పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్‌లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.
వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: బ్రెజిల్‌లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment