అనంతపురం రూరల్ : డెంగీతో బాలుడు మృతి చెందిన ఘటన రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాలలో మంగళవారం చోటు చేసుకుంది. చంద్రబాబు కొట్టాలకు చెందిన ఫరూక్ బేగం, శర్మాస్ దంపతుల కుమారుడు హుస్సేన్ (4) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గలేదు. పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు.