సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలోకి కోవిడ్ థర్డ్‌వేవ్ ప్రవేశించి ఏడాది దాటినా ఇంకా దాని రూపాంతరాలు వ్యాప్తిలోనే ఉంటున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ వద్దకు వస్తున్న ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
బాధితుల్లో పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రజలు మాస్క్ల వాడకాన్ని దాదాపుగా మర్చిపోయారని.. రద్దీ ప్రాంతాల్లోనూ ఎవరూ పెద్దగా మాస్క్లు వాడటంలేదని విశ్లేషిస్తున్నారు. అందుకే వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
♦ మాస్క్ , శానిటైజర్ వాడాలి.
♦ కళ్లు, ముక్కు, నోటిని అధికంగా తాకడం, రుద్దడం వంటివి మానాలి.
♦ జనసమ్మర్థ ప్రాంతాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లకూడదు.
♦ బట్టలు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు.
బాధితుల్లో దగ్గు అధికం..
గత 2 నెలలుగా ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద ల అధికంగా ఉంది. చాలా మందిలో దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఆస్తమా, అలర్జీ, సీవో పీడీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారిలో సమస్యలు మరింతగా పెరుగుతున్నా యి. ఈ వైరస్‌లకు వాయుకాలుష్యం తోడుకావడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ వైరస్‌ల బారినపడిన వారు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడరాదు. ఇలాంటి వారికి ఫ్లూ వ్యాక్సిన్లు రక్షణనిస్తాయి.
– డాక్టర్ (ప్రొ) గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీ
ఈ వైరస్ ఏమిటో అంతుబట్టట్లేదు
చాలామంది బాధితుల్లో దగ్గు ఎక్కువై కళ్లెలో రక్తం పడటం, ఆయాసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్య లు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజు లు జ్వరం, ఒళ్లునొప్పులు సైతం ఉంటు న్నాయి. ఇది ఇన్‌ఫ్లూయెంజాలో కొత్త వేరియెంటా లేక కొత్త మ్యు టేషన్ తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షనా అనేది (ఆర్టీపీసీఆర్ గుర్తించని) స్పష్టంగా తెలియట్లేదు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ షాట్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచి స్తున్నాం. ఇవి ఇన్‌ఫ్లూయెంజా ఏ,బీ, స్వైన్‌ఫ్లూ నుంచి రక్షణనిస్తున్నాయి.
– డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్
Comments
Please login to add a commentAdd a comment