పెనుకొండ : పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శీనప్ప, రాధమ్మల కుమారుడు నాని (4) పాముకాటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్నారి తల్లిదండ్రులతో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో బాలుడు ఏడవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాటుకాటుకు గురయ్యాడన్న అనుమానం ఉందని, వెంటనే పుట్టపర్తికి వెళ్ళాలని సూచించడంతో వారు హుటాహుటిన పుట్టపర్తికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం... పలువురిని కంటతడి పెట్టించింది.