జపాన్‌లో మాస్కులతో విద్యార్థులు
హిస్టరీ రిపీట్ అంటారే..ఒక్కోసారి అది నిజంగానే జరుగుతుంది..ఇప్పుడు చూడండి.. మాస్కులు వాడండి..అవి లేకుండా బయటకు రావొద్దు.. సోషల్ డిస్టెన్స్.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం.. బస్సులు రైళ్లలో రసాయనాల పిచికారీ చేయడం.. ఇవన్నీ చేస్తూనే ఉన్నాంగా.. అచ్చం అలాగే.. ఓ వందేళ్ల క్రితం కూడా జరిగింది కావాలంటే ఈ ఫొటోలను చూడండి..
కరోనాలాగే వందేళ్ల క్రితం (1918–1920) కూడా స్పానిష్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఏకంగా 5 కోట్ల ప్రాణాలను బలి తీసుకుంది. అప్పుడు కూడా ఇప్పుడుచెప్పుకుంటున్నవన్నీ తప్పనిసరి చేశారు. ఫ్లూ ప్రబలిన దశలో చాలా దేశాల్లో మాస్కులు ధరించడం మస్ట్ అని చెప్పారు. అవి లేకుండా ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రవేశాన్ని నిషేధించారు కూడా. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూ.. ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేధించారు. షేక్‌హ్యాండ్‌కు పరిమితమవమని చెప్పారు. అయితే దాని వల్ల కూడా ఫ్లూ ప్రబలింది, అది వేరే సంగతి. అప్పట్లో కొందరైతే గాలిలో కూడా ఫ్లూ ఉందని నమ్ముతూ చిత్ర విచిత్రమైన మాస్కులు ధరించారు ఇప్పట్లాగే. (కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...)
ఇదో చిత్రమైన మాస్కు
ఇంకో విషయం.. స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనడానికి స్పానిష్ అన్నారు గానీ.. నిజానికి స్పెయిన్‌తో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. దాంతో మీడియాపై రకరకాల ఒత్తిడులు, విపరీతమైన సెన్సార్‌షిప్ ఉండేది. దాని వల్ల ఫ్లూ కరాళ నృత్యం చేస్తున్నా. దాన్ని తగ్గించి చూపేవారు. లక్షల మంది చనిపోతున్నారంటే సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని కూడా భావించేవారు. ఈ యుద్ధ సమయంలో తటస్థంగా ఉన్న అతి తక్కువ దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. దాంతో అక్కడి మీడియా స్వేచ్ఛగా ఉన్నది ఉన్నట్లుగా రాసేది. వాళ్ల రాజుకు కూడా వైరస్ సోకిన విషయాన్ని రాయడంతోపాటు అది ఎలా లక్షలాది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుందన్న విషయాన్నీ తెలియజెప్పేది. (కరోనా : ఆ వీధికి చైనా డాక్టర్ పేరు !)
వాషింగ్టన్.. మాస్కు లేకపోతే నో ఎంట్రీ అంటున్న అధికారి
దీంతో మిగిలిన దేశాల ప్రజలు స్పెయిన్‌లోనే ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడే వైరస్ పుట్టిందని భావించేవారు. వారి అపార్థాల ఫలితంగా వచ్చిందే స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనే పేరు. అలా తదనంతర కాలంలో ఆ పేరు స్థిరపడిపోయింది. స్పెయిన్‌లో మాత్రం ఈ వైరస్‌ను ఏమనేవారో తెలుసా? ఫ్రాన్స్ ఫ్లూ. వారు తమ శత్రు దేశం ఫ్రాన్స్‌లోనే ఈ వైరస్ పుట్టిందని నమ్మేవారు. నిజానికి ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అన్నదానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కొందరు చైనా అని, మరికొందరు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా అని అంటారు. అయితే స్పెయిన్ మాత్రం ఆ జాబితాలో లేకపోవడం గమనార్హం. (కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం)
లండన్‌లో మాస్క్‌లతో
Comments
Please login to add a commentAdd a comment