child dies
-
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్‌పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్‌కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్‌కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కొడుకు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీర్ లేఅవుట్ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలి రోడ్డు మీద పడింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్లతో కూడిన మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు. ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడే కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోకుండా.. -
పాముకాటుకు తల్లడిల్లి తనువు చాలించిన చిట్టితల్లి
కర్నూలు (వెల్దుర్తి) : తనకేం జరిగిందో తెలీదు. ఊపిరాడని స్థితిలో తీవ్ర బాధను అనుభవించింది. చెప్పేందుకు నోరురాక, శరీరం సహకరించక.. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించిందో చిట్టితల్లి. పదకొండేళ్ల ఆ బాలిక పేరు అంజలి. వెల్దుర్తి మండలంలో జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే... పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవిలకు నలుగురు కుమార్తెలు సంతానం. మూడవ కుమార్తె అంజలి. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి తన ఆఖరు కూతురుతో కలిసి రెండేళ్ల నుంచి పుట్టిల్లు బలపాలపల్లెలో ఉంటోంది. తండ్రి బ్రహ్మయ్య ఆ సమయం నుంచే పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు కుమార్తెలు కుటుంబ భారం మోస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. మూడవ కుమార్తె అంజలి స్థానిక ఎంపీపీ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసుకుంది. సెలవులు కావడంతో తన అక్కలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఆదివారం రాత్రి రోజూ మాదిరిగానే ఇంట్లో (రేకుల షెడ్డు) నిద్రించింది అంజలి. 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో కాలికి ఏదో కరిచినట్లు గుర్తించింది. అబ్బా అనుకుంటూనే వెళ్లి పడుకుంది. రెండు గంటల సమయానికి గొంతు, మొహం వాచిపోయి, శరీరంలోను, కాలి వద్ద తీవ్ర నొప్పి మొదలైంది. చెప్పుకోవడానికి తల్లి లేకపాయె. తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. అక్కలు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాగోలాగ తడబడుతూ బయటకు వచ్చి పక్క ఇంట్లో నివాసముంటున్న జేజినాయన చిన్నమారెన్న వద్దకు వెళ్లింది. అక్కడ జేజినాయన, జేజి, చిన్నాన్నకు విషయం తెలుపలేక అప్పటికే మూగబోతున్న గొంతుతో కొద్దికొద్దిగా చెబుతూ, చివరకు సైగలు చేసింది. నోరు మెదపలేని స్థితిలో, ఊపిరి ఎగదోసుకుంటూ వచ్చిన బాలికను చూసి వారు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలీదు, బాలిక చెప్పలేకపోతోంది. చివరకు అచేతనావస్థకు చేరుకుంటోంది. పాముకాటు వేసినట్లు నిర్ధారించుకుని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాముకాటుకు తగిన చికిత్స అందించేలోగా సోమవారం తెల్లవారుజామున అంజలి కన్నుమూసింది. -
భార్యతో గొడవ, ఆ వ్యక్తి ఏం చేశాడంటే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు మూడేళ్ల పసిపాప బలైయ్యింది. భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండగా కోపంతో ఆమె భర్త పసి పాపను నేలకు వేసి బలంగా కొట్టాడు. దీంతో పాప అక్కడికి అక్కడే మరణించింది. ఈ సంఘటనలో పాప తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోలా గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరే సమయానికి మహిళ తీవ్రంగా గాయపడినట్లు, చిన్నారి అప్పటికే మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు నోయిడా అదనపు పోలీస్ కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. నిందితుడు రోజు మద్యం సేవించి, భార్యతో తరచూ గొడవలు పడేవాడని చుట్టు పక్కల వారు తెలిపారు. నిన్న గొడవ జరిగే సమయంలోనూ అతడు మందు తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన అమిత్‌గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నోయిడాలో పనిచేసే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాప చనిపోయిందన్న విషయాన్ని అతడు తన భార్య రేణు కుటుంబానికి సమాచారం ఇచ్చాడని, అయితే పాప చనిపోవడానికి గల కారణాన్ని వారికి తప్పుగా చెప్పాడని అతని అత్తమామలు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, అమిత్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు -
ఆశల దీపం ఆరిపోయింది
సాక్షి, మందస: ఆశల దీపం ఆరిపోయింది. ఇన్నాళ్లు ఆ ఇంట్లో గళగళమన్న కాళ్ల పట్టీల సవ్వడి ఆగిపోయింది. అందరినీ ఎంతగానో నవ్వించిన ఆ నవ్వు మాయమైంది. ఆ చిన్నారిపై క్యాన్సర్ మహమ్మారి పగబట్టి తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. దాతల సాయంతోనైన బతికించుకుందామనుకున్న ఆ తల్లిదండ్రుల ప్రయత్నాలను నీరుగార్చింది. తన గారాల పట్టి భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న వారికి గుండె కోత మిగిల్చింది. మందస మండలం లొహరిబంద గ్రామానికి చెందిన చిన్నారి నవ్య(9) అలియాస్ ప్రేమకుమారి బుధవారం అర్ధరాత్రి బోన్‌మారో కేన్సర్‌తో మరణించింది. రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతులు తమ కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో దాతలు సాయంతో ఏడాదిపాటు బతికించారు. ఈ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఏ కష్టమొచ్చిన తామంతా ఆదుకోవడానికి ముందుంటామని ఉద్దానవాసులు నవ్య సమస్యను సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా, పత్రికల ద్వారా బాహ్య ప్రపంచానికి చెప్పి, ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. నవ్యకు సోకిన వ్యాధి చికిత్సకు అవసరమయ్యే వ్యయం సేకరించడానికి ఉద్దానం యువత సిద్ధమవుతుండగా, హఠాత్తుగా నవ్య మరణించడంతో చిన్నారిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యవంతమవుతున్నారు. ఇక ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూకావడం కాలేదు. అందరి ఆశలు అడియాశలు చేసిన నవ్య అంత్యక్రియలు ప్రజల కన్నీటి సంద్రం మధ్య జరిగాయి. -
సీతాఫల్మండిలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనం స్లాబ్ ఆదివారం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో తల్లితోపాటు ఆమె 14 నెలల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటన గురించి తెలియడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పురాతన భవనం కూలిన స్థలాన్ని పరిశీలించారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
-
ఆడుకుంటూ వెళ్లి.. స్తంభాన్ని పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్‌పాత్ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్ సీటీ (ఫెబల్ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్(7)తో కలిసి ఫెబల్ సిటీలోని ఈ–బ్లాక్ 12వ అంతస్తు 8వ నెంబర్ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. మోనీష్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్మెంట్లోని తోటి పిల్లలతో కలిసి లాన్లో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకోవడానికి కిందకు వచ్చాడు. ఈ క్రమంలో ఆడుతూ ఆడుతూ వెళ్లి ఫుట్‌పాత్ పక్కనే ఉన్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకున్నాడు. దాని కింది భాగంలో విద్యుత్ వైరు పాడై ఉండటంతో స్తంభానికి కరెంటు సరఫరా అవుతోంది. దీంతో మోనీష్ విద్యుత్ఘాతానికి గురై నిమిషంపాటు అలాగే ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోపాటు వాకింగ్ చేస్తున్నవారు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. నిమిషం తర్వాత మోనీష్ కింద పడిపోయాడు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. బిల్డర్‌తో పాటు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పీబీఈఎల్ సిటీ నిర్వాహకులు నివారణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న భూగర్భ కేబుల్ వైర్లకు టేపులు చుట్టారు. స్తంభం వద్దకు వెళ్తూ... విద్యుత్ఘాతానికి గురై అలాగే ఉండిపోయిన మోనీష్ పోస్టుమార్టానికి తండ్రి ససేమిరా... మోనీష్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు సోమవారం రాత్రే తమ స్వస్థలం చెన్నై తీసుకెళ్లారు. అయితే, ఇక్కడ కేసు నమోదు చేయడానికి పోస్టుమార్టం నివే దిక అవసరం కావడంతో పోలీసులు మోనీష్ తండ్రి దివాకర్‌ను సంప్రదించారు. అయితే, తన కుమారుడికి పోస్టుమార్టం చేయించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు దివాకర్‌తో మాట్లాడి ఒప్పించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఐదు రోజుల్లో వస్తుందని వెల్లడించారు. ఈ కేసులో బిల్డర్, అసోసియేషన్, విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్‌పై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. -
విమానంలో 11నెలల శిశువుకు అస్వస్ధత
-
విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతి
సాక్షి, హైదరాబాద్: విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
చిన్నారిని మింగేసిన మృత్యువు
రోజూలాగే అమ్మకు బైబై చెప్పి పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన చిన్నారిని ఇంటి సమీపంలో కమాండర్ వాహనం రూపంలో మృత్యువు మింగేసింది. చిన్నారి రాక కోసం ఎదురు చూస్తున్న తల్లి జరిగిన విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. ఇక నా పాప శాశ్వతంగా రాదన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరువుతుంది. భగవంతుడా! ఇంత కఠినంగా శిక్షిస్తావా? అంటూ చిన్నారి తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం: ముక్కుపచ్చలారని చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో రెండు నిమిషాల్లో ఇంట్లోకి వెళ్లిపోతుందనగానే మృత్యువు ఆగమేఘాల మీద వచ్చి కమాండర్ రూపంలో కబలించుకుపోయింది. ఆటో దిగి ఇంటి వైపు నడుస్తున్న చిన్నారిని ఉన్న ఫలంగా కమాండర్ ఢీకొట్టి ప్రాణాలను హరించింది. తమ చిన్నారి స్కూలు నుంచి తిరిగి వస్తుందని ఆ తల్లి ఇంటి ముంగిట వేచి చూస్తున్నంతలోనే కమాండర్ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి చిన్నారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన గండి జగదీశ్వరరావు, రోజాల కుమార్తె నేహ. పార్వతీపురం మండలం వైకేఎం కాలనీ సమీపంలో ఉన్న సురేష్ పాఠశాలలో 1వ తరగతి చదువుతుంది. రోజులాగే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో ఆటోలో తోటి విద్యార్థులతో కలసి ఇంటికి బయలుదేరింది. ఆటో ఊరిలోకి రాగానే ఇంటి ముందు రోడ్డు మీద దిగి ఇంటివైపు నడిచింది. ఇంతలో ఒడిశా అలమండ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న కమాండ్‌ర్ వాహనం బలంగా ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే చిన్నారి నేహ మృతి చెందింది. వీధిలో ఉన్న వారంతా చిన్నారి నేహను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించినప్పటికే ప్రాణాలను విడిచిందని స్థానికులు తెలిపారు. దీంతో చిన్నారి నేహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి నేహ తండ్రి జగదీశ్వరరావు ఆర్మీలో పని చేస్తున్నారు. తల్లి రోజ గృహిణి. కుమారుడు యుగంధర్ ఉన్నాడు. నేహ మృతితో కుటుంబ సభ్యులు, చినబొండపల్లి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదృశ్యమై శవమై తేలాడు... రామభద్రపురం(బొబ్బిలి): మండలంలోని రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య(63) నాలుగురోజులు క్రితం అదృశ్యమై అదే గ్రామ సమీపంలో గల డ్యాంలో పడి శవమై శనివారం తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య ఈ నెల నాల్గో తేదీన పొలం పనికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు రోజులుగా వెతుకుతున్నారు. అదే గ్రామంలో డ్యాం వద్ద ఉన్న లష్కర్ రెండు రోజుల కిందట ఇక్కడ ఏదో మృతదేహం కనిపించినట్లయింది గ్రామస్తులకు చెప్పడంతో ఆ డ్యాంలో గాలించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతదేహం కనిపించలేదు. శనివారం నాటికి డ్యాంలో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని ముదిలి సూరయ్యగా గుర్తించారు. కుమారుడు ముదిలి కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్‌సీ గోపీరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యుమోనియాతో చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి(రామగిరి): చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు నవీన్ (9) న్యుమోనియాతో గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నవీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బెంగుళూరుకు తరలించారు. వైద్యపరీక్షల్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
ధర్మవరం టౌన్: ధర్మవరం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృత్యువుపాలైంది. పట్టణంలోని లోనికోటకు చెందిన హసీఫా శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. శిశువు ఉమ్మనీరు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. అయితే ఆ సమయంలో చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకుని తిరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడినా శనివారం ఉదయం మళ్లీ క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది ఎదురవడంతో చిన్నారి తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్ వెంకటేశ్వర్లు కోసం చిన్నపిల్లల వార్డుకు వెళితే యథావిధిగా అందుబాటులో లేడు. దీంతో వారు ఆ చిన్నారిని తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యుడు చెప్పడంతో రోదిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివాదం ముదరడంతో పట్టణ ఎస్సై జయానాయక్ అక్కడికి చేరుకుని బాధితులను శాంతపరిచారు. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. సూపరింటెండెంట్ రామలక్ష్మి చిన్నపిల్లల డాక్టర్ సెలవులో ఉండటంతోనే బయట చికిత్స చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. చిన్న పిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం తాను డ్యూటీలో ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. -
ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం
కదిరి అర్బన్: అభం శుభం తెలియని చిన్నారి ఆటో చక్రాల కిందపడి ప్రాణం కోల్పోయింది. పట్నం గ్రామంలో రాధిక, ఆంజనేయులు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు రాధిక ఆటో ట్యాంకర్ వద్దకెళ్లింది. ఆమె వెనకాలే కార్తీక (3) వెళ్లింది. బిందెలో నీరు పట్టుకుని తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి వెనకాలే నిల్చుని ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారివ్వడం కోసం డ్రైవర్ ఆటో ట్యాంకర్‌ను వెనక్కు తోలాడు. వెనుకచక్రాల కిందపడిన కార్తీక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాముకాటుతో చిన్నారి మృతి
పెనుకొండ : పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శీనప్ప, రాధమ్మల కుమారుడు నాని (4) పాముకాటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్నారి తల్లిదండ్రులతో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో బాలుడు ఏడవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాటుకాటుకు గురయ్యాడన్న అనుమానం ఉందని, వెంటనే పుట్టపర్తికి వెళ్ళాలని సూచించడంతో వారు హుటాహుటిన పుట్టపర్తికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం... పలువురిని కంటతడి పెట్టించింది. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణంలోని 21వ వార్డు మారెమ్మగుడి సమీపంలో పది నెలల చిన్నారి ఎన్.జస్మిత్ డెంగీ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పేస్వామి, రాధ దంపతులకు మూడేళ్ల కుమారుడు, పది నెలల కుమార్తె జస్మిత్ ఉన్నారు. గత ఆదివారం జస్మిత్‌కు జ్వరం రావడంతో ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ స్థాయికి పడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా ఇదే నెల ఒకటో తేదీ తహసీల్దార్ రోడ్డులో అల్తాఫ్ కుమార్తె ఆయేషా(6) డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా పట్టణంలోని అన్ని వార్డుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజూ ఆస్పత్రికి దాదాపు 500 దాకా రోగులు వస్తుండగా ఇందులో 50కిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. వారంరోజుల క్రితం కూడా ముగ్గురికి డెంగీ పాజిటివ్‌గా గుర్తించి అనంతపురంలో చికిత్సలు అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. -
అయ్యో..చిట్టి తండ్రీ!
తన చిట్టితండ్రి ఎడబాటును.. ఆ తండ్రి ఒక్క క్షణమైనా భరించలేడు. ఆ తల్లీ అంతే.. తన బంగారుబాబును వదిలి.. నిమిషమైనా ఉండలేదు. చిన్నారి బాబు బుడిబుడి అడుగులను చూసి వారెంతో మురిసిపోయేవారు. అమ్మ.. నాన్న అంటూ పలికే పొడిపొడి మాటలను విని ఉప్పొంగిపోయేవారు. ఏ పనిలో ఉన్నా వారికి బిడ్డ ధ్యాసే. నిన్న కాక అటు మొన్ననే.. ఆ చిన్నారికి ఏడాది నిండింది. తొలి జన్మదిన వేడుకను తల్లిదండ్రులు పెద్ద పండగలానే చేశారు. ఇంతలోనే వారి ఆశల దీపం ఆరిపోయింది. పరామర్శ కోసమని బిడ్డను తీసుకుని వచ్చిన ఆ తల్లి.. కళ్లెదుటే తన గారాలపట్టిని పోగొట్టుకుంది. ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో మాయదారి మృత్యుశకటం.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. పాపం.. తన బిడ్డ ఇంక లేడన్న విషయం ఆ తండ్రికి ఎలా చెప్పాలో..!! రాజాం/సిటీ(శ్రీకాకుళం): తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన మరో తల్లికి కడుపుకోత మిగిలింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి మృత్యుఒడిలోకి చేరుకుంది. వన్‌వే ట్రాఫిక్ విధానం ఆ ఇంట్లో పుత్రశోకానికి కారణమైంది. వాటర్ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందాడు. శనివారం స్థానిక మేదరవీధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లాకు చెందిన పిల్లి కళావతి.. రాజాం మేదరవీధిలో ఉంటున్న తన తల్లి కోలా పార్వతిని పరామర్శించేందుకు రెండు రోజుల క్రితం వచ్చింది. కళావతి భర్త గురునాథరావు వలస కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కళావతి కూడా భర్తతోనే హైదరాబాద్‌లో ఉంటోంది. వీరికి 13 నెలల ఢిల్లీశ్వరరావుతోపాటు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. భర్త హైదరాబాద్‌లో ఉంటుండగానే.. కళావతి విజయనగరం వచ్చింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి కళావతిని పరామర్శించేందుకు ఈ నెల 22న పిల్లలతో కలసి రాజాం వచ్చింది. అప్పటి నుంచి మేదరవీధిలో తల్లిదండ్రులు పార్వతి, బంగారయ్యల వద్దనే ఉంది. మరో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది. శనివారం ఉదయం ఇంటి ఆవరణలో తన 13 నెలల కుమారుడు ఢిల్లీశ్వరరావుతో కలసి ఉంది. అదే సమయంలో వన్‌వే ట్రాఫిక్ కారణంగా అటుగా వచ్చిన వాటర్ప్యాకెట్ల లగేజీ వ్యాన్ ఆ ఇంటిపైకి దూసుకువచ్చింది. దీంతో ఇంటి వరండాలో ఉన్న బాలుడు ఢిల్లీశ్వరరావు ప్రమాదానికి గురయ్యాడు. వ్యాన్ ముందర భాగం బాలుడి తలను గట్టిగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కళ్లముందు ఆడుతున్న ఢిల్లీశ్వరరావు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఇంట్లో ఉన్న కళావతి తల్లిదండ్రులు బంగారయ్య, పార్వతిలు కూడా బయటకు వచ్చి ఘొల్లుమన్నారు. పాపం.. కన్నబిడ్డ చావు చూడటానికే వచ్చిందా!! కళావతికి ఏడేళ్ల క్రితం విజయనగరానికి చెందిన గురునాథరావుతో వివాహం జరిగింది. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లడం.. కొద్దిరోజులు పని చేసి విజయనగరం రావడం వారికి పరిపాటి. వీరికి ఇద్దరు మగపిల్లలు. హాయిగా జీవనం సాగిపోతుందనుకున్న సమయంలో చిన్న కుమారుడు ఢిల్లీశ్వరరావు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రికి చేరవేసేందుకు బంధువులు సాహించలేకపోయారు. రాజాం సీఐ శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి మృతదేహాన్ని బంధువులు విజయనగరం తీసుకుపోయారు. -
వేడి నీటిలో పడిన చిన్నారి మృతి
అగళి (మడకశిర) : అగళి మండలం ఆలూడి గ్రామంలో పవిత్ర, నరసింహరాజు దంపతుల కుమార్తె భానుప్రియ(3) అనే చిన్నారి శుక్రవారం ఉదయం వేడినీటిలో పడి మృతి చెందినట్లు ఏఎస్ఐ ఖలీల్‌బాషా తెలిపారు. చిన్నారికి స్నానం చేయించేందుకు కుటుంబ సభ్యులు నీటిని వేడి చేసి బయట ఉంచారన్నారు. అక్కడే ఉన్న ఓ కుక్క మొరగడంతో ఆడుకుంటున్న చిన్నారి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు వేడినీటి బకెట్‌పై పడింది. దీంతో వేడి నీరంతా పడటంతో శరీరం కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అగళిలోని గుప్త పాఠశాలలో ఎల్కేజీలో చేరిన భానుప్రియ పట్టుమని పది రోజులు కూడా గడవకనే మృతి చెందడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతికి పాఠశాల యజమాన్యం నివాళులర్పించి, మౌనం పాటించారు. -
గర్భంలోనే శిశువు మృతి
- వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ - ప్రభుత్వాస్పత్రి ఎదుట నిరసన రాయదుర్గం టౌన్ : రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో నివాసముంటున్న మాబున్నీ బళ్లారి ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి ప్రసవమైంది. అయితే గర్భంలోనే శిశువు మృతి చెందింది. రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో అంతకు ముందు వేసిన ఇంజక్షన్ వికటించడంతోనే ఈ సంఘటన జరిగిందంటూ బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదం చేశారు. రెండోసారి గర్భం దాల్చిన మాబున్నీని గత శుక్రవారం పొత్తికడుపులో నొప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్తో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. డ్యూటీ డాక్టర్ వసంతలక్ష్మీ డైక్లోఫెనాక్ ఇంజక్షన్ ఇచ్చారు. శనివారం ఉదయం కూడా మరోమారు ఇంజక్షన్ ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. సాయంత్రం 4 గంటలవుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక గర్భిణిని బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి ఆమె డెలివరీ కాగా.. గర్భంలోనే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. రాయదుర్గం ఆస్పత్రిలో ఇచ్చిన ఇంజక్షన్ల వల్లే బిడ్డ గర్భంలోనే మృతి చెందాడని మాబున్నీ బంధువులు ఆరోపించారు. దీంతో వారు మూకుమ్మడిగా కలసి రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. వైద్యాధికారి స్పందిస్తూ డాక్టర్ వసంతలక్ష్మీ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల తల్లికీ, బిడ్డకూ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. తాము సిఫార్సు చేయకున్నా వారే బళ్లారికి వెళ్లారన్నారు. -
చిన్నారిని మింగిన నీటిపాత్ర
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : నీటిపాత్ర ఓ చిన్నారిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిని అవ్వ వద్ద మంగళవారం సాయంత్రం వదిలేసి దంపతులిద్దరూ గొర్రెలను చూసొచ్చేకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రెండో సంతానమైన చందు(2)ఆడుకుంటూ వెళ్లి కొళాయి వద్ద గల నీటి పాత్రలో ప్రమాదవశాత్తు పడిపోయాడన్నారు. కాసేపటికి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే బిడ్డ మరణించి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. -
వికటించిన వైద్యం
హిందూపురం రూరల్ : పురిటి నొప్పుల ప్రసవంతో వచ్చిన ఒక మహిళకు శస్త్రచికిత్స (సిజేరియన్) నిర్వహించగా పురుటిబిడ్డ మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హిందూపురం పట్టణం ఎంఎఫ్‌రోడ్డులో నివాసం ఉంటున్న దివ్యజ్యోతికి ఏడాది క్రితం మడకశిరలోని శ్రీనివాసులుతో వివాహంమైంది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈక్రమంలో 9 నెలలు నిండిన తర్వాత కాన్పు కోసం వెళ్తే స్కానింగ్ చేసి బిడ్డ క్షేమంగా ఉందని.. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. దివ్యజ్యోతి ఉదయం నుంచే ఆస్పత్రిలో ఉంది. అయితే చివరి నిమిషంలో సిజేరియన్ చేయాలని కోరగా చేశారు. కానీ పురిటి బిడ్డ మృత్యువాత పడిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై వైద్యురాలు సంధా్యలక్ష్మిని అడగ్గా సాధారణ కాన్పు చేయాలని కోరారు. అయితే పరిస్థితి మారడంతో సిజేరియన్ చేశామన్నారు. బిడ్డ ఉమ్మి నీరు తాగి తల వాపు రావడంతో మృతి చెందినట్టు తెలిపనారు. విషయం తెలుసుకున్న ఐఎంఏ కార్యదర్శి బాలాజి అక్కడికి చేరుకుని బాధితులకు, వైద్యులకు సర్ది చెప్పారు. -
పోయిన చిన్నారి ప్రాణం
- హృదయ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - రంగంలోకి దిగిన పోలీసులు అనంతపురం మెడికల్ : అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది. తమ బిడ్డ మరణానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన భాగ్యలక్ష్మీ, ఉదయ్‌కుమార్ దంపతులకు మూడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం జ్వరం రావడంతో అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్ శ్రీనివాసులు.. నాలుగు రకాల మందులు ఇచ్చారు. ఇంటికెళ్లి మందులు వేయగానే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే ఆటోలో అనంతపురానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అంతలోనే టూటౌన్ పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఆస్పత్రి వద్ద గొడవ చేయడం తగదని, ఏదైనా ఉంటే స్టేషన్లో కేసు పెట్టాలని సూచించారు. అయినా వారు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. బిడ్డ మృతదేహంతో తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడున్న వారి హృదయాలు చలించిపోయాయి. ఘటనపై డాక్టర్ శ్రీనివాసులును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘పాల పొర పోవడం వల్లే బిడ్డ చనిపోయినట్టున్నాడు. పోస్టుమార్టం చేస్తే వాస్తవాలు తెలుస్తాయి’ అని అన్నారు. -
బాత్రూము బండ విరిగిపడి బాలుడి మృతి
ఓడీ చెరువు : ఇంటిముందు బాత్రూము కోసం ఏర్పాటు చేసుకున్న నల్లబండ విరిగి మీద పడటంతో బాలాజీ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు.. క్రాసింగ్‌లో నివాసముంటున్న నాగరాజు, అనూష దంపతులకు బాలాజీ, కార్తీక్ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురూ కలిసి శనివారం ఉదయం టిఫిన్ చేశారు. నాగరాజు కూలి పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. ఇంటిముందు చుట్టూ బండలు పాతి ఏర్పాటు చేసుకున్న బాత్రూము వద్ద పెద్ద కుమారుడు బాలాజీ ఆడుకుంటున్నాడు. ఆ బండల వద్ద కూర్చోవడానికి వీలుగా పెట్టిన ఓ రాయి ఎక్కి బండను పట్టుకుని ఆ పక్కనే ఉన్న చిన్న కానుగచెట్టు ఎక్కబోయాడు. ఆ బండ విరిగి మీదపడింది. ఆ శబ్ధం విన్న అనూష అరుస్తూ పరుగున బయటకు వచ్చింది. ఆమె అరుపుతో చుట్టుపక్కలవారు కూడా అక్కడికి వచ్చి బాలుడిపై పడిన బండను తొలగించారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాలాజీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. -
చిన్నారిని మింగిన నీటి తొట్టె
అగళి : అగళి పోలీస్‌స్టేషన్ సమీపంలో నివాసముంటున్న భజంత్రి అశ్వత్థప్ప మనవడు విష్ణుకుమార్(2) బుధవారం ఉదయం నీటి తొట్టెలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అశ్వత్థప్ప తన కుమార్తె శశికళను ఆరేళ్ల కిందట హిందూపురానికి చెందిన రామప్పకు ఇచ్చి వివాహం చేశారు. మొదటి కాన్పులో విష్ణు జన్మించగా, ఇప్పుడామె రెండో కాన్పుకు పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టెలోకి విష్ణుకుమార్ కాలుజారి పడిపోయాడన్నారు. తల్లి చూసి గట్టిగా కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారిని బయటకు తీసి వెంటనే పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శిరా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వివరించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే ఆ బిడ్డ బతికేవాడని స్థానికులు తెలిపారు. -
సనప ఉత్సవాల్లో అపశ్రుతి
కోనేటిలోకి జారిపడి చిన్నారి మృతి ఆత్మకూరు (రాప్తాడు) : ఆత్మకూరు మండలం సనప గ్రామంలో శుక్రవారం జరిగిన మాధవరాజుల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కోనేటిలోకి జారిపడి మృత్యువాతపడ్డాడు. ఎస్ఐ ధరణి కిషోర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా... ధర్మవరంలోని రైతు నారాయణస్వామి, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గణేష్ (10)ఉన్నారు. సనప మాధవరాజుల ఉత్సవాలకు శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నారాయణస్వామి వచ్చారు. సాయంత్రం మూడు గంటలకు గణేష్ ఒంటరిగా కోనేరు వద్దకు చేరుకుని అక్కడ నీటిలో ఆడుకుంటున్న పిల్లలను గమనిస్తూ మెట్లపై నుంచి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. చాలా సేపటి తర్వాత తమతో పాటు గణేష్ లేడనే విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడి కోసం వెదకడం మొదలుపెట్టారు. కోనేరు వద్ద చేరుకుని అనుమానంతో నీటిలో వెదకగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలాన్ని ఎస్ఐ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.