Social Distancing
-
పార్లమెంట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు. మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్‌ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. (చదవండి: Nirmala Sitharaman Budget 2022 Speech) -
పండగ పూట... ఊరు పిలుస్తోంది
నను గన్న నా ఊరుకు వందనం. నా మాటలు విని నాకు మాటలు చెప్పిన రావిచెట్టు అరుగుకు వందనం. సైకిల్ టైరును కర్రపుల్లతో పరుగులెత్తించే వేళ నన్ను విమానం పైలెట్‌లా ఫీలయ్యేలా చేసిన ఊరి వీధులకు వందనం. కరెంటు స్తంబం దగ్గర రేగుపళ్లను అమ్మిన అవ్వకు వందనం. దొంగ కొంగలను అదిలించక చేపలకు భద్రం చెప్పిన చెరువుకు వందనం. అక్కా.. పిన్ని... బాబాయ్ పలకరింపులకు వందనం. తప్పు చేస్తే ఉమ్మడిగా కలిసి ప్రేమగా విధించిన దండనకు వందనం. పండగొచ్చింది. ఊరెళ్లాలి. కోవిడ్ సమయం ఇది. జాగ్రత్తగా వెళ్లాలి. సురక్షితంగా తిరిగి రావాలి. పొలిమేరల్లో అడుగుపెడుతూనే జిల్లున తండ్రి పేరు వినపడుతుంది. ‘ఏయ్యా... నువ్వు వెంకన్న కొడుకువే కదా’... ‘ఏమ్మా... రామారావు మేష్టారి చివరమ్మాయివేగా’... ఊరికి అందరూ తెలుసు. ఊరు తన మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులని. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనే అవే వీధులు. అవే ఇంటి పైకప్పులు. అవే డాబాలు. అవే చిల్లర అంగళ్లు. కొన్ని ఏవో మారిపోయి ఉంటాయి. పాత దగ్గర కొత్తవి వచ్చి ఉంటాయి. మేకప్ కొద్దిగా తేడా. ముఖం అదే. చిర్నవ్వు అదే. కళ్లాపి చల్లిన ముంగిళ్లు ఎదురు పడతాయి. వాటి మీద వేసిన ముగ్గులు తమ రంగులను లెక్కపెట్టమంటాయి. ఒక తల్లి ఎవరో ముసుగు తన్ని నిద్ర పోతున్న పిల్లలను లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద పాకిన గుమ్మడిపాదు తన కాయలను నీకివ్వను పో అంటూ ఉంటుంది. ఈ మనుషుల మధ్యే కదా బాల్యం గడిచింది అని గుండెలకు కొత్త గాలి ఏదో తాకుతుంది. పొద్దున్నే పాల కోసం గిన్నె పట్టుకుని వచ్చింది ఈ వీధుల్లోకే. అదిగో సుబ్బయ్య టీ అంగడి. మళ్లీ ఇస్తాలే అని తాగి మర్చిపోయిన ఒకటి రెండు టీల బాకీ గుర్తుకొస్తోంది. పుల్లట్లు వేసే కాంతమ్మ ఇంటికి కొంత దూరం నడవాలిలే. ఆ చట్నీ అంత రుచిగా ఎలా ఉంటుందో కెఎఫ్సి వాడికి తెలిసుంటే ఫార్ములా కొనుక్కొని వెళ్లేవాడు. పెద్ద శెట్టి అంగడి ఇంకా తెరవలేదు. పండక్కి అమ్మ చీటి రాసిస్తే ఈ అంగడిలోనేగా చక్కెర, బెల్లం, యాలకులు, సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి కొనుక్కుని వెళ్లేది. బెల్లం పొట్లం కట్టాక చేయి సాచితే కొసరు అందేది. బుగ్గ పండేది. అబ్బ. కచ్చేరి అరుగు. ఉదయం అక్కడే పేపర్ చదవాలి. మధ్యాహ్నం అక్కడే గోలీలాడాలి. సాయంత్రం అక్కడే ట్రాన్సిస్టర్‌లో పాటలు వినాలి. పులిజూదం ఆటలో ఒలింపిక్స్ మొనగాళ్లు మామూలు లుంగీల్లో అక్కడే తిరుగాడుతుండేవారు. ఊరి వార్తలు చెవిలో పడేసే మహా మహా జర్నలిస్టులు రాత్రి కూడు తినేసి పై కండువా సర్దుకుంటూ వచ్చేసేవారు. అందరికీ నీడనిచ్చే అరుగు చెట్టు వేల కొద్ది గువ్వలకు పురుళ్లు పోసి పోసి పండిపోయి ఉండేది. అది ఆకులు రాల్చి మోడుగా నిలిచే రోజుల్లో ఊరు చిన్నబుచ్చుకుని ఉండేది. నాన్న సైకిల్ ఈ దారుల్లోనే తిరిగేది. అమ్మ చేయి పట్టుకొని తొలాటకు ఇటుగానే వెళ్లేది. ఐసు బండి వస్తే ఏ రంగుది కొనుక్కోవాలో తెలియక రెండు మూడు నిమిషాలు నెత్తి గీరుకునేది. గెలిచిన గోలీలు దొంగలించిన శీనుగాడి మీద నాలుగైదు వారాలు పగబట్టేది. ఊళ్లోని మేనత్త మేమమామలు అసలు చుట్టాలుగా అనిపించకపోయేది. రైలు దిగి వచ్చే బాబాయి పిన్నే తమను కూడా వెంటబెట్టుకుని వెళతారని సంబరం కలిగిచ్చేది. పండగ సెలవుల్లో స్కూలు మైదానంలో గాలిపటాలు ఎగిరేవి. తోకలు లేని పిట్టలు తోకలు ఉన్న పటాల దారాలు లాగేవి. బిళ్లంగోడు దెబ్బకు బిళ్ల గిర్రున గాలిలో లేచేది. హరిదాసు చిడతలకు వాకిట్లో ఇల్లు గుమిగూడేది. బుడబుడల డమరుకానికి పాత బట్టలనీ వెలికి వచ్చేది. గంగిరెద్దుల సన్నాయికి ఒక్కటే పాట వచ్చు. కొమ్మదాసులు చెట్టెక్కి దిగకపోయేది. పిట్టలదొరల కోతలకు పంట చేలు కూడా అచ్చెరువొందేవి. కోలాటానికి మోత ఫెళ్లుఫెళ్లున మోగేది. పులేషగాళ్లు నిమ్మకాయను పళ్లతో కొరికి భయపెట్టేవాళ్లు. తప్పెట్లు తాటాకు మంటల చివరలకు బెదరక సెగ పొందేవి. ఊరి దేవత ఊరేగింపు సంబరంగా జరిగేది. పిండి వంటలు లేని ఇల్లు ఎక్కడ? కనిపెట్టిన వారికి బహుమానమండోయ్. ఈ ఇంటి మనుబూలు.. ఆ ఇంటి అరిసెలు... పొరుగింటి లడ్లు... ఇరుగింటి పాయసం. పెద్దవాళ్లు అడక్క పోయినా పిల్లలకు సినిమాకు చిల్లర ఇచ్చేవారు. కొత్త సినిమాల పోస్టర్లు టైమ్ మొత్తం తినేసేవి. ఊరు వదిలి ఉపాధి కోసం వచ్చేశాము. ఊరు గుండెల్లోనే ఉంది. పండగ వచ్చిందంటే అది జాబు రాయకనే పిలుస్తుంది. ఊరిని చూడాలి. మళ్లీ బతకాలి. నేస్తుల్ని కలవాలి. ఊసులను రాసి పోయాలి. ఊరికి బయలుదేరుతున్నా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. దూరం పాటిస్తా. పిల్లలను గుంపులో వెళ్లకుండా చూసుకుంటా. ఈ పండగను వదలుకోలేను. ఊరికి వెళతాను. కాని ఊరిని నా నుంచి నన్ను ఊరి నుంచి సురక్షితంగా ఉంచేలా వెళతాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. -
UK: కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.. జులై 19 నుంచి ఫేస్ మాస్క్‌లు, సామాజిక దూరం వంటి కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఇష్టం ఉంటే మాస్కులు ధరించవచ్చు అని అన్నారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ను వీక్షించడానికి పూర్తిస్థాయిలో అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి బ్రిటన్ ప్రభుత్వం జూన్ 21న పూర్తి ఆంక్షలను ఎత్తివేయాలనుకుంది. కానీ డెల్టా వేరియంట్ విజృంభన కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
సుశీల్ సాబ్.. ఎక్ ఫొటో ప్లీజ్!
న్యూఢిల్లీ: ప్రియ శిష్యుడు సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్ కావడంతో దుమారం మొదలైంది. మాస్క్‌లు లేవు, సోషల్ డిస్టెన్స్ లేదు. పైగా సుశీల్ సహా అందరూ ముఖంలో చిరునవ్వుతో ఫొజులిచ్చారు. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అసోషియేషన్ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. చదవండి: సుశీల్ గురించి సాగర్ పేరెంట్స్ ఏమన్నారంటే.. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఆపై భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించారు. ఇక ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: సాగర్ హత్య, ఆ రాత్రి ఏంజరిగిందంటే.. -
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్‌లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ విజృంభిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రాణ భయంతో నిర్థారణ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్‌సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. దీంతో పీహెచ్‌సీల వద్ద కనీస భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు, ఒకరిపై ఒకరు పడుతూ రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. వీరిని నివారించేందుకు ఆసుపత్రి సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేక టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ముషీరాబాద్ నియోజకవర్గంలో బైబిల్ హౌస్, డీబీఆర్ మిల్లు, గగన్మహల్లతో పాటు ముషీరాబాద్, భోలక్పూర్లలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సిన్‌ను కూడా అందిస్తున్నారు. ► ముఖ్యంగా భోలక్‌పూర్, ముషీరాబాద్ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పాటు ముషీరాబాద్ ప్రధాన రహదారిలో ఉండడంతో ఇక్కడ రద్దీ అధికంగా ఉంది. ► ముషీరాబాద్, భోలక్‌పూర్ కేంద్రాలకు రోజుకు సగటున సుమారు టెస్టులకు, వ్యాక్సిన్‌కు 300 మందికి పైగా హజరవుతున్నారు. ► టెస్టుల కోసం వచ్చే వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తమ సీరియల్ నెంబర్ వచ్చే వరకు సుమారు గంట పాటు ఆవరణలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ► అలాగే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆరగంట పాటు ఎటువంటి రియాక్షన్ లేదని నిర్థారణ అయ్యే వరకు అక్కడ వేచిచూడాల్సి ఉంటుంది. దీనితో ఆ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి.... ► టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చే బాధితులు, వారికి సహయకులుగా వచ్చే వారు క్యూ లైన్, భౌతిక దూరం పాటించే విధంగా ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులు టీం లను ఏర్పాటు చేసి రోగులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ► దీనికి తోడు మహిళలకు టాయిలెట్ సౌకర్యం, టెస్టులు, వ్యాక్సిన్ అందించే ఆరోగ్య కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ( చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని ) -
కేక్ కోసం చొంగ కార్చుకున్న పాక్ మంత్రి, వైరల్
ఇస్లామాబాద్: భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్యతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఇటీవల నిర్మించిన రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఖురేషీ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒక పెద్దకేకును కట్ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు. దీంతో కారక్రమానికి హజరైనవారు కేక్ ముక్క కోసం ఎగబడ్డారు. వారిలో ఏఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాస్కు ధరించిన మంత్రి ఖురేషీ కూడా కేక్ కోసం అర్రులు చాచాడు. తన నోటికి మాస్కు ఉందన్న సంగతి మరచి.. కేక్ తినేందుకు ఆరాటపడ్డాడు. మంత్రిగారి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ నాయ్లా ఇనాయత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఖురేషీ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పదవిలో ఉండి ఇవే పిల్ల చేష్టలు అని తిట్టిపోస్తున్నారు. చదవండి: భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు! -
ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ లేదు
లండన్: ఏటా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏదో ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా సంవత్సరమంతటా ప్రాచుర్యం పొంది, ప్రజల నోళ్లలో నానిన పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నం. ఈ ఏడాది భాష చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్. ఈ పదం కారణంగా కోవిడ్, లాక్డౌన్, సోషల్ డిస్టన్స్, రీఓపెనింగ్ వంటి పదాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దీంతో ఒకే పదాన్ని ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించలేమని చెప్పింది. నెలల వారీగా చూస్తే పలు పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జనవరిలో బుష్ఫైర్, ఫిబ్రవరిలో అక్విట్టల్, మార్చి నుంచి మే వరకు కోవిడ్–19, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, రీఓపెనింగ్ వంటి పదాలు ముందు వరుసలో నిలిచాయి. జూన్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఆగస్టులో మెయిల్–ఇన్, బెలాసరుసియన్, సెప్టెంబర్‌లో నెట్ జీరో, అక్టోబర్‌లో సూపర్ స్ప్రెడర్ పదాలు ప్రాచుర్యం పొందాయి. -
భార్యాభర్తలకూ భౌతికదూరం తప్పదు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, సుదీర్ఘకాలంపాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో అయినా, బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది. అంటే వారు లైంగిక సంబంధాలు కొనసాగించరాదని పరోక్షంగా స్పష్టం చేసింది. ఒకే కప్పు కింద నివసిస్తున్న భార్యాభర్తలు, సహజీవనం సాగిస్తున్న జంటలు ఇంటా బయట భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, వారు లైంగిక సంబంధాలు కొనసాగించవచ్చని పేర్కొంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బయటకు వెళ్లినప్పుడు పాటించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగం రిత్యా, లేదా మరే ఇతర కారణాల వల్లనో వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు, సహజీవన జంటలు ఇంటా బయట కలసుకున్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను లైంగికంగా కలుసుకోరాదని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇది తమ ప్రైమసీ హక్కులకు భంగం కలిగించడమేనంటూ వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కొత్తగా విధించిన ఆంక్షలు ఎంతవరకు సబబంటూ ప్రభుత్వ వర్గాలను ప్రశ్నించగా, సమాజంలో ఇప్పటికీ కరోనా వైరస్ వేగంగా విజంభిస్తోందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా నివారించేందుకే ఈ నిబంధనలంటూ ప్రభుత్వ వర్గాలు సమర్థించాయి. -
‘ఇలా అయితే కరోనా గొలుసు తెంచలేం’
సాక్షి, న్యూఢిల్లీ: మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి గొలుసును తెంచడం చాలా కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. హెల్త్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన... ఇప్పటికీ చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించలేదని అన్నారు. అలా అయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్ వర్క్‌ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అన్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ -
వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది
కొన్ని జంతువులు చేసే పనులు మనుషులను అశ్చర్యపరచడంతోపాటు ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న కుక్కపిల్ల ఓ పార్కులో తెలివిగా చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ‘వెల్కమ్ టూ నేచర్’ అనే ట్వీటర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఈ చిన్న కుక్క పిల్ల చాలా సీరియస్‌గా సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ.. పార్క్‌లో తిరుగుతోంది’ అని కాప్షన్ జతచేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఒక లక్ష మంది వీక్షించగా, 13 వేలమంది లైక్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వైరస్ నియంత్రణకు సామాజిక దూరం నిబంధన పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతమంది ఆకతాయిలు ఎటువంటి సామాజిక దూరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన సంఘటనలను మనం చాలానే చూశాం. అయితే వైరస్‌పై ఎలాంటి అవగాహన లేని ఓ చిన్న కుక్క పిల్ల సామాజిక దూరం పటించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘క్యూట్ ఉన్న కుక్కపిల్ల చేస్తున్న పని చాలా గొప్పది’, ఆ కుక్క పిల్ల మనుషుల కంటే చాలా స్మార్ట్‌గా ఉంది. అలా ఉండటం దానికే మంచిది’’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్కపిల్ల సామాజిక దూరం నిబంధనను పాటిస్తున్న తీరును చూస్తే మనుషులు కచ్చితంగా పాటిస్తారని చెప్పగలను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
కుక్క పిల్ల చాలా తెలివైంది
-
ఇలా చేస్తే 2 లక్షల మరణాలు నివారించవచ్చు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ని తుదముట్టించే వ్యాక్సిన్ ఏది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి పాటిస్తే.. వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే సంగతి అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన మోడలింగ్ అధ్యాయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కఠినంగా పాటిస్తే.. 2020 డిసెంబరు నాటికి భారతదేశంలో రెండు లక్షల కరోనా మరణాలను నివారించవచ్చని తెలిపింది. కేసుల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని అధ్యాయనం వెల్లడించింది. అంతేకాక భారత్ లాంటి అధిక జనాభా కల దేశంలో మహమ్మారి విజృంభణ ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయలేం కాబట్టి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి ఇండియాలో అత్యవసరమని అధ్యాయనం స్పష్టం చేసింది. (చదవండి: 69% మందికి లక్షణాల్లేవ్..!) ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని పట్టణాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి మంచి ఫలితాలిచ్చాయంది. ఈ అధ్యాయనం ప్రకారం భారతదేశంలో ఆగస్టు నాటికి కరోనా మరణాల సంఖ్య 60 వేల పై చిలుకు ఉండగా.. డిసెంబరు, 2020 నాటికి 2,91, 145 మంది కోవిడ్ బారిన పడి మరణిస్తారని మోడలింగ్ అధ్యాయనం అంచాన వేసింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. -
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు. (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు) దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’) -
మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్ 4.0లో భాగంగా వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు మెట్రో అధికారులు. ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సమావేశం అయ్యి చర్చించారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. (చదవండి: కోవిడ్-19 : దీదీ కీలక నిర్ణయం) అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్లో ఉంటారని.. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తారని సమాచారం. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఇతర రవాణా మార్గాలను అనుమతిస్తున్నారు కానీ మెట్రో మాత్రం ప్రారంభం కాలేదు. దీని ద్వారా ప్రతి రోజు ఢిల్లీలో 2.4 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. -
26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి
లండన్: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫార్డ్ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మహిళల్లో ముప్పు తక్కువకి కారణమిదే ! ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. అదే విధంగా కరోనా వైరస్ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్ అడ్డుపడు తుందని, దీం తో వైరస్ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లియాన్నె గ్రోబన్ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
కరోనా: వైద్య నిపుణుల హెచ్చరికలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం తదితర జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడం ముందుకు సాగడమే ప్రస్తుతం మన ముందున్న మార్గం. అయితే మాస్కులు పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ, చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కు ఉందనే ధీమాతో ఎదుటి వ్యక్తులకు చేరువగా ఉండటం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కరోనా వైరస్ తన రూపం మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతున్న వేళ.. మనిషికి, మనిషికీ మధ్య ఆరు ఫీట్ల కంటే ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు బీఎంజే అనే మెడికల్ జర్నల్‌లో అంటువ్యాధి నిపుణులు పలు కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం) కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ ఇండోర్లు, వెలుతురు తక్కువగా ఉండే చోట్ల ఆరడగుల కంటే ఎక్కువ దూరం పాటించాలని సూచించారు. మాస్కు ధరించడం, బయట తిరుగుతున్న సమయం, జన సమూహ సాంద్రత, తదితర అంశాలు వైరస్ వ్యాప్తిలో ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి వర్జీనియా టెఖ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లిన్సే మార్ మాట్లాడుతూ.. ‘‘ఆరు ఫీట్ల దూరం పాటించడం బాగానే ఉంటుంది. అయినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేం’’అని అభిప్రాయపడ్డారు. కాగా గాలి ద్వారా సోకే ఏదేని వైరస్ కణాలు కనీసం ఆరడగుల దూరం వరకు వ్యాప్తి చెందగలవని జర్మన్ బయోలజిస్టు కార్ల్ ఫ్లగ్ దాదాపు 200 ఏళ్ల క్రితం( 1800ల్లో) ఓ పరిశోధనలో భాగంగా వెల్లడించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ విషయంపై పరిశోధనలు సాగించిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయన వాదనతో ఏకీభవించలేదు.(చదవండి: కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ సెంటర్లు కనీసం ఆరు ఫీట్ల దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కనీసం ఒక మీటర్ లేదా మూడడుగులు దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో కేవలం ఒకటిన్నర మీటర్లు(5 ఫీట్లు), మరికొన్ని దేశాల్లో ఆరున్నర ఫీట్ల దూరం పాటించాలని నిబంధనలు విధించాయి. ఇక ముఖానికి మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్న ప్రజలంతా తమకు కరోనా సోకదనే ధీమాతో ఉన్నట్లు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సామాజిక లేదా భౌతిక దూరం పాటించడానికి సుముఖంగా లేరని సర్వేలో తేలింది. దీంతో కరోనా వైరస్ రెండోసారి గనుక దాడి చేసినట్లయితే ప్రజలను భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కరోనా పై జనాల్లో అతిభయం
-
మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, కేంద్రం నిర్దేశించిన మేరకే జనం హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. మంత్రులు, అధికారులు ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదని, కేంద్ర నిబంధనలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వందలాది మంది ఆయా సమావేశాల్లో పాల్గొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. ఈ మేరకు 120కి పైగా వీడియోలను ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలు పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి చెందుతోందని, మంత్రులు, అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
దక్షిణ కొరియాకు షాక్.. భారీగా కేసులు
సియోల్: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వెల్లడించిన దక్షిణ కొరియాలో తాజాగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సియోల్ ప్రాంతంలో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సగం జనాభా అనగా సుమారు 51 మిలియన్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. శనివారం ఇక్కడ 166 కొత్త కరోనా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 11 నుంచి చూస్తే.. ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. శుక్రవారం 103 కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులలో 11 మినహా మిగిలినవి లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల సంక్రమించాయని.. అవి కూడా చాలావరకు సియోల్ ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..) దక్షిణ కొరియాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 15,039 కేసులు నమోదు కాగా 305 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా వెలుగు చూసిన కేసులలో 155 స్థానికంగా నమోదయ్యాయన్నారు అధికారులు. ఇవన్ని కూడా ఎక్కువ జనసాంద్రత కల్గిన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నమోదయ్యయని తెలిపారు. ఈ ప్రాంతంలో వేలాది చర్చిలను మూసివేయలేదు. దాంతో వైరస్ వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా నిలిచాయి. చర్చి నిర్వహకులు కరోనా నివారణ చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యారంటున్నారు అధికారులు. ఆరాధకులు మాస్క్ తీసేసి ప్రార్థనల్లో పాల్గొనడమే కాక.. పాటలు పాడే సమయంలో, భోజన సమయంలో గుంపులుగా చేరడం, మాస్క్ ధరించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్నారు అధికారులు. అంతేకాక నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, బహిరంగ మార్కెట్లు, డోర్ టూ డోర్ సేల్స్ పర్సన్ల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. (ఏంటి డాక్టర్ ఇదీ..) నేడు దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం. యుఎస్, సోవియట్ దళాలు కొరియాపై దశాబ్దాలుగా ఉన్న జపాన్ ఆక్రమణను ముగించిన రోజు కాబట్టి దక్షిణ, ఉత్తర కొరియా రెండింటిలోనూ ఆగస్టు 15న ప్రతి సంవత్సరం పండుగలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించారు. అయితే నిర్వహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో సామాజిక దూరం అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన నియమాలు అమలు చేస్తుందని భావిస్తున్నారు జనాలు. -
ఆశా జీవులు
సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ముందు వరుసలో ఉండి కరోనా వ్యాప్తి నిరోధానికి పాటు పడినన్నాళ్లూ ఆశా వర్కర్లను పిలిచి కిరీటం పెట్టని ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు వాళ్లు తమ గౌరవ వేతనాన్ని కనీసం పదివేల రూపాయలకైనా పెంచాలని కోరుతూ నిరసనకు కూర్చుంటే.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తోంది! ఢిల్లీలో ఆశా వర్కర్లు జూలై 21 నుంచి ధర్నాలో ఉన్నారు. వారిలో కొందరు బుధవారం జంతర్ మంతర్ దగ్గర భైఠాయించినప్పుడు సుమారు 100 మంది ‘ఆశా’ జీవులపై పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు! ఆశా వర్కర్లు ప్రస్తుతం 4 వేల రూపాయల వేతనానికి మోయలేని సేవలే అందిస్తున్నారు. ఇంకో ఆరువేలు పెంచాలని, పి.పి.ఇ. కిట్లు ఇవ్వాలని వారి డిమాండ్. విజ్ఞప్తిని డిమాండ్ వరకు ప్రభుత్వమే తెచ్చుకుంది. తిరిగి ప్రభత్వమే ఇప్పుడు వారిపై కేసులు పెడుతోంది. ఆశావర్కర్ల ఢిల్లీ కో ఆర్డినేటర్ కవితా యాదవ్ మాత్రం ఈ కేసుల గురించి కన్నా పెరుగుతున్న కరోనా కేసుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీని కరోనాకు వదిలి పెట్టామే అని అపరాధ భావన వాళ్లను నిలువనిచ్చేలాను, కూర్చోనిచ్చేలానూ లేదు.‘ప్రభుత్వానికి లేకుంటే మాకు ఉంటుంది కదా’ అని సేవలకు పునరంకితం అయేందుకు తన సేనను సమాయత్తం చేసున్నారు కవిత. -
జిమ్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్ ఫూల్లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి... (లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు) 1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది. 2. జిమ్ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు. 3. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. 4. యోగా సెంటర్, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి. 5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి. 6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్, యోగా సెంటర్ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు. -
నేడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక భేటీ
-
‘ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’
రియాధ్: కరోనా వైరస్ మన జీవితాలను తారుమారు చేసింది. ఓ పండగ లేదు.. వేడుక లేదు. కనీసం ఎవరైనా మరణిస్తే.. చూడ్డానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేస్‌లలో లాక్డౌన్ విధించాయి. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కా వెళ్లాలనుకుంటాడు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా హజ్ యాత్రకు అటంకం ఏర్పడింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఏటా దాదాపు 2.5 మిలయన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10 వేలకు మాత్రమే పరిమితమయినట్లు అల్ జజీరా తెలిపింది. వీరిని కూడా 50 మంది చొప్పున మాత్రమే కాబా దర్శనానికి అనుమతిస్తోన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కాబా చుట్టు తిరగాలని ఆదేశించింది. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను మహ్మద్ అలీ హరిస్సి అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ‘ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యం కానీ దృశ్యాలు.. కరోనా హజ్ యత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే అర్థమవుతోంది’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటల్లో యాత్రికులంతా రంగురంగుల గొడుగులు పట్టుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కాబా చుట్టూ తిరుగుతున్నారు. వీరందరిని ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక ప్రతి రోజు ఈ మసీదును శుభ్రం చేయడానికి దాదాపు 35 వేల మంది పని చేస్తున్నారని తెలిపింది. మసీదును శానిటైజ్ చేయడం కోసం 54 వేల లీటర్ల క్రిమి సంహారక మందును, 1050 లీటర్ల ఎయిర్ ఫ్రెషనర్‌ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) Unbelievable scenes from Mecca today! Historic Hajj amid the threat of coronavirus. @AFP has amazing colorful photos on a very, very sunny day! pic.twitter.com/0RvTVwGWtd — Mohamad Ali Harissi (@aleeharissi) July 29, 2020 గతంలో రోజుకు రెండు, మూడు సార్లు మసీదును శుభ్రం చేస్తుండగా.. ప్రస్తుతం పది సార్లు క్లీన్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం. కరోనా నేపథ్యంలో ఈసారి యాత్ర జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. -
హైదరాబాద్: నిరాడంబరంగా గణేష్ ఉత్సవాలు
-
భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
-
‘కరోనా ఎక్కడైనా ఉండొచ్చు’
జెనీవా: ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనకునే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని.. తమకు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియా వంటి దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచనలు చేసింది. ‘కరోనా వైరస్ ఎక్కడైనా ఉంటుంది.. ప్రతి చోటా ఉంది. ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ప్రజలు దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి’ అని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ కోరారు. ‘కరోనా నియంత్రణ కోసం పలు దేశాలు ఇప్పటికే ఒక సారి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. కొన్ని దేశాలు మరో సారి లాక్డౌన్ అమలు గురించి ఆలోచిస్తున్నాయి. ప్రజలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాల గురించి నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు మార్గరెట్. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా, హంగ్‌కాంగ్ దేశాలు మరో సారి లాక్డౌన్ విధించాయి. మంగళవారం ఆస్ట్రేలియాలోని రెండవ అతిపెద్ద నగరం మెల్బోర్న్లో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. అత్యవసరమైన వ్యాపారాలకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచనలు చేసింది.(కోవిడ్-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!) అంతేకాక గతంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం డబ్ల్యూహెచ్ఓ పలు మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడంతో, కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదంటూ పలు సూచనలు చేసింది. అంతేకాక ప్రస్తుతం ప్రయాణం చేయాలనుకునే వారు సామాజిక దూరాన్ని పాటించడమే కాక తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మార్గరెట్ సూచించారు. వీటితో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. -
పెళ్లైన 2 రోజులకే వరుడు మృతి, 95 మందికి..
పట్నా : కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించి మరి ఇటీవల ఓ జంట కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతిచెందాడు. దీంతో అసలు విషయమంతా బయటపడింది. పెళ్లికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకెళితే... బిహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా జూన్ 15న వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక జరిగిన రెండు రోజులకు వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. (కరోనా: భారత్‌లో కొత్తగా 18,522 పాజిటివ్ కేసులు) వరుడు మరణించడంతో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు అతడి దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధులవులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలగా అతిథులందరికీ పరీక్షలు చేశారు. వీరిలో సోమవారం 80 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పెళ్లికి హాజరైన వారిలో 95 మంది కరోనా బారిన పడినట్లు రిపోర్టులు వెలువడగా పెళ్లి కూతురుకి మాత్రం నెగిటివ్ వచ్చింది. (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్) ఇక ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మంది మాత్రమే వివాహానికి హాజరవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వివాహ వేడుక జరిగిందన్నారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించకపోవడం వల్లే ఇన్నీ కేసులు వెలుగు చూశాయని అన్నారు. కాగా రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా) -
షూటింగ్లో సామాజిక దూరం కష్టమే!
రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో చిత్రీకరణలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం కరోనా ప్రభావ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు షూటింగ్స్‌కి వెళ్లకపోవడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్లో మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను హీరోయిన్ నిత్యామీనన్ ముందుంచితే– ‘‘ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఈ ఏడాది చివరి వరకు నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. కానీ కరోనా వల్ల సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో షూటింగ్స్‌లో పాల్గొనకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే మాట్లాడుకోకుండా, చర్చించుకోకుండా వర్క్ చేయడం సినిమాల్లో కష్టం. అలాగే లొకేషన్లో సామాజిక దూరం పాటించడం అనే అంశం కూడా ఆచరణలో విజయవంతంగా కుదరకపోవచ్చు. అందుకే సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు నాకేం తొందరలేదు. కానీ ఒకటి రెండు రోజులు షూటింగ్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందంటే అప్పుడు నేను షూటింగ్లో పాల్గొంటాను’’ అని పేర్కొన్నారు. అలాగే తాను ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నానని కూడా నిత్యామీనన్ వెల్లడించారు. ఆశ చాలా ప్రమాదరకం: హీరోయిన్ నిత్యా మీనన్ నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’. ఇది బ్రీత్ సిరీస్‌లో రెండోవది. ఇందులోని నిత్యామీనన్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘ముమ్మ అంత త్వరగా వదిలి పెట్టదు. సియా దొరుకుతుంది. ఆశ అనేది చాలా ప్రమాదరకరమైనది. జూలై 1న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. జూలై 10న ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ స్ట్రీమ్ అవుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యామీనన్. -
ఇలాగైతే ఎలా?
కర్ణాటక రాష్ట్రం హవేరీ పోలీసులు 69 మంది మీద ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, 1897’ చట్టాల కింద కేసులు పెట్టారు. వాళ్లందరూ ఒక ఊరి వాళ్లే. వారంతా ఊరి పండుగ చేసుకోవడానికి గుమిగూడారు. హవేరీ జిల్లా కర్జగి గ్రామంలో ఏటా జరిగే ‘కరా హున్నిమే’ ఉత్సవానికి యాభైవేల మంది హాజరవుతారు. ఎన్నోఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ‘ఎన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమైనప్పటికీ ఈ ఏడాది అన్ని ఏడాదుల వంటిది కాదు. ఉత్సవాలను పక్కన పెట్టండి’ అన్నారు పోలీసు అధికారులు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. దాంతో నిర్వహకులు ఇటు భక్తుల విశ్వాసాలకు, కోవిడ్ నిబంధనలకు మధ్య ఒక మధ్యే మార్గాన్ని ఆశ్రయించారు. బ్రహ్మ లింగేశ్వరుడికి పూజలన్నీ యధావిధిగా జరుగుతాయి. ఎడ్లబండి ఊరేగింపు మాత్రం అతి కొద్దిమందితో నామమాత్రంగా నిర్వహించాలనుకున్నారు. ఆనవాయితీని కొనసాగించడం మాత్రమే జరుగుతుంది. వేడుక కాదు, కాబట్టి ఎవరూ పాల్గొనవద్దని ఊరంతటికీ చెప్పారు. విన్నట్లే తలూపారందరూ. గురువారం (11–06–2020) సాయంత్రం ఊరేగింపు మొదలవగానే జనం నేల ఈనినట్లు పోగయ్యారు. నిర్వహకుల మాట వినేవాళ్లు ఒక్కరూ లేరు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. భౌతిక దూరం పాటించలేదు, మాస్కులు ధరించనూ లేదు. మరీ ఈ రకంగా నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవడం కుదరదని తేల్చి చెప్పేశారు పోలీసులు. నిర్వాహక కమిటీసభ్యులతోపాటు మరికొందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. ఇది విశ్వాసాలకు విఘాతం కలిగించడం కాదు, సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే. -
సామాజిక దూరంతోనే ఆత్మహత్యలు!
సాక్షి, న్యూఢిల్లీ : వర్ధమాన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అంతకుముందు మే 19వ తేదీన సూరత్‌లో చిక్కుకు పోయిన అస్సామీ కార్మికుడొకరు ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 16వ తేదీన ఢిల్లీలో కూరగాయల అమ్ముకుంటూ బతుకుతున్న 40 ఏళ్ల వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో జరగుతుంటాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో సినిమా యాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ క్రీడాకారులతోపాటు సామాన్య మానవులు ఉన్నారు. అవన్నీ ‘మానసిక కారణాల’తో చేసుకున్న ఆత్మహత్యలని వైద్యులు సులువుగా తేల్చి పారేస్తారు. లేదా సామాజిక–ఆర్థిక ఒత్తిడి అని కూడా కొందరు వైద్య నిపుణులు తేలుస్తున్నారు.(సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు) ఆత్మహత్యలన్ని కూడా సమాజంతో ముడి వడి ఉన్నవే. సామాజిక గమనాన్ని తెలియజేసేవే. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయీ ఆత్మహత్య చేసుకోవడం వెనక కూడా సామాజిక కోణమే ఉంటుంది. సహజంగా సమాజం ఒప్పుకోదన్న కారణంగానే ఆ యువతిగానీ యువతిగానీ ఆ ప్రేమకు ఒప్పుకొని ఉండకపోవచ్చు. ‘ఎలా చావాలన్నది కూడా వినియోగదారుడి ఎంచుకునేదే’ అని ‘డైయింగ్ ఆఫ్ లోన్లీలెస్’ పుస్తకంలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త నార్బట్ ఇలియాస్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒంటరితనం అంటే సమాజం తనను ఒంటరిని చేసిందనే భావనే. ఆ భావనే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. ఉపాధి కోల్పోయిన వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆదుకోవాల్సిన సమాజం అతన్ని ఒంటరని చేసిందన్న భావమే, మరో విధంగా చెప్పాలంటే సామాజిక దూరమే ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్లయితే సానుభూతి చూపించే సమాజం, ఆ చావుకు తాము కూడా బాధ్యులమనే విషయాన్ని గ్రహిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని ‘లివింగ్ అండ్ డైయింగ్’ పుస్తకం రాసిన సామాజిక శాస్త్రవేత్త దేవ్నాథ్ పాఠక్ సూచిస్తున్నారు. (కరణ్ నంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేస్తే..) -
ఆనంద్ మహీంద్ర ట్వీట్ : మద్యం డెలివరీ
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తిరమైన ట్వీట్ ను షేర్ చేశారు. కరోనా వైరస్, లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో మద్యం షాపు యజమాని భౌతిక దూరాన్ని పాటిస్తున్న వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న ఈ వినూత్నఆలోచనకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఇపుడు ఈ వీడియో నెట్లో చక్కర్లు కొడుతోంది. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్) మద్యం షాపులో మద్యం అమ్మేందుకు యజమాని ఒక టెక్నిక్ ను ఎంచుకున్నారు. దాదాపు 5 అడుగుల దూరం వుండేలా జాగ్రత్తపడుతూ ఒక గొట్టం, తాడు ద్వారా భౌతిక దూరాన్ని పాటిస్తున్న వైనం ఆకర్షణీయంగా నిలిచింది. అంతేకాదు దుకాణం చుట్టూ కర్టెన్ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం. మద్యం కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి, షాపు యజమాని ఏర్పాటు చేసిన గొట్టంలో ఉండే ఒక బాటిల్ లో డబ్బులు ఉంచాలి. అపుడు యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా బాటిల్ ను వెనక్కు లాగి అందులోని డబ్బు తీసుకుంటారు. అనంతరం వారికి కావాల్సిన దానిని అదే గొట్టంలోంచి కిందికి వదులుతారు. అలా వారి లావాదేవీ పూర్తవుతుందన్నమాట. కరోనా విస్తరణ భయంతో వ్యాపారులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులకు నగదు లావాదేవీల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. గతంలో ఒక బ్యాంకు ఉద్యోగి కి సంబంధించిన వీడియోను కూడా ఆనంద్ మహీంద్ర తన ఫాలోయర్ల కోసం షేర్ చేసిన సంగతి తెలిసిందే. This clip’s been circulating for a bit. Clever,but crude,so it points to an opportunity for aesthetic ‘contactless’ storefront design. The future is Bluetooth-enabled shelf-browsing+chute-enabled cash exchange & delivery to your waiting hands/car. @PininfarinaSpA @tech_mahindra pic.twitter.com/gGF2jUYs7l — anand mahindra (@anandmahindra) June 14, 2020 -
లాక్డౌన్ ఉల్లంఘన; ఎమ్మెల్యేపై కేసు నమోదు
సాక్షి, బళ్లారి: కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ నియమాలను గాలికి వదిలి కుమారుడు పెళ్లి ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి, హడగలి ఎమ్మెల్యే పీటీ పరమేశ్వర్ నాయక్‌పై కేసు నమోదు చేశారు. సోమవారం హడగలి తాలూకా లక్ష్మీపురలో తన కుమారుడు అవినాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం చేరారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ పరమేశ్వర హెలికాప్టర్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. హెలికాప్టర్ రాకను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి లాక్డౌన్ నియమాలను గాలికి వదిలి గుమిగూడారు. దీంతో పాటు వివాహ వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీ.శ్రీరాములుతో పాటు పలువురు శాసససభ్యులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా వేసుకోవాలని నిబంధనలు ఉన్నా పెళ్లిలో అలాంటి సన్నివేశాలు కనిపించకపోవడంతో పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. 50 మంది కన్నా ఎక్కువ మంది పెళ్లికి హాజరు కాకూడదని నిబంధనలు ఉండటంతో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చేసుకోమంటే.. నగ్న ఫోటోలతో బయపెడుతూ.. -
కరోనా కట్టడిలో అతి ముఖ్యమైనది అదే..
వాషింగ్టన్ : ఫేస్ మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టన్స్..కరోనాకు ముందు పెద్దగా పరిచయం లేని పేర్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా నుంచి అమలాపురం దాకా పట్టణాల నుంచి పల్లెల దాకా ఇప్పుడు అందరికీ సుపరిచతం అయ్యాయి. వీటి వాడకం కూడా బాగా పెరిగింది. దాదాపుగా అన్ని కరోనా ప్రభావిత దేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రంచడంలో ఫేస్ మాస్క్ చాలా ముఖ్యమైందంటూ తాజాగా అమెరికా పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఈ నిబంధన లేకపోతే కరోనా కేసులు మరిన్ని పెరిగేవని తెలిపింది. స్టే ఎట్ హోమ్, సోషల్ డిస్టన్స్ కంటే ఫేస్ మాస్క్ ద్వారా వైరస్‌ను ఇతరులకు సోకకుండా రక్షిస్తుందని ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీలో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. (మరోసారి లాక్డౌన్ దిశగా చైనా..! ) ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఏప్రిల్ 6 న ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పరిశోధనలో తేలింది. ఏప్రిల్ 17న న్యూయార్క్‌లోనూ ఫేస్ మాస్క్ తప్పనిసరి చేయడం ద్వారా 66,000 వేల కేసులు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నిబంధన ద్వారా న్యూయార్క్‌లో ఇన్ఫెక్షన్ల రేటు రోజుకు సుమారు 3 శాతం తగ్గినట్టు తెలిపారు. కరోనా వల్ల అత్యధిక మరణాలు చోటుచేసుకున్న ఇటలీలోనూ పేస్ మాస్క్ కారణంగా 78,000 వేల కరోనా కేసులు తగ్గాయని వివరించారు. ఇటలీ,న్యూయార్క్ నగరాల్లో ఫేస్ మాస్క్ నిబంధనల కంటే ముందు క్వారంటైన్, సోషల్ డిస్టన్స్ లాంటివి అమల్లో ఉన్నాయని అవి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కేసులు పెరగకుండా మాత్రమే ఇవి నియంత్రంచగలిగాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే గాల్లో కొన్ని గంటల పాటు నిలిచి ఉండే వైరస్ కణాలతో ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ఫేస్ మాస్క్ దీని నుంచి రక్షిస్తుందని పేర్కొంది. (అమెరికాలో సిక్కు యువతి అరుదైన ఘనత ) -
భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్, ప్రభుత్వం చేపట్టిన ఇతర నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. దేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు ఈ సర్వేలో తేలిందని కేంద్రం గురువారం తెలియజేసింది. అయితే, కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్ ఇంకా చేరుకోలేదని తేల్చిచెప్పింది. ఈ సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి. మొదట సాధారణ జన సమూహంలో సార్స్–కోవ్–2 వైరస్ వ్యాప్తి తీరును పరిశీలించారు. రెండో భాగంలో కంటైన్మెంట్ జోన్లు, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎవరెవరు ఈ మహమ్మారి బారినపడ్డారో గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. రెండో భాగం సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖలు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) భాగస్వామ్యంతో మే నెలలో దేశవ్యాప్తంగా సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు. ► మొత్తం 83 జిల్లాల్లో 28,595 ఇళ్లల్లోని 26,400 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ► ఇప్పటిదాకా 65 జిల్లాల సర్వే ఫలితాలను క్రోడీకరించారు. ఈ జిల్లాల్లో 0.73 శాతం జనాభా సార్స్–కోవ్–2 వైరస్ ప్రభావానికి గురైనట్లు తేలింది. ► దేశంలో కరోనా వేగానికి అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్ కేసులను తగ్గించడంలో లాక్డౌన్, కంటైన్మెంట్ చర్యలు బాగా తోడ్పడ్డాయి. ► గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా ముప్పు పట్టణ ప్రాంతాల్లో 1.08 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధికం. ► పట్టణ మురికివాడల్లో లాక్డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశం ఉన్న గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక్కరోజులో 357 మరణాలు 24 గంటల్లో 9,996 కేసులు మొత్తం కేసులు 2,86,579 మరణాలు 8,102 ఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం నానాటికీ ఉధృతమవుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తొలిసారిగా 300 మార్కును దాటేసింది. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలోనే 9,996 కేసులు బయటపడ్డాయి. 357 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,86,579కు, మరణాలు 8,102కు చేరాయి. రెండో రోజు కూడా యాక్టివ్ కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండడం కొంత సానుకూల పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,37,448 కాగా, 1,41,028 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 49.21 శాతంగా నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత భారత్ ఐదో స్థానానికి చేరింది. దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు, అనుమానితులు వెంటనే రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అధికారుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందాలన్నారు. -
సెప్టెంబర్ నాటికి 2 లక్షల మరణాలు!
వాషింగ్టన్: సెప్టెంబరు నాటికి కరోనా వైరస్ కారణంగా అమెరికాలో 2,00,000 మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అధినేత ఆశిష్ ఝా బుధవారం సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మొత్తం అమెరికాలో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికి 20 లక్షలను అధిగమించాయి. కఠినమైన చర్యలు పాటించకపోతే సెప్టెంబరు నాటికి మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరగనప్పటికీ, సెప్టెంబరు నాటికి 2,00,000 మంది మరణించబోతున్నట్లు ఊహించడం సమంజసం అని ఝా అన్నారు. అంతే కాక సెప్టెంబరు నాటికి మహమ్మారి తుడిచిపెట్టుకుపోదని ఆయన తెలిపారు. రాబోయే వారాలు, నెలల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా ఎక్కడ ఉండబోతుంది అనే విషయం తలుచుకుంటేనే భయంగా ఉందన్నారు ఝా. బుధవారం నాటికి అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,12,754 ఉండి ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. కరోనా కట్టడి కోసం దేశాలన్ని లాక్డౌన్ అమలు చేశాయి. కానీ అమెరికా మాత్రం కేసుల సంఖ్య తగ్గకముందే సడలింపులు ఇచ్చింది. ఫలితంగా మరణాల రేటు ఇంత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి నియమాలను కఠినంగా పాటించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఝా అభిప్రాయ పడ్డారు.(అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’) పలు అమెరికా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గకముందే సడలింపులు ఇస్తున్నారని.. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు ఝా. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం, న్యూ మెక్సికో, ఉటా, అరిజోనాలో గత వారంతో పోలిస్తే.. ఈ వారం 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని.. ఫ్లోరిడా, అర్కాన్సాస్ హాట్ స్పాట్స్‌గా మారాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే గత ఐదు వారాల నుంచి కరోనా కేసుల్లో క్షీణత కనిపించగా.. ఈ వారంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 20,03,038గా ఉన్నాయి. కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ (covidtracking.com) ప్రకారం, గత శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయి 5,45,690 పరీక్షలు జరిపారు. ఇదే కాక గత కొద్ది రోజులుగా అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ నర హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ఆందోళనకారులు ఒకే చోట గుమిగూడటం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారంతా తప్పక కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ) -
40 రోజుల్లోనే 86శాతం కేసులు
-
మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు
న్యూఢిల్లీ: గత 40 రోజుల్లో దాదాపు 86 శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. అలానే మే, జూన్ మధ్య 84 శాతం మంది రోగులు మరణించినట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించినంతవరకు మే నెల భారతదేశంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తాజా పరిశీలన ప్రకారం ఒక్క మే నెలలోనే 1,53,000 కేసులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి దేశంలో ఆంక్షలను తగ్గించడమే కాక, ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడిచిన తొమ్మిది రోజుల్లో దేశంలో 76,000 కన్నా ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. ప్రస్తుత అన్లాకింగ్ దశలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో మాల్స్, మతపరమైన ప్రదేశాలు, రెస్టారెంట్లు సోమవారం నుంచి ప్రారంభించబడ్డాయి. అధిక కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లు మినహాయించి దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు, ఇతర సంస్థలు కూడా తిరిగి ప్రారంభించారు. దేశంలో మంగళవారం నాడు దాదాపు 10,000 కేసులు నమోదయ్యి మొత్తం సంఖ్య 2.6 లక్షలను దాటింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఫలితంగా వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలను నియమించింది. ఈ బృందాలు పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తున్న జిల్లాలు, మున్సిపాలిటిల్లో పర్యటించి వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలను పరిశీలించనున్నాయి. (భయపడింది చాలు.. ఇక జాగ్రత్తపడితే మేలు!) ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అనేక దేశాలతో పోల్చితే కోవిడ్ -19 పోరాటంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని తెలిపారు. ‘సామాజిక దూరం, చేతుల శుభ్రత, మాస్క్‌లు, ఫేస్ కవర్లు వంటి నిబంధనలను కఠినంగా పాటించడం ద్వారా కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పాటిస్తోన్న సామాజిక వ్యాక్సిన్‌ను మనం మరచిపోకూడదు అని ఆయన పిలుపునిచ్చారు. కరోనా కేసుల సంఖ్యలో భారత్.. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తరువాత ఐదవ స్థానంలో నిలిచిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ గత డిసెంబరులో చైనాలో ఉద్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 71.5 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 4 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. (కొత్త అవకాశాలు తీసుకొచ్చిన కరోనా) -
భౌతిక దూరం పాటిస్తూ వెంకన్న దర్శనం
-
బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?
ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటకి మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్ డ్రైవ్ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నిహారికా కులకర్ణి ఈ ఫోటోని షేర్ చేశారు. ‘అన్లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో భారీగా జనం గుమిగూడారు’ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. View this post on Instagram Huge crowd at Marine drive in the evening. June 6, 2020. In phase 1 of unlocking, outdoor physical activities have been allowed across the state from June 3 from 5 am to 7 pm. #MarineDrive #Phase1 #unlocking1.0 #lockdown5.0 #mumbai #everydaymumbai #everydayeverywhere #indiapictures #thingstodoinmumbai #instagram #instadaily #everydayindia #india_gram #india_ig #indiaclicks #indianphotography #desi_diaries #photojournalism #gettyimages #reportagespotlight #mymumbai #insta_maharashtra #myhallaphoto #storiesofindia #_soi A post shared by Niharika kulkarni (@niharika_kulkarni) on Jun 6, 2020 at 10:44am PDT దీనిపై నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా’.. ‘మాస్క్ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు’.. ‘మెరైన్ డ్రైవ్ పేరును కరోనా డ్రైవ్‌గా మార్చాలి’.. ‘కరోనా గిరోనా జాన్తా నై’’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
దేవాలయాలు,ప్రార్ధన స్ధలాల్లో వేటిని చేతితో తాకకూడదు
-
‘2 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరి’
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నప్పటికి వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటగా... ఈ ఒక్క రోజే 8 వేల పై చిలుకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి లాక్డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం అడగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని ప్రసిద్ధ లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది. 16 దేశాలలో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. దానిలోని అంశాలు.. మాస్క్, సామాజిక దూరం అన్ని కలిస్తేనే.. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఒంటరిగా కరోనాను కట్టడి చేయలేదని.. వీటన్నింటిని పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని నివేదిక తెలిపింది. అంతేకాక వ్యాధి సోకిన వారి నుంచి మీటరు దూరం లోపల ఉన్న వ్యక్తికి వైరస్ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా.. మీటరు కంటే ఎక్కువ దూరం(2మీటర్లు)లో ఉన్నప్పుడు వ్యాప్తి కేవలం 2.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉంది. అలానే ఫేస్ షీల్డ్స్, గ్లాసెస్ వాడటం వలన వైరస్ వ్యాప్తి 5.5 శాతం తగ్గిందని.. వాడకపోవడం వల్ల 16 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మాస్క్ ఎలాంటిది అయినా పర్వాలేదు.. గుడ్డ మాస్క్‌లు, ఆపరేషన్ మాస్క్‌లు, ఎన్-95 మాస్కులు.. ఇలా ఏది వాడినా మంచిదే అని నివేదిక తెలిపింది. కాకపోతే ఎక్కువ పొరలు ఉన్న మాస్క్ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కిర్బీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రైనా మాక్ ఇంటైర్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సడలించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేయాలి. ఈ మాస్క్‌లు కూడా నీటిని పీల్చుకోని వస్త్రంతో.. ఎక్కువ పొరలు ఉన్న వాటిని వాడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం’ అన్నారు. భారత్‌ను కాపాడే అస్త్రాలు ఇవే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా వీటిని పాటించడం మాత్రం మర్చిపోవద్దన్నారు గులేరియా. (అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు) తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు.. కళ్లు, ముక్కు, గొంతు ద్వారా ప్రవేశించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని నిరూపించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని నివేదిక తెలిపింది. -
పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి సమయంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం సామాజిక దూరం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే సామాజిక దూరం పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ మనం దాని ప్రాధాన్యతను గుర్తించలేక పోతున్నాం. భారత్‌లో లాక్డౌన్ పరిమితులు సడలించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా సామాజిక దూరం ఉల్లంఘిస్తున్న సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలాంటి ప్రదేశాలలో మరింత ఎక్కువగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో గతంలో కంటే వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ నిబంధనలను పాటించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత జూన్ 1 నుంచి ఈ పరిస్థితి దారుణంగా తయారైంది. చదవండి: భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు కోల్‌కతాలో కేవలం 20మంది ప్రయాణికులతో బస్సు ప్రయాణాలకు అనుమతించగా సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం మెజారిటీ కార్యకలాపాలకు అనుమతించినప్పటికీ.. కరోనా మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసం సామాజికి దూరం నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. గత కొన్ని రోజులుగా భారత్‌లో రోజూవారీ కేసులు దాదాపుగా 8 వేలుగా నమోదవుతున్న తరుణంలో.. సామాజిక దూరం ఉల్లంఘన పెను ముప్పుగా మారనుంది. చదవండి: అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు -
భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు
సాక్షి, బెంగళూరు: కరోనా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెబుతున్నాయి. అయినా కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నవారే ఈ నిబంధనలు పాటించకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మరోసారి భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చిత్రదుర్గానికి వెళ్లిన మంత్రి శ్రీరాములుకు స్వాగతం పలకడానికి బీజేపీ కర్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆయన భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, కనీసం ముఖానికి మాస్క్ కూడా ధరించకుండా కార్యకర్తలతో కలిసిపోయారు. (మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?') అదేవిధంగా మంత్రి శ్రీరాములు తన చుట్టూ చేరినవారికి భౌతిక దూరం పాటించాలని సూచించకపోవటం గమనార్హం. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిలిగిన ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను లాక్డౌన్ నిబంధనలకు లోబడి దశల వారిగా తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3408 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంత్రి లాక్డౌన్ ఉల్లంఘన చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మంత్రి శ్రీరాములు ఇలా భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించటం ఇది రెండోసారి. -
రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా!
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ పాలకవర్గాలు కఠినంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త పారవేస్తే.. బాధ్యులకు రూ.500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా గ్రామీణులకు అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి శనివారం పిలుపునిచ్చారు.పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. పంచాయతీల పాలనా సామర్థ్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా.. పల్లె ప్రగతి స్ఫూర్తితో జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా.. కరోనా మహ మ్మారి పల్లె గడప తొక్కకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం–పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో తొలి రోజు సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించాలని, నీరు నిలిచి ఉన్న గుంతలను మూసివేయాలని సూచించారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి.. 8 రోజులపాటు చేయాల్సిన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దిగువ ప్రాంతంలోకి వర్షపు నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. రక్షిత నీటి పథకాలను ప్రతీ నెలా 1,11,21వ తేదీల్లో విధిగా శుభ్రపరచాలని, లీకేజీలు అరికట్టాలన్నారు. -
కరోనా కేసులింకా పెరుగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపులతో జనం రోజు వారీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటుండటంతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని, ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. శనివారం వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డితో కలిసి కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలైందని, అందువల్లే కరోనా అదుపులో ఉందన్నారు. లాక్డౌన్ లక్ష్యం కరోనాను నిర్మూలించడం కాదని, ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టడం కోసమన్నారు. దీర్ఘకాల లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టమని, అందుకే విడతల వారీగా సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలు, కేసుల నమోదు అంశాలు దాచినా దాగేవి కావన్నారు. అవసరం ఉన్న వారికే నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేలకుపైగా పరీక్షలు చేశామని, 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ కట్టడికి మూడు సూత్రాలు పాటించాలని జి.శ్రీనివాసరావు సూచించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి పాటిస్తే కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకున్నట్టేనన్నారు. రాష్ట్రంలో కేసుల నమోదు తీరును పరిశీలిస్తే.. జనసమూహాలు ఏర్పడిన చోటే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఒడిబియ్యం, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాల వల్లే ఒకే కుటుంబానికి చెందిన పలువురు వైరస్ బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ గెలిచిందని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం సాధిస్తామన్నారు. భవిష్యత్తులో ఊపిరితిత్తులపై ప్రభావం: రమేష్‌రెడ్డి కరోనా వైరస్ నుంచి బాధితుడు కోలుకున్నా.. దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవని వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డి చెప్పారు. వైరస్ ప్రభావం ఊపిరి తిత్తులపై ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత అది బయటపడొచ్చన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చికి త్స చేసే క్రమంలో వెంటిలేటర్ అవసరం చాలా తక్కువన్నారు. 5శాతం మందికి మాత్రమే ఇది వాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. లాక్డౌన్ సడలింపులతో కేసుల తీవ్రత పెరుగుతుందని ముందే ఊహించామని, ఇందులో భాగంగా వసతులు, సౌకర్యాలు కల్పించి ఎక్కువమందికి చికిత్స అందేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 170 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని, కింగ్‌కోఠి ఆస్పత్రి, టిమ్స్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చికిత్స చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్న 7రోజుల తర్వాత బాధితుడి నుంచి మరొకరికి వైరస్ సోకదని, తొమ్మిదో రోజు అతడిలో వైరస్ కణాలు నశిస్తాయన్నారు. -
ఆరు అడుగుల దూరం సరిపోదు
కాలిఫోర్నియా: 'చికిత్స కన్నా నివారణ మేలు' అనే మాట కరోనాకు సరిగ్గా సరిపోతుంది. మందు లేని ఈ మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షగా నిలుస్తాయి. అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్కు ధరించడం, మరీ ముఖ్యంగా ఆరడగుల భౌతిక దూరం పాటించడం. అన్నీ సరే కానీ.. ఆరడుగుల దూరం కరోనాను నిలువరించలేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు కరోనా వైరస్ కణాలు సుమారు 20 అడుగుల దూరం వరకు ప్రయాణించవచ్చని హెచ్చరిస్తున్నారు. సాంత బర్బరాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు) వైరస్ వ్యాప్తిని నిర్దేశించే వాతావరణం! ఈ అధ్యయనం ప్రకారం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడే సమయంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీటర్ల మేర వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువులను అధ్యయనకారులు రెండు రకాలుగా విభజించారు. పెద్ద పరిమాణంలో ఉండే స్థూల కణాలు తక్కువ దూరం ప్రయాణించి అక్కడే స్థిరపడుతాయి. కానీ సూక్ష్మ కణాలు వైరస్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో పాటు కొన్ని గంటల పాటు గాలిలోనే ఉండగలవన్న విషయాన్ని వెల్లడించారు. వాతావరణంలోని మార్పులు వైరస్ వ్యాప్తిని మరింత ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సూచించిన ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళలా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చల్లని వాతావరణంలో వైరస్ కణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీటర్ల(19.7 అడుగులు) వరకు వ్యాపిస్తాయని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? ) -
ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్
సిడ్ని: కరోనా విజృంభిస్తోన్న వేళ మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడమే శ్రీరామ రక్ష అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి.. తిరిగి రాగానే తీసేస్తాం. కానీ బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన ఓ నివేదిక మాత్రం ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని చెబుతుంది. అప్పుడే మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమంటుంది ఈ నివేదిక. ఇంట్లో ఎవరికి కరోనా సోకక ముందు నుంచే మాస్క్ ధరిస్తే.. వైరస్ వ్యాప్తిని 79 శాతం.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్, ఇతర క్రిమిసంహారకాలతో శుభ్రపరిస్తే.. 77 శాతం వైరస్ వ్యాప్తిని నిరోధించగమలని సదరు నివేదిక వెల్లడించింది. కుటుంబ సభ్యుల మధ్య కనీసం ఒక మీటరు సామాజిక దూరం తప్పనిసరి అని ఈ నివేదిక తెలిపింది. కుంటుంబాల్లోనే వ్యాప్తి ఎక్కువ ఈ నివేదిక తెలిపిన దాని ప్రకారం చైనాలో ఫిబ్రవరిలో నమోదయిన క్లస్టర్ కేసులు సూపర్ మార్కెట్, పాఠశాలల నుంచి వచ్చినవి కావని.. కుటుంబాలలోనే వ్యాప్తి చెందిన కేసులని తెలిపింది. దాదాపు 1000 క్లస్టర్ కేసులను పరిశీలించినప్పుడు వాటిలో 83 శాతం కేసులు కుంటుబ సమూహాలుగా గుర్తించబడ్డాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. మాస్క్ ధరించం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించగలమన్నారు వూ జున్యూ. అయితే ఇంటిలో కూడా మాస్క్ ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించేందుకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఇంట్లో కూడా మాస్క్ ధరించడం మంచిదే అన్నారు వు జున్యూ. (‘మాస్క్ లేదా.. పొర్లుదండాలే’) చైనాలో జరిగిన మరో సర్వే కోసం బీజింగ్‌లోని 124 కుటుంబాలకు చెందిన 460 మందిని పరిశోధకులు పిలిపించారు. వీరంతా వైరస్ సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు. తమ కుటుంబ సభ్యులకు మహమ్మారి సోకిన సమయంలో ఇంటి శుభ్రత, ఇతర అంశాల ఎలా ఉండేవని పరిశోధకులు వీరిని ప్రశ్నించారు. ఈ 124 కుంటుంబాలలో.. 41 ఇళ్లలో మొదట వైరస్ సోకిన వారి నుంచి దాదాపు 77 మందికి వ్యాధి సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మిగతా కుటుంబాలలో తొలుత ఒకరికి కరోనా వచ్చినప్పటికి.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్, ఇతర క్రిమిసంహారకాలతోతో శుభ్రపర్చడం.. కిటికీలు తెరిచి ఉంచడం.. ఇంట్లోని వ్యక్తుల మధ్య కనీసం 1 మీటర్ (3 అడుగులు) సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల మిగత వారికి వైరస్ సోకలేదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాక ఇంట్లో కుటుంబ సభ్యులందరు ఒక్కచోట చేరి భోజనం చేయడం, టీవీ చూడటం వల్ల వైరస్ సోకే ప్రమాదం 18 శాతం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. (ఎందుకు రిస్క్? వేస్కోండి మాస్క్) ఇంట్లో మాస్క్.. మంచిదే అంటున్న నిపుణులు ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. అధ్యయనంలో పాల్గొనని నిపుణులు కూడా ఈ నివేదిక ప్రాముఖ్యతను గుర్తించారు. ‘ఇంట్లోనూ మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే లాక్డౌన్ సడలించిన తర్వాత బయట నుంచి ఇంటికి (ఉదా. ప్రజా రవాణా, ఆఫీసు నుంచి) వచ్చిన వ్యక్తి ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. అయితే దీని గురించి వెంటనే మనకు తెలియదు కాబట్టి మిగితా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం అధికం. కనుక ఇంట్లో కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకున్నవారం అవుతాం’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ సాలీ బ్లూమ్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.(అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్ ఈ నివేదికపై స్పందిస్తూ.. ‘ఇప్పటికే చాలా మంది వైరస్ సోకనప్పటికి కూడా ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో మాస్క్ ధరించడం చేస్తున్నారు. కోవిడ్ -19 సోకడానికి ముందే మాస్క్ ధరించడం ద్వారా ఇంటిలోని ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. వ్యాధి సోకిన తర్వాత ముసుగు ధరించడం ప్రారంభించిన వారు తమ కుటుంబాన్ని రక్షించలేకపోయారు’ అని గ్రీన్హాల్గ్ వెల్లడించారు. లండన్ యూనివర్శిటీ కాలేజీ డాక్టర్ ఆంటోనియో లాజారినో మాట్లాడుతూ.. ‘ఈ నివేదిక మంచిదే కానీ అధికారిక సిఫార్సులు చేయడానికి ఈ అధ్యయనం సరిపోదు. ఎందుకంటే ఇది శాస్త్రీయమైనది కాదు. గణాంక విశ్లేషణలో అనేక పరిమితులను కలిగి ఉంది. ప్రధాన లిమిటేషన్ ఏమిటంటే ఇది వ్యక్తిగత స్థాయిలో కాకుండా కుటుంబ స్థాయిలో రూపొందించబడింది’ అన్నారు. -
లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సాధ్యమైనంత వరకూ మెట్ల మీదుగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలని, మెట్లు ఎక్కడం లో ఇబ్బందులుంటే తప్ప లిప్టు వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చే సింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీచేసింది. లిప్టులో ఒకేసారి నలుగురికం టే ఎక్కువమంది వెళ్లకూడదనీ, ఒకరికొకరు ఎదురెదురుగా కాకుండా, లిఫ్టు గోడల వైపు తమ ముఖం ఉండేలా నిలబడాల ని సూచించింది. అం దరూ ఒకేచోట చేరి మూకుమ్మడిగా భో జనాలు చేయకూడ దు. వేర్వేరు సమయాల్లో భోజనానికి వెళ్లేలా ఏర్పాట్లు చే యాలి. ఒకేచోట ఎ క్కువమంది గుమిగూడి మాట్లాడుకోవడాన్ని నిలిపివేయాలి. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాల ను నిర్వహించుకోవాలని సూచించింది. ఇతర ఉ ద్యోగుల సెల్ఫోన్లను, గదులను, డెస్కులను వాడకూడదని, వాడాల్సి వస్తే వాటిని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరిచాకే తాకాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ వాడొద్దు... సాధ్యమైనంత వరకు కొంతకాలం వరకూ సెంట్రలైజ్డ్ ఏసీని వినియోగించకపోవడమే మంచిదని కేం ద్రం సూచించింది. ఉద్యోగులందరూ ఒకేసారి ఒకే గేటు ద్వారా ప్రవేశించకుండా, వేర్వేరు ద్వారాల నుంచి ఆఫీసులోకి ప్రవేశించాలని కోరింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో కలిసిమెలిసి తిరిగిన ఉద్యోగి ఎవరైనా ఉంటే, వారు స్వయంగా హోంక్వారంటైన్ లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటి వ్ వస్తేనే ఆఫీసుకు రావాలని తెలిపింది. డెస్కులు, కుర్చీలను దూరం దూరంగా జిగ్‌జాగ్ పద్ధతిలో వే యాలని కోరింది. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒకవేళ దగ్గు, తుమ్ములు వస్తే కర్చీఫ్ లే దా టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. కం ప్యూటర్ కీబోర్డులు, ఫోన్లు, ఆఫీసుల్లో ఎక్కువమం ది పలుసార్లు తాకడానికి అవకాశమున్న ప్రాంతాలను, వస్తువుల పైభాగాన్ని శానిటైజ్ చేయాలి. -
గుమిగూడితే.. చెప్పేస్తుంది
సాక్షి, హైదరాబాద్: మాస్కు ఉల్లంఘనలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఇకపై భౌతికదూరం పాటించకున్నా.. చర్యలు తీసుకోనున్నారు. రోడ్డు పై ఎక్కడైనా ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువగా గుమిగూడినా.. పోలీసులు క్షణాల్లో అక్కడికి వచ్చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సీసీ కెమెరాలకు జోడించి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. భౌ తికదూరం పాటించకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీజీపీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. దేశంలోనే ఇలాం టి సాంకేతికతను తొలిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టామని తెలిపింది. తొలుత ఈ సాంకేతికతను గ్రేటర్ పరిధిలోని రాచకొండ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఆపై రాష్ట్రంలో అమలు చేయనున్నారు. క్షణాల్లో వచ్చేస్తారు: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు సేవలు ప్రారంభించడంతో పలుచోట్ల రోడ్లు, కూడళ్లలో రద్దీ ఏర్పడుతోంది. సీసీ కెమెరాల సాయంతో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ద్వారా ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందో సిబ్బంది గుర్తిస్తారు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గస్తీ పోలీసులను అప్రమత్తం చేస్తారు. వారు ఉల్లంఘనల ప్రాంతానికి వెళ్లి.. భౌతికదూరం పాటించని ప్రజలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు. మరీ ఉల్లంఘనలు అధికంగా ఉంటే కేసులు నమోదు చేస్తారు. -
మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో దశ లాక్డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం మెట్రో ప్రయాణాలకు అనుమతిస్తే... ప్రతి స్టేషన్లో రైలు ఆగే వ్యవధిని పెంచాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎమ్ఆర్సీ) ఆలోచిస్తుంది. రైలులో సామాజిక దూరం అమలయ్యేలా చూడాలని భావిస్తుంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రో రైలు ప్రతి స్టేషన్లో 30 సెకన్ల పాటు ఆగేది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ వ్యవధిని మరో 30 సెకన్ల పాటు పెంచాలని డీఎమ్ఆర్సీ చూస్తుంది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. మే 31 నాటికి దేశంలో నాల్గవ దశ లాక్డౌన్ ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ ఎస్ఓపీ ఆమోదం పొందనుంది. ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారులతో దీనిపై చర్చించారు. కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతిస్తే.. సామాజిక దూరం పాటించడం, రైళ్లను శుభ్రపర్చడం వంటి అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలో డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మెట్రోలో సామాజిక దూరం పాటించడం కోసం రెండు సీట్లకు మధ్య ఓ సీటు వదిలేయాలి. ప్రతి ట్రిప్ పూర్తి కాగానే రైళ్లను డిసిన్ఫెక్టెంట్ చేయాలి. స్టేషన్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలి. టోకెన్లతో పాటు కాంటాక్ట్‌లెస్ టికెటింగ్‌ను అమలు పర్చాలని భావిస్తున్నాం. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే... జరిమానాతో పాటు.. జైలు శిక్ష కూడా విధిస్తాం. స్టేషన్లోకి వచ్చేటప్పుడు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఈ మేరకు అదనపు సిబ్బందని నియమించాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. -
శంషాబాద్ రెడీ..
శంషాబాద్: సుదీర్ఘకాలం లాక్డౌన్ తర్వాత సాధారణ ప్రయాణికులతో కూడిన విమానాల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టును అన్ని విధాలుగా సిద్ధం చేశారు. లాక్డౌన్ సమయంలో కార్గోతో పాటు వేరే దేశాల నుంచి మన వారిని తీసుకొచ్చే విమానాలు, రిలీఫ్ విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. కేంద్ర పౌర విమానయాన మార్గదర్శకాల మేరకు తొలి దశలో 30 శాతం విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించి విమానాశ్రయాన్ని సిద్ధం చేసినట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడుతూ.. విమానం లోపల భౌతిక దూరం, నిబంధనలు ఉండేందుకు అవకాశం లేదని.. దీంతో ప్రయాణికులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల మధ్య దూరం ఉండేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. విమానంలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విమానం లోపల ఆహారం సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధుమేహ రోగులకు కొందరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు.. గర్భిణులు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఎయిర్‌పోర్టు విలేజ్ వద్ద భౌతిక దూరం గుర్తులు వేస్తున్న సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఇలా.. ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గం నుంచి భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా గుర్తులు ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ లెస్ విధానంలో ప్రయాణికులు తమ పత్రాలను కెమెరా ముందు పెడితే వాటిని సంబంధిత సీఐఎస్ఎఫ్ అధికారులు కంప్యూటర్లో పరిశీలించి అనుమతిస్తారు. అలాగే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేస్తారు. ప్రయాణికులకు అందుబాటులో అన్ని ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారు. ప్రయాణికులకు పరిశుభ్రత.. భౌతిక దూరం నిబంధనలను అప్రమత్తం చేసేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే చెక్–ఇన్ కియోస్క్‌లు మానిటరింగ్ చేయొచ్చు. కాగా, ప్రారంభంలో విమానయానం నెమ్మదించినా.. భవిష్యత్తులో ఆశాజనకంగానే ఉండొచ్చని కిశోర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 36 ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భౌతిక దూరం కోసం ఏర్పాటు చేసిన పాద సూచికలు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన శానిటైజర్ -
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలోని బాబుమోహన్ డైలాగ్ ఇది.. ప్రతి విషయంలోనూ ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే.. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయంటూ.. ఆయన పడే పాట్లు అప్పట్లో అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. కామెడీ సంగతి పక్కనపెట్టి.. కరోనా విషయానికొచ్చేస్తే.. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు జనమంతా రోడ్డుమీదకు వస్తున్న రోజులివీ.. చాలా మందిలో రకరకాల భయాలు.. బయట నుంచి వస్తే.. తప్పనిసరిగా స్నానం చేయాలని చెప్పేవాళ్లు కొందరు.. కనీసం చేతులు కూడా కడగని వాళ్లు మరికొందరు.. ఎన్నో అనుమానాలు.. మరెన్నో అపోహలు.. అందుకే.. బాబుమోహన్లాగా కామెడీగా కాకుండా.. సీరియస్‌గానే శోధిద్దాం.. ఎందుకు? ఏమిటి? అన్నది తెలుసుకుందాం.. ఎలా?.. ఇదిగో ఇలా.. (వ్యక్తి నుంచి వ్యక్తికే) మార్కెట్‌కు వెళ్లి వచ్చాను.. నేను తప్పనిసరిగా స్నానం చేయాలా? ►అవసరం లేదు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు. అయితే మార్కెట్లు వంటి చోట్లకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటిం చాలి.. మాస్క్ మస్ట్‌గా వేసుకోవాలి.. అది సరిగ్గా చేస్తే చాలు. నా జుట్టు లేదా గడ్డంలో వైరస్ ఉండే అవకాశముందా? ►భౌతిక దూరం వంటివి పాటిస్తూ ఉంటే.. ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. నిజంగానే మీ జుట్టు లేదా గడ్డంలో వైరస్ ఉండాలంటే.. ఇవి జరగాలి.. అవేంటంటే.. ఎవరైనా కరోనా రోగి మీ గెడ్డం లేదా జుట్టు మీద తుమ్మాలి.. మీ జుట్టు మీద అతడు తుమ్మిన ప్రాంతాన్ని మీరు చేతులతో ముట్టుకోవాలి.. ఆ చేతులను మళ్లీ మీ ముఖంపై పెట్టాలి.. అప్పుడు వైరస్ వస్తుంది (ఇలాంటివి చాలా అంటే చాలా తక్కువగా జరిగే అవకాశముంది కాబట్టి.. లైట్ తీసుకోండి) నేను ధరించిన దుస్తులకు వైరస్ అంటుకునే అవకాశముందా? ►సాధారణంగా మనం ముందుకు కదులుతుంటే గాలి పక్కకు తప్పుకొంటుంది. అంటే వైరస్ గాలిలో ఉన్నా కూడా మనం నడుచుకుంటూ వెళ్తుంటే పక్కకు తొలగుతూ ఉంటుంది.. నిజంగా మీ దుస్తులపై వైరస్ పడాలంటే.. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి మీకు దగ్గరగా వచ్చి.. దగ్గడం లేదా తుమ్మడం చేయాలి.. అంతేకాదు.. మనం నడుస్తున్నప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. ఆ బిందువులు చాలా పెద్దవిగా ఉండాలి.. నా కుక్కతో నేను వాకింగ్‌కు వెళ్లొచ్చా.. లేదా బయటకు వెళ్లి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా? ►ఇండోర్‌తో పోలిస్తే.. అవుట్‌డోర్‌లో వైరస్ బలహీనంగా ఉంటుంది.. స్థిరత్వం తక్కువ ఉంటుంది.. భౌతిక దూరం పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటే.. బయట తిరిగినా కూడా వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువ. బయటికి వెళ్లొచ్చాక షూస్ తుడవాలా? ►షూస్, చెప్పులపై బ్యాక్టీరియా, వైరస్ ఉండవచ్చు. కానీ దీని వల్ల కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. కరోనా వైరస్ మీ షూపై పడాలంటే.. మళ్లీ పాత పద్ధతే.. మీకు దగ్గరగా వచ్చి.. తుమ్మడం దగ్గడం చేయాలి.. అది మీ షూపై పడాలి. కాబట్టి.. నో ప్రాబ్లెం. లేదూ..కాదూ అంటే.. ఉతికేందుకు వీలుండే బూట్లైతే ఉతికేసుకోండి. మరో విషయం.. షూ కింది భాగంలో డిస్ఇన్ఫెక్టెంట్లతో అస్సలు తుడవకండి. ఎందుకంటే అక్కడ ఉన్న సూక్ష్మ క్రిములు మీ చేతులకు అంటుకునే ప్రమాదముంటుంది. ►మొత్తమ్మీద విషయం అర్థమైందిగా.. కరోనాకు నిజమైన మందు.. ముందు జాగ్రత్తే.. సో.. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. బేఫికర్ కండి.. -
భౌతిక దూరం రెండు నుంచి మీటరుకు!
లండన్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలంటూ ప్రపంచంలో చాలా దేశాలు తమ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ రెండు మీటర్ల దూరం అనేది అర్థరహితమని, అది శాస్త్రవిజ్ఞానంపై ఆధారపడి చెప్పింది కాదని బ్రిటీష్ ప్రభుత్వ సలహాదారు, నాటింగమ్ ట్రెంట్ యూనివర్శిటీ సోసియాలోజిస్ట్ ప్రొఫెసర్ రాబర్ట్ డింగ్వాల్ చెప్పారు. ఒక మీటరు దూరాన్ని పాటిస్తే చాలునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందని, ఆ సూచనను డెన్మార్క్‌తోపాటు కొన్ని యూరప్ దేశాలు ఇప్పుడు పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. (అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!) రెండు మీటర్లు లేదా ఆరున్నర అడుగుల దూరాన్ని పాటించాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం ఎందుకైన మంచిదని తన ప్రజలకు సూచించి ఉంటుందని, ఒకటి లేదా ఒకటిన్నర మీటరు దూరాన్ని పాటించాలని చెబితే ఆ దూరమెంతో ప్రజలకు తెలియక దగ్గరగా ఉండే ప్రమాదం ఉందన్న ముందు జాగ్రత్తతో కూడా సూచన చేసి ఉండవచ్చని డింగ్వాల్ అన్నారు. అన్ని రకాల షాపుల వద్ద రెండు మీటర్ల దూరం పాటించడం కష్టం అవుతుందని, అందుకని ఒకటిన్నర మీటరు దూరం పాటిస్తే చాలునని ఆయన సూచించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఐయాన్ డంకెన్ స్మిత్ కూడా సామాజిక భౌతిక దూరం 1.5 మీటర్లు ఉంటే చాలునని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజలు భౌతిక దూరాన్ని రెండు మీటర్లు పాటిస్తుండగా, వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిన్నర, ఒక మీటరు దూరాన్ని మాత్రమే పాటిస్తున్నారు. (కరోనా: భారత దేశానికి ఊరట) -
అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!
నాకు జ్వరం లేదు.. దగ్గు లేనే లేదు.. తుమ్ములు రావడమే లేదు.. కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేవు.. కానీ.. నేను కరోనా పాజిటివ్!! ప్రస్తుతం కరోనాపై మనం సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాలు.. వైరస్ శరీరంలో ప్రవేశించినా.. ఎటువంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. తెలియకుండానే చాలామందికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదివారం చైనాలో 17 కొత్త కేసులు నమోదైతే.. అందులో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు! ‘వాళ్లలో లక్షణాలు కనిపించవు.. అనుమానించే పరిస్థితి ఉండవు.. మిగిలిన వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే.,. లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల వెంటనే దాన్ని గుర్తించి.. ఇన్ఫెక్షన్ మిగిలినవారికి సోకకుండా నివారించవచ్చు.. కరోనా వైరస్ ఇలా కాదు.. ఇప్పుడీ లక్షణాలు కనబరచని రోగులతోనే పెద్ద సమస్య. వీరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ఈ లక్షణాలు బయడపడకపోవడానికి ఒక కారణం అయిఉండొచ్చు. వీరి నుంచి ఇన్ఫెక్షన్ చెయిన్‌ను తెంచాలంటే.. ఎంత ఎక్కువ మందికి అయితే.. అంత మందికి పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం’ అని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ(అమెరికా)కు చెందిన సీనియర్ పరిశోధకుడు, ఇమ్యునాలజిస్ట్ గిగి గ్రాన్వాల్ తెలిపారు. అన్ని వసతులు లేకుంటే.. లక్షణాలతో సంబంధం లేకుండా.. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం మేలని.. అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. మన దేశంలోనూ ఇలాంటి ‘లక్షణాలు లేని’ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు లక్షణాలు లేని వీరి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా అన్నది ఓసారి చూద్దామా.. ఇలా ఎంత మంది.. ప్రతి నలుగురిలో ఒకరికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడకపోవచ్చు.. ఆధారం: అమెరికాలో జరిగిన అధ్యయనాలు.. ఇదెందుకంత సమస్య.. అసింప్టొమాటిక్ క్యారియర్లలో లక్షణాలు కనపడవు.. కానీ ఇన్ఫెక్షన్ ఉంటుంది.. సైలెంటుగా వీరి ద్వారా చాలామందికి కరోనా వ్యాపిస్తుంది. లక్షణాలు లేకపోవడం వల్ల పరీక్షల ద్వారానే వీరిని గుర్తించగలం. అయితే, ఇందుకోసం భారీ స్థాయిలో టెస్టింగ్ కిట్ల అవసరం ఉంటుంది. -
బస్సెక్కేందుకు భయపడ్డరు
సాక్షి, హైదరాబాద్: జనంలో కరోనా భయం ఎక్కువగానే ఉంది. 56 రోజుల తరువాత బస్సులు రోడ్డెక్కినా.. అవెక్కడానికి ప్రయాణికులు సాహసించలేదు. లాక్డౌన్ మినహాయింపులతో ప్రారంభమైన బస్సులు తొలిరోజు ఖాళీగానే పరుగుపెట్టాయి. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్.. బస్సులు తిరుగుతాయని సోమవారం రాత్రే చెప్పడంతో ఆ సమాచారం వేగంగానే ప్రజల్లోకి వెళ్లింది. కానీ మంగళవారం బస్సులు బస్టాండ్లలోకి వచ్చినా.. ప్రయాణికులు రాలేదు. సాధారణంగా ఉదయం వేళ బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ ఉదయం చాలా బస్టాండ్లలో ప్రయాణికుల కోసం సిబ్బంది ఎదురుచూడాల్సి వచ్చిం ది. కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట తదితర బస్టాం డ్లలో ఉదయం 8 గంటల ప్రాంతంలో మోస్తరు సంఖ్యలో ప్రయాణికులొచ్చారు. వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్లే బస్సులెక్కగా, గ్రామాల వైపు వెళ్లే బస్సులు చాలాసేపు బస్టాండ్లలోనే ఉండిపోయాయి. 6,153 బస్సులు తిప్పేందుకు సిద్ధం చేసుకోగా.. మంగళవారం సాయంత్రం కర్ఫ్యూ సమయానికి 3,179 బస్సులు మాత్రమే తిరిగాయి. కరీంనగర్ జోన్ పరిధిలో 1,585, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 510 సర్వీసులు నడిచాయి. నడపాల్సిన బస్సు ల్లో 51% వరకే తిరిగాయి. మం గళవారం సగటు ఆక్యుపెన్సీ 35%గా నమోదైంది. బస్సుల్లో నిలబడి ప్రయాణించటాన్ని నిషేధిస్తున్నట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. భౌతికదూరం పాటించేలా కొన్ని సీట్లను కూర్చోకుండా చేయాలన్న ఆలోచననూ విరమించుకుంది. కానీ.. మంగళవారం జనం లేక భౌతికదూరం పాటించినట్టయింది. కరోనాపై తగ్గని హైరానా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, మన దేశంలో కేసులు లక్షకు మించిపోవటంతో జనంలో ఆందోళన నెలకొంది. లాక్‌డౌన్‌తో ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమైన జనం ఇతర వ్యాపకాలు పెద్దగా లేక కరోనాపై ఎక్కువగా చర్చించుకోవటం, టీవీల్లో ఎక్కువగా ఆ విషయాలే చూడ్డం వల్ల వారిలో ఆ భయం ఎక్కువ ఉందని మానసిక విశ్లేషకులు అంటున్నారు. దీంతో మంగళవారం బస్సు ప్రయాణమనేసరికి చాలామంది భయపడ్డట్టు స్పష్టమవుతోంది. ఇన్ని రోజులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుని, ఇప్పుడు ఇతరులతో కలిసి బస్సుల్లో వెళ్లటం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బస్సులతో పోలిస్తే ఆటోలు కొంతవరకు మంచిదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన పట్టణాల్లో మంగళవారం ఆటోల్లో ఎక్కువ మందే ప్రయాణించారు. తోటి ప్రయాణికులు లేకుండా విడిగా ఆటోల్లో వెళ్లేందుకు కొందరు మొగ్గుచూపారు. ‘ఇన్ని రోజుల తర్వాత బస్సులు ప్రారంభమైతే.. రద్దీ ఎక్కువుంటుందనుకున్నాం. కానీ, ఉదయం ఆరు గంటలకు బస్సులను బస్టాండ్లలో ఉంచితే ఎక్కేవారే లేరు. 9 తర్వాత గానీ పుంజుకోలేదు’అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రధాన బస్ డిపో మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. మరో వారం పదిరోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చన్నారు. ఊళ్లలో కట్టుదిట్టం.. కరోనా విస్తరణ ప్రారంభమైనప్పటి నుంచి పల్లెలన్నీ ప్రత్యేక శ్రద్ధతో పైలంగా నడుచుకుంటున్నాయి. ఊళ్లలోకి కొత్తవారిని రానివ్వకుండా గ్రామస్తులు ముళ్లకంచెలు వేశారు. ఆ తర్వాత ఎవరైనా సిటీ నుంచి వస్తే వారిని క్వారంటైన్ చేయించారు. అలా జాగ్రత్తగా ఉన్న పల్లెల్లో బస్సులనగానే కొంత భయం మొదలైంది. సమీపంలోని పట్టణాలకు వెళ్తే క్వారంటైన్ చేస్తారంటూ సోమవారం కొన్ని ఊళ్లలో ప్రచారం జరిగినట్టు వార్తలొచ్చాయి. అలాగే, బస్సుల్లో తిరిగితే ఇతర ప్రయాణికులతో ముప్పు ఉంటుందని, ఒకరికి వ్యాధి సోకినా ఊరంతా ఇబ్బందిపడాలని సర్పంచ్‌లు కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. సొంత వాహనాలపై వెళ్లి పనిచూసుకుని రావాలని, బస్సులెక్కకూడదని కొందరు నిర్ణయించుకున్నారు. ‘మా గ్రామానికి రోజూ 20 సర్వీసులుంటాయి. మంగళవారం ఐదు బస్సులొచ్చాయి. అవన్నీ ఖాళీగా వచ్చి.. వెళ్లాయి. మా ఊళ్లో ఒక్కరూ ఎక్కలేదు’అని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ వాసి వూడె పులీంద్రారెడ్డి చెప్పారు. హైదరాబాద్ అంటే హడల్.. ప్రస్తుతం పనులపై సమీపంలోని పట్టణాలకు వెళ్తే.. బయట భోజనం చేసే అవకాశం లేదు. హోటళ్లన్నీ ఇప్పటికీ మూసే ఉన్నాయి. దీంతో భోజనం చేసే వీల్లేకపోవటం కూడా ప్రయాణాలు తగ్గేందుకు ఓ కారణమైంది. కాగా, హైదరాబాద్ వైపు వచ్చే బస్సులెక్కే విషయంలో భిన్న వాతావరణం కనిపించింది. వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్ వైపు తిరిగే బస్సుల్లోనే కాస్త ఎక్కువ ప్రయాణికులు కనిపించారు. అదే ఇతర పట్టణాలకు హైదరాబాద్ నుంచి బస్సులు ఖాళీగా వెళ్లాయి. సాధారణ రోజుల్లో నిత్యం హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అలా అత్యవసర పనులపై వచ్చే వారితో కొన్ని బస్సుల్లో మోస్తరు రద్దీ కనిపించింది. కానీ, ఊళ్ల నుంచి సిటీకి వచ్చే బస్సుల్లో మాత్రం జనమే లేరు. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జనం హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు. -
ప్రైవేట్‌లోనూ కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీయూ లేదా వెంటిలేటర్ సౌకర్యంతోపాటు కరోనా చికిత్స అందించగలిగే స్థాయి కలిగిన ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మిగిలిన క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోంలకు మాత్రం అటువంటి వెసులుబాటు కల్పించలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. కరోనా రోగులకు ఇప్పటివరకు కేవలం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికే కరోనా చికిత్సలు చేస్తున్నాయి. కానీ అధికారికంగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎవరైనా వెళ్లి వాటిల్లో చికిత్స చేయించుకోవచ్చు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రైవేటు క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు. రెండోది ఇన్–పేషెంట్ సౌకర్యంలేని నర్సింగ్ హోంలు. మూడోది ఐసీయూ లేదా వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనా చికిత్స అందించే సామర్థ్యం కలిగిన ఆస్పత్రులు. ఈ విభజన ప్రకారం ఆయా ఆస్పత్రులు ఏ విధమైన మార్గదర్శకాలు పాటించాలో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు వైద్య సేవలు నిలిపేశాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయి. దీంతో సాధారణ వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలందించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు... ► కరోనా అనుమానిత రోగులు వస్తే వారి పరీక్షా ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్ రూంలో ఉంచాలి. ► ల్యాబ్ టెక్నీషియన్లు శ్వాబ్ నమూనాలు తీసేటప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. ► కరోనా రోగుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి, ఆస్పత్రిలో కరోనా జోన్లను ఏర్పాటు చేయాలి. ► కరోనా జోన్లో వైరస్ లక్షణాలున్న వారి కోసం ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యాలను సిద్ధం చేయాలి. ► కరోనా జోన్లో తప్పకుండా ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, లేబర్ రూం ఉండాలి. ఈ జోన్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► ప్రతి కరోనా పాజిటివ్ కేసును అవసరాన్నిబట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనెస్తీషియనిస్టు, ఇతర సంబంధిత వైద్యులు పరీక్షించాలి. ► పాజిటివ్ రోగుల చికిత్సా విధానాలకు సంబంధించి ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలను విధిగా పాటించాలి. ► ఒకవేళ కరోనా రోగి మరణిస్తే మృతదేహాన్ని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం తరలించి దహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ► ప్రతి ఆస్పత్రి విధిగా మరణాల వివరాల రిజిస్టర్‌ను నమోదు చేయాలి. అందులో కరోనా లేదా కరోనాయేతర రోగులు ఎలా చనిపోయారో వివరాలు ఉండాలి. ఆ వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ► టీకాల షెడ్యూల్ యథావిధిగా కొనసాగించాలి. ► ఆస్పత్రి ప్రాంగణంలో లెక్కకు మించిన రోగులు, వారి సహాయకులు ఉండకుండా చూసుకోవాలి. రొటీన్ విజిటింగ్‌కు అనుమతించొద్దు. ► రొటీన్ ఫాలో అప్ కేసుల విషయంలో టెలి మెడిసిన్ విధానాన్ని అవలంబించాలి. ► వైద్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ఇవ్వాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా ఫ్లూ, జ్వరం, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడే రోగులు, గర్భిణుల వివరాలను రిజిస్టర్లో నిత్యం నమోదు చేయాలి. వాటిని ఈ–బర్త్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా కరోనా పాజిటివ్ రోగుల వివరాలను నమోదు చేస్తూ వాటిని సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ► ఇన్–పేషెంట్ రోగులు, శస్త్రచికిత్సల వివరాలు కూడా నమోదు చేయాలి. వాటిని జిల్లా వైద్య, అధికార యంత్రాగానికి పంపాలి. ► కరోనా జోన్లో మాస్క్‌లు, గ్లౌజ్స్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ వాషింగ్, శానిటైజర్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భౌతికదూరం పాటించాలి. ూ వైరస్ సోకిన రోగులు, ఇతర రోగులు కలవకుండా చర్యలు చేపట్టాలి. ఈ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌హోంలకు... ► రోగుల రద్దీని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ► అందుకోసం డాక్టర్లు గంటకు నలుగురైదుగురు రోగులను మాత్రమే చూడాలి. ూ ప్రతి రోగి పక్కన ఒక్కరినే అనుమతించాలి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. ► ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. క్లినిక్‌లోకి ప్రవేశించే ముందు సబ్బునీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. ూ జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత కేసులను కరోనా ఆస్పత్రికి తరలించాలి. అటువంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్, రోగులకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయాలి. ూ ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ూ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు మూడు పొరల మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజ్స్ మొదలైనవి ధరించాలి. ూ ప్రతి రోగిని పరీక్షించాక వైద్యులు తప్పనిసరిగా సబ్బునీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్తో చేతులు కడుక్కోవాలి. ూ బయో మెడికల్ వ్యర్థాల తొలగింపు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. ► చేతులు కడుక్కొనే అవకాశం, శానిటైజర్ సౌకర్యం ఆస్పత్రి ప్రతి మూలలో అందుబాటులో ఉంచాలి. ► క్లినిక్‌ను ప్రతిరోజూ బ్లీచ్ లేదా ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి.ూ సాధ్యమైతే టెలి మెడిసిన్ సౌకర్యాన్ని వైద్యులు ఉపయోగించుకోవాలి. ► కరోనా అనుమానిత కేసులను పరీక్షల కోసం, ఇతరత్రా నిర్వహణ కోసం కరోనా ఆస్పత్రికి తరలించాలి. ► కరోనాకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
రెస్టారెంట్ వెలుపల వేచిచూసిన ప్రధాని
వెల్లింగ్టన్ : కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ను రెస్టారెంట్ బయట నిలబడేలా చేశాయి. భౌతిక దూరం నిబంధన కారణంగా రెస్టారెంట్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే కస్టమర్లను అనమతిస్తుండటంతో ఈ పరిస్థతి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని జెసిండా తన కాబోయే భర్త క్లార్క్ గెఫోర్డ్‌తో కలిసి శనివారం దేశ రాజధాని వెల్లింగ్టన్లోని ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే భౌతిక దూరం నిబంధన ప్రకారం రెస్టారెంట్లో పలు మార్పులు చేయడంతో.. అప్పటికే కుర్చీలు అన్ని నిండిపోయాయి. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు కాసేపు వేచి చేయాల్సిందిగా ప్రధానిని కోరారు. దీంతో ఆమె కుర్చీలు ఖాళీ అయ్యేవరకు సామాన్యుల మాదిరిగా రెస్టారెంట్ వెలుపల వేచిచూశారు. ఆ తర్వాత సీట్లు ఖాళీ కావడంతో గెఫోర్డ్‌తో కలిసి లోనికి వెళ్లారు. (చదవండి : కరోనాపై విజయం సాధించాం: జెసిండా అర్డర్న్) ఈ ఘటనపై జెసిండా కార్యాలయం అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన పరిమితులను ఎవరైనా పాటించాల్సిందే.. ప్రధాని కూడా అందరిలానే నిబంధనలు పాటించారు’ అని తెలిపారు. మరోవైపు కరోనా కట్టడి కోసం జెసిండా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా తీవ్రతను ముందుగానే గ్రహించిన ఆమె మార్చిలోనే న్యూజిలాండ్‌కు విదేశీ రాకపోకలపై నిషేధం విధించడంతోపాటుగా.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేశారు. ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో 1,498 కరోనా కేసులు నమోదు కాగా, 21 మంది మరణించారు. అయితే గత ఐదు రోజుల్లో అక్కడ కొత్తగా ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదు అయింది. (చదవండి : గుక్కతిప్పుకోని ప్రధాని) కాగా, రెండు రోజుల కిత్రం దేశవ్యాప్తంగా చాలావరకు లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గెపోర్డ్‌తో కలిసి జెసిండా సరదాగా బయటకి వచ్చారు. ఇక, కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట 2018 జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. -
రోజుకు 3 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం సమా వేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. ముం దుగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటిం చేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణ యానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణా ళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేయాలని భావిస్తోంది. జూన్ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు. -
'ఓహ్ గాడ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!'
కాలిఫోర్నియా : కరోనా వైరస్ మనుషుల మధ్య దురాన్ని తీసుకొచ్చింది. భౌతిక దూరం పేరుతో ఎంతో మంది తమ వారికి దూరంగా ఉంటున్నారు. మహమ్మారి ఎక్కడి నుంచి ఎలా తమను ఎటాక్ చేస్తుందో అని నిత్యం భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా దూరంగా ఉన్న తమ తాత, అమ్మమ్మలను హత్తుకునేందుకు ఓ చిన్న పాప వినూత్న ఆలోచన చేసింది. కాలిఫోర్నియాకు చెందిన పైజ్ అనే పదేళ్ల పాప సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తాతా, అమ్మమ్మలను కౌగిలించుకున్న ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. (వైరల్ : ఇప్పుడంతా మాదే రాజ్యం ) తన వారిని కలుసుకోవాలనే కోరిక పైజ్ మనుసులో బలంగా నాటుకుంది. ఇందుకు ఎంతో కష్టపడి కొన్ని వీడియోలు చూసి షవర్ కర్టెన్ సహాయంతో ప్లాస్టిక్ కర్టెన్లను తయారు చేసింది. దీనిని తమ తాతా, అమ్మమ్మల ఇంటి ముందు తలుపు వద్ద కర్టెన్ ఉంచింది. అనంతరం 'మీరు నన్ను కౌగిలించుకోండి' అని చిన్న అమ్మాయి చెప్పింది. దీంతో పైజ్ అమ్మమ్మ ఎంతో సంతోషించి, ఆమెను హత్తుకుంది. కర్టెన్, పైజ్‌ను చూసిన అమ్మమ్మ.. 'ఓహ్ మై గాడ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ప్రభాస్ సినిమాలో 'మైనే ప్యార్ కియా' నటి ) దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తల్లి లిండ్స్ ఫేస్బుక్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో దీనిని చూసిన చిన్నారి తెలివి తేటలను మెచ్చుకుంటున్నారు. ఏ కష్టం వచ్చిన తమ వారిని ఎవరు వీడదీయలేరని అభిప్రాయపడుతున్నారు.'మేము మా మనవరాళ్ళు, కుమార్తెల కౌగిలింతలను చాలా మిస్ అవుతున్నాం. ఇది నా హృదయాన్ని హత్తుకుంది' అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నపుడు..) -
ముమ్మాటికీ మనమే నేరస్తులం
మనిషి సంఘజీవి. సంఘంలో ప్రాతినిధ్యం ప్రారంభమైన దశ నుంచి (గ్రీకుల కాలం తరువాత) తన ప్రాబల్యం కోసం స్వార్థ చింతన పెంచుకోవడం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన ఈ స్వార్థం ఎక్కడికి దారితీసిందంటే తన సొంత మనుషులకు కూడా ప్రమా దం జరిగిందంటే ఆందోళన చెందనంత స్థాయికి చేరుకుంది. మహాకవి కాళోజీ గారన్నట్లు ‘తనకు అందినంత వరకు తనదని, తనకు అందనిది, కనిపించినంత వరకు మనదని’ సొమ్ము చేసుకు నేంత స్వార్థం మనిషిలో పెరిగి పోయిన కాలంలో తన సౌకర్యం, విలాసాల కోసం ప్రకృతిని వాడు కుని నాశనం చేయడం ప్రారం భించి, అదే పరోక్షంగా తన వినాశ నానికి కారణం అయ్యేంతవరకూ తెచ్చుకున్నాడు. స్వైన్‌ఫ్లూ, ఎబోలా, ‘జికా’. ఈ వైరస్‌లకు పూర్తి వైవిధ్య మైనది నేడు మనం ఎదుర్కొంటున్న మహమ్మారి ‘కరోనా వైరస్’. మానవ ఆరోగ్య చరిత్రలో మొదటి వైరస్, వ్యాధి అయిన సిర్సాను సృష్టించిన చైనానే కరోనా వైరస్ వ్యాప్తికి కూడా దోహదం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కేసు నమోదై మొత్తం దేశం వ్యాపించి ప్రపంచాన్ని చుట్టేసింది. చిన్న చిన్న దీవుల నుంచి అగ్ర రాజ్యమైన అమెరికా వరకు బీద బిక్కి, ధనిక దక్కి లేకుండా భయ కంపితులను చేస్తోంది. చైనా తర్వాత అత్యంత జనాభా కలిగిన దేశం మనది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంకన్నా మన ఆహార్యం గొప్పది, మెడిసిన్ కన్నా మన మేధస్సు గొప్పది. ఐక్యతే ఈ దేశంలో మహ మ్మారిని కట్టడి చేయగలుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదం లేకుండా దేశమంతా ఒక్కటే అన్న నినాదంతో ప్రధాని సూచనను తప్పకుండా పాటిస్తూ కరోనాను ఐక్యంగా తరిమికొట్టడానికి సిద్ధ పడుతున్నారన్నది నిర్వివాదాంశం. కనుక భౌతిక దూరం, స్వీయ గృహ నిర్బంధం ఇకపైనా పాటిద్దాం. – కొండల్ ప్రజాపతి,రాజనీతి శాస్త్ర పరిశోధకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మొబైల్ : 96763 54999 -
మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలో నిలిచి పోయిన రైల్వే సేవలను మే 12 నుంచి తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయని.. 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అహ్మాదాబాద్ నుంచి బుధవారం న్యూఢిల్లీ చేరుకున్న మొదటి రైలులో భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించారు. ఈ రైలు మే 12 న సాయంత్రం 6.30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంది. (అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే.. ) కాగా రైలులో ప్రయాణించే వారి కోసం కోచ్‌లోనే చిన్న గదిని ఏర్పాటు చేసి ఆహార ఉత్పత్తులైన బిస్కెట్లు, భుజియా, చాక్లెట్లు అందుబాటులో ఉంచారు. అయితే ప్రయాణికులు కూర్చున్న కోచ్, చిన్నవంటగదికి దూరంగా ఉండటంతో ప్రయాణీకులు ఆహార పదార్థాలను కొనడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆకలి తీర్చుకునేందుకు వంటగది వద్ద ప్రయాణికులు ఎగబడ్డారు. దీని ఫలితంగా రైలునంబర్ 02957 బి -1 కోచ్ సమీపంలో ఉన్న చిన్నగది వ్యాన్ వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. (రైలు దిగగానే.. స్టాంప్ వేసేశారు! ) రాత్రి సమయంలో చిన్న వంట గది వద్ద ప్రయాణికులు గుమిగూమినప్పుడు ప్రజలంతా ఒక్కక్కరుగా వంటగది వద్దకు రావాలని అధికారులు కోరినట్లు రైలులో ప్రయాణించిన నిహార్ కక్కాడ్ అనే విద్యార్థి తెలిపారు. వాటర్ బాటిల్స్ కొనడానికి చాలా మంది క్యూ కట్టడంతో రద్దీని నివారించడానికి కోచ్‌లోనే నీటిని అమ్మడం ప్రారంభించారని పేర్కొన్నాడు. చాలా మంది ప్రయాణీకులు ఆహారాన్ని తీసుకెళ్లలేదని, చిన్నగదిలో లభ్యమైన వాటిని కొనవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. (లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు) -
మన దగ్గర కూడా ఇలానే అవుతుందేమో..!
బీజింగ్: కరోనా.. కష్టాలతో పాటు మనిషి జీవితంలో మరేన్నో మార్పులు తీసుకువచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ముఖ్యంగా మనందరికి వ్యక్తిగత పరిశుభ్రత బాగా అలవడింది. సామాజిక దూరం, మాస్కులు మన జీవితాల్లో భాగం కానున్నాయి. కరోనా కేవలం మన జీవన విధానాన్ని మాత్రమే కాక పని వేళలను, విధులను, చదువులను అన్నింటిని మార్చబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మార్పులు ఆచరణలోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి మార్పులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది. ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో ప్రస్తుతం సాధరణ పరిస్థితులు నెలకొన్నట్లు ఆ దేశం ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత తాజాగా చైనాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంతకు ముందు విద్యార్థులు జామ్మంటూ స్కూల్ లోపలకు పరిగెత్తుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. అసలే కరోనా భయం.. ఈ మాయదారి రోగం తగ్గదు.. మన జాగ్రత్తలో మనం ఉండాలి అని భావించిన పాఠశాల యాజమాన్యాలు.. ఐదంచెల శుభ్రత వ్యవస్థను ప్రవేశపెట్టాయి.(వూహాన్లో అందరికీ పరీక్షలు) దీంట్లో భాగంగా ఓ విద్యార్థి పాఠశాల గేటు వద్దకు రాగానే అక్కడి సిబ్బంది విద్యార్థి షూస్‌ను శానిటైజ్ చేస్తారు. అనంతరం స్టూడెంట్ తన మాస్క్‌ను అక్కడే ఉన్న చెత్తడబ్బాలో వేసి లోపలికి వెళ్లాలి. అక్కడ చేతులను శుభ్రం చేసుకోవాలి.తర్వాత విద్యార్థి బట్టలు, బ్యాగ్‌ను శానిటైజ్ చేస్తారు. తర్వాత మరో పరీక్ష చేసి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిస్తే అప్పుడు ఆ విద్యార్థిని పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు. ఇంత తతంగం ముగిశాక పిల్లలు పాఠశాలలోనికి వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్ సాధించింది. మీరు ఓ సారి చూడండి... -
సన్యాసి దర్శనం.. భౌతిక దూరం ఉల్లంఘన
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లాక్డౌన్ నిబంధనలు భౌతికదూరం పాటించటం, ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని పాటించకుండా యథేచ్చగా ప్రజలు గుమిగూడుతున్నారు. ఓ జైనమత సన్యాసిని దర్శించుకోవటం కోసం ఒక్కసారిగా ప్రజలు పెద్దఎత్తున అతని వద్దకు తరలివచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జైనమత సన్యాసి దర్శనం కోసం కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రజలు పాటించకుండా ఉల్లంఘించారని సాగార్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ భూరియా తెలిపారు. ఆ సన్యాసిని దర్శించుకునే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (‘రాజధాని’ స్టాప్‌లు పెంచండి: సీఎం) సాగర్ జిల్లాలో ఇప్పటికే పది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. భౌతికదూరం పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించటాన్ని నేరంగా పరిగణించాలని ఇటీవల హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం కొన్ని లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయటంపై ప్రజల నుంచి సలహాలు కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24,386 కరోనా వైరస్ బాధితులు డిశ్చార్జ్ అవ్వగా, 2415 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
కొన్ని చోట్ల ఎక్కువ కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయనీ, ఈ దశలో వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కీలకమని కేంద్రం పేర్కొంది. దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 4,213కు చేరుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘దేశంలోని కొన్ని క్లస్టర్లతోపాటు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని సమర్థంగా కట్టడి చేయకుంటే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది’అని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ప్రభుత్వం మత ప్రాతిపదికన కరోనా హాట్స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోందంటూ వస్తున్న వార్తలును కొట్టిపారేశారు. దేశీయంగా రూపొందించిన ఎలిసా టెస్ట్ కిట్ 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని అగర్వాల్ స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులకూ ఆరోగ్యసేతు విమాన ప్రయాణికులు కూడా తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ యాప్ లేని ప్రయాణికులను విమానంలోకి అనుమతించబోరని చెప్పారు. పౌర విమాన యాన శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్(గుజరాత్)లో వ్యాప్తి కట్టడికి చెల్లింపులను కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ద్వారానే జరపాలని నిర్ణయించారు. -
మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లో ఒకేసారి కాకుండా మూడు దశల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 13వ తేదీన మొదటి శ దశ ప్రారంభం అవుతుంది. మూడవ దశ జూలై వరకు కొనసాగుతుంది. మొదటి దశ లాక్డౌన్ సడలింపు కారణంగా ఇంగ్లండ్ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎండలో కూర్చోవచ్చు. సమీపంలోని స్థానిక పార్కులకు వెళ్లి వ్యాయామాలు చేసుకోవచ్చు. అయితే ఇతరులతో సామాజిక దూరం మాత్రం పాటించాలి. సొంత కుటుంబ సభ్యులతో గ్రామం లేదా పట్టణం వెలుపలికి వెళ్లి సరదాగా గడపి రావచ్చు. వెసులుబాటు ఉన్నవాళ్లంతా ఇంట్లో నుంచే పని చేయాలి. పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లక తప్పని వాళ్లు బుధవారం నుంచి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. (సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం) ఇక రెండో దశ సడలింపులో భాగంగా ఒకటి నుంచి ఆరవ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలలు జూన్ ఒకటవ తేదీ నుంచి తెరచుకుంటాయి. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ పాఠశాలలకు, కాలేజీలు వేసవి సెలవుల తర్వాత తెరవాలని బ్రిటిష్ అధికారులు నిర్ణయించారు. అయితే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. విద్యార్థులందరికి శానిటైజర్లు, బాడీ స్ప్రేలు ఉపయోగించడం తప్పనిసరి చేశారు. జూన్ ఒకటవ తేదీ నంచి అన్ని రకాల షాపులను తెరవాలని నిర్ణయించారు. బుధవారం నుంచే ప్రభుత్వ రవాణాను షరతులతో అనుమతిస్తున్నారు. మొత్తం సామర్థ్యంలో పది శాతం ప్రయాణిలను మాత్రమే అనుమతిస్తారు. కచ్చితంగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. అత్యవసరం ఉన్నవాళ్లు మాత్రమే ప్రభుత్వ రవాణాలో ప్రయాణించాలి. (మహా మంచి విషయం.. కరోనాలో పాజిటివ్..) మూడవ దశ సడలింపులో భాగంగా జూలై మొదటి వారంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, సినిమా థియేటర్లు, ఆ తర్వాత బార్లు, పబ్బులను ప్రారంభించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లోనూ సామాజిక దూరం పాటించాలని సూచించింది. ఏ దశలోనూ ఆంక్షలను ఉల్లంఘించిన జరిమానాను విధిస్తామని, దాన్ని కూడా 60 డాలర్ల నుంచి వంద డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. (కొంపముంచిన నైట్ క్లబ్‌లు.. పెరిగిన కేసులు) -
చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?: భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ కాపలా ఉంచినంత మాత్రాన వైన్‌షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని, తాగుబోతులకు కరోనా వచ్చి చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతిస్తే తాగుబోతులు భౌతికదూరం పాటిస్తారా? అని నిలదీశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైన్స్ ఓపెన్ చేయడంతో ఇన్ని రోజుల శ్రమ, వైద్యులు, పోలీసులు పడ్డ కష్టం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన ఉందని, ఇసుక సరఫరా చేసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు వారాలు కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే
హిస్టరీ రిపీట్ అంటారే..ఒక్కోసారి అది నిజంగానే జరుగుతుంది..ఇప్పుడు చూడండి.. మాస్కులు వాడండి..అవి లేకుండా బయటకు రావొద్దు.. సోషల్ డిస్టెన్స్.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం.. బస్సులు రైళ్లలో రసాయనాల పిచికారీ చేయడం.. ఇవన్నీ చేస్తూనే ఉన్నాంగా.. అచ్చం అలాగే.. ఓ వందేళ్ల క్రితం కూడా జరిగింది కావాలంటే ఈ ఫొటోలను చూడండి.. కరోనాలాగే వందేళ్ల క్రితం (1918–1920) కూడా స్పానిష్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఏకంగా 5 కోట్ల ప్రాణాలను బలి తీసుకుంది. అప్పుడు కూడా ఇప్పుడుచెప్పుకుంటున్నవన్నీ తప్పనిసరి చేశారు. ఫ్లూ ప్రబలిన దశలో చాలా దేశాల్లో మాస్కులు ధరించడం మస్ట్ అని చెప్పారు. అవి లేకుండా ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రవేశాన్ని నిషేధించారు కూడా. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూ.. ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేధించారు. షేక్‌హ్యాండ్‌కు పరిమితమవమని చెప్పారు. అయితే దాని వల్ల కూడా ఫ్లూ ప్రబలింది, అది వేరే సంగతి. అప్పట్లో కొందరైతే గాలిలో కూడా ఫ్లూ ఉందని నమ్ముతూ చిత్ర విచిత్రమైన మాస్కులు ధరించారు ఇప్పట్లాగే. (కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...) ఇదో చిత్రమైన మాస్కు ఇంకో విషయం.. స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనడానికి స్పానిష్ అన్నారు గానీ.. నిజానికి స్పెయిన్‌తో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. దాంతో మీడియాపై రకరకాల ఒత్తిడులు, విపరీతమైన సెన్సార్షిప్ ఉండేది. దాని వల్ల ఫ్లూ కరాళ నృత్యం చేస్తున్నా. దాన్ని తగ్గించి చూపేవారు. లక్షల మంది చనిపోతున్నారంటే సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని కూడా భావించేవారు. ఈ యుద్ధ సమయంలో తటస్థంగా ఉన్న అతి తక్కువ దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. దాంతో అక్కడి మీడియా స్వేచ్ఛగా ఉన్నది ఉన్నట్లుగా రాసేది. వాళ్ల రాజుకు కూడా వైరస్ సోకిన విషయాన్ని రాయడంతోపాటు అది ఎలా లక్షలాది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుందన్న విషయాన్నీ తెలియజెప్పేది. (కరోనా : ఆ వీధికి చైనా డాక్టర్ పేరు !) వాషింగ్టన్.. మాస్కు లేకపోతే నో ఎంట్రీ అంటున్న అధికారి దీంతో మిగిలిన దేశాల ప్రజలు స్పెయిన్‌లోనే ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడే వైరస్ పుట్టిందని భావించేవారు. వారి అపార్థాల ఫలితంగా వచ్చిందే స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అనే పేరు. అలా తదనంతర కాలంలో ఆ పేరు స్థిరపడిపోయింది. స్పెయిన్‌లో మాత్రం ఈ వైరస్‌ను ఏమనేవారో తెలుసా? ఫ్రాన్స్ ఫ్లూ. వారు తమ శత్రు దేశం ఫ్రాన్స్‌లోనే ఈ వైరస్ పుట్టిందని నమ్మేవారు. నిజానికి ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అన్నదానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కొందరు చైనా అని, మరికొందరు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా అని అంటారు. అయితే స్పెయిన్ మాత్రం ఆ జాబితాలో లేకపోవడం గమనార్హం. (కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం) లండన్‌లో మాస్క్‌లతో -
సామాజిక దూరం కోసం రోబో డాగ్
సింగపూర్ : ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రేయస్కర మార్గమని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నప్పటికీ, లాక్డౌన్లు అమలు చేస్తున్నప్పటికీ పట్టించుకోని వారు కొందరుంటారు. ఆ కొందరి కోసం ‘బోస్టన్ డైనమిక్స్’ సంస్థ ఓ రోబోటిక్ డాగ్‌ను సృష్టించింది. సామాజిక దూరం పాటించని వారికి ‘స్పాట్’ పెట్టాలనే ఉద్దేశంతోనేమో దానికి ‘స్పాట్’ అని పేరు పెట్టారు. ఆ రోబో ప్రస్తుతం సింగపూర్‌లోని ‘బిషన్ ఆంగ్మో కియో’ పార్క్‌లో ప్రయోగాత్మకంగా తన విధులను నిర్వర్తిస్తోంది. ఎక్కడయితే మనుషులు గుమికూడారో గుర్తించి అక్కడికి ‘దూరం దూరం’ అంటూ హెచ్చరికలు చేస్తూ దూసుకుపోతుంది. తల బాగాన అమర్చిన కెమెరాల ద్వారా మనుషులు గుమికూడిన చోటును ఆ రోబో గుర్తిస్తుంది. దూరం పాటించాలంటూ ముందుగా రికార్డు చేసిన వాయిస్‌ను వినిపిస్తోంది. ( కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...) ప్రయోగాత్మకంగా రోబో సేవలను ప్రవేశపెట్టామని, మున్ముందు దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని ‘గవర్నమెంట్ టెక్పాలజీ ఏజెన్సీ’ మీడియాకు తెలియజేసింది. ఈ రోబోకు అమర్చిన కెమేరాలు వ్యక్తిగతం ఎవరి చిత్రాలనుగానీ, మాటలును గానీ రికార్డు చేయదని, పౌరుల వ్యక్తిగత గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని ఏజెన్సీ అధికారులు తెలిపారు. రోబో దగ్గరికి వస్తుంటే దూరం జరగాల్సిన సందర్శకులు ఏకంగా దూరం పారి పోతున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. -
మద్యం షాపులు ఇలా తెరిచారు.. అలా మూశారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సోమవారం మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం కోసం 40 రోజులుగా వేచిచూస్తున్న మందు బాబులు ఒక్కసారిగా లిక్కర్ షాపుల ముందు బారులుతీరారు. అన్ని మద్యం షాపుల ముందు పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. మూడో దశ లాక్డౌన్ ప్రారంభమైనా ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, హర్యానా, ఏపీ, గోవా సహా పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలకు అనుమతించారు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మద్యం దుకాణాలకు నిర్ధేశిత సమయంలోనే అధికారులు అనుమతించారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనను మద్యం ప్రియులు పలు చోట్ల ఖాతరు చేయకపోవడంతో ఆయా షాపులను అధికారులు మూసివేయిన్నారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్‌ను మూసివేశామని కరోల్‌బాగ్ ఎస్హెచ్ఓ మణీందర్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లు మినహా వైన్ షాపులను, కాలనీల్లోని వైన్ షాపులకు అనుమతించింది. పలు మద్యం దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు మధ్యాహ్నానికే ఆయా షాపులను మూసివేయించారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేసేవరకూ లిక్కర్ షాపులను తెరిచేందుకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. మద్యం, గుట్కా, పాన్ షాపుల వద్ద ఒకే సమయంలో ఐదుగురు మించి ఉండరాదని, వారి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఇక కర్ణాటకలోనూ మద్యం షాపులు తెరుచకున్నాయి. 40 రోజుల లాక్డౌన్లో మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో రోజుకు రూ 60 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి హెచ్ నగేష్ వెల్లడించారు. చదవండి : అందుకే మద్యం ధరలు పెంచారు : రోజా లిక్కర్‌పై కోవిడ్-19 సెస్ మద్యంపై కోవిడ్-19 సెస్‌ను విధించాలని హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం నాణ్యత, పరిమాణం ఆధారంగా రూ 2 నుంచి రూ 20 వరకూ సెస్ విధించాలని భావిస్తున్నామని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. ఇక ఏపీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలను అనుమతించాయి. -
ఇక హాస్టళ్లలోనూ భౌతిక ‘దూరం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ హాస్టళ్ల అనుమతులకు సంబం ధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి హాస్టల్లో కనీసంగా 50 ఎస్ఎఫ్టీ స్థలం కేటాయించాలన్న నిబంధన ఉండగా దానిని రెట్టింపు చేయాలని బోర్డు భావిస్తోంది. వీలైతే అంతకంటే ఎక్కువ స్థలం కేటాయించేలా చూడాలన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఆ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. వాటి ప్రకారమే హాస్టళ్ల గుర్తింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియెట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. లక్షన్నర మందికిపైగా.. రాష్ట్రంలో 2,500కు పైగా జూనియర్ కాలేజీలుంటే అందులో ప్రభుత్వ, ఎయిడెడ్, సంక్షేమ శాఖల గురుకుల జూనియర్ కాలేజీలు పోగా ప్రైవేటు కాలేజీలు 1,556 ఉన్నాయి. అందులో నివాస వసతితో కూడిన(హాస్టళ్లతో) జూనియర్ కాలేజీలు 570 వరకు ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే 9.5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో దాదాపు 3.5 లక్షల మంది చదువుతుండగా, 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. అందులో లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయా కాలేజీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 10 మందిని ఉంచుతున్నారు. సదుపాయాలు పెద్దగా కల్పించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఐదారు అంతస్తులుండే హాస్టళ్లలో లిఫ్ట్ సదుపాయం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం కూడా ప్రధానమే కావడంతో 2020–21 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. మరో వేయి వరకు పాఠశాలల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. చదవండి: తగ్గిన కంటైన్మెంట్ జోన్లు 2018లోనే నిబంధనలు రూపొందించినా... హాస్టళ్లలో ఉండాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై 2018 మార్చిలోనే ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఫీజును నిర్ణయించింది. ముందుగా ఫీజు ఎక్కువగా ఉందని యాజమాన్యాలు పేర్కొనడంతో మూడుసార్లు ఫీజు తగ్గించింది. అయినా యాజమన్యాలు ముందుకు రాకపోగా, కోర్టును ఆశ్రయించాయి. దీంతో బోర్డు ఆ నిబంధనల అమలును పక్కన పెట్టింది. ప్రస్తుతం ఒక్కో హాస్టళ్లలో 300 నుంచి 500 వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేయడం ద్వారా భౌతిక దూరం పాటించేలా చేయవచ్చన్న ఆలోచనకు వచ్చింది. దీంతోపాటు ప్రతి చోట భౌతిక దూరాన్ని పెంచేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు అధికారుల కమిటీ చర్యలు చేపట్టింది. మార్పులు చేయనున్న కొన్ని నిబంధనలు (ప్రస్తుతం ఉన్నవి)... ►25 మంది విద్యార్థులు ఉండే ఒక్కో డార్మెటరీ 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. రూమ్ అయితే ఒక్కో విద్యార్థికి 50 ఎస్ఎఫ్టీ ఉండాలి. ► 25 మంది విద్యార్థులకు స్టడీ రూమ్ 300 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►ఫస్ట్ ఎయిడ్/సిక్ రూమ్ ఒక్కో విద్యార్థికి 75 ఎస్ఎఫ్టీ ఉండాలి. డార్మెటరీ లాంటిదైతే 10 మందికి 750 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►కిచెన్ 250 ఎస్ఎఫ్టీ, డైనింగ్ హాల్ కనీసంగా 500 ఎస్ఎఫ్టీ, రిక్రియేషన్ రూమ్ 300 ఎస్ఎఫ్టీ, లైబ్రరీ 500 ఎస్ఎఫ్టీ, ఆఫీస్ ఏరియా 500 ఎస్ఎఫ్టీ, కౌన్సెలింగ్/గైడెన్స్ రూమ్ 120 ఎస్ఎఫ్టీ ఉండాలి. కొన్నాళ్లు భౌతికదూరం పాటించేలా.. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. ఇప్పటికిప్పుడు అదనపు తరగతి గదులను నిర్మించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే వీలైనంత వరకు విద్యార్థుల మధ్య దూరం పాటించేలా చేయాలని భావిస్తోంది. విద్యార్థులను విభజించి షిఫ్ట్ పద్ధతిలో తరగతులను కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా చర్చించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని హాస్టళ్లలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
జమాత్‌కు దూరంగా.. జకాత్‌కు దగ్గరగా
కర్నూలు(అర్బన్): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షలకు ముస్లింలు ఉపక్రమించారు. నెలరోజుల పాటు ఐదుపూటలా నమాజు చేస్తారు. ఈ మాసంలో ఏ కార్యం చేసినా పుణ్యం 70 రెట్లు అధికంగా ఉంటుందని దివ్య ఖురాన్‌తో పాటు హదీసుల్లో పేర్కొన్నారు. ఎవరిపైనా కోప పడకుండా, కొట్లాడకుండా ప్రశాంత చిత్తంతో అల్లాను ఆరాధించాలి. లాక్డౌన్ నిబంధనలను గౌరవిస్తూ రంజాన్ పుణ్య కార్యాలు ఆచరించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా నమాజ్ జమాత్‌తో (సామూహికంగా) చేయాలనేది శ్రేష్టమైన విధానమని పేర్కొంటారు. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా జమాత్‌తో కాకుండా వ్యక్తిగతంగా ఇళ్లలోనే నమాజు చేయడం ద్వారా పుణ్యం ఏమాత్రమూ తగ్గదని ఆలిమ్లు పేర్కొంటున్నారు. ఉపవాస వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు.. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం ఉదయం 10 గంటల వరకు వెసులు బాటు కలి్పంచింది. పుణ్యకార్యాల్లో భాగంగా ఎవరైనా సహెర్కు ఆహారం సమరి్పంచాలనుకుంటే తెల్లవారు జామున 3 నుంచి 4.30 గంటల వరకు ఉండే సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ పూర్తి చేసుకోవాలి. అలాగే ఇఫ్తార్‌కు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు వెసులుబాటు ఉంటుంది. సడలింపులు ఇచ్చాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మసీదులో ఇమామ్, మౌజన్, మరో ముగ్గురు కమిటీ సభ్యులు (మొత్తం ఐదుగురు) నమాజ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ధ్రువీకరించిన ఇమామ్, మౌజన్లకు ఇంటి నుంచి మసీదులకు వెళ్లేందుకు పాసులు ఇస్తారన్నారు. గుర్తించిన హోటళ్ల ద్వారా సహెర్, ఇఫ్తార్ సమయంలో కేవలం పార్శిల్స్ మాత్రమే ఇచ్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ‘జకాత్’కు సంబంధించి పేదవారి ఇంటికి సరుకులు చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో, దాతల ఇళ్ల వద్ద సరుకులు పంచరాదని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్న ముస్లింలకు సహెర్, ఇఫ్తార్ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్ సమకూరుస్తున్నట్లు చెప్పారు. భౌతిక దూరాన్ని పాటిద్దాం ఐదు పూటలా మసీదుల నుంచి ఆజాన్ పిలుపు వినిపిస్తుంటుంది. ఇమామ్, మౌజన్లు మసీదులో నమాజ్ చేస్తారు. లాక్డౌన్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటించాల్సి ఉంది. నమాజులు ఇళ్లల్లోనే చేయాలి. ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. దేశంలోని మౌలీ్వలు, మతపెద్దలందరు కలసికట్టుగా తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం కలి్పంచిన వెసులుబాటును సది్వనియోగం చేసుకుందాం. – ముఫ్తి అబ్దుస్సలాం, ప్రభుత్వ ఖాజీ -
వినూత్న ఆలోచన.. ఆటోలో 5 అరలు!
-
ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహింద్రా ఆఫర్!
హైదరాబాద్: మందుల్లేని మహమ్మారి కరోనా ను కట్టడి చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే మన ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో ఈ-ఆటోరిక్షాను అరలుగా మార్చి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా.. ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన సదరు డ్రైవర్ వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. (చదవండి: వావ్.. క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ చూశారా?) ‘క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి’అనే క్యాప్షన్‌తో ఆనంద్ మహింద్రా వీడియో షేర్ చేశారు. మహింద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్ను ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. తమ ఆటో బిల్డింగ్ కంపెనీలో ఈ-ఆటోరిక్షా డ్రైవర్‌ను సలహాదారుగా పెట్టుకుందామని పేర్కొన్నారు. కాగా, 27 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు 10 వేల వ్యూస్ రాగా.. 9 వేల లైకులు వచ్చాయి. (చదవండి: కరోనా: 20 మందికి విందు.. ఆమెకు పాజిటివ్) -
ఒసాకా మేయర్‌పై నెటిజన్ల ఆగ్రహం
టోక్యో: జపాన్ పట్టణం ఒసాకా మేయర్ ఇచిరో మట్సూరీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విరుచుకుపడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జపాన్‌లో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మే 6 వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఒసాకా పట్టణంలో శుక్రవారం ఉదయం నాటికి దాదాపు 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ ఇచిరో.. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనుల నిమిత్తం మినహా బయటకు రావొద్దని కోరారు.(వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్!) ఈ క్రమంలో సూపర్ మార్కెట్లలో సామాజిక ఎడబాటు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఓ విలేకరి కోరగా.. ఇందుకు బదులిచ్చిన ఇచిరో.. ‘‘ఆడవాళ్లు షాపింగ్‌కు వస్తే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. వాళ్ల స్థానంలో నువ్వు ఉన్నట్లయితే కావాల్సిన వస్తువులు తీసుకుని వెంటనే బయటకు వెళ్తావు. నేరుగా ఇంటికి చేరుకుంటావు. కానీ వాళ్లు అలా కాదు. ఆలస్యం చేస్తారు. కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ’’అని వ్యాఖ్యానించారు. అదే విధంగా భార్యాభర్తలు కలిసి షాపింగ్‌కు వెళ్లడం మానుకోవాలని సూచించారు. పుట్టిన నెలల ఆధారంగా సరి- బేసి విధానంలో సూపర్‌మార్కెట్‌కు వెళ్లాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఇచిరో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. మహిళలను అగౌరవపరచడం జపాన్ సంస్కృతి కాదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజాప్రతినిధిగా అర్హత లేదని కామెంట్లు చేస్తున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!) -
దూరం మరచి... వైరం పెరిగి...
చైనీస్ తైపీ: కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్ తైపీ బేస్‌బాల్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్ మంకీస్, ఫుబొన్ గార్డియన్స్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో... విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది. -
ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!
సాక్షి, బెంగళూరు : మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రధాని నుంచి క్రిందిస్థాయి అధికారుల వరకు మొత్తుకుంటున్నా దేవెగౌడ కుటుంబ పట్టించుకోలేదు. పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని తిలకరించారు. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం. శానిటైజర్లు వాడారో, లేదో తెలియదు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి అశ్వత్నారాయణ తెలిపారు. రామనగర డిప్యూటీ నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. కలెక్టర్, ఎస్పీతో కూడా మాట్లాడానని చెప్పారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పెళ్లి తంతు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: మాజీ సీఎం ఇంట పెళ్లి -
కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 విశ్వమంతా ప్రకంపనలు పుట్టిస్తూనే వుంది. ఈ వైరస్ కట్టడికి ప్రస్తుతానికి మందు, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ విస్తరణ సైకిల్ ను అడ్డుకోవాలంటే భౌతిక దూరం ఒక్కటేనని అంతా అంగీకరిస్తున్నమాట. అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ , తమను తాము, అంతిమంగా చుట్టూ వున్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ ఎలా పాటించాలనే దానిపై చిన్నపిల్లలు రూపొందించిన వీడియో ఆసక్తికరంగా మారంది. భౌతిక దూరాన్ని పాటించికపోతే ప్రమాదం ఎలా వుంటుందనే అంశాన్ని చాలా నేర్పుగా వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకవైపు కరోనా విస్తరణతో ప్రపంచదేశాలన్నీ అష్ట కష్టాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై వున్నారు. మరోవైపు వ్యాధిని నిరోధించడంలో తెలివిగా తమకున్న వనరులను ఉపయోగించుకొని భౌతిక దూరాన్ని ఎలా పాటించాలనే విషయాన్ని పిల్లలు చక్కగా వివరించడం విశేషం. అందుకే ఇది బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాను ఆకట్టుకుంది. పిల్లలు చాలా తెలివైనవారు అంటూ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు.