కాలిఫోర్నియా : కరోనా వైరస్ మనుషుల మధ్య దురాన్ని తీసుకొచ్చింది. భౌతిక దూరం పేరుతో ఎంతో మంది తమ వారికి దూరంగా ఉంటున్నారు. మహమ్మారి ఎక్కడి నుంచి ఎలా తమను ఎటాక్ చేస్తుందో అని నిత్యం భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా దూరంగా ఉన్న తమ తాత, అమ్మమ్మలను హత్తుకునేందుకు ఓ చిన్న పాప వినూత్న ఆలోచన చేసింది. కాలిఫోర్నియాకు చెందిన పైజ్ అనే పదేళ్ల పాప సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తాతా, అమ్మమ్మలను కౌగిలించుకున్న ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. (వైరల్ : ఇప్పుడంతా మాదే రాజ్యం )
తన వారిని కలుసుకోవాలనే కోరిక పైజ్ మనుసులో బలంగా నాటుకుంది. ఇందుకు ఎంతో కష్టపడి కొన్ని వీడియోలు చూసి షవర్ కర్టెన్ సహాయంతో ప్లాస్టిక్ కర్టెన్‌లను తయారు చేసింది. దీనిని తమ తాతా, అమ్మమ్మల ఇంటి ముందు తలుపు వద్ద కర్టెన్ ఉంచింది. అనంతరం 'మీరు నన్ను కౌగిలించుకోండి' అని చిన్న అమ్మాయి చెప్పింది. దీంతో పైజ్ అమ్మమ్మ ఎంతో సంతోషించి, ఆమెను హత్తుకుంది. కర్టెన్, పైజ్‌ను చూసిన అమ్మమ్మ.. 'ఓహ్ మై గాడ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
(ప్రభాస్ సినిమాలో 'మైనే ప్యార్ కియా' నటి )
దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తల్లి లిండ్స్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో దీనిని చూసిన చిన్నారి తెలివి తేటలను మెచ్చుకుంటున్నారు. ఏ కష్టం వచ్చిన తమ వారిని ఎవరు వీడదీయలేరని అభిప్రాయపడుతున్నారు.'మేము మా మనవరాళ్ళు, కుమార్తెల కౌగిలింతలను చాలా మిస్ అవుతున్నాం. ఇది నా హృదయాన్ని హత్తుకుంది' అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నపుడు..)
Comments
Please login to add a commentAdd a comment