
పాట్నా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక బదిలీలు తప్పనిసరి. విధుల్లో భాగంగా వారు ఎక్కడికైనా వెళ్లాల్సిందే. ఇతర రాష్ట్రాలకైనా, దేశ సరిహద్దులకైనా వెళ్లక తప్పదు. ఈ క్రమంలో తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయకపోతే ఉద్యోగులు బాధపడతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తనకు బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారని ఓ టీచర్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా బీహార్ ప్రజలను దారుణంగా అవమానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
వివరాల ప్రకారం.. కేంద్రీయ విద్యాలయంలో ప్రొబేషన్‌లో ప్రైమరీ టీచర్ దీపాలీ షాకు బీహార్‌లోని జెహానాబాద్‌లో పోస్టింగ్ వచ్చింది. దీంతో, ఆమె ఆవేశానికి లోనయ్యారు. బీహార్‌లో పరిస్థితులు నచ్చకపోవడంతో తిట్ట దండకం అందుకున్నారు. ఇదే సమయంలో బీహార్ ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో టీచర్ దీపాలీ షా మాట్లాడుతూ.. నాకు బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దేశ సరిహద్దుల్లో జాబ్ వచ్చినా బాగుండేది. అక్కడికి వెళ్లేందుకు కూడా నేను రెడీ ఉన్నాను. నాకు బీహార్‌కు వెళ్లాలని లేదు. బీహార్ ప్రజలకు అసలు పౌర స్పృహే ఉండదు. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మిగిలిపోయిందంటే దానికి బీహారీలు కూడా ఒక కారణం. బీహార్‌ను భారత్ నుంచి తొలగించిన రోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాం. మన రైల్వేలను కూడా బీహారీలే భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ బూతులు తిట్టారు.
అంతేకాకుండా.. కేంద్రీయ విద్యాలయాలు కేవలం బీహార్‌లో మాత్రమే ఉన్నాయా?. వేరేచోట నాకు పోస్టింగ ఇవ్వొచ్చు కదా?. నాపై వారికున్న శత్రుత్వం ఏమిటో తెలియడం లేదు. దేశంలో అత్యంత చెత్త ప్రాంతానికి నన్ను పంపించారు. కొందరు కోల్‌కతాకు వెళ్లేందుకు ఇష్టపడరు. నేను అక్కడికి వెళ్లేందకు సిద్ధంగా ఉన్నాను. ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లడానికి రెడీ ఉన్నాను. నన్ను గోవాకో, ఒడిశాకో, హిమాచల్ ప్రదేశ్‌కో లేదా దక్షిణాది చివరకు లద్దాఖ్‌కు పంపించినా బాగుండేది’ అంటూ కామెంట్స్ చేశారు.
దీంతో, ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీహార్ ఎంపీ శాంభవి దృష్టికి వచ్చింది. దీంతో, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమెను తక్షణం సస్పెండ్ చేస్తే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క వీడియోను ఆమెను చిక్కుల్లో పడేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
A primary school teacher in Bihar's Jehanabad has been suspended after a video of her making offensive comments about the state went viral. In the video, she used inappropriate language and expressed dissatisfaction with her posting in Bihar, calling it "India's worst region."… pic.twitter.com/lvy64rULO6
— The Tatva (@thetatvaindia) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment