
కొత్త రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఔషధ తయారీ సంస్థ 'జైడస్ లైఫ్‌సైన్సెస్' (Zydus Lifesciences) బుధవారం తెలిపింది.
ఫ్లూ నుంచి రక్షణ కోసం డబ్ల్యుహెచ్ఓ సిఫార్సు చేసిన కూర్పు ప్రకారం దేశంలోనే మొట్టమొదటి క్వాడ్రివలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిఫ్లూ-4ను పరిచయం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ టీకాను సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.
రాబోయే ఫ్లూ సీజన్ ప్రబలంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నాలుగు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జాతులకు వ్యతిరేకంగా కాలానుగుణ రక్షణను, క్రియాశీల రోగనిరోధకతను అందించేలా క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వివరించింది. దీనిని సంస్థ అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్ (VTC) అభివృద్ధి చేసింది.
ఇన్‌ఫ్లూయెంజా అనేది.. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకే దగ్గు, తుమ్ముల వ్యాప్తిని నివారిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి.. కావలసిన వ్యాక్సిన్ తీసుకోకపోతే, తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా.. ప్రతి సంవత్సరం 2.9 లక్షల నుంచి 6.5 లక్షల మంచి మరణిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మరణాల రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు.