Influenza virus
-
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.ఇక, డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.డింగా డింగా లక్షణాలు..జ్వరం.తలనొప్పి.దగ్గు.ముక్కు కారటం.శరీర నొప్పులు.A mysterious illness locally called 'Dinga Dinga' is rapidly spreading amog women and girls in Uganda's Bundibugyo district, leaving dem dancing and shaking uncontrollably, along with experiencing fever. The illness is treatable with antibiotics. pic.twitter.com/yYEx9unIbR— Common Sense (@keysense_1) December 20, 2024 -
కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ భయం.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి. మనుషుల్లో హెచ్7ఎన్9,హెచ్5ఎన్1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం అవుతాయి. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నపుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా కేవలం స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుంది. మరికొన్ని కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్‌లో ఉండాలి. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటునే ఉండాలి. ఇదీచదవండి.. క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా -
దడ పుట్టిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్.. వాళ్లకి రిస్క్ ఎక్కువ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇన్‌ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అతలాకుతలం.. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోచుకుంటున్న ల్యాబ్‌లు.. సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్‌ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్‌లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్‌లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు. కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు.. రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్‌లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్‌సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు.. జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. – మెట్పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి -
కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైరల్ ఫీవర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివిటీ రేటు సైతం వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) సమస్యలపై ఇదివరకే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయగా.. ప్రస్తుతం కోవిడ్–19 కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వద్దు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసుల నమోదు వేగంగా పెరుగుతోంది. కేరళలో 26.4 శాతం, మహారాష్ట్రలో 21.7 శాతం, గుజరాత్లో 13.9 శాతం, కర్ణాటకలో 8.6 శాతం, తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలస్వతంగా ఉండవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దిశగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్లను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షలను పెద్ద ఎత్తున పెంచుతూ కోవిడ్–19 జాగ్రత్తలను పాటించేలా చేయాలని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్య పెరిగి ప్రమాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరమని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఇన్ఫ్లుయాంజా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దేశంలో ఈ తరహా కేసులు జనవరి నుంచి మార్చి చివరి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్–19ను అరికట్టేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ► వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపర్చుకోవాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది. ► దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వీలైనంత తక్కువగా బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. ► వైద్యులు, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. ► రద్దీగా ఉండే ప్రాంతాల్లో, క్లోజ్డ్ సెట్టింగులున్న చోటఉండాల్సిన వారు తప్పకుండా మాస్క్‌లు ధరించాలి ► తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు ముక్కు, నోరు కప్పుకోవడానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి ► బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలి ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలి ► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో చేయాలి. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి ఆస్పత్రుల్లో ఏర్పాట్లు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని తెలిపింది. అలాగే ఆక్సిజన్ వసతులను పునఃసమీక్షించుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల తీరును నిరంతరం పరిశీలించాలని, ఆస్పత్రుల వారీగా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 27న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
అప్రమత్తత అవసరమే!
పీడకల లాంటి కోవిడ్–19 మానవాళిని ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది. మొదలై మూడేళ్ళు నిండినా, ఇప్పటికీ ఏదో ఒక కొత్త రూపంలో వేధిస్తూనే ఉంది. దేశంలో కొన్నాళ్ళు సద్దుమణిగిన కరోనా ఈ మార్చిలో క్రమంగా పడగవిప్పింది. కరోనా కేసులు గత అయిదు వారాల్లో ఏకంగా 9 రెట్లు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. డిసెంబర్ 22 తర్వాత సరిగ్గా మూడు నెలలకు బుధవారం మళ్ళీ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం దాని ఫలితమే. ఒక వంక కరోనా, మరో వంక ఇన్ఫ్లుయెంజా కేసులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో తక్షణ కార్యాచరణకు ప్రభుత్వం కదిలింది. కరోనా కేసుల ‘టెస్టింగ్ – ట్రాకింగ్ – చికిత్స – టీకాకరణ – కోవిడ్ సముచిత ప్రవర్తన’ అనే అయిదంచెల వ్యూహంపై దృష్టి కొనసాగించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ గురువారం సూచించింది. త్వరలో దేశమంతటా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికీ సమాయత్తమవుతోంది. వెరసి, దేశంలో ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత, టీకాకరణ వర్తమాన స్థితి లాంటి వాటిపై మరోసారి ఆలోచన, అంచనా మొదలైంది. ఫిబ్రవరి రెండోవారంలో రోజూ సగటున 108 కేసులొస్తే, ఇప్పుడది రోజుకు 966 కేసులకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో 1 శాతమే భారత్లోనివనీ, మొత్తంగా దేశంలో ఉన్నవి 7600 కరోనా కేసులే అనీ అధికారిక లెక్క. అయితే టెస్టింగ్ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కేసుల అసలు సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. ప్రస్తుతానికి మహా రాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎనిమిదింటిలో గరిష్ఠంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌లో జన్యుపరమైన వేరియేషన్లను గమనించడానికి 50కి పైగా ప్రయోగశాలలతో కూడిన గ్రూపు ‘ఇండియన్ సార్స్– కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్’ (ఇన్సాకాగ్) పనిచేస్తోంది. వీలైనంత ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ నమూనాలను ఈ ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపి, జన్యు నిర్మాణక్రమాన్ని విశ్లేషిస్తే ఏ కొత్త వేరియంట్ వచ్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. తక్షణ చర్యలు చేపట్టవచ్చు. అందుకే, ప్రభుత్వం సైతం ల్యాబ్‌ల ద్వారా వీలైనన్ని పాజిటివ్ శాంపిళ్ళను పరీక్షించి, జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మునుపటి కరోనా వేరియంట్లకు భిన్నంగా ఈసారి మూడు అదనపు కొమ్ములున్న ఉత్పరివర్తన మైన ఎస్బీబీ.1.16 (మరో మాటలో ‘ఆర్క్టూరస్’) వేరియంట్ తాజా కేసుల విజృంభణకు కారణ మని ప్రాథమిక విశ్లేషణ. దేశంలో తొలిసారిగా జనవరిలో బయటపడ్డ ఈ వేరియంట్ కేసుల సంఖ్య ఏ నెలకానెల పెరుగుతూ వస్తుండడం గమనార్హం. ఈ వేరియంట్ తీవ్రత, వ్యాప్తి ఎంత అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది. కేసులు పెరుగుతున్నా, ఆస్పత్రి పాలవడం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి ఎక్కువగా లేవు. అది పెద్ద ఊరట. నిజానికి, ఇప్పటి వరకు దేశంలో మొత్తం 220.65 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు. ఇది పెద్ద సంఖ్యే. వ్యాధినిరోధకత సాధించిన మన ప్రజానీకం ఇప్పటికే బీఎ.2.75, బీఎ.5, బీక్యూస్, ఎక్స్‌బీబీ.1.5 లాంటి పలు కరోనా వేరియంట్లను తట్టుకొని నిలబడింది. కొత్త వేరియంట్‌ను కూడా తట్టుకొంటే, మంచిదే. అలా కాకుంటేనే చిక్కు. కరోనా, ఫ్లూ, సీజనల్ వ్యాధులు సహా కారణాలేమైనా తీవ్ర శ్వాసకోశ సమస్యలు అనేకం ప్రస్తుతం నమోదవుతూ ఉండడం ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుత ఫ్లూ సీజన్లో దేశంలో శరవేగంగా వ్యాపిస్తూ, శ్వాసకోశ సమస్యలు కల్పిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ సైతం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్నదే. ‘ఇన్ఫ్లుయెంజా–ఏ’లో ఉపవర్గానికి చెందిన ఈ వైరస్ కూడా కరోనా వైరస్‌లా మహమ్మారిగా విజృంభించి, 1968లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 40 లక్షల మరణాలకు కారణమైంది. మన దేశంలో 2010లో బయటపడ్డ ఈ రకం వైరస్‌కు ఒకసారి గురైతే జీవితకాల వ్యాధినిరోధకత వస్తుందట. అయితే కరోనా, దీర్ఘకాలం గొంతునొప్పి, దగ్గుతో వేధించే ఇన్ఫ్లుయెంజా – రెండూ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలతో రూపం మార్చుకొనే ఆర్ఎన్ఏ వైరస్‌లే. అందుకే, ఇన్ఫ్లుయెంజా సైతం కరోనాలా ఒకరి నుంచి మరొకరికి మహమ్మారిలా విస్తరించే ముప్పుంది. దేశంలో ఏ,బీ రకాల ఇన్ఫ్లుయెంజాలు రెండూ ఉన్నందున తాత్కాలికంగా హడావిడి చేసి, సమస్యను అదుపు చేశామనడం కాక ప్రభుత్వ పక్షాన సమగ్ర ఆరోగ్య ప్రణాళికా రచన తప్పనిసరి. రకరకాల మహమ్మారుల నివారణ, ఎదుర్కొనే సంసిద్ధత, కార్యాచరణలకు సంబంధించి ‘మహమ్మారి నివారణ ఒప్పందం’ చేసుకోవాలని విశ్వవేదికపై వివిధ దేశాలు, సంస్థలు ఇప్పటికే చర్చిస్తున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా వర్ధమాన దేశాలైన ‘గ్లోబల్ సౌత్’కు ప్రతినిధిగా, జీ20 దేశాలకు ప్రస్తుత సారథిగా భారత్ ఇందులో చురుకైన పాత్ర పోషించాలి. అందరికీ ఫలాలు సమంగా అందేలా చూడాలి. కరోనా, ఫ్లూ కేసులు వేలల్లో నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు, ప్రజలూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సుదీర్ఘంగా వేధిస్తున్న వ్యాధులతో విసుగొచ్చి, ముందు జాగ్రత్తలు పాటించకుంటే మనకే నష్టం. ఈ వ్యాధికారక వాతావరణంతోనూ సహజీవనం చేయడం నేర్చుకోవాలి. సభలు, సమావేశాలు, సినిమాలు, షికార్లు, ప్రయాణాలు – ఇలా జన సమ్మర్దం ఉండే ప్రతిచోటా స్వచ్ఛందంగా మాస్కు ధారణ, భౌతికదూరం తప్పనిసరి చేసుకోవాలి. వీటితో పాటు తరచూ చేతుల పరిశుభ్రతను ఒక అలవాటుగా చేసుకోవాలని నిపుణుల సూచన. ఈ కనీస జాగ్రత్తలతో కరోనాతో సహా అన్ని రకాల వైరల్, ఫ్లూ దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మహమ్మారుల కథ ఇంకా ముగిసిపోలేదు. మన జాగ్రత్తలే మనకు రక్ష. -
విజృంభిస్తున్న H5N1 బర్డ్‌ఫ్లూ.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం..!
ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముంగిస, పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో హెచ్5ఎన్1 తదుపరి ముప్పు మానవులకేనా? ఇది మరో మహమ్మారిగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ వైరస్ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. పక్షలకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి H5N1. 1997లోనే దీన్ని తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. కేసుల సంఖ్య తక్కువే ఉంది కదా? అనుకోవద్దు. ఎందుకంటే హెచ్5ఎన్1 సోకిన వారిలో 50 శాతం మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ ఇన్‌ఫ్లూయెంజా 1,000 మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే ఈ వైరస్ కొత్త వంశం ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు గణాంకాల్లో ఉంది. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615 జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు ఈ 2,701 కేసులు వెలుగుచూశాయి. మరో మహమ్మారిగా అవతరిస్తుందా? ఈ బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం ఉండటం ప్రజారోగ్య అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్1ఎన్1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉండటం గమనార్హం. ఒకవేళ హెచ్5ఎన్1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ అవకాశం లేదని చెప్పి కాస్త ఊరటనిచ్చారు. ఇటీవల హెచ్5ఎన్1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా మెలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ తెలిపారు. వీరిలో పౌల్ట్రీ ఫాంలతో పనిచేసేవారు, పక్షులు, జంతువులను చంపేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్5ఎన్1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు ఈ ఫ్లూ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. -
పొంచి ఉన్న ఇన్ఫ్లుయెంజా.. ఈ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ హెచ్చరిక
బనశంకరి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా ప్లూ రోగం బెడద పెరుగుతోంది. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు కొన్ని సలహాలు విడుదల చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ కేసులు నమోదు కాగా ఐసీఎంఆర్ ల్యాబ్ డేటా విశ్లేషణలో కర్ణాటకలో కూడా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ జబ్బుకు ఒసెల్టామివిర్ మాత్రలను చికిత్సా విధానంలో చేర్చారు. ఇవి అన్ని ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు పాటించాల్సిన నియమాలు ● తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కుకు టవల్, కర్చీఫ్, లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుగా పెట్టుకోవాలి, ఆపై చేతులను సబ్బుతో నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం లేకుండా కన్ను, ముక్కు , నోటిని చేతులతో ముట్టరాదు. ● అధిక రద్దీ ఉండే స్థలాలకు వెళ్లడం తగ్గించాలి, రద్దీ ప్రాంతాల్లో మాస్కును ధరించాలి. ప్లూ జ్వరంతో బాధపడే వ్యక్తులనుంచి కనీస దూరం పాటించాలి ● రోజూ బాగా నిద్రపోవాలి. తీవ్ర శ్రమ కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆలింగనం, ముద్దు పెట్టుకోవడం, జనరద్దీ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటివి చేయరాదు. వైద్యుల సలహాలేకుండా ఔషధాలను, యాంటి బయాటిక్ మందులను తీసుకోరాదు. ఇన్ఫ్లుయెంజా ఉంటే ఇలా చేయండి ● జ్వరం, జలుబు, అస్వస్దత, ఆకలి లేకపోవడం, చేతులు,కాళ్లు నొప్పులు, దీర్ఘకాలికంగా జలుబు తదితర లక్షణాలు ఇన్ఫ్లుయెంజా రోగ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయరాదు. మాస్కు ధరించడం ముఖ్యం. రోగ లక్షణాలు ప్రారంభమైన తరువాత కనీసం 7 రోజుల పాటు ఆరోగ్యవంతులకు దూరంగా ఉండాలి. లేదంటే రోగి వల్ల ఇతరులకు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. -
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్‌ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్‌ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
చైనాలో ఇన్‌ఫ్లూయెంజా పంజా
బీజింగ్: చైనాలో ఇన్‌ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఫ్లూ పాజిటివ్ కేసుల రేటు 41.6 శాతం పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మునుపటి వారంతో పోలిస్తే 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు తెలియజేసింది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్ నగరంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. హాంకాంగ్ వైరస్‌గా పిలిచే హెచ్3ఎన్2 వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణాలు సైతం నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం విశేషం. -
చైనాను వణికిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా.. కరోనా తరహా లాక్డౌన్లు..
బీజింగ్: ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా చైనా హడలెత్తిపోతోంది. దీంతో నివారణ చర్యగా జియాన్ నగరంలో కరోనా లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. గత వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 25.1 శాతం నుంచి 41.6 శాతానికి పెరిగినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనాకు తీసుకున్న చర్యలే తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్కూళ్లు, వ్యాపార కార్యకాలాపాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారుల లాక్డౌన్ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. లాక్డౌన్ విధించడం కంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఉత్తమమని జియాంగ్ నగరవాసులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చదవండి: లైవ్ మ్యూజిక్ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే.. -
H3N2: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..
ఏంటీ H3N2 వైరస్ ? ఇది వందేళ్ల నాటి వైరస్. H1N1 వైరస్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి వైరస్. ఇప్పుడు కొత్తగా మ్యుటేట్ అయ్యిందా ? లేదు.. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా సోకుతోందా? ప్రతి ఒక్కరికి అనేక సార్లు సోకింది. మరి ఇప్పుడు కొత్తగా భయపెడుతున్నారేంటి ? గతంలో మాస్క్‌లు లేవు. మ్యుటెంట్లకు కొత్త పేర్లు పెట్టి భయపెట్టి బిజినెస్ చేయడం గతంలో లేదు. ఇప్పుడు భయమే ఫార్మా కంపెనీల బిజినెస్. కోవిడ్ రెండో వేవ్‌లో గల్లా పెట్టెలు దాటి గోడౌన్లు నోట్ల కట్టలతో నిండాయి. ఓమిక్రాన్ వేవ్ వారిని నిరాశ పరిచింది. వాక్సీన్ల పుణ్యమా అంటూ సైడ్ ఎఫెక్ట్స్ వారు చికిత్స కోసం వెళుతుంటే బిజినెస్ బాగానే సాగుతోంది ! తిరిగి మాస్క్ లు నిభందనలు అలెర్ట్ అంటూ జనాల్లో భయం నింపి బిజినెస్ చేయాలనే ప్రయత్నం. గతం కంటే ఇప్పుడు ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకని ? రెండేళ్లు మాస్క్‌లు పెట్టుకొని వాక్సీన్లు వేసుకొని ఇమ్మ్యూనిటి ని బలహీనం చేసుకొన్నారు. ఇదే కారణం. మరి ఇప్పుడేమి చెయ్యాలి? దొంగలు దూరిన ఆరు నెలలలకు అన్నట్టు వున్నాయి కొందరి కూతలు. ఇది జనవరిలోనే మొదలయ్యింది. లక్షలాది మంది దీని బారిన పడి కోలుకున్నారు. దగ్గు రెండు మూడు వారాలు కొనసాగి తగ్గి పోయింది. ఇక ఎవరికీ రాదా? ఎవరో కొంతమందికి . రెండు నెలల్లో సోకకుండా మిగిలి పోయిన వారికి సోకుతుంది. మరి ఏమి చేయాలి? డి ,సి, బి విటమిన్ టాబ్లెట్స్ నాలుగు రోజులు( సోకినప్పుడు మాత్రం ) జింక్ టాబ్లెట్, వేడి నీరు తాగడం, వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని పుకిలించడం, పసుపు అల్లం కాషాయం టీ కప్పులో మూడు నాలుగు రోజులు వేసుకోవడం. తగినంత నీరు తాగడం. రెండు రోజులు రెస్ట్. పాత రోగానికి కొత్త మోత వద్దు. కొందరి విష ప్రచారానికి మోసపోవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి! -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్యానిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు (నోట్: ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు! -
వైరస్ లోడింగ్.. జరభద్రం.. ప్రతి ఇద్దరిలో ఒకరు జ్వర బాధితులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలోకి కోవిడ్ థర్డ్‌వేవ్ ప్రవేశించి ఏడాది దాటినా ఇంకా దాని రూపాంతరాలు వ్యాప్తిలోనే ఉంటున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ వద్దకు వస్తున్న ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుల్లో పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రజలు మాస్క్‌ల వాడకాన్ని దాదాపుగా మర్చిపోయారని.. రద్దీ ప్రాంతాల్లోనూ ఎవరూ పెద్దగా మాస్క్‌లు వాడటంలేదని విశ్లేషిస్తున్నారు. అందుకే వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ♦ మాస్క్ , శానిటైజర్ వాడాలి. ♦ కళ్లు, ముక్కు, నోటిని అధికంగా తాకడం, రుద్దడం వంటివి మానాలి. ♦ జనసమ్మర్థ ప్రాంతాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లకూడదు. ♦ బట్టలు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. బాధితుల్లో దగ్గు అధికం.. గత 2 నెలలుగా ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద ల అధికంగా ఉంది. చాలా మందిలో దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఆస్తమా, అలర్జీ, సీవో పీడీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారిలో సమస్యలు మరింతగా పెరుగుతున్నా యి. ఈ వైరస్‌లకు వాయుకాలుష్యం తోడుకావడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ వైరస్ల బారినపడిన వారు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడరాదు. ఇలాంటి వారికి ఫ్లూ వ్యాక్సిన్లు రక్షణనిస్తాయి. – డాక్టర్ (ప్రొ) గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఈ వైరస్ ఏమిటో అంతుబట్టట్లేదు చాలామంది బాధితుల్లో దగ్గు ఎక్కువై కళ్లెలో రక్తం పడటం, ఆయాసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్య లు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజు లు జ్వరం, ఒళ్లునొప్పులు సైతం ఉంటు న్నాయి. ఇది ఇన్‌ఫ్లూయెంజాలో కొత్త వేరియెంటా లేక కొత్త మ్యు టేషన్ తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షనా అనేది (ఆర్టీపీసీఆర్ గుర్తించని) స్పష్టంగా తెలియట్లేదు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ షాట్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచి స్తున్నాం. ఇవి ఇన్‌ఫ్లూయెంజా ఏ,బీ, స్వైన్‌ఫ్లూ నుంచి రక్షణనిస్తున్నాయి. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ -
దడ పుట్టిస్తున్న కొత్త వైరస్..కోవిడ్-19, H3N2 మధ్య తేడాలివే..
న్యూఢిల్లీ: జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవి కోవిడ్ లక్షణాలు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఇది కరోనా కాదు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ అని చెబుతున్నారు. మరి రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు మీకు సోకింది కోవిడా? లేక ఇన్‌ఫ్లూయెంజానా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఒక వైరస్ ఉపరకం. దీని వల్ల ఫ్లూ బారినపడి ఆస్పత్రితో చేరాల్సిన అవసరం ఇతర స్ట్రెయిన్లతో పోల్చితే అధికంగా ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లూయెంజా సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ ఫ్లూ బారినపడినవారిలో దగ్గు మాత్రం త్వరగా పోదు. దగ్గు పూర్తిగా తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల వరకు పడుతుంది. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఐసీఎంఆర్ వివరాల ప్రకారం హెచ్3ఎన్2 సోకి ఆస్పత్రిలో చేరినవారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పించాయి. చాలా అరుదుగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చింది. కోవిడ్-19 ఇలా.. మరోవైపు కోవిడ్-19 సోకివారిలో కూడా దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఒక్కోసారి బయటపడవు. ఒకటి నుంచి 14 రోజుల వరకు ఇవి ఉండొచ్చు. అయితే లక్షణాలు కన్పించకపోయినా.. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మీకు సోకింది కోవిడా, ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని కూడా స్పష్టం చేసింది. చదవండి: అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్.. లక్షణాలివే..! -
కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ వాడొద్దు!
కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్‌ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ► ఈ వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం. ► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. ► ఐసీఎంఆర్‌తో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఆర్) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. ► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది. ► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. ► కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ విషయంలో.. Influenza A subtype H3N2 is the major cause of current respiratory illness. ICMR-DHR established pan respiratory virus surveillance across 30 VRDLs. Surveillance dashboard is accessible at https://t.co/Rx3eKefgFf@mansukhmandviya @DrBharatippawar @MoHFW_INDIA @DeptHealthRes pic.twitter.com/3ciCgsxFh0 — ICMR (@ICMRDELHI) March 3, 2023 Fever cases on rise - Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho — Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023 -
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్‌లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
కోవిడ్ తెచ్చిన కొత్త వైరస్.. ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా కలకలం
టెల్ అవీవ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లోరోనా కేసు వెలుగుచూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విటర్ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. మరోవైపు భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగుచూస్త్ను నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నచ్‌మన్ యాష్ తెలిపారు. తక్కువ ఇమ్యునిటీ ఉన్నవాళ్లకు నాలుగో డోసు కూడా ఇస్తున్నట్టు వెల్లడించారు. ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందేందుకు నాలుగో డోసు వ్యాక్సిన్ తప్పనిసరైందని అన్నారు. ఇక గురువారం ఒక్కరోజే 5 వేల కోవిడ్ కేసులు బయటపడటంతో దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిట్జన్ హొరొవిట్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వేనని అన్నారు. తమ దేశంలో ఫిఫ్త్ వేవ్ నడుస్తోందని చెప్పారు. (చదవండి: నాలుగో వేవ్ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత) -
Bird Flu Strain H10N3: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఆందోళన అక్కర్లేదు!
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ కారకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్జియాంగ్కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్‌ఫ్లూ వైరస్‌లోని హెచ్10ఎన్3 స్ట్రెయిన్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్10ఎన్3 స్ట్రెయిన్‌తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8 స్ట్రెయిన్) బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్లో చైనా హువాన్ ప్రావిన్స్‌లో ఓ బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్6 స్ట్రెయిన్) కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్5ఎన్1 మాత్రం కొంచెం రిస్క్ ఉన్న బర్డ్‌ఫ్లూ వైరస్. దీని రిస్క్ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్7ఎన్9 స్ట్రెయిన్ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎలా సోకుతుందంటే.. సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ తరహాలోనే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలు (హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్‌ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్ఫెక్షన్కి గురైన పక్షుల ద్వారా ఆ వ్యక్తిని వైరస్ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్‌వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు వేరియెంట్లతో రిస్క్ ఛాన్స్! వైరస్ స్ట్రెయిన్లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్ఏవో ఎమర్జెన్సీ సెంటర్ సైంటిస్ట్ ఫిలిప్ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్ఫెక్షన్ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక ఫ్లూ వైరస్లు వేగంగా మ్యుటేంట్ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న హెచ్10ఎన్3 వేరియెంట్ జెనెటిక్ సీక్వెన్స్ తెలిస్తేనే తప్ప.. రిస్క్ తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు. చదవండి: Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
‘ఫ్లూ’ ఏదైనా.. జాగ్రత్తే అసలు మందు
సాక్షి, హైదరాబాద్: బర్డ్ ఫ్లూ... కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఎదురైన మరో ఉపద్రవం. ఈ ఫ్లూ పక్షులపైనే కాదు.. మనుషులపైనా ప్రభావం చూపనుందని కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఛాయలను గుర్తించింది. కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఈ నెల 11న ఫ్లూ ఉన్నట్లు ఖరారు చేసిన కేంద్రం... దీన్ని ఏవియన్ ఇన్ఫ్లూయెంజాగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లే బర్డ్ ఫ్లూపై పోరాటంలో కీలక భూమిక పోషించాలని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి పూర్తిగా ఉడికించిన ఆహారం మేలు హాఫ్ బాయిల్డ్(సగం ఉడికించిన) గుడ్లను అస్సలు తినొద్దు. సగం ఉడికించిన చికెన్ జోలికీ పొవద్దు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కనీసం అరగంట పాటు ఉడికించిన పదార్థాలనే తినాలి. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులకు కాస్త దూరంగా ఉండటంతో పాటు అవి సంచరించిన చోట ఉండే ఆహార పదార్థాలు, పచ్చి కాయగూరలు, పండ్లను తీసుకోకపోవడమే మేలు. ఆహార పదార్థాల వాడకంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: దేశమంతటా టీకా పండుగ) జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు... బర్డ్ ఫ్లూపై పోరాటం చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పశుసంవర్థక, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల విభాగం, హోం, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరణించిన పక్షులను ముట్టుకోకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. అకారణంగా పక్షులు మరణించినట్లు గుర్తిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ నంబర్ 040–246511196కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. జ్వరం, గొంతు నొప్పి బర్డ్‌ఫ్లూ సోకిన పక్షితోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ సోకిన పక్షిని తాకడం.. ముఖ్యంగా పక్షి కళ్లు, ముక్కును పట్టుకోవడంతో ఈ వైరస్ మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన పక్షి ఎగురుతున్నప్పుడు రెక్కల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాçస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షుల్లో రకరకాల లక్షణాలు అంతర్గతంగా కనిపిస్తుండగా... ఈ వైరస్ మనుషులకు సోకితే ముందుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, కండరాలు, ఎముకల నొప్పితో మొదలై క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వైరస్ సొకితే దుష్ప్రభావాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపర్చింది. -
కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు
‘‘కోవిడ్–19 కారణంగా మనదేశంలో ఇప్పటిదాకా దాదాపు 1.35 లక్షల మంది చనిపోయారు. కరోనా దెబ్బకు కుదేలయ్యాం. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా? అని ఇప్పుడు ప్రపంచమంతా క్షణమొక యుగంగా గడుపుతోంది. కరోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సిన్ తయారీలో దాదాపు 200 కంపెనీలు తలమునకలై ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర మరణాలు కాస్త తక్కువే అయినా, ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ కోసం యావత్తు దేశం ఎదురుచూస్తోంది. (రష్యాలో టీకా షురూ) ‘‘మరి ఏకంగా కోటిన్నర మంది చనిపోతే... పిట్టల్లా రాలిపోతే ఎంతగా అల్లాడిపోయి ఉంటారో కదా! 1918–20 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ ప్రబలిన సమయంలో మనదేశంలో ఏకంగా కోటిన్నర (ఈ సంఖ్య ఇంకా ఎక్కువనే వాదనా ఉంది) మంది బలైపోయారు. అప్పుడు టీకా కోసం ఎంతగా ఎదురుచూసి ఉంటారో? కానీ విచిత్రమేమిటంటే... నాడు మనదేశంలో అసలు వ్యాక్సినే అందుబాటులోకి రాలేదు. ఒక్కరికి కూడా టీకా పడలేదు. చివరకు హెర్డ్ ఇమ్యూనిటీతోనే వైరస్ అంతమైపోయింది’’ సాక్షి, హైదరాబాద్ : ఇన్‌ఫ్లూయెంజా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది 1918 నాటి స్పానిష్ ఫ్లూ. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన వెంటనే ఇది ప్రబలింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మందిని (ఈ సంఖ్యపై భిన్నాభిప్రాయాలున్నాయి) బలితీసుకుంది. కోటిన్నర మరణాలతో స్పానిష్ ఫ్లూతో ఎక్కువ మంది చనిపోయిన దేశంగా ఇండియా చరిత్రలో నిలిచింది. దీని బారినపడి ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు రంగంలోకి దిగి వ్యాక్సిన్ తయారీ చర్యలు చేపట్టారు. చివరకు 1938–1940 మధ్య వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. యూకే, యూఎస్, రష్యా సహా పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్లను తయారు చేశారు. 1940లో అమెరికా వ్యాప్తంగా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచారు. అప్పటి నుంచి దశలవారీగా అమెరికా, యూరప్ సహా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగింది. (కరోనా వైరస్: ఎన్నో వ్యాక్సిన్లు..) 90 ఏళ్ల తర్వాత తొలి టీకా.. మన దేశంలో 1920 నాటికే స్పానిష్ ఫ్లూ వల్ల కోటిన్నర మంది చనిపోయినా, దేశంలో ఒక్కరికి కూడా టీకా ఇవ్వలేదు. తొలుత స్పానిష్ ఫ్లూకు బ్యాక్టీరియా కారణమనుకుని 15 ఏళ్లపాటు అదే దిశలో పరిశోధనలు చేశారు. చివరకు 1930 తర్వాత వైరస్ అన్న విషయాన్ని గుర్తించి మళ్లీ కొత్త పరిశోధనలు చేసి పదేళ్లలో పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత కూడా మన దేశంలో టీకాలు అందుబాటులోకి రాలేదు. అప్పటికే స్పానిష్ ఫ్లూ అంతమైంది. కానీ 1957లో చైనాలో మరోసారి ఇన్‌ఫ్లూయెంజా వెలుగుచూసింది. దానికి ఏషియన్ ఫ్లూగా పేరు పెట్టారు. అదిదాదాపు 40 లక్షల మందిని చంపేసింది. మళ్లీ 1968లో చైనాలోనే మొదలై హాంగ్‌కాంగ్ ఫ్లూ పేరుతో ప్రపంచానికి పాకి మరో 40 లక్షల మందిని బలితీసుకుంది. తర్వాత హెచ్1ఎన్1 వైరస్‌గా స్వైన్‌ఫ్లూ పేరుతో 2009లో అమెరికాలో వెలుగుచూసింది. స్వైన్ ఫ్లూ ప్రబలే సమయానికి కొంతముందుగా ఫ్లూ వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ఫ్లూ వెలుగు చూసిన 90 ఏళ్లకు తర్వాత మనకు వ్యాక్సిన్ వచ్చింది. తొలుత వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా, ఆ తర్వాత మనమే సొంతంగా తయారు చేసుకోవటం ప్రారంభించాం. (వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్) అంతం..హెర్డ్ ఇమ్యూనిటీతోనే స్పానిష్ ఫ్లూ వచ్చే నాటికి మన దేశంలో కనీస జాగ్రత్తలపై కూడా అవగాహన లేదు. మహమ్మారి అతివేగంగా విస్తరిస్తూ, ప్రజల్లో అవగాహన వచ్చేసరికి లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పట్లో దాదాపు మూడొంతుల మంది భారతీయులకు ఇది సోకిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి పెరగడం) ఏర్పడి మహమ్మారి విస్తరణ ఆగి... వైరస్ దానికదే అంతమైంది. ఆ తర్వాత ఏషియన్ ఫ్లూ, హాంగ్‌కాంగ్ ఫ్లూ ప్రబలినా పెద్దగా ప్రభావం చూపలేదు. చరిత్రలో అతి భయంకర వ్యాధిగా నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూను టీకా లేకుండానే మన దేశం ఎదుర్కొనటం విశేషం. -
9 లక్షల వైరస్లు మానవులపై దాడి!
జెనీవా: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. దీనిని అరికట్టే వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరికొన్ని ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. వైరస్ల విజృంభణ కరోనాతోనే ఆగలేదు.. భవిష్యత్తులో మరిన్ని వైరస్లు మానవుల మీద దాడి చేయనున్నాయి అని తెలిపారు. అవి కోవిడ్ కన్నా ఇంకా భయంకరంగా ఉండనున్నాయి అని తెలిపారు. ప్రకృతిలో మానవుల మీద దాడి చేయగల వైరస్లు 9లక్షల వరకు ఉన్నాయని వెల్లడించారు. అంటువ్యాధులతో వ్యవహరించే విధానంలో కూడా భారీ మార్పులు రాబోతున్నట్లు తెలిపారు. ప్రకృతి క్షీణత, పెరుగుతున్న మహమ్మారి ప్రమాదాల మధ్య సంబంధాలపై దృష్టి సారించిన ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్-పాలసీ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్శిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్) ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ గురువారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 22 మంది ప్రముఖ నిపుణులు దీనిలో పాల్గొన్నారు. వీరంతా కలిసి జీవివైవిధ్యం, మహమ్మారిపై ఈ నివేదికలో చర్చించారు. నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. ప్రకృతిలో 9లక్షల వైరస్లు మానవులపై దాడి చేస్తాయి కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ అయిన సార్స్-కోవ్-2 గురించి భయపడేవారికి, ప్రకృతిలో 5,40,000 - 8,50,000 తెలియని వైరస్లు ప్రజలకు సంక్రమించగలవని నివేదిక హెచ్చరించింది. ఆసక్తికర అంశం ఏంటంటే ఫ్రెంచ్ గయానాలో మాయరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదించిన మూడు రోజుల తరువాత ఈ నివేదిక వెలువడటం గమనార్హం. డెంగ్యూ లాంటి లక్షణాలతో ఉన్న ఈ వైరస్ కూడా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఎబోలా, జికా, నిపా ఎన్సెఫాలిటిస్ వంటి అభివృద్ధి చెందుతున్న వ్యాధులలో ఎక్కువ భాగం (70శాతం), ఇన్‌ఫ్లూయెంజా, హెచ్ఐవీ / ఎయిడ్స్, కోవిడ్ -19 వంటి జూనోటిక్ వ్యాధులకు మూలం జంతువుల మీద ఉండే సూక్ష్మజీవులు. వన్యప్రాణులు, పశుసంపద, ప్రజల మధ్య సంబంధాలు ఉండటంతో ఈ సూక్ష్మజీవులు వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని ఐపీబీఈఎస్ నివేదిక తెలిపింది. వర్క్‌షాప్‌లో, మహమ్మారి బారి నుంచి తప్పించుకోవడం సాధ్యమే అని నిపుణులు అంగీకరించారు. అందుకు గాను ప్రతిచర్య నుంచి నివారణ వరకు వరకు భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. (కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ) కోవిడ్ 6వ ప్రపంచ ఆరోగ్య మహమ్మారి 1918 నుంచి గమనించినట్లయితే ప్రపంచాన్ని వణికించిన మహమ్మారులలో కోవిడ్‌ది ఆరవ సస్థానం. వీటిలో గ్రేట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ మొదటిది. ఇక దీని మూలాలు కూడా జంతువులలోని సూక్ష్మజీవులలోనే ఉన్నాయి. అయితే అన్ని మహమ్మారుల ఆవిర్భావం, వ్యాప్తి పూర్తిగా మానవ కార్యకలాపాల వల్లనే జరిగింది అని తెలిపింది. క్షీరదాలు, పక్షులలో ప్రస్తుతం కనుగొనబడని 1.7 మిలియన్ల వైరస్లు ఉన్నాయని, వీటిలో 8,50,000 వరకు ప్రజలకు సోకే సామర్థ్యం ఉందని నివేదిక తెలిపింది. "కోవిడ్ మహమ్మారి - లేదా ఏదైనా ఆధునిక మహమ్మారి వంటి వాటి వెనక గొప్ప రహస్యం ఏమి లేదు" అని ఎకో హెల్త్ అలయన్స్ అధ్యక్షుడు, ఐపీబీఈఎస్ వర్క్‌షాప్ పప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ దాస్జాక్ ఒక ప్రకటనలో తెలిపారు. (చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: డబ్ల్యూహెచ్‌వో) మానవ కార్యకలపాలతో అధిక ముప్పు "వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు కూడా మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతాయి. భూమిని ఉపయోగించే విధానంలో మార్పులు, వ్యవసాయం విస్తరణ, తీవ్రత; స్థిరమైన వాణిజ్యం, ఉత్పత్తి, వినియోగం ప్రకృతికి విఘాతం కలిగిస్తాయి. వన్యప్రాణులు, పశుసంపద, మానవుల మధ్య సంబంధాన్ని పెంచుతాయి. ఫలితంగా మహమ్మారి వ్యాప్తికి మార్గం సుగమం అవుతుంది. జీవవైవిధ్యానికి నష్టం కలిగించే మానవ కార్యకలాపాలను తగ్గించడం, అధిక జీవవైవిధ్య ప్రాంతాల దోపిడీని తగ్గించే చర్యల ద్వారా మహమ్మారి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇది వన్యప్రాణుల-పశువుల-మానవ సంబంధాలను తగ్గిస్తుంది. ఫలితంగా కొత్త వ్యాధుల వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం వైరస్ కట్టడి కోసం అమలు చేస్తోన్న లాక్డౌన్ వంటి నివారణ చర్యల కన్నా ఇది ఎంతో చవక అని.. పైగా ఎలాంటి ఆరర్థికపరమైన నష్టం వాటిల్లదని తెలిపుతుంది. (చదవండి: గాలి ద్వారా కరోనా.. !? ) "జూనోటిక్ వ్యాధుల్లో జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే వైరస్లు ఇప్పటివరకు మనకు బహిర్గతం కాని కొత్త వైరస్లు. ఈ వైరస్లు మానవుల శరీరాలను అనుకూలంగా మార్చుకున్న తర్వాత వ్యాప్తి చెందుతాయి. కోవిడ్ -19 వ్యాధికి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ మన ముందున్న ఒక మంచి ఉదాహరణ. ఏ వైరస్ వేగంగా వ్యాపిస్తుందో మనం అస్సలు ఊహించలేము" అని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైక్రోబయాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ శోభా బ్రూర్ అన్నారు. (చదవండి: కోవిడ్ తిరగబెట్టదని గ్యారంటీ లేదు) బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ శంకరన్ మాట్లాడుతూ, “భవిష్యత్తులో వైరస్ వ్యాధుల వ్యాప్తిలో 'సంపూర్ణ తుఫాను'ను సృష్టించడానికి భారతదేశం అనేక లక్షణాలను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడ అధిక జీవవైవిధ్యం, అధిక జనాభా సాంద్రత, విస్తృతమైన భూ పరివర్తన, విచ్ఛిన్నం మానవ-వన్యప్రాణుల ఇంటర్ఫేస్ యొక్క పరిధిని పెంరగడం వంటి లక్షణాల వల్ల వైరస్ల వ్యాప్తి గణనీయంగా ఉండనుంది" అన్నారు. -
జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ శతాబ్దంలో వచ్చిన సార్స్, మెర్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ధారించారు. పలురకాల జూనోటిక్ వ్యాధులు జంతువులు లేదా సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు రోగాలను వ్యాపింపజేస్తాయని గుర్తించారు. ఈ రోగాల్లో కొన్నిజంతువులను అనారోగ్యానికి గురిచేయకపోయినా, వీటి వల్ల మనుషులు మాత్రం అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 1,200 ఇన్ఫెక్షన్లు సోకేందుకు కారణమైన వ్యాధులు, రోగాల్లో 816 జూనోటిక్ డిసీజెస్ జంతువుల నుంచి (75 శాతం వరకు) వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఇంకొంత కాలం ఇంటినుంచే) స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం దాకా.. ఈ వ్యాధులు స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు అనుసరించాల్సిన వ్యూ హంపై ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ వన్ హెల్త్’పేరిట ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ జి.పద్మనాభన్ నేతృత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. జంతువుల, సూక్ష్మక్రిముల నుంచి సోకే వైరస్లు, వాటి విస్తృతి, వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలను మెరుగైన పద్ధ తుల్లో అర్థం చేసుకునేందుకు ఇది కృషి చేయనుంది. మూడేళ్ల కాలపరిమితిలో ఈ రోగాలు, వ్యాధులకు సంబంధించి ప్రాధాన్యాంశాలను గుర్తించడం తో పాటు, ఈ వైరస్లు మళ్లీ రాకుండా, ఇన్ఫెక్షన్లు మళ్లీ సోకకుండా, బయో సేఫ్టీ, బయో సెక్యురిటీకి సంబంధించిన సవాళ్లను పరిశీలించి వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించనుంది. వాతావరణ మార్పులు, అడవులు తగ్గిపోవడం, జంతువులతో వ్యవహరించే తీరు, వలసలు, టూరిజం, పట్టణీకరణ, మనుషుల ప్రవర్తనలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరమైన అంశాలు, తదితరాలు జూనోటిక్ వ్యాధులు రావడానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏయే రకాలు.. వైరస్, బ్యాక్లీరియా, శిలీంద్రాలు తదితర పరాన్న జీవులు.. వీటిలో కొన్ని దోమలు, పేలు వంటివి వ్యాప్తి చేస్తాయి. వ్యాప్తి ఎలా.. ⇒ గాలి ద్వారా, కలుషితమైన మాంసం తినడం ⇒ వ్యాధి సోకిన జంతువులకు సన్నిహితంగా మెలగడం ∙ వ్యాధి సోకిన జంతువు తాకిన ఉపరితలాన్ని/ప్రాంతాన్ని ముట్టుకోవడం ⇒ దోమలు, పేలు వంటివి కుట్టినప్పుడు ఇవే జూనోటిక్ వ్యాధులు.. ⇒ ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, బొవైన్ ట్యూబర్క్యులోసిస్, క్యాట్ స్క్రాచ్ ఫీవర్, డెంగీ ఫీవర్, ఎబోలా, ఎన్సెఫలైటిస్, ఫిష్ ట్యాంక్ గ్రాన్యులోమా, గ్లాండర్స్, హెపటైటిస్–ఈ, లెప్టోస్పైరోసిస్, లైమ్ డిసీజ్, మలేరియా, ప్యారట్ ఫీవర్, ప్లేగు, క్యూ ఫీవర్, రేబీస్, ర్యాట్ బైట్ ఫీవర్, రింగ్వార్మ్, స్వైన్ ఫ్లూ, డిప్తీరియా తదితరాలు. -
ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే
హిస్టరీ రిపీట్ అంటారే..ఒక్కోసారి అది నిజంగానే జరుగుతుంది..ఇప్పుడు చూడండి.. మాస్కులు వాడండి..అవి లేకుండా బయటకు రావొద్దు.. సోషల్ డిస్టెన్స్.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం.. బస్సులు రైళ్లలో రసాయనాల పిచికారీ చేయడం.. ఇవన్నీ చేస్తూనే ఉన్నాంగా.. అచ్చం అలాగే.. ఓ వందేళ్ల క్రితం కూడా జరిగింది కావాలంటే ఈ ఫొటోలను చూడండి.. కరోనాలాగే వందేళ్ల క్రితం (1918–1920) కూడా స్పానిష్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఏకంగా 5 కోట్ల ప్రాణాలను బలి తీసుకుంది. అప్పుడు కూడా ఇప్పుడుచెప్పుకుంటున్నవన్నీ తప్పనిసరి చేశారు. ఫ్లూ ప్రబలిన దశలో చాలా దేశాల్లో మాస్కులు ధరించడం మస్ట్ అని చెప్పారు. అవి లేకుండా ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రవేశాన్ని నిషేధించారు కూడా. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూ.. ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేధించారు. షేక్‌హ్యాండ్‌కు పరిమితమవమని చెప్పారు. అయితే దాని వల్ల కూడా ఫ్లూ ప్రబలింది, అది వేరే సంగతి. అప్పట్లో కొందరైతే గాలిలో కూడా ఫ్లూ ఉందని నమ్ముతూ చిత్ర విచిత్రమైన మాస్కులు ధరించారు ఇప్పట్లాగే. (కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...) ఇదో చిత్రమైన మాస్కు ఇంకో విషయం.. స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనడానికి స్పానిష్ అన్నారు గానీ.. నిజానికి స్పెయిన్‌తో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. దాంతో మీడియాపై రకరకాల ఒత్తిడులు, విపరీతమైన సెన్సార్షిప్ ఉండేది. దాని వల్ల ఫ్లూ కరాళ నృత్యం చేస్తున్నా. దాన్ని తగ్గించి చూపేవారు. లక్షల మంది చనిపోతున్నారంటే సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని కూడా భావించేవారు. ఈ యుద్ధ సమయంలో తటస్థంగా ఉన్న అతి తక్కువ దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. దాంతో అక్కడి మీడియా స్వేచ్ఛగా ఉన్నది ఉన్నట్లుగా రాసేది. వాళ్ల రాజుకు కూడా వైరస్ సోకిన విషయాన్ని రాయడంతోపాటు అది ఎలా లక్షలాది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుందన్న విషయాన్నీ తెలియజెప్పేది. (కరోనా : ఆ వీధికి చైనా డాక్టర్ పేరు !) వాషింగ్టన్.. మాస్కు లేకపోతే నో ఎంట్రీ అంటున్న అధికారి దీంతో మిగిలిన దేశాల ప్రజలు స్పెయిన్‌లోనే ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడే వైరస్ పుట్టిందని భావించేవారు. వారి అపార్థాల ఫలితంగా వచ్చిందే స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనే పేరు. అలా తదనంతర కాలంలో ఆ పేరు స్థిరపడిపోయింది. స్పెయిన్‌లో మాత్రం ఈ వైరస్‌ను ఏమనేవారో తెలుసా? ఫ్రాన్స్ ఫ్లూ. వారు తమ శత్రు దేశం ఫ్రాన్స్‌లోనే ఈ వైరస్ పుట్టిందని నమ్మేవారు. నిజానికి ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అన్నదానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కొందరు చైనా అని, మరికొందరు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా అని అంటారు. అయితే స్పెయిన్ మాత్రం ఆ జాబితాలో లేకపోవడం గమనార్హం. (కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం) లండన్‌లో మాస్క్‌లతో -
మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!
వాషింగ్టన్/బీజింగ్/ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి ఈ ఏడాది చివరిలో తీవ్రంగా అమెరికాపై విరుచుకుపడే అవకాశముందని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరించారు. అమెరికాలో దాదాపు 8.24 లక్షల మంది వైరస్ బారిన పడగా, 45 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్లు విజృంభిస్తాయని రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిదశలో కరోనా వైరస్ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉండిఉంటే తట్టుకోవడం కష్టమయ్యేదనీ, అదృష్టవశాత్తూ ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందన్నారు. రానున్న శీతాకాలంలో ఇప్పటి కంటే తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇమ్రాన్‌కు కరోనా పరీక్ష పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ఈదీ ఫౌండేషన్ ఛైర్మన్ ఫైసల్ ఈదీ ఇటీవల ఇమ్రాన్‌ను సందర్శించడం, ఆ తరువాత ఆ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో ఈ పరీక్షలు అవసరమయ్యాయి. కాగా, ఇమ్రాన్‌కు నెగటివ్ అని పరీక్ష ఫలితాల్లో తేలింది. అమెరికాలో చైనాపై కేసు కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారాలను ప్రశ్నిస్తూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం ఒక కేసు దాఖలు చేసింది. సమాచారాన్ని తొక్కిపెట్టడం, ముందస్తు హెచ్చరికలు చేసిన వారిని అరెస్ట్ చేయడం, వైరస్ అంటువ్యాధి లక్షణాన్ని తిరస్కరించడం ద్వారా చైనా ప్రపంచానికి సరి చేయలేనంత నష్టం కలుగజేసిందని, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు మానవ బాధలకు కారణమైందని మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ షిమిట్ స్థానిక కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. వూహాన్ డైరీ రచయితపై వ్యతిరేకత కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్లో లాక్డౌన్ పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన చైనా రచయిత ఫాంగ్ఫాంగ్పై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫాంగ్ఫాంగ్ తన ఆన్లైన్ డైరీలో వూహాన్‌లోని పరిస్థితులను వివరించారు. రోగులతో నిండిన ఆస్పత్రులు, చికిత్స అందించలేమంటూ కొందరిని తిప్పి పంపడం, రోగుల బంధువుల మరణాల వంటి విషయాలను పేర్కొన్నారు. -
అక్కడ మరణం నిషేధం
ఓస్లో: నార్వేలోని ఆ పట్టణంలో మరణం నిషేధం. ఆర్కిటిక్ ద్వీపకల్ప ప్రాంతంలో ‘లాంగ్యర్‌బీన్’ అనే ఆ బొగ్గుగనుల పట్టణంలో అతి శీతల ఉష్ణోగ్రతల వల్ల మృతదేహాలు ఎన్నటికి మట్టిలో కలిసే పరిస్థితి లేదు. అందువల్ల మృతదేహాలతో పాటు వాటిలోని వైరస్, బ్యాక్టీరియాలు కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ భయంతోనే అక్కడ చావుపై పూర్తిగా నిషేధమే పెట్టారు. అందుకోసం 2017లో ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. 1918లో స్పానిష్ ఫ్లూ వైరస్ బారిన పడి మరణించిన వారి మృతదేహాల్లో ఇప్పటికీ ఆ ఫ్లూ జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎందుకీ పరిస్థితి.. నార్వే ఉత్తర ప్రాంతంలో మారుమూల స్వాల్బార్డ్ ద్వీపకల్పాల సమూహంలో ఉన్న లాంగ్యర్‌బీన్ పట్టణ జనాభా దాదాపు 2 వేలు. ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత –17 డిగ్రీలు కాగా అత్యల్పంగా –46.3 డిగ్రీలకు పడిపోతుంది. ఏడాదిలో నాలుగు నెలల పాటు సూర్యుడి జాడే ఉండదు. భూమిలో ‘పెర్మ ఫ్రాస్ట్’ అనే వాతావరణ పరిస్థితి కారణంగా పాతిపెట్టిన మృతదేహాలు కుళ్లిపోవు. దీనిని 1950లో అధికారులు గుర్తించారు. పెర్మా ఫ్రాస్ట్ అంటే మట్టి లేదా రాతిలో ఉష్ణోగ్రతలు ఎప్పటికీ సున్నా లేదా అంతకంటే తక్కువ డిగ్రీలు ఉండడమే.. ఈ పరిస్థితి కారణంగా చాలా సందర్భాల్లో మృతదేహాలు భూమి ఉపరితలంపైకి కూడా వచ్చేస్తాయి. 1950 తర్వాత ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు. మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ జాడలు 1918లో ప్రాణాంతక ‘స్పానిష్ ఫ్లూ వైరస్’ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో మరణించిన వారి 11 మృతదేహాలు ఇప్పటికీ లాంగ్యర్‌బీన్‌లో ఉన్నాయి. ‘పెర్మ ఫ్రాస్ట్’ ప్రభావంతో ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఆ మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇంకా సజీవంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 1998, ఆగస్టులో నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్కు చెందిన కర్స్టి డంకన్ లాంగ్యర్‌బీన్‌లో పరిశోధనలు నిర్వహించారు. ఫ్లూతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇంకా బతికే ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. మరణాల్ని నిషేధిస్తూ 2017లో చట్టం.. భూమి శాశ్వతంగా ఘనీభవన స్థితిలో ఉండడంతో పాతిపెట్టిన శవాలు కుళ్లిపోకుండా.. ఉపరితలం పైకి వస్తున్నందున 2017లో అక్కడ మరణాలపై చట్టం చేసినట్లు నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ క్రిస్టియన్ మేయర్ తెలిపారు. అక్కడ ప్రాణాంతక వైరస్ స్థానికులకు సోకకుండా ఉండేందుకు మరణానికి చేరువలో ఉన్న వారిని నార్వేలోని ప్రధాన భూభాగానికి వెంటనే తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా అకస్మాత్తుగా అక్కడ మరణించినా, అక్కడే మరణించాలని కోరుకున్నా.. వారి అంతిమ సంస్కారాల్ని అక్కడ నిర్వహించరు. అయితే వారి అస్థికలను అక్కడి భూమిలో పూడ్చేందుకు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం. -
ఫ్లూ టీకా ఉదయమే మేలు
లండన్: ఫ్లూ వ్యాక్సిన్లు ఉదయం పూట వాడినప్పుడు ఎక్కువ క్రియాశీలకంగా, ప్రతిరక్షకాల స్పందనలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. ఇన్‌ఫ్లూయెంజా ‘వ్యాక్సినేషన్ ప్రోగ్రాం’లో భాగంగా లండన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావంపై అధ్యయనం చేశారు. మూడు రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లతో పోరాడేందుకు వివిధ రకాల వ్యాక్సిన్లను 65 ఏళ్లకు పైబడిన దాదాపు 276 మందిపై ప్రయోగించారు. ఉదయం 9 -11 గంటల మధ్య, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య శస్త్రచికిత్సలు జరిగిన వారికి ఈ మూడు రకాల వ్యాక్సిన్లను వేర్వేరుగా నెలరోజుల పాటు ఇచ్చారు. మొదటి రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిలో మధ్యాహ్నం వ్యాక్సిన్ ఇచ్చిన వారి కన్నా ఉదయం ఇచ్చిన వారిలో ప్రతి రక్షకాలు ఎక్కువగా విడుదలైనట్లు గుర్తించారు.