరి. ఈ క్రమంలో నకిలీ ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సింగిల్ సబ్జెక్టు ఇంగ్లిష్ డిగ్రీ పేరుతో నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. డీఈఓ నిర్ణయంతో వారందరికీ చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ మెజార్టీ ఉపాధ్యాయులు మాత్రం ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని సీనియార్టీ, అర్హత ఉన్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. -
ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ!
ఆయనో ఎస్ఐ. శాంతిభద్రతలు కాపాడటంతో పాటు అక్రమ మద్యం, పేకాట, మట్కా తదితరాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారి. అలాంటి బాధ్యతాయుతమైన అధికారి దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం పెనుకొండ ప్రాంతంలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సారు.. గతంలో చిలమత్తూరులోనూ పనిచేశారు. ఆ సమయంలో అక్కడా అక్రమ మద్యం ఏరులై పారించారు. అప్పటి సీఐ అండతో ఆయన రెండు చేతులా ఆర్జించారనే అపవాదు ఉంది. ఈయన దందా బయటపడినా అదే సీఐ అండతో ఎస్పీకే టోకరా వేసినట్లు సమాచారం. రెండు రోజుల కిందట పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందనే సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందింది. పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అధికారులు.. అక్కడి పరిస్థితులతో విసిగిపోయి సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణకు విషయం చేరవేశారు. సదరు ఎస్ఐ వెంటనే సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి, నిందితులను అరెస్ట్ చేశారు. వాస్తవానికి శెట్టిపల్లిలో జరుగుతున్న పేకాట గురించి ముందుగానే పెనుకొండ ప్రాంతంలోని పోలీసు అధికారికి తెలిసినా ఆయనెందుకనో మౌనం వహించారు. ఈ చిన్న సారు పనితీరుకు ఇదో ఉదాహరణ మాత్రమే.. ఆయన పనిచేసిన చోటల్లా ఇదే తంతు. హిందూపురం సెంట్రల్: పెనుకొండ ప్రాంతంలో పని చేస్తున్న ఓ ఎస్ఐ పనితీరు వివాదాస్పదంగా మారింది. మట్కా నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. దుప్పటి పంచాయితీలు చేసి డబ్బులు దండుకోవడం. చేయి తడిపితే చాలు కేసును తారుమారు చేయడం.. తనమాట వినకపోతే బెదిరింపులతో పాటు గుండాగిరీ చేయడం ఆయన నైజం. ఇలా ఖాకీ దుస్తుల్లో పోలీసు శాఖ పరువు తీస్తున్న ఆయన వైఖరిపై నిజాయితీ ముసుగులో ఖాకీ దందా శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో గతంలో ఆయన పనిచేసిన చిలమత్తూరు స్టేషన్ సిబ్బందీ ఆయన కన్నింగ్ కథలు ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటున్నారు. అక్రమ మద్యం.. ఆయన కనుసన్నల్లోనే పెనుకొండకు రాకముందు చిలమత్తూరులో పనిచేసిన ఈ చిన్న సారు.. బార్డర్లో అక్రమ మద్యం దందా జోరుగా సాగించారు. కొడికొండ చెక్‌పోస్ట్‌లో గతేడాది కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి ఏరులై పారింది. అందుకు అప్పటి చిలమత్తూరు స్టేషన్‌లోని ముఖ్య అధికారే సహకరించారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. చిలమత్తూరు మండలంలోని కొందరి వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో రూ.లక్షలు దండుకున్నారని తెలుస్తోంది. అనధికార డ్రైవర్‌తో దందా అనధికారికంగా నియమించుకున్న డ్రైవర్ సాయంతో సదరు ఎస్ఐ రూ.లక్షలు కూడబెట్టినట్టు అప్పట్లో చిలమత్తూరు మండలంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే చిలమత్తూరు ఎస్ఐగా రంగడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఐ రంగడు కొడికొండ చెక్‌పోస్ట్‌కు వెళ్లగా.. సాయంత్రం సమయంలో సర్వీస్ రోడ్లో ఓ కారు వచ్చింది. దీంతో ఎస్ఐ ఆ కారును నిలుపగా... అందులోని వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. అందులో చిలమత్తూరు మండలానికి చెందిన వ్యక్తులతో పాటుగా అంతకుముందు చిలమత్తూరు ఎస్ఐకి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఉన్నట్లు తేలింది. దీనిపై అప్పుడే ‘సాక్షి’ చిల‘మత్తూరు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీన్ని ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్‌గా తీసుకోగా.. ఎస్పీని తప్పుదోవ పట్టిస్తూ సీసీటీవీ పుటేజీల మాయాజాలంతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మభ్యపెట్టారు. చిలమత్తూరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చూపించి కేసును సింపుల్‌గా మూసేశారు. స్వామి భక్తికి మెచ్చి డ్రైవర్‌కు ప్రమోషన్ కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో ఉన్నతాధికారులకు సహకరించిన సదరు ఎస్ఐ డ్రైవర్‌కు సర్కిల్‌స్థాయి అధికారి ప్రమోషన్ ఇప్పించి ఏకంగా ఎస్పీఓగా తీసుకున్నారు. ఆధారాలు తారుమారు చేసిన తర్వాత తమను ఎవరు ఏమి చెయ్యగలరనే ధైర్యంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పెనుకొండ వ్యవహారంపై తీవ్ర చర్చ ఇక పెనుకొండ పోలీస్ స్టేషన్ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త పెనుకొండ పోలీసు సబ్ డివిజన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఆ ఎస్ఐ ఎక్కడికి వెళ్లినా ఇంతేనా అంటూ పోలీసులే పెదవి విరుస్తున్నారు. చదవండి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు -
అనంతపురం: పెనుకొండలో అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య
-
విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య
అనంతపురం: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో విషాదం నింపింది. ఒకేరోజు ముగ్గురు విష పదార్థం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని పదవీ విరమణ పొందిన బ్యాంక్ ఉద్యోగి అశ్వర్థప్ప (65) నివాసంలో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగ అశ్వర్థప్ప, అతడి ఇద్దరు సోదరిలు విగతజీవులుగా పడ్డారు. అయితే వారు కొన్నిరోజుల కిందట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు. -
అనంతపురం: పెనుగొండ వద్ద రోడ్డు ప్రమాదం
-
గూగుల్ పేతో జాక్‌పాట్!
పెనుకొండ: గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
పెనుకొండ అమ్మాయినోయి.. మిస్ సౌతిండియానోయి..!
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక యువతి దక్షిణ భారతదేశ స్థాయిలో మొదటి సాన్థంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు పొందిందంటే సామాన్య విషయం కాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో ఆమె దూసుకెళ్లింది. సౌత్ ఇండియా 2020 కిరీటం పొందింది. గొప్పగొప్ప వారి ప్రశంసలు అందుకుంది. అందుకుంటూనే ఉంది. ఆమె పెనుకొండకు చెందిన సుగమ్య. మిస్ యూనివర్స్‌గా నిలవడమే తన లక్ష్యమని చెబుతున్న ఆమె సాక్షితో తన అనుభూతులను పంచుకుంది. -పెనుకొండ మాది పెనుకొండ. తండ్రి రవిశంకర్ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు. తల్లి గాయత్రి. పలు సినిమాల్లో నటించింది. ఇక్కడి సరస్వతి విద్యామందిర్‌లో 3వ తరగతి వరకు చదివా. 4, 5 తరగతులు హైదరాబాద్‌లో. 6, 7, 8,9 బెంగళూరు రిషీకుల పాఠశాలలో పూర్తిచేశా. బీఎస్సీ సైకాలజీ, కళాక్షేత్ర ఫౌండేషన్ చెన్నైలో డిప్లమాలో భరతనాట్యం చేసి, ప్రస్తుతం ఎంఏ భరతనాట్యం చదువుతున్నా. మహారాష్ట్రలోని పండరీపురలో ఉన్న మిట్ విశ్వనాథ్ గురుకుల భరతనాట్య డ్యాన్సు టీచర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా. మెమొంటోలుతల్లిదండ్రులతో సుగమ్యశంకర్ ఇలా మిస్ సౌతిండియా అయ్యా..! స్నేహితుల సహకారంతో మిస్ సౌత్ ఇండియా 2020 విషయం తెలుసుకున్నా. ఆన్లైన్లో దరఖాస్తు చేశా. 2019 డిసెంబర్లో బెంగళూరులో మొదటిసారిగా పరీక్ష నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో జరిగే 4 రోజుల శిక్షణకు 2020 జనవరి మొదటి వారంలో పిలుపొచ్చింది. అక్కడ ఫోటో జెనిక్, టాలెంట్ పోటీలు, వ్యక్తిత్వ వికాసం, మానసికంగా దృఢంగా ఉండేలా శిక్షణ తీసుకున్నా. వ్యూయర్స్ ఛాయిస్ ద్వారా ఓటింగ్ ప్రారంభమైంది. 23 మంది పోటీ పడితే 67 వేల మంది నాకు మద్దతుగా ఓట్ చేశారు. ఈవెంట్లో మిస్ సౌత్ ఇండియా కిరీటం కట్టబెట్టారు. తల్లిదండ్రుల సహకారంతోనే ఇక్కడి దాకా.. అమ్మానాన్న, నా సోదరుడు, స్నేహితుల సహకారంతో ఇక్కడిదాకా నా ప్రయాణం సాధ్యమైంది. వారి తోడ్పాటు లేకుంటే ఇంత దాన్ని అయ్యే దానిని కాదు. ప్రతి విషయంలోనూ ఎన్నో సూచనలు అందించి ఆచరణలో పెట్టే వరకు సలహాలు ఇస్తూనే వుంటారు. అన్నయ్య సునాగ్ శంకర్భరద్వాజ్ ప్రోత్సాహం మరువలేనిది. మిస్ సౌత్ ఇండియా పోటీల సందర్భంగా ఇంగ్లిష్ మాట్లాడడంలోనూ, ర్యాంప్‌పై నడిచే విషయంలోనూ, హావభావాల ప్రదర్శన విషయంలోనూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరే నా భవిష్యత్తు మార్గనిర్దేశకులు. ఈ జన్మ వారికే అంకితం. సుగమ్యను వరించిన అవార్డులు యువతకు లక్ష్యం ఉండాలి.. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. ముఖ్యంగా యువతకు. విద్యకు పెద్దపీట వేయాలి. పోటీతత్వాన్ని ఎదుర్కోవాలి. ముందుచూపు లేకుండా వెళ్ల రాదు. ప్రధానంగా యువతులు ఉదాశీన వైఖరి విడనాడాలి. ప్రాణాల మీదకు వచ్చే వరకు ఉండరాదు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో అనుభూతులను నింపిన ప్రయాణమిది.. ప్రస్తుతం మాటల్లో చెప్పలేని ఎంతో ఆనందం అనుభవిస్తున్నా. ఇంతటి స్థానం పొందుతానని ఎన్నడూ ఊహించలేదు. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తూ సన్మానం చేస్తుండడం తీయని అనుభూతి. ప్రస్తుతం కన్నడ, తమిళం, మళయాళం చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యాడ్ ఫిల్మ్‌లలో నటించా. లక్ష్యం మిస్ యూనివర్స్.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలన్నదే నా ధ్యేయం. అలాగే, భరత నాట్య కళాక్షేత్రం పెనుకొండలో స్థాపించి ఈ ప్రాంత బాలికలకు శిక్షణ ఇవ్వాలనే కోరిక ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఇమిడి వుంటుంది. దాన్ని వెలికితీసినపుడే ఆత్మ సంతృప్తి వుంటుంది. అమ్మ కళాకారిణి, నాన్న యోగా గురువు. వీరి ప్రతిరూపంగా పోటీ రంగంలో ముందుకు వెళ్లాలన్నదే లక్ష్యం. అనేక పురస్కారాలు అందుకున్నా.. గుంటూరులో భరతనాట్యంతో యువకళారత్న అవార్డును మంజీర సాహిత్య అకాడమీ ద్వారా 2019లో పొందా. రాయల ఉత్సవాల సందర్భంగా భరతనాట్యంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ప్రశంసలందుకున్నా. అనూష ఆర్ట్ అకాడమీ ద్వారా చెన్నైలో పురస్కారం పొందాను. అనంతసాహితీ అకాడమీ, త్యాగరాజ సంగీత సభల్లో అనేక పురస్కారాలూ వరించాయి. -
సీసీటీవీ కెమెరాకు ముసుగు కప్పి మరీ..!
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో దొంగ హల్చల్ చేశాడు. పెనుకొండలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీనికితోడు గ్యాస్ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏటీఎంలోని డబ్బులు భద్రంగా ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది. ప్లాంట్ పరిశీలించిన సీఎం.. కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి కియా ప్లాంటు వద్దకు వచ్చారు. ప్లాంటులో కార్ల తయారీ యూనిట్‌కు సంబంధించిన అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్ తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల్లో 40,649 కార్ల విక్రయం కియా ప్లాంటులో తయారైన సెల్టోస్ కారుకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని హన్ తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 6,046 బుకింగ్స్ వచ్చాయన్నారు. గత నాలుగు నెలల్లోనే 40,649 కార్లను విక్రయించినట్లు తెలిపారు. కొరియా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భారత్‌లో కొరియా రాయబారి బోంగో కిల్‌షిన్ చెప్పారు. కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్ షిమ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కియా కార్ల గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న కియా సంస్థ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన కియా ప్రతినిధులు -
అనంతపురం: కియా ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
కియా ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అనంతపురం: పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ‘పెనుకొండలో కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. కియా కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామం. కియా యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా’ అని అన్నారు. ఎందరికో ఉపాధి రాష్ట్రంలో కియా మోటర్స్ చక్కగా పని చేస్తుందన్న ముఖ్యమంత్రి సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు. మరింత విస్తరించాలి కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు. పూర్తి అండగా నిలుస్తాం కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని, ఆ కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తమది ప్రొయాక్టివ్ ప్రభుత్వం అని ఆయన వివరించారు. కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్ఊపాక్, ఒకేరోజు ఆరు వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంకిన్, కియా మోటర్స్ ఎండీ కోకిన్‌షిన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, .గౌతమ్‌రెడ్డి, శంకరనారాయణ, జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే, మండలి విప్ కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కియా మోటర్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆయన వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. -
కియా ఫ్యాక్టరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెనుకొండలో గల కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం.. ఈ సందర్భంగా కియా యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పరిశ్రమ గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్ వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సీఎం ఆరా తీయనున్నారు. అలాగే అనంతపురం-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరవాహన్ సంస్థ కు 120 ఎకరాల భూములు కేటాయింపు కూడా పూర్తి అయ్యాయి. కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గౌతంరెడ్డి, శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్భాల్, మాజీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, గుర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్లలోనే వారి కాపురాలు
సాక్షి, పెనుకొండ : ఈ భవనం కియా కార్ల పరిశ్రమ సమీపంలోని ఎర్రమంచి రహదారిలో కంటైనర్లతో నిర్మించారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన దీని పేరు ‘విదమ్ హాస్పెటాలిటీ’ పేరుతో కొరియన్లకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. బేగ్ అనే కొరియన్ దీనిని నిర్వహిస్తున్నాడు. కంటైనర్లలో భవంతులు నిర్మించి నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనేక మంది నిర్వహిస్తున్నారు. పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లవుతోంది. ఇందులో పని చేయడానికి వందలాది మంది కొరియన్లు వారి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పలువురు కొరియన్లు సమీపంలోని భవనాల్లో బాడుగలకు ఉంటున్నారు. మరి కొందరు కంటైనర్ బాక్సులతో రూపొందించిన భవనాల్లో నివసిస్తున్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు. భద్రత డొల్ల.. కంటైనర్లలో కాపురం ఉండడం అంత శ్రేయస్కరం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఏ మాత్రం షార్ట్‌సర్క్యూట్ జరిగినా, ఏ ఇతర ప్రమాద సమయాల్లోనైనా ప్రాణాపాయం తప్పదని అభిప్రాయపడుతున్నారు. 2017లో కంటైనర్‌లో నివాసం ఉంటున్న తాడిపత్రికి చెందిన ఇద్దరు బేల్దార్లు పొగ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కంటైనర్ కాపురాలు మరిన్ని పెరగడం ఆందోళన రేపుతోంది. అనుమతులు ప్రశ్నార్థకమే? ఒక భవనం నిర్మించాలంటే గ్రామ పంచాయతీ లేదా అహుడా అనుమతి ఉండాలి. అయితే కంటైనర్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా దీనిని ప్రశి్నంచకపోవడంతో నిర్మాణాలు మరింత జోరందుకుంటున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడం వల్లే వీటి నిర్మాణాలు అధికమవుతున్నాయనే విమర్శలుమున్నాయి. ఇప్పటికే ఎర్రమంచి, హరిపురం, అమ్మవారుపల్లి, దుద్దేబండ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. కియా, ఏపీఐఐసీ అతిథి గృహాలు సైతం కంటైనర్లతో నిరి్మంచడం గమనార్హం. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇలాంటి నిర్మాణాలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పెనుకొండలో పెనువిషాదం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుంటుబ కలహాలతో కళావతి అనే మహిళ తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించిన స్థానికులు తల్లి కళావతి, పిల్లలు అంజలి, రమేష్, రాజశేఖర్, వైష్ణవిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వెంకటేష్ కుటుంబాన్ని పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మేడిన్ ఆంధ్రా కియా ‘సెల్తోస్’ మార్కెట్లోకి వచ్చేసింది
-
కియా తొలి కారు ‘సెల్తోస్’ విడుదల
సాక్షి, అనంతపురం: పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును గురువారం మంత్రులు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీలో కార్ల పరిశ్రమ స్థాపించాలని 2007లో కియా యాజమాన్యాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరారు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చట్టం తీసుకొచ్చారు. సెల్తోస్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఉద్యోగుల 'కియా' మొర్రో
సాక్షి, పెనుకొండ(అనంతపురం) : ‘కియా’తో ఉద్యోగాలు లభిస్తాయని, తమ జీవితాలే మారిపోతాయని ఆశపడిన ‘అనంత’ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జిల్లాలో కంపెనీ ఏర్పాటైనా...అక్కడ ఉద్యోగుల్లో మనవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా.. కియా, దాని అనుబంధ సంస్థల్లో అమలు కావడంలేదు. పైగా ‘కియా’లో 80 శాతం మంది ఉద్యోగులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే కావడంతో...తెలుగువాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిగంటలు పెంచడం...వారాంతపు సెలవు ఇవ్వకుండా తెలుగువారికి నరకం చూపిస్తున్నారు. చివరకు వారే విసిగిపోయి ఉద్యోగాలు వదిలి పారిపోయేలా చేస్తున్నారు. ఆది నుంచీ వివక్షే! ‘కియా’ పరిశ్రమలో తెలుగువారిపై ఆది నుంచీ వివక్షే కొనసాగుతోంది. నైపుణ్యం పేరుతో వివక్ష చూపిస్తూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. ‘కియా’ అనుబంధ పరిశ్రమ ‘హుందాయ్’ గతంలో తమిళనాడులో ఉండటం, ఆ చనువుతో తమిళనాడు ప్రాంతం వారికే ఇక్కడి ‘కియా’లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో అరకొరగా ఉన్న తెలుగు ఉద్యోగులపై వేధింపులకు దిగుతున్నారు. వేతనాలు, పనిగంటలు, తదితర అన్ని విషయాల్లోనూ చిన్నచూపు చూస్తున్నారు. భూ బాధిత కుటుంబాలకూ దక్కని ఉద్యోగాలు ‘కియా’ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల పిల్లలు ఎందరో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివినా కియాలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం అరకొరగా ఉన్న తెలుగువారికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ విషయమై గతంలో పలుమార్లు ‘కియా’ పరిశ్రమ ఎదుటనే తెలుగువారు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. పరిశ్రమ కోసం భూములు సేకరించినప్పుడు స్థానికులకే వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నాయకులు వాటిని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కనీసం భూబాధిత రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారు. ‘సంగ్వూ’ ఎదుట ధర్నా తెలుగువారిపై చూపుతున్న వివక్షను నిరిస్తూ సోమవారం ఉదయం పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలోని కియా అనుబంధ కంపెనీ ‘సంగ్వూ’ హైటెక్ కంపెనీ ఎదురుగా తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వారంతా అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. -
కబ్జాకు కాదేదీ అనర్హం
సాక్షి, పెరవలి: పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటేనే నానా రాద్ధాంతం చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు వారి కళ్లెదుటే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ స్థలాలను టీడీపీ నేత, పెరవలి నీటి సంఘం అధ్యక్షుడే దర్జాగా ఆక్రమణలకు పాల్పడటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆక్రమించుకున్న స్థలం చాలదన్నట్టు కాలువను పూడ్చి గట్టును ఆక్రమించుకుని ఇటుక బట్టీ ఏర్పాటు చేసి ఇరిగేషన్ స్థలాన్ని తన సొంత జాగీరుగా అనుభవిస్తున్నాడు. మరోవైపు శ్మశానాన్ని సైతం ఆక్రమించుకుని చేనుగా మలిచాడు. కాలువగట్లను రెండువైపులా ఆక్రమించుకుని ఇళ్లు కూడా నిర్మించుకున్నాడు. ఈ అధికార పార్టీ నేత కబ్జాలో ఇరిగేషన్‌కు చెందిన సుమారు 70 సెంట్ల భూమి ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువలనూ వదలని అక్రమార్కులు ప్రభుత్వ కార్యాలయాల మధ్య జాతీయ రహదారి పక్కన లక్షలాది రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ భూమి ఆక్రమణ చెరలో ఉంది. ఇరిగేషన్‌కు చెందిన రెండున్నర ఎకరాల స్థలం ఈ కాలువ పక్కనే ఉండగా అడుగడుగునా ఆక్రమణలకు గురవ్వడంతో కనీసం 10 సెంట్లు భూమి కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇది మండల కేంద్రమైన పెరవలిలో ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని విలవిల్లాడుతున్న భూపయ్య కాలువ దుస్థితి. ఈ కాలువ నర్సాపురం నుంచి పెరవలి లాకుల వద్ద మీదుగా నేరుగా ఇరగవరం మండలంలో వందలాది ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తోంది. కాలువగట్లను పూడ్చేసి ఇళ్లు నిర్మించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాలువనే పూడ్చివేసి ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. ఇంత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు. సదరు నేతపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు నెలనెలా అందుతున్న మామూళ్లే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 70 సెంట్లు స్వాహా ఇరిగేషన్కి చెందిన ఖాళీ స్థలం 24 సెంట్లు, కాలువగట్టు 10 సెంట్లు, ఇరిగేషన్ స్థలం మరో 20 సెంట్లు, శశాన భూమి 16 సెంట్లు మొత్తం కలిపి సమారు 70 సెంట్లు ఆనేత అధీనంలో ఉంది శ్మశాన భూమిలో ఇటుకల బట్టీ జాతీయ రహదారి పక్కన, మండల పరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నం.117/2ఏలో 18 సెంట్లు, 117/2సీలో 13 సెంట్లు మొత్తం 31 సెంట్లు భూమి ఉంది. కానీ జాతీయ రహదారి విస్తరణలో దీనిలో 9 సెంట్లు భూమి పోవడంతో మిగిలిన 22 సెంట్లు ఉంది. దీనిపై కన్నేసిన ఆనేత దీనిని కొద్దికొద్దిగా ఆక్రమించుకుని చేనుగా మలిచి ఇప్పడు ఇటుక బట్టీ నిర్వహిçస్తున్నాడు. కనుమరుగవుతున్న కాలువ గట్లు కాలువ గట్లు అక్రమణదారుల కోరల్లో చిక్కుకుని గట్లే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గట్లు చిక్కిపోయి నడవటానికి తప్ప, ఎటువంటి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్పుడు ఏకంగా గట్టునే కబ్జా చేసి నేరుగా సాగు చేస్తున్నారు. పెరవలి మండలంలో మూడు ప్రధాన కాలువలతో పాటు 69 పిల్ల కాలువలు ఉన్నాయి. వీటిపై మండలంలో 34,600 ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇరగవరం, పెనుగొండ, తణుకు, అత్తిలి, ఆచంట మండలాల భూముల పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పడు ఇవన్నీ ఆక్రమణల చెరలో ఉన్నాయి. ముక్కామలలో వైరు కాలువ గట్లుపై అరిటి సాగు చేస్తుంటే ఖండవల్లి వద్ద నక్కల డ్రెయిన్ కుడిగట్టును ఆక్రమించుకుని దర్జాగా బొప్పాయి, జామ సాగు చేస్తున్నారు. అన్నవరప్పాడులో బ్రాంచ్ కెనాల్ గట్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో గట్టుపై నడవటానికి తప్ప కనీసం సైకిల్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఈకాలువ గట్ల పొడవునా కొందరు రైతులు గట్లను చేలో కలుపుకోగా మరికొందరు గట్లపైనే పశువుల పాకలు వేసి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం వరకు ఈ గట్లపై ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రాకపోకలు సాగించేవి. శివారు భూముల పంట ఉత్పత్తులను ఈ గట్ల ద్వారానే ప్రధాన రహదారి చేర్చేవారు. ఇప్పుడు గట్లు కనుమరుగవ్వటంతో శివారు భూముల రైతులు పంట ఉత్పత్తులను మోసుకురావడం తప్ప మార్గం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్టు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సోమందేపల్లి బహిరంగ సభలో వైఎస్ జగన్
-
‘బాబుకు ఓటేస్తే.. రూ.5 లక్షలు కట్టాల్సి వస్తుంది’
-
ప్రతికులాన్ని వెన్నుపోటు పొడిచి చరిత్ర చంద్రబాబుది
-
‘బాబుకు ఓటేస్తే.. రూ.5 లక్షలు కట్టాల్సి వస్తుంది’
సాక్షి, సోమందేపల్లి(అనంతపురం) : ‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. ఇంజనీరింగ్‌కు రూ. 5లక్షల ఫీజు కట్టాల్సివస్తుంది. ఎల్కేజీకి కూడా లక్ష కట్టాల్సి వస్తుంది. ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఉండదు. ఇప్పటికే 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. నారాయణ స్కూల్లో ఎల్కేజీ చదవాలంటే రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. పించన్లు, రేషన్ కార్డులు తీసేస్తారు. ఆరోగ్య శ్రీ అటకెక్కుతుంది.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టేనన్నారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శంకర్ నారాయణ, హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. రాజస్తాన్ తర్వాత.. రాజస్తాన్ తర్వాత అనంతపురం జిల్లాలోనే కరువు ఎక్కువ. గొల్లపల్లి రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైఎస్సారే. నాన్నగారి హయాంలో హంద్రీనీవా 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. తాగడానికి నీళ్లు లేవని తెలిసినా చంద్రబాబు చేసిందేమి లేదు.. ఇసుకను మాత్రం యధేచ్చగా దోచేస్తున్నారు. పెనుకొండ, గోరంట్ల మండల్లాలో వేల ఎకరాల భూమిని సేకరించింది. ఇక్కడ ఒక్క పరిశ్రమనైనా వచ్చిందా? కియా మోటర్స్‌తో చంద్రబాబు చేసిన స్కాంలు ఇన్ని అన్నీ కావు. రైతుల నుంచి కారు చౌకగా భూములను కొని చదునుగా ఉన్న భూమిని మళ్లీ చదును చేసేందుకు రూ. 650 కోట్లకు ఎల్అండ్టీ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ ఎల్అండ్టీ సంస్థనే మళ్లీ రూ.177 కోట్లకు తెలగుదేశం నాయకులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే వీళ్లు పాలకులా లేఖ రాక్షసులా? అనిపిస్తోంది. టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. రైతు, డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకాలను ఎగ్గొట్టారు. ప్రతికులాన్ని వెన్నుపోటు పొడిచి చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్లో ఎల్కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్ పరం చేస్తాడు. కరెంట్, ఆర్టీసీ, పెట్రోల్ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. రేషన్ కార్డులు, పెన్షన్లు కుదించేశాడు. ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తాడు. భూములు లాగేస్తాడు. ఇప్పటికే వెబ్ ల్యాండ్ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూమలు లాగేస్తున్నాడు. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవు. జన్మభూమి కమిటీలదే రాజ్యం.. పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీ చానెల్ చూడాలన్నా.. ఏ పేపర్ చదవాలన్నా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా వారే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు. చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని కోరుతున్నా. 1994 ఎన్నికల ముందు మద్యపాన నిషేదం.. కిలో రెండు రూపాయల బియ్యమని చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో మద్యపాన నిషేధం ఎత్తేశారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25 చేశారు. ఇదే పెద్దమనిషి మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవ్. రైతులకు రుణాలే ఇవ్వరు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది.. ఇంకా పూర్తిగా లేకుండా పోతుంది. 108,104లు కనుమరుగవుతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కుతుంది. ఫీజులు ఆకాశానికి పడుగెత్తుతాయి. చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఎవ్వరిని బతుకనివ్వరు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రానివ్వరు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపొయ్యాయి. చనిపోయినా ఒక్క వార్త రాదు. వారే చంపించి పైగా బాధిత కుటుంబంపై నెట్టేస్తారు. జడ్జీలుగా బీసీలకు అవకాశం ఇస్తే.. బీసీలు జడ్జి పదవులకు అనర్హులని చంద్రబాబు లేఖలు రాశారు. గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. ఆయనను ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు తాను చేసిన రాజీనామాను ఆమోదించకుండా చంద్రబాబు అడ్డుతగిలారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే, సింగిల్ విండో ఆఫీస్ ముందే.. మనకు హత్యలు కనిపిస్తున్నాయి. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఎలా ఉంటుందో చంద్రబాబును నమ్మితే అలా ఉంటుంది. అన్న ఉన్నాడని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
గోరంట్ల మాధవ్ రాజీనామాకు చంద్రబాబు అడ్డుతగిలారు
-
టీడీపీ కమీషన్ల దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు
-
బీకే గొప్పలు..జనం తిప్పలు
సాక్షి, పెనుకొండ: అసమర్థ ప్రజాప్రతినిధి అరాచకంతో దశాబ్దకాలంగా ఎదుగూబొదుగూలేని నియోజకవర్గంగా పెనుకొండ మిగిలిపోయింది. ఎటు చూసినా బీడు భూములే.. తాగునీటి ఇబ్బందులే.. అందరూ వలసపోగా నిర్మానుష్యంగా ఉన్న పల్లెలే. అయినా స్థానిక ఎమ్మెల్యే మాత్రం అరచేతిలో అభివృద్ధి చూపుతున్నారు. అన్నీ తానే చేశానంటూ గొప్పలు చెబుతున్నారు. ఎన్నికల వేళ హామీల ముల్లె భూజాన వేసుకుని ఊరూవాడా తిరుగుతున్నారు. రోడ్డులేదు.. నీరురాదు..ఇల్లు లేదు 2014 ఎన్నికల్లో పార్థసారథి పెనుకొండ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దర్గాపేటలో మాత్రం నాటుగైదు రోజులకు ఒకసారి నీరు వదలుతుంటే ఆ ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దీంతో ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదు. పెన్నానదికి అడ్డంగా సబ్‌సర్ఫేస్ డ్యాం కట్టించి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య తీర్చుతానని బీకే పార్థసారథి హామీ ఇచ్చినా.. అది కాగితాలను పరిమితమైంది. ఇక నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లుకూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గకేంద్రంలో గత ప్రభుత్వాలు పట్టాలివ్వగా...లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకుండా ఎమ్మెల్యేనే అడ్డుపడ్డారు. ఇళ్లు నిర్మించుకునేందుకు వెళ్తున్న పేదలను పోలీసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయల ఉత్సవాలకూ మంగళం పురాతన కట్టడాలను అభివృద్ధి చేసి ఈప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే..తన మాట నిలుపుకోలేదు. అసలు పురాతన కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక రాయల ఉత్సవాలను నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇక పర్యాటక కేంద్రం అన్న అంశాన్నే అటకెక్కించారు. విద్యాభివృద్ధికి చర్యలు లేవు ఇక్కడి బాలికల కోసం జూనియర్ కళాశాల ఏర్పాటుచేస్తానని చెప్పినా... నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు పూర్థిస్థాయిలో కృషి చేసి విద్యార్థులు టెక్నికల్ కోర్సులు చదివేలా చూస్తానన్న ఆయన హామీ గాల్లో కలిసిపోయింది. ఇక పరిగిలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. నీళ్లు కరువు..బీళ్లుగా పొలాలు గోరంట్ల మండలానికి హంద్రీనీవా నీళ్లు తీసుకువస్తానని గొప్పలు చెప్పిన బీకే..నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకువచ్చి హంద్రీనీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతానని ఆయన ఇచ్చిన హామీ...గాల్లో కలిసిపోయింది. దీంతో రిజర్వాయర్ కింద ఉన్న 10 వేల ఎకరాలు, పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండలాల పరిధిలోని 25 చెరువుల కింద ఉన్న 14 వేల ఎకరాలు బీడుగా మారిపోయింది. కళ్లముందే పారుతున్న కృష్ణా జలాలు పొలాల్లో పారక రైతులు అల్లాడిపోతున్నారు. ఇక పెనుకొండ మండలంలోని మునిమడుగు చెరువు తెగి ఏళ్ళు గడుస్తున్నా.. పట్టించుకోలేదు. చేనేతలకు మొండిచేయి పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాల్లోని చేనేతల ఓట్ల కోసం బీకే పార్థసారథి ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక కనీసం వారిని పలకరించిన పాపన పోలేదు. చేనేతల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా అందక...అప్పుల పాలైన ఎందరో చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా...ఆయన స్పందించలేదు. ఇవే కాకుండా రొద్దం డెయిరీని తెరిపించడం.. గోరంట్లలో హిందూశ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నేటికీ నెరవేరలేదు. అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే బీకే పార్థ సారథి ఈ నాలుగున్నరేళ్లలో అవినీతి, ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలుచారు. అల్లుడు శశిని ప్రోత్సహించి సెంటిల్మెంట్లు, దందాలు సాగించారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.కోట్లు పర్సెంటేజ్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద రైతుల భూములను తక్కువ ధరకు కోనుగోలు చేసి అనంతరం మూడు రెట్లు ఎక్కువకు ‘కియా’ యాజమాన్యానికి విక్రయించారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రైతులను బెదిరించి పరిశ్రమ సమీప ప్రాంతాల్లో రూ.కోట్ల విలువజేసే భూములు అక్రమంగా కొనుగోలు చేసినట్లు జనం చర్చించుకుంటున్నారు. ఇక పేటకుంట సమీపంలో ఓ సామాజిక సంస్థ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.కోట్ల రూపాయల లాభానికి విక్రయించారన్న విమర్శలున్నాయి. అలాగే పరిగి మండలం ఊటుకూరు చెరువులో కియా అనుబంధమైన కేఐఎంఎల్ పరిశ్రమ ఏర్పాటులో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవు ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి ప్రజా సమస్యలు పట్టవు. అందుకే ఇక్కడ అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గ కేంద్రంలోని దర్గాపేటలో వందలాది మంది ఇళ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య వేధిస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యేకు పట్టడం లేదు. – యాసిన్, పెనుకొండ వ్యవసాయం మానుకున్నాం చెరువుకు మరమ్మత్తులు చేయించి రైతులను ఆదు కుంటానని బీకే పార్థ సారథి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తీరా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇపు డు హడావుడిగా పనులు ప్రారంభించారు. చెరువు కు నీళ్లు చేరక..వ్యవసాయం చేయడమే మానేశాను. – శేఖరప్ప, రైతు, మునిమడుగు, పెనుకొండ -
తిట్టినా.. తుడిచేసుకొని!
సాక్షి, పెనుకొండ రూరల్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈ కోవలోనే ఉప్పునిప్పుగా ఉన్న ఎమ్మెల్యే బీకే పార్థసారధి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మునిమడుగు చిన వెంకటరాముడు ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం పెనుకొండ మండలంలోని మునిమడుగులో బీకే ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక సందర్భంగా చిన వెంకటరాముడు తన వర్గీయులను పెద్ద ఎత్తున టీడీపీలోకి తీసుకొస్తారని ఆశించినా నిరాశే మిగిలింది. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన కొందరు అనుచరులు మినహాయిస్తే పెద్దగా స్పందన లేకపోవడం బీకేతో పాటు టీడీపీ శ్రేణులను తీవ్ర అసహనానికి గురిచేసింది. పైగా మంత్రి పరిటాల సునీత కూడా కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో హల్చల్ ఆదివారం ఉదయం నుంచి ఒక వీడియో సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది ప్రత్యేక హోదా కోసం పెనుకొండ పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్న అప్పటి కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ బాధ్యుడు, ప్రస్తుతం టీడీపీలో చేరిన మునిమడుగు చిన వెంకట్రాముడును ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి తీవ్ర పదజాలంతో దూషించారు. రోడ్డుపై ధర్నా చేస్తూ తన కారుకు అడ్డుగా తగిలాడనే కారణంతో బండ బూతులు తిట్టిన వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ నియోజకవర్గంలో తన ఓటమి ఖాయమని తేలిపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే బీకే పడుతున్న పాట్లను చూసి అధికారం కోసం ఇంతటి నీచానికి దిగజారుతారా? అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిన వెంకటరాముడు కూడా ప్యాకేజీ కోసం తనను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే పంచన చేరడాన్ని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మహిళా నేత మధ్యవర్తిత్వం చిన వెంకటరాముడు టీడీపీలో చేరిక వెనుక పెద్ద డీల్ కుదిరినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడుకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించగా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలుస్తోంది. పెనుకొండకు చెందిన ఓ మహిళా నేత రాప్తాడులో కుల ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తుండటంతో.. ఇందుకు ప్రతిగా రాప్తాడుకు చెందిన మహిళా నేత ఈ డీల్ కుదిర్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం చిన్న వెంకటరాముడుకు పెనుకొండ నేత రూ.50లక్షలు, పార్లమెంట్ నేత రూ.30లక్షలు, రాప్తాడు మహిళా ప్రజాప్రతినిధి రూ.20లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. -
ముల్లె సర్దిన పల్లె
సాక్షి, పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కూలీలకు నిరవధికంగా పని కల్పించాలని, వారి ఉపాధికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కలలు కని కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది కూలీలు ఈ పథకంతో లబ్ధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక పూట గడవని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు నెలలైనా ప్రభుత్వం వేతనాలను కూలీల ఖాతాలకు జమ చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నరు. కూలీలు ఉపాధి బిల్లులు పడ్డాయో లేదోనని చూసుకోవడా¯నికి పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో అనేక మంది కూలీలు పనికి స్వస్తి పలికి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. గతంలో దాదాపు ఐదు వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లేవారు. నేడు ఉపాధి కూలీల సంఖ్య వందలకు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వ ఎలా నీరుగారుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో అనేక మంది ఇళ్లను వదలి వెళ్లిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అడదాకులపల్లి, మహదేవపల్లి, శెట్టిపల్లి, కొండంపల్లి, సోమందేపల్లి, బ్రాహ్మణపల్లి, పందిపర్తికి చెందిన గ్రామస్తులు భారీగా వలస వెళ్లారు. ఒకవైపు తీవ్ర వర్షాబావంతో పంటలు పండక నష్టపోయిన రైతన్నలు, మరోవైపు ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వలసలు రోజురోజుకి పెరుగుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. కొంపముంచిన వరుణుడు.. పెనుకొండ నియోజకవర్గంలో ఖరీఫ్ 56,000 ఎకరాల్లో కంది, వేరుశనగ, అలసంద, పెసర, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగయింది. పంట సాగులో అడపదడపా వర్షాలు కురిసినా తర్వాత మూడు నెలల పాటు చినుకు జాడ కనిపించలేదు. దీంతో పంట పూర్తిగా దెబ్బతినింది. చాలా చోట్ల రైతులు పంటను పశువులకు వదిలేశారు. ఇక రబీలో నియోజకవర్గ వ్యాప్తంగా 5500 ఎకరాల్లో పప్పుశనగ, ఉలవలు తదితర పంటలు సాగుచేశారు. రబీలో కూడా వరణుడు కరుణించకపోగా తీవ్ర వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పంట పెట్టుబడి చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, బీమా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వలసబాట పట్టారు. మండలాల వారీగా జాబ్‌కార్డులు,కూలీలు, పెండింగ్ వేతనాల వివరాలు మండలం జాబ్ కార్డుల పని చేస్తున్నకూలీలు సంఖ్య పెండింగ్‌లో ఉన్న వేతనాలు పెనుకొండ 10959 1029 రూ.85 లక్షలు సోమందేపల్లి 8526 3000 రూ.70 లక్షలు రొద్దం 15753 1202 రూ.56 లక్షలు గోరంట్ల 6459 1100 రూ.60 లక్షలు పరిగి 11229 1188 రూ.35 లక్షలు నియోజకవర్గంలో వలసపోయిన వారి సంఖ్య మండలం వలసపోయిన వారు పెనుకొండ 1000 సోమందేపల్లి 1000 రొద్దం 1500 పరిగి 1000 గోరంట్ల 4500 ఈ ఫోటోలో ఉన్న వృద్ధురాలి పేరు హనుమక్క. పెనుకొండ మండలం మహదేవపల్లి గ్రామం. కుమారుడు రామాంజినేయులు ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు బెంగళూరుకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. అన్ని పనులు చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతోంది. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగకపోవడం, వేతనాలు సకాలంలో పడకపోవడం, బోర్లు బావులు ఎండిపోయి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు వలస బాట పట్టక తప్పలేదు. ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నా.. కుమారుడు వలస వెళ్లడంతో ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నాను. కుమారుడు హిందూపురం ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడే సంసారం పెట్టుకున్నాడు. 10 రోజులకు ఒకసారి వచ్చి పలకరించి వెళ్తుంటాడు. వృద్ధురాలినైనా నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి. బతకడానికి గ్రామంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వలస వెళ్లక తప్ప లేదు. – నాగమ్మ, మహదేవపల్లి, పెనుకొండ మండలం బిల్లులు సక్రమంగా పడవు గతంలో ఉపాధి పనులకు చాలా మంది వెళ్లే వాళ్లం. ప్రస్తుతం బిల్లులు సక్రమంగా పడక పోవడంతో పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంది. వలస వెళ్లక తప్పడం లేదు. – రామాంజినమ్మ, మహదేవపల్లి -
ఎమ్మెల్యేవారి బూతుపురాణం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న ఆశతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంతకుమునుపు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఎంతగానో సహకరించారు. కానీ ఆయన మాత్రం సొంత లాభమే ఎక్కువగా చూసుకున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే బూతు పురాణం వినిపిస్తున్నారు. 2014లో ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. అక్రమ సంపాదనతో అహం పెరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నించే విపక్ష పార్టీల నాయకులను దూషించడం, ప్రజలను చులకనగా మాట్లాడటంతో జనమంతా ఆయనంటేనే ఈసడించుకుంటున్నారు. చివరకు సొంత పార్టీ నేతలను సైతం రాయలేని పదజాలంతో దూషిస్తుండటంతో చాలా మంది సీనియర్లు ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి నెలకొంది. తన అల్లుడి ద్వారా నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు చేసుకుని సొంత పార్టీలోని సీనియర్లను తీవ్రంగా అవమానించారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడగా...మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత్రికేయులనూ వదలని బీకే పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలు, అవినీతిపై కథనాలు రాసిన విలేకరులను సైతం బీకే నోరుచేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. నోటికి అంతూపంతూ లేకుండా ఆయన వినిపించే బూతుపురాణం వింటే ఎవరైనా ఇతనో ఎమ్మెల్యేనా అని అనుమానిస్తారు. ‘‘ఏయ్ ఎస్ఐ.. ఈ నా కొడుకులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి మక్కిలు విరిగేలా తన్ను’’ - నీటి సమస్యలపై నిలదీసిన పెనుకొండ మండలం కొండంపల్లి సీపీఐ నాయకులనుద్దేశించి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలివి. ‘‘ఏయ్ సీఐ.. ఆ లం..కొడుకును.. ఎవరు రోడ్డుపై ధర్నా చేయమన్నారు. మొదట ఆ లం..కొడుకును చెప్పుతో కొట్టి పోలీస్‌స్టేషన్‌లో పెట్టి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చెయ్...’’ - ప్రత్యేక హోదాపోరుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి అప్పటి సీఐ శ్రీనివాసులుతో ఎమ్మెల్యే అన్న మాటలివి. బీకే దూషణల పర్వంలో మచ్చుకు కొన్ని.. ఇటీవలే సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లిలో గ్రామస్తులు నీటి సమస్యపై ఎమ్మెల్యేని నిలదీస్తే దీనికి బాధ్యుడిగా చేస్తూ స్థానిక ‘సాక్షి’ విలేకరిపై చిందులు వేసి దూషించాడు. అలాగే పెనుకొండ, రొద్దం మండలాలకు చెందిన విలేకరులను సైతం చాలా సందర్భాల్లో బహిరంగంగానే దూషించారు. రెండునెలల క్రితం గోరంట్ల మండలం అమ్మవారిపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో మంజూరైన సిమెంట్ రోడ్డును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బీకే గ్రామానికి రాగా...స్థానికులంతా సిమెంట్ రోడ్డు బదులుగా తారురోడ్డు వేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే బీకే సహనం కోల్పోయి వారితో దురుసుగా ప్రవర్తించాడు. ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించమని అడిగిన పాపానికి అమ్మవారిపల్లికి చెందిన భూ నిర్వాసితుల కుటుంబానికి చెందిన విద్యార్థి వెంకటరెడ్డిని అందరి ముందే దూషించాడు. ఇలా ఆయన నోటికి బలైన వారు ఎందరో ఉన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడటం తగదంటున్నారు. -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
సాక్షి, రొద్దం: అవినీతి కాదేదీ అనర్హమంటున్నారు అధికార పార్టీ నాయకులు. ఏకంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకెళితే..మండలంలోని 19 గ్రామ పంచాయితీల్లోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 8700 మరుగుదొడ్లు మంజూరు కాగా 6,533 నిర్మాణాలను 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకూ విడతల వారీగా పూర్తి చేశారు. ఇందుకోసం రూ.9.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరుగుదొడ్డి కట్టకుండానే బిల్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులే చేయించారు. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ చిన్నప్పయ్య పనులు చేశారు. మిగతా పంచాయతీల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పునాదులు తీసి వాటిని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు దిగమింగినట్లు తెలుస్తోంది. ఇక పాతవాటికి కూడా బిల్లులు చేసినట్లు సమాచారం. ఒకే తలుపును మరుగుదొడ్లకు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు సమాచారం. పెద్దగువ్వలపల్లి గ్రామంలోనే దాదాపు రూ.40 లక్షల దాకా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. బోగస్ బిల్లులు చేయడానికి ఒప్పుకోని ఒక ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. నాణ్యతకు పాతర.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకమైన ఇటుకలు వాడడంతోపాటు సిమెంట్ తగిన పాళ్లలో వాడలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక చాలావాటికి రింగులే ఇవ్వలేదు. నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని వినియోగించడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం. -
మహా శివరాత్రి రోజున అద్భుతం!
సాక్షి, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో శివరాత్రి పర్వదినం రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. శివుని మెడలో నిత్యం నాగుపాము ఉండడం పరిపాటి. గోధుమ వర్ణం కలిగి ఉన్న అలాంటి నాగుపాము పాత జైన దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పడగ విప్పి అటు ఇటు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు సెల్ఫోన్లలో ఫొటో తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నాగుపామును దర్శించారు. పలువురు మహిళలు ప్లేటులో పాలు తీసుకొచ్చి పాము వద్ద ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి అద్భుతం చోటు చేసుకోవడం నిజంగా శివుని మహిమేనని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
పోరుబాట ఉద్రిక్తం.. నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అనంతపురం: కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు నిర్భంధించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను తమ నిర్భందంలో ఉంచుకున్న పోలీసులు.. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ప్రభుత్వ ఆస్పత్రా.. మద్యం దుకాణమా?
సాక్షి, అనంతపురం : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బరితెగించారు. పట్టపగలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ డాక్టర్ ఆనంద్ బాబు, మరో నలుగురు సిబ్బంది వైద్య సేవలు పక్కనపెట్టి.. రోగులను గాలికొదిలేసి.. ఆస్పత్రిలోనే పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ జల్సా చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎటుచూసినా మద్యం బాటిళ్లు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. వైద్యుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగుల అవస్థలను పట్టించుకోకుండా ఆస్పత్రిలోనే అసాంఘిక కార్యకలాపాలకు దిగడం దారుణమని, ఇది ఆస్పత్రా.. మద్యం దుకాణామా? అని నిలదీశాయి. ఆస్పత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి
సాక్షి, అనంతపురం : జిల్లాలో ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద కారు, టెంపో ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రొద్దం మండలం తిమ్మాపురం నుంచి అనంతపురంలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైఎస్ జగన్ సంతాపం సత్తారుపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
అనంతపురం జిల్లా పెనుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు
పెనుకొండ రూరల్: జాతీయరహదారిపై వేగంగా వెళుతున్న కారు కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న దంపతులు సీటుబెల్టు ధరించడం వల్ల ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. పెనుకొండ ఎస్ఐ జనార్ధన్ తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన సంతోష్ తన భార్య ప్రశాంతితో కలసి ఆదివారం ఉదయం గుంతకల్లుకు కారులో బయల్దేరాడు. పెనుకొండ మండలం హరిపురం జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ సీటు బెల్టు ధరించడంతో లోపల ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, వాహనదారులు గమనించి దంపతులను బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కంటైనర్‌లో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి
సాక్షి, పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద్ద ఉన్న కియా ఫ్యాక్టరీ దగ్గర కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రించిన ఇద్దరు కూలీలు మృతిచెందారు. నారాయణ, రామాంజినేయులు అనే కూలీలు సోమవారం రాత్రి కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రపోయారు. అయితే అక్కడ ఊపిరాడకపోవడంతో వారు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
పట్టా భూమికి పక్కా స్కెచ్
కియా మాటున దందా భూసేకరణ స్కెచ్‌లో తిరకాసు మొదటి స్కెచ్‌లోని 16 ఏకరాలు రెండవ స్కెచ్‌లో మాయం ముఖ్య ప్రజాప్రతినిధికి అనుకూలంగా మార్పులు బహిరంగ మార్కెట్లో 16 ఎకరాల విలువ రూ.24 కోట్లు రైతు నుంచి ఎకరా రూ.30.25 లక్షలకు కొనుగోలు అధికారం ఉంది... చెప్పింది వినే అధికారులూ ఉన్నారు. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. అంతిమంగా బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కియా’ను అడ్డంపెట్టుకుని కోట్లు కొళ్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. అనంతపురం అర్బన్: కియా మోటార్స్ పరిశ్రమకు సంబంధించి భూ సేకరణ మాటున అధికార పార్టీ నేతలు ‘జాదూ’కి తెరలేపారు. రూ.కోట్లు విలువ చేసే భూమిని తమ వశం చేసుకునేందుకు పథకం రచించారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు ‘ఒక్కటై’ వ్యవహారం నడిపారు. భూ సేకరణకు సంబంధించి తొలిగా విడుదల చేసిన స్కెచ్‌లో 16 ఎకరాల పట్టా భూమిని కూడా చేర్చారు. అయితే నాలుగులేన్ల రహదారిపై ఉన్న ఈ భూమిపైన అధికార పార్టీ నాయకులు కొందరు కన్నెశారు. ఒక ముఖ్యప్రజాప్రతినిధి సూచన మేరకు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి స్కెచ్‌లో మార్పులు చేశారు. మొదటి స్కెచ్‌లో సేకరణకు కింద చూసిన 16 ఎకరాల భూమి తప్పించి రెండవ స్కెచ్ సిద్ధం చేశారు. ఇలా కథ నడిపారు కియా మోటర్స్ పరిశ్రమ కోసం పెనుకొండ సమీపంలో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో 179 సర్వే నంబరులోని 16 ఎకరాల భూమిని కూడా సేకరించేలా తొలుత స్కెచ్‌ను విడుదల చేశారు. అయితే ఈ 16 ఎకరాల భూమి పరిశ్రమలకు ఎదురుగా ఉన్న రోడ్డు బిట్ కావఽడంతో తమ వశం చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కథ నడిపారు. రెవెన్యూ అధికారుల సాయంతో రెండవ స్కెచ్‌లో ఈ 16 ఏకరాల భూమిని తప్పించారు. భూమి విలువ రూ.24 కోట్లు ప్రస్తుతం కియా మోటర్స్ పరిశ్రమ పరిసరాల్లో రోడ్డు బిట్ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.1.50 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన 16 ఎకరాల భూమి విలువ రూ.24 కోట్లు ఉంటుంది. వాస్తవంగా భూ సేకరణ కింద భూమిని తీసుకుని ఉంటే ఎకరాకు రూ.10.50 లక్షలుగా ఇచ్చే వారు. భూ సేకరణ కింద 16 ఎకరాలు తప్పించి రైతులతో బేరసారాలు నడిపారు. రైతులు ఒప్పకోకపోతేæ 16 ఎకరాలను భూ సేకరణ కింద తిరిగి చేర్చాలని పథకం రచించారు. భూ సేకరణ కింద పోతే ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున 16 ఎకరాలకు రూ.1.68 కోట్లు మాత్రమే వస్తుందనీ, తాము చెప్పినట్లు వింటే ప్రభుత్వం ఇచ్చేదానికంటే రెండింతలు ఎక్కవగా ఇస్తామన్నారు. దీంతో రైతులు ఎకరా రూ.30.25 లక్షలకు విక్రయించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. 16 ఎకరాలకు గానూ ఇక్కడ రైతులకు వారు ఇచ్చేది రూ.4.84 కోట్లు. రైతులకు రూ.19.16 కోట్లు నష్టం ఈ భూమి వ్యవహారంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అధికార పార్టీకి చెందిన వారు ఇస్తున్న మొత్తమే ఎక్కవగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇందులో రైతులు నష్టపోయేది రూ.19.16 కోట్లు. భూసేకరణ నుంచి తప్పించిన భూమిని రైతులకు వదిలేసి ఉంటే వారికి లబ్ధి చేకూరేది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరా రూ.1.50 కోట్లకు విక్రయించుకునేవారు. ఈ లెక్కన 16 ఎకరాలకు వారికి రూ.24 కోట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు రైతుల నుంచి దక్కించుకున్న 16 ఎకరాల భూమి ద్వారా అధికార పార్టీ నాయకులకు భారీ లబ్ధి పొందారు. -
జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం శంకరనారాయణ అధ్యక్షతన నవరత్నాల సభ జరిగింది. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వృద్ధులు, రైతులు, వితంతువులు అన్ని వర్గాల ప్రజలు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇసుక, పట్టిసీమ, ఇతర సంక్షేమ పథకాల్లో దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని, నవరత్నాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్నారు. -
‘కియా’ గోల్మాల్
కార్ల కంపెనీకి భూసేకరణలో మాయాజలం రూ. కోట్ల విలువైన 16 ఎకరాలు తప్పించే ఎత్తుగడ మనం చూస్తున్న ఈ భూములు కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్నవి. రెండో విడత భూ స్వాధీన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు సేకరిస్తున్న భూములకు ఆనుకుని ఉన్న భూములు కూడా ఇవే. అయితే విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వెనుక అధికారిక కుట్ర సాగుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను స్వాధీన ప్రక్రియ నుంచి తప్పించేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది. పెనుకొండ: మండలంలోని అమ్మవారుపల్లిలో సర్వే 179లో హనుమంతరెడ్డికి 3.26 ఎకరాలు, శేషగిరికి 3.26 ఎకరాలు, వెంకటరెడ్డికి 9.50 ఎకరాల పట్టా భూమి ఉంది. కియా కార్ల పరిశ్రమల ఏర్పాటులో భాగంగా చేపట్టిన భూ స్వాధీన ప్రక్రియ నుంచి ఈ 16 ఎకరాలను అధికారులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు కథ ఏమిటంటే.. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో ఎకరా భూమి విలువ కనీసం రూ. కోటికి పైగా ఉంది. దీనిని బట్టి సర్వే 179లోని 16 ఎకరాల భూమి విలువ రూ. 16 కోట్ల పై మాటే. ఈ భూములపై కన్నేసిన జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు ఎకరా రూ. 30 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మధ్యవర్తిగా రియల్టర్ రామచంద్రను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీన ప్రక్రియలో ఈ భూములు పోతే ప్రభుత్వం అందజేసే రూ. 10.50 లక్షలతోనే అమ్మకందారులు సరిపెట్టుకోవాలి. లేకపోతే అగ్రిమెంట్ మేరకు రూ. 30 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భూములను అగ్రిమెంటు చేసుకున్నా.. కియా కార్ల పరిశ్రమ రెండో విడత భూసేకరణ ప్రారంభించక మునుపే ఈ భూములను అగ్రిమెంట్ చేసుకున్నాను. సిమెంటు పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఈ భూమిని కొనుగోలు చేశాను. దీని వెనుక ఎవ్వరి హస్తం లేదు... ఎవరికీ సంబంధం లేదు. ఈ 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ కోర్టును ఆశ్రయించాను. - రామచంద్ర, రియల్ ఎస్టేట్‌వ్యాపారి, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం విషయం తెలియదు.. ఆ 16 ఎకరాల భూమి విషయం నాకు తెలియదు. నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. ఆ భూములపై విచారణ చేయిస్తాం. పారదర్శకంగా వ్యవహరించడమే మా బాధ్యత. - రామ్మూర్తి, ఆర్డీవో, పెనుకొండ -
దగా కారు!
చదును వెనుక దందా - కియా కార్ల పరిశ్రమ ముసుగులో ‘పచ్చ’తంత్రం - రూ.177.94 కోట్లతో ఎల్అండ్టీకి టెండర్ - భూముల విలువను మించి చదునుకు వ్యయం - ఓ ఎమ్మెల్యే, చినబాబుకు లబ్ధి చేకూర్చే యత్నం - పక్కా ప్రణాళికతో దోపిడీ భూసేకరణ బాధితులు గ్రామం బాధిత రైతులు అమ్మవారిపల్లి 145 దుద్దేబండ 55 కురబవాండ్లపల్లి 205 వెంకటగిరిపాలెం 15 కియా కార్ల పరిశ్రమకు కేటాయించిన భూముల చదును వెనుక దందా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. 599.35 ఎకరాలను రూ.62.93 కోట్లతో కొనుగోలు చేసిన ఏపీఐఐసీ.. ఆ భూములను చదును చేసేందుకు రూ.177.94 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. కొనుగోలుకు వెచ్చించిన మొత్తానికి మూడింతలు చదునుకు ఖర్చు చేయనుండటం వెనుక మతలబు ఉన్నట్లు ఇట్టే అర్థమవుతోంది. కేబినెట్లో చోటు ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం.. చినబాబును ఓ ‘ఇంటి’వాడిని చేయడమే ఈ టెండర్ సారాంశంగా తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పెనుకొండ నియోజకవర్గంలోని ఎర్రమంచి, అమ్మవారిపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాళెంలో ‘కియా’ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఏపీఐఐసీ 599.35 ఎకరాల భూమిని సేకరించింది. బాధిత రైతులకు ఎకరాకు రూ.10.50లక్షలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నాలుగు గ్రామాల పరిధిలో 599.35 ఎకరాలు కోల్పోయిన రైతులకు 62.93లక్షల పరిహారం దక్కనుంది. ప్రభుత్వం సేకరించిన పొలాన్ని ‘కియా’కు అప్పగిస్తే అందులో యాజమాన్యం నిర్మాణ పనులు చేసుకోవాలి. కానీ ప్రభుత్వం పొలాలను చదునుచేసి ‘కియా’కు అప్పగించేందుకు ముందుకొచ్చింది. పొలాన్ని చదును చేసేందుకు ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ పనికి ఖర్చయ్యే మొత్తాన్ని రూ.177.94కోట్లుగా నిర్ధారించింది. భూముల కొనుగోలుకు రూ.62.93కోట్లు పరిహారం చెల్లించిన ప్రభుత్వం.. చదును పేరుతో ఇంత భారీ మొత్తంలో టెండర్లు పిలవడాన్ని రైతు సంఘాలతో పాటు విపక్షాలు తప్పుబడుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే టెండర్లు చదును పనులను అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్లలో తిరకాసు పెట్టింది. టెండర్లు దాఖలు చేసే ఏజెన్సీలు గత ఐదేళ్లలో కనీసం ఓ ఏడాది రూ.780కోట్ల టర్నోవర్‌తో పనులు చేసి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు ఎల్అండ్టీ, ఎన్‌సీసీలు అర్హత సాధించాయి. ఈ రెండింటి టెండర్లలో ఫైనాన్సియల్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు ఎల్అండ్టీ టెండర్‌ను ఖరారు చేశారు. నిజానికి ఈ పనులకు రూ.25కోట్లకు మించి ఖర్చు కాదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్మాణాలు లేకుండా కేవలం పొలాలు చదును చేసేందుకు పెద్దగా ఖర్చు కాదు. ఈ పనుల్లో రూ.150కోట్లకు పైగా అవినీతి జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎవరి వాటా ఎంతంటే! అనంతపురం జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేను సంతృప్తి పరిచేందుకు టెండర్ మొత్తంలో రూ.30కోట్లు నిర్మాణ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో రూ.30–40కోట్లతో అమరావతిలో ఓ భవంతిని చినబాబుకు నిర్మించి ఇచ్చేలా కూడా ఒప్పందం జరిగినట్లు చర్చ జరుగుతోంది. రెండిటికీ రూ.60–రూ.70కోట్లు ఖర్చవుతుంది. ఇది కాకుండా పనులకయ్యే రూ.25కోట్ల ఖర్చు పోనూ మరో రూ.80–రూ.90 కోట్లు నిర్మాణ సంస్థకు మిగలనుంది. ప్రస్తుతం ఎల్అండ్టీ సంస్థ పనులు చేస్తోంది. నాలుగు చోట్ల చిన్న చిన్న గుట్టలు తప్ప మొత్తం పొలం చదునుగానే ఉంది. ఈ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని చూస్తున్న భూములు కోల్పోయిన రైతులు చదును పేరుతో జరిగే దోపిడీని తెలుసుకుని అవాక్కవుతున్నారు. తమకు తక్కువ మొత్తాన్ని పరిహారంగా చెల్లించి.. చదును పేరుతో ప్రభుత్వం టీడీపీ నేతలకు దోచిపెడుతుండటం పట్ల మండిపడుతున్నారు. -
ఇదేం అద్దె బాబోయ్ !
- పెనుకొండలో భారీగా పెరుగుతున్న ఇంటి అద్దెలు - ‘కియో’ ఎఫెక్టేనంటున్న అధికారులు - తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు పెనుకొండ : పెనుకొండలో పెరిగిన ఇంటి అద్దెలతో సామాన్యుడు కుదేలవుతున్నారు. క్రింది స్థాయి ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చేసేది లేక కొంత మంది ఏకంగా పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి లాంటి సమీప మండల కేంద్రాలకు తమ మకాం మార్చుతున్నారు. చిన్న ఉద్యోగులు తమకు వచ్చే జీతంతో అంత బాడుగలు చెల్లించుకోలేమని మదన పడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. కియా ఎఫెక్ట్‌తోనే.. మండలంలోని అమ్మవారుపల్లి, ఎర్రమంచి ప్రాంతాల్లో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం కావడం, కొరియా దేశం నుంచి కియా ప్రతినిధులు ఇక్కడికి భారీగా రావడంతో పాటు ఎల్అండ్టీ కాంట్రాక్ట్ సంస్థకు భారీగా కార్మికులు, ఉద్యోగులు తరలిరావడంతో పట్టణంలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇల్లు చూడచక్కగా ఉంటేనే అద్దె తగిన విధంగా ఇవ్వడానికి బయట ప్రాంతాల వ్యక్తులు సిద్ధమవుతున్నారు. అనేక మంది ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు కొత్త ఇళ్ళను నిర్మించుకునేందుకు సన్నాహాలు ముమ్మరం చేయగా మరి కొందరు లక్షలు వెచ్చించి ఇళ్లను అందగా ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే పట్టణంలో భారీ అపార్ట్మెంట్లు నిర్మాణమవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ళకే బయట ప్రాంతాల నుంచి వస్తున్న అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. దీంతో పాటు గుట్టూరు, పాలసముద్రం సమీపంలోని గ్రేట్‌వే విల్లాస్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ రానున్న 2 నెలల తరువాత మరింత పుంజుకోనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పెంచడం తగదు - రామమూర్తి, ఆర్డీఓ పట్టణంలో ఇష్టారాజ్యంగా ఇంటి బాడుగలు పెంచడం తగదు. సామాన్యుడు, మధ్యతరగతి ఉద్యోగులు ఇక్కడ ఉండలేని పరిస్థితి వస్తోంది. ఇప్పటికే కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. కియా కార్ల పరిశ్రమ నిర్మాణ ప్రారంభంతోనే బాడుగలు పెరిగాయి. ప్రచారం ఎక్కువగా ఉంది - సుదర్శనరెడ్డి, న్యాయవాది, పెనుకొండ కియా ప్రతినిధులు కాని ఎల్అండ్టీ ఉద్యోగులు కాని ఇతర కార్మికులు కాని తమకు కావాల్సిన ఇళ్ళను ఎంపిక చేసుకుంటూ బాడుగలు పెంచారు. అయితే పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు అలాంటి ప్రభావం లేదు. బాడుగలు పెరిగాయన్న ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే కియా టౌన్ షిప్ నిర్మిస్తే దీని ప్రభావం తగ్గుతుంది. -
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొస్తున్నాయ్
పెనుకొండ: ప్రజా, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు, రైతులు తిరగబడే రోజులు ఎంతో దూరం లేవని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమాలో అవినీతిని నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్సర్కిల్లో డీసీసీ కార్యదర్శి కేటీ.శ్రీధర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఇన్పుట్ సబ్సిడీ కాని బీమా కాని సక్రమంగా అందించిన పాపాన పోలేదన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనేక మంది టీడీపీ నాయకులు పంట పెట్టకపోయినా ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారని, పంట పెట్టిన వారికి పరిహారం అందలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారన్న అక్కసుతో రైతులకు అన్యాయం చేశారన్నారు. రొద్దం మండలం బూచెర్లకు చెందిన పలువురు రైతుల అక్రమాల జాబితాను చదివి వినిపించారు. జన్మభూమి కమిటీల పేరుతో బ్రోకర్లు పర్సెంటేజీలు దండుకోవడానికే ఈ అక్రమాలకు తెరలేపారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో లక్షల కోట్లు, మంత్రులు వేల కోట్లు, ఎమ్మెల్యేల స్థాయిలో వందల కోట్లు, జన్మభూమి కమిటీలు వేలు,లక్షలు దోచుకుంటున్నారన్నారు. గత ఏడాది రెయిన్గన్ల పేరుతో వందల కోట్లు దోపిడీ జరిగిందని, ఒక్క ఎకరా కూడా బతికించలేకపోయారని, మళ్ళీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెయిన్గన్ల జపం వల్లించడం దోపిడీ చేయడానికేనన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తిని కలిసి ఇన్పుట్ సబ్సిడీలో తలెత్తిన లోపాలను వివరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులు గుట్టూరు చినవెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో చిన్నారి మృతి
పెనుకొండ : పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శీనప్ప, రాధమ్మల కుమారుడు నాని (4) పాముకాటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్నారి తల్లిదండ్రులతో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో బాలుడు ఏడవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాటుకాటుకు గురయ్యాడన్న అనుమానం ఉందని, వెంటనే పుట్టపర్తికి వెళ్ళాలని సూచించడంతో వారు హుటాహుటిన పుట్టపర్తికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం... పలువురిని కంటతడి పెట్టించింది. -
మళ్లీ టెన్షన్..!
- 5 వేల ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం - ఆందోళనలో అన్నదాతలు పెనుకొండ: కియాకార్ల పరిశ్రమ కోసం పెనుకొండ మండలం ఎర్రమంచి, అమ్మవారుపల్లి పొలాల్లో మొదట విడతలో 193 మంది రైతుల నుంచి 600 ఎకరాలు భూమిని సేకరించారు. ఈ ప్రాంతంలో కార్ల పరిశ్రమ పనులు జరుగుతుండగా... ఏకంగా మరో 5 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యే బీకే సార్థసారధే ఈ విషయాన్ని చెప్పారు. సీఎం దీనికి ఆమోద ముద్ర వేశారని, రైతులందరూ సహకరించాలంటున్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి గొందిపల్లి సమీపంలో ఉన్న భూములతో పాటు ఆ ప్రాంతంలోని మిగిలిన భూములు రాంపురం గ్రామ వెనుక భాగంలో అంటే ఎర్రమంచి , మోట్రుపల్లి, చినపరెడ్డిపల్లి ప్రాంతాలకు చెందిన భూములన్నీ భూసేకరణకు వెళ్ళనున్నాయని ఎమ్మెల్యే మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక గుట్టూరు ప్రాంతంలో సైతం విలువైన భూములను ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది. సోమందేపల్లి మండలంలో సైతం పలు ప్రాంతాల్లో విలువైన భూములను సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కియా చదును పనులు ఆగస్టులోగా పూర్తీ కానుండటంతో 2వ విడత పనులు ఊపందుకోనున్నాయి. రైతుల్లో ఆందోళన.. ఉన్న భూములన్నీ పోతే ఏం చేయాలన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. కియా కార్ల కంపెనీ కోసం ప్రస్తుతమున్న భూమిని చదును చేసేందుకు ఎకరాకు ఏకంగా రూ. 29.74లక్షలతో రూ. 177 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయిస్తోంది. ఇందులో భారీ స్కాం దాగి ఉందనే విమర్శలు వస్తున్నా అదే తరహాలో మరోసారి భారీ భూసేకరణ, చదును పనులతో మరో దోపిడీకి తెరతీసేందుకు సిద్ధమవుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ పెద్దల భూములను ప్రభుత్వం సేకరిస్తుందా? లేక సామాన్య రైతుల భూములను మాత్రమే తీసుకుంటుందా? అన్న చర్చ సైతం జోరుగా సాగుతోంది. రిజర్వాయర్ నిండుతుందా? గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలలు గంటున్న తరుణంలో భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై వ్యతిరేకత వచ్చినా భూసేకరణ చేపట్టింది. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సైతం దీనికి తీవ్రంగా ఖండించారు. అమ్మవారుపల్లిలో సభ నిర్వహించి రైతులకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా రిజర్వాయర్‌ను తూతూ మంత్రంగా నీటితో నింపి కియా యాజమాన్యాన్ని నమ్మించిన ప్రభుత్వం అనంతరం నీటిని గొల్లపల్లి రిజర్వాయర్‌కు వదలకుండా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని నేరుగా ఇతర ప్రాంతాలకు ఇష్టారాజ్యంగా వదుతున్నారు. రొద్దం ప్రాంతంలో భారీ భూసేకరణ రొద్దం మండలంలో సైతం ప్రభుత్వం భారీ భూసేకరణకు సిధ్ధమైంది. ఇందులో భాగంగా ప్రారంభంలో బొక్కసంపల్లి వద్ద ఉన్న భూములను సేకరించనున్నట్లు ఎమ్మెల్యే బీకే పార్ధసారధి చెబుతున్నారు. అనంతరం చుట్టు పక్కల పున్న గ్రామాల భూములను సైతం ప్రభుత్వం సేకరించనున్నట్లు చర్చ నడుస్తోంది. కమీషన్ల కోసమే... - శ్రీకాంతరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ 5 వేల ఎకరాల భూసేరణ అంటే ప్రతి రైతు భయపడే చర్య ఇది. రిజర్వాయర్ పనులను ఆఘమేఘాల మీద చేపట్టిన ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని కమీషన్ల దందాకు పాల్పడాలన్న ఉద్ధేశ్యం బయట పడుతోంది . అంతా పథకం ప్రకారమే.. - వెంకటప్ప, మునిమడుగు ప్రభుత్వం పథకం ప్రకారం భూములను తీసుకుంటోంది. తరతరాలుగా భూమి మీదే ఆధారపడిన రైతులు జీవితాంతం బాధపడేలా ప్రభుత్వం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి రైతులంటే అభిమానం లేదు. -
భూ కైలాస్..
ఎకరం రూ.కోటి పైనే! కియో కార్ల పరిశ్రమ ఏర్పాటు నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోయాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములు కనిపిస్తే చాలు కొనటానికి కర్ణాటక, తమిళనాడు వ్యాపారులు, దళారులు వాలిపోతున్నారు. రూ.లక్షల్లో పలికిన ఎకరం ధర రానురాను కోటి రూపాయల దాకా చేరుకుంది. - పెనుకొండ పెనుకొండ నియోజకవర్గంలోని 44వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఏడాది కిందట గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద బెల్, నాసన్ పరిశ్రమలు వస్తాయని ప్రచారం జరగడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బెంగళూరు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు. తాజాగా పెనుకొండ మండలం అమ్మవారుపల్లి, ఎర్రమంచి ప్రాంతంలో కియో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 600 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరా రూ.10.50 లక్షలతో కొనుగోలు చేసిన ప్రభుత్వం భూముల చదునుకు ఎకరాకు రూ.30 లక్షల దాకా వెచ్చించింది. ఈ నేపథ్యంలో కార్ల పరిశ్రమ వల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావించిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు భూముల కొనుగోలులో మునిగిపోయారు. ఎకరా రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు బేరమాడి అగ్రిమెంట్ కుదుర్చుకుని అనంతరం ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ధర పలకగా ప్రస్తుతం ఏకంగా ఎకరా రూ.కోటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. లోపలి ప్రాంతాల్లో ఉన్న భూములు సైతం రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన పారిశ్రామిక వేత్తలు వారికి సంబంధించిన పరిశ్రమలు, లాడ్జీలు, హోటళ్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇదీ అంతేనా..? కియో కార్ల పరిశ్రమ పుణ్యమా అని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అయితే బెల్, నాసన్ పరిశ్రమల ఏర్పాటు పనులు ప్రారంభ దశలోనే కొట్టుమిట్టాడుతుండగా.. వీటి పరిసర ప్రాంతంలో 8 నెలల క్రితం భూములకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అయితే ‘బెల్’కు కాంపౌండ్ నిర్మించి తదుపరి పనులు పట్టించుకోలేదు. నాసన్ పరిశ్రమ ఊసే కనిపించడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రియల్ఎస్టేట్ వ్యాపారాలు మందగించాయి. ఇదే తరహాలో ఇప్పుడు కియో కార్ల పరిశ్రమ ఏర్పాటు ఉంటుందా.. లేక విజయవంతం అవుతుందా అనేది అనుమానాస్పదంగా ఉంది. -
ప్రజా పోరాటాలకు సిద్ధం
- ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరుస్తాం - కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు - పెనుకొండ వైఎస్సార్సీపీ ప్లీనరీలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పెనుకొండ (అనంతపురం) : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరుస్తూ.. పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. కరువుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు కాటకాలతో ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు. పెనుకొండ పట్టణంలోని వన్షికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎంగా గద్దెనెక్కిన తర్వాత తన హామీలను మాఫీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అనైతిక పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమ, హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌లలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లిస్తే.. అదే ఎకరా భూమిని చదును చేయడానికి రూ. 29.75 లక్షలు కేటాయించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బెల్, నాసన్ పరిశ్రమల ఏర్పాటు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. ఎమ్మెల్యే బీకే పార్థ«సారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దోపిడీ పాలనకు ముగింపు పలికేలా ప్రజలను చైతన్యపరుస్తూ, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... మరో 365 రోజులు గడిస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడులో జిల్లా కరువు గురించి గానీ, రైతు ఆత్మహత్యలు, కష్టాల గురించి గానీ చర్చించిన పాపాన పోలేదన్నారు. విశాఖలో జరిగిన మహానాడులోనూ ప్రజాసమస్యలపై చర్చించడంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర నాయకులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టీడీపీ మూడేళ్ల పాలన మొత్తం అవినీతిమయమన్నారు. వైఎస్ పాలనలో వలసలు, రైతు ఆత్మహత్యలకు అవకాశం ఉండేది కాదన్నారు. వేరుశనగ చెట్లకు కాయలు కాయకపోయినా డబ్బులు కాయిస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. ప్రస్తుతం కరువు నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ అడ్డుకుందన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి, యువతతో పాటు భావితరాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. టీడీపీ అవినీతిని కాలరాయాలంటే జగన్‌ను సీఎం చేయాలన్నారు. పార్టీ పరిశీలకులు నర్సేగౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమై జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పెనుకొండ మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సోమందేపల్లి కన్వీనర్ వెంకటరత్నం, గోరంట్ల కన్వీనర్ ఫకృద్దీన్, రొద్దం కన్వీనర్ నారాయణరెడ్డి, పరిగి కన్వీనర్ జయరాం, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మచంద్రారెడ్డి, రాజగోపాలరెడ్డి, లక్ష్మానాయక్, పద్మావతమ్మ, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఉమర్ ఫరూక్, మురళి, రహంతుల్లా, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సెంట్రల్‌బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, జిల్లా నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, బూదిలి వేణుగోపాలరెడ్డి, ఎస్బీశీనా, నియోజకవర్గంలోని సింగిల్ విండో అధ్యక్షులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రియులకు స్వర్గధామం
పెనుకొండ : విజయనగర రాజుల రెండవ రాజధాని పెనుకొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తోంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం. కొండ పై భాగంలో శత్రుదుర్బేధ్యమైన ‘ఖిల్లా’ నిర్మించారు. ఖిల్లాపై నుంచి శత్రువుల రాకను కిలోమీటర్ల దూరం నుంచే కనిపెట్టేవారు. నరసింహస్వామి దేవాలయం.. కొండపై బ్రహ్మతీర్థము (కొలను)కు దక్షిణంగా శ్రీవేట్రాయుడు అని పిలిచే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించారు. తను ఎంతగానో పూజించే నరసింహస్వామి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తెల్లవారుజామునే కృష్ణదేవరాయలు ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానమాచరించి తడి గుడ్డలతోనే మంటపాల కిందుగా వెళ్లి నరసింహస్వామిని పూజించేవాడని భక్తుల నమ్మకం. గగన్‌మహల్.. పెనుకొండ రాజరికపు చరిత్రలో విలువైన కట్టడాల్లో గగన్‌మహల్ ప్రధానమైనది. ఇక్కడ విజయనగర రాజులు పాలన సాగించినా వీరికి మునుపే ఈ కట్టడాన్ని నిర్మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణంలోని ఊరువాకిలి ఆంజనేయస్వామి దేవాలయం, పవిత్రబాబయ్య దర్గా, జైన మతాన్ని ప్రతిబింబించే జైన ఆలయాలు, శివాలయాలు, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా విశాలమైన బావులు, కోటగోడలు, 365 దేవాలయాలు ఇతర కట్టడాలు పెనుకొండ పుణ్య చరిత్రను తెలుపుతాయి. విజయనగర రాజుల పాలనకు పెనుకొండ కేంద్రబిందువు కావడంతో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహం సైతం ఏర్పాటు చేశారు. ఇలా చేరుకోవచ్చు.. జిల్లా కేంద్రం అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. బెంగళూరు, లేక హిందూపురం వెళ్ళే ఏ బస్సయినా ఇక్కడ నిలుపుతుంది. కాచిగూడ, ప్యాసింజర్, ప్రశాంతి తదితర రైళ్లలోనూ చేరుకోవచ్చు. -
పెనుకొండలో 25 మి.మీ. వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : పెనుకొండ మండలంలో గురువారం సాయంత్రం 25 మి.మీ వర్షం కురిసింది. కొత్తచెరువు 22 మి.మీ, రాయదుర్గం 20 మి.మీ, డి.హిరేహాల్, ధర్మవరం 15 మి.మీ, శెట్టూరు 10 మి.మీతో పాటు విడపనకల్, కనేకల్లు, బొమ్మనహాల్, పరిగి, చెన్నేకొత్తపల్లి, పుట్టపర్తి, బత్తలపల్లి, ముదిగుబ్బ, తనకల్లు, కుందుర్పి, తాడిమర్రి తదితర మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. రాయదుర్గం మండలంలో ఈదురుగాలులకు పల్లేపల్లి, 74–ఊడేగోళం ప్రాంతాల్లో 10 కరెంటు స్తంభాలు నేలవాలాయి. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతిచెందాయి. -
మీకు తెలుసా?
పెనుకొండ దుర్గం జిల్లాలోని గిరి దుర్గాలలో ప్రఖ్యాతిగాంచింది పెనుకొండ దుర్గం. దీనిని పెనుకొండ ఘనగిరి అని శాసనాల్లో పేర్కొన్నారు. రెండు ఆమడల వైశాల్యంలో బలిష్టమైన ఈ దుర్గం 914 మీటర్ల ఎత్తున కొండపై నిర్మించారు. దుర్గం చుట్టూ పెద్ద అగడ్త ఉంది. నాలుగు ముఖద్వారాలున్నాయి. ఉత్తరం వైపు ద్వారాన్ని మహా ద్వారమని అంటారు. అలనాటి ప్రాభవాన్ని, శిల్ప చాతుర్యాన్ని చాటే గొప్ప కట్టడాలు నేటికీ ఇక్కడ చూడవచ్చు. కోటలో కోట పద్ధతిలో మొత్తం ఏడు కోటలుగా నిర్మించారు. దుర్గంలోని రాజధానికి దక్షిణంగా మూడు శిలా ప్రాకారాలు, 365 ఆలయాలు ఉండేవి. పలుసార్లు విదేశీ దండయాత్రల ఫలితంగా సుందర ఆలయాలు మట్టిలో కలిసిపోయాయి. ఇక్కడి గగన్‌మహల్ క్రీ.శ. 1575లో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇది ఒకనాటి సార్వభౌములకు వేసవి విడిదిగా విరాజిల్లింది. ఈ కోటను క్రియాశక్త ఓడయార్ కట్టించినట్లు ప్రతీతి. క్రీస్తుకు పూర్వం మౌర్యుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని తర్వాత శాతవాహనులు, బాదామి చాళుక్యులు, బాణరాజులు, రాష్ట్ర కూటులు, నొలంబ పల్లవులు, కల్యాణ చాళుక్యులు, దేవగిరి యాదవులు పాలించారు. క్రీ.శ. 1357లో బుక్కరాయలు తన కుమారుడైన విరుపణ్ణను పెనుకొండ రక్షకుడిగా నియమించారు. ఆ తర్వాత చిక్క ఒడయారు అనే మంత్రి ఈ కోట రక్షకుడై దీనిని పునర్నిర్మాణం చేసి శత్రుదుర్భేద్యంగా మార్చారు. తర్వాత కొన్నేళ్లకు ఉమ్మతూరు గంగరాజు దీనిని జయించగా, శ్రీకృష్ణదేవరాయలు అతనిని ఓడించి కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పటి విజయనగర సార్వభౌముడు సదాశివరాయల సమాధి ఇక్కడే ఉంది. ఆధునాతన ఇంజినీర్లను సవాల్ చేస్తూ, ఆంధ్రుల శిల్ప కళా శక్తికి, నిర్మాణ నైపుణ్యానికి మచ్చుతునకగా మిగిలిన పెనుకొండ దుర్గం అనంతపురం - బెంగళూరు రహదారి మార్గంలో జిల్లా కేంద్రానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. - పెనుకొండ -
25న పెనుకొండలో పట్టు రైతుల సమ్మేళనం
అనంతపురం అగ్రికల్చర్ : ఈనెల 25న పెనుకొండ వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో పట్టు రైతుల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రం (ఆర్ఎస్ఆర్ఎస్) శాస్త్రవేత్త డాక్టర్ ఎంఏ శాంతన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్ఆర్ఎస్తో పాటు కేంద్ర పట్టుమండలి, జౌళి మంత్రిత్వశాఖ, ఏపీ పట్టుపరిశ్రమశాఖ సంయుక్తంగా బైవోల్టీన్ పట్టుగూళ్ల పెంపకం, అధిక దిగుబడులు, అధునాతన సాంకేతిక పద్ధతులు, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై సమ్మేళనంలో చర్చించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో పట్టు రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
పెనుకొండ : పెనుకొండ–పుట్టపర్తి రైలు మార్గంలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. రైల్వే ట్రాక్ మధ్యలో యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు ఎల్లో కలర్ ఆఫ్ షర్ట్, వైట్ షేడ్ బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నట్లు వివరించారు. అయితే అతను ఎవరన్నది అంతుబట్టడం లేదన్నారు. కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్గం కోసం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆశలన్నీ సమాధి
= బంధువుల ఇంటికొచ్చి.. ఈతకెళ్లి.. = నీటిలో మునిగి అన్నదమ్ముళ్ల మృతి = పెళ్లై నెల కాకనే నిండిన నూరేళ్లు = కన్నీరుమున్నీరైన నవ వధువు పెనుకొండ రూరల్: వైవాహిక జీవితం.. కాబోయే భాగస్వామి గురించి కోటి ఆశలతో ఆమె అత్తారింట అడుగుపెట్టింది. పెళ్లై పట్టుమని నెల రోజులు కాలేదు. అచ్చటా, ముచ్చట కూడా తీరనే లేదు. ఇంకా బంధువుల ఊర్లకు తిరగడంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి పెనుకొండలోని బంధువుల ఇంటికొచ్చారు. కొత్త జంట వచ్చిన ఆనందంలో వారంతా కలసి పెనుకొండకు సమీపంలోని హంద్రీ–నీవా రిజర్వాయర్ వద్దకు జలకాలాటల కోసం ఆనందంగా వెళ్లారు. అంతే.. పెళ్లికొడుకు సల్మాన్(21)తో పాటు అతని తమ్ముడు సద్దాం(19) ఇద్దరూ రిజర్వాయర్‌లో జలసమాధి కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురానికి చెందిన సనావుల్లాకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకు పెళ్లి అయింది. ఆ తరువాత అతను చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ భారం పిల్లలపై పడింది. అన్నదమ్ముళ్లిద్దరూ బెంగళూరులో కార్లకు రంగు కొట్టడం, వాటి విడిభాగాలు అమ్మడం ద్వారా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నెల కిందటే పెళ్లి... సల్మాన్ పెళ్లి హిందూపురానికి చెందిన ఫిరదౌస్తో గత నెల 28న అయింది. కొత్త జంట బంధువుల ఊర్లకు తిరగడంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెనుకొండలోని దర్గా పేటలో గల బంధువుల ఇంటికొచ్చారు. అందరూ కలసి కారులో హంద్రీ–నీవా రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగిన సల్మాన్ నీటిలో మునిగిపోతుండగా, అతన్ని రక్షించే క్రమంలో తమ్ముడు సద్దాం కూడా నీటిలోకి దిగాడు. నీటిలో మునిగిపోతూ ఇద్దరూ వేసిన కేకలతో బంధువులు, గ్రామస్తులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఊపిరాడక నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలొదిలారు. జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న భర్త ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఫిరదౌస్ గుండెలు పగిలేలా ఏడ్వడం అందరి గుండెలను పిండేసింది. ఇక తన జీవితం ఏం కావాలని ఆమె ప్రశ్నించడం చూసిన వారి కళ్లు నీటితో చెమర్చాయి.