kendriya vidyalaya
-
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్‌ను ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొలం బాట పట్టిన విద్యార్థులు
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్‌లో ఆయా నమూనాలకు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాలతో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సంబంధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్‌గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది. భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ నోడల్ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్‌ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు. వ్యవసాయ వికాసానికి.. విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం. – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో చేరటం చాలా సంతోషంగా ఉంది. భూసార పరీక్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – ఎన్.శివగగన్, 9వ తరగతి -
అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులు
-
జాబిలిపై అన్వేషణకు ఇస్రో చంద్రయాన్-3
-
ఆరో తరగతిలో ప్రశ్న.. దళితులంటే ఎవరు..?
చెన్నై : ‘సీబీఎస్ఈ ఆధ్యర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దళితులు, ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఆరో తరగతి పరీక్ష పత్రంలో ప్రశ్నలు పొందుపరిచారు. తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయ నిర్వహించిన పరీక్షలో దారుణమైన ప్రశ్నలడిగారు’అని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆరోపించారు. సీబీఎస్ఈ ఆరో తరగతి ప్రశ్నాపత్రమని పేర్కొంటూ శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. స్టాలిన్ ట్వీట్ ప్రకారం.. దళితులంటే ఎవరు..? అనే ప్రశ్నకు.. ఎ)విదేశీయులు, బి)అంటరానివారు, సి)మద్య తరగతివారు, డి)ఎగువ తరగతివారు అని ఆప్షన్లు ఇచ్చారు. ఇక మరో ప్రశ్న.. ముస్లింలకు సంబంధించిన ఈ క్రింది సాధారణాంశమేది..? అనే ప్రశ్నకు ఎ)ముస్లింలు బాలికలను పాఠశాలకు పంపరు. బి)వారు ప్యూర్ వెజిటేరియన్, సి)వారు రోజా సమయంలో నిద్రపోరు, డి)పైవన్నీ.. అని ఆప్షన్లు ఇచ్చారు. ఆరో తరగతి సాంఘీకశాస్త్రంలోని పాఠ్యాంశం ఆధారంగా ఈ ప్రశ్నలు రూపొందించినట్టు చెప్పారు. దీంతో సీబీఎస్ఈ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరణ్, రాజ్యసభ ఎంపీ వైకో కూడా విమర్శలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారుల మెదళ్లలో విషాన్ని నింపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, స్టాలిన్ పోస్టు చేసిన ప్రశ్నాపత్రం అధికారికమైనదేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ సిబ్బంది ఈ ఆరోపణల్ని ఖండించారు. అలాంటి ప్రశ్నలేవీ అగడలేదని కొట్టిపడేశారు. Shocked and appalled to see that a Class 6 Kendriya Vidyalaya exam contains questions that propagate caste discrimination and communal division. Those who are responsible for drafting this Question Paper must be prosecuted under appropriate provisions of law.@HRDMinistry pic.twitter.com/kddu8jdbN7 — M.K.Stalin (@mkstalin) September 7, 2019 -
సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి సిద్దిపేట కూడా ఉంది. 2017 మార్చిలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, అయితే వీటి ఏర్పాటుకు ఉచితంగా స్థలం, తరగతుల ప్రారంభానికి తాత్కాలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ 13 విద్యాలయాలకు అనుమతినిచ్చారు. ఇక మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా అలోట్‌లో రెండో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నివేదించినప్పటికీ కేంద్రం మంజూరు చేయలేదు. -
‘అలా చూపిస్తే అమ్మాయిలు రేప్ కోరుకున్నట్లే’
రాయ్‌పూర్ : కేంద్ర విద్యాలయంలో పాఠ్యాంశాలు బోధించే బయాలజీ టీచర్ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందాన్ని చూపించే వస్త్రాలు ధరిస్తే తమపై లైంగిక దాడికి ఆహ్వానించినట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి వస్త్రాలు వేసుకుంటే, అందాన్ని ప్రదర్శిస్తే నిర్భయలాంటి ఘటనలు జరుగుతాయని, ఇష్టం వచ్చినట్లు బయట తిరిగే వాళ్లకు నిర్భయకు పట్టిన గతే పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సంచలన సూచనలతో భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి ఆ టీచర్‌పై స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌లోని ఓ కేంద్రీయ విద్యాలయంలో స్నేహలత శంఖ్వార్ అనే బయాలజీ టీచర్ తొమ్మిది, ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులకు ఇచ్చే కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థినులకు ఆమె సలహాలు ఇస్తూ అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే, లిప్‌స్టిక్ పెట్టుకుంటే ప్రమాదం అన్నారు. అలా చేసేవారిపై నిర్భయ దాడి ఘటనలు జరుగుతాయని, పరోక్షంగా వారే లైంగిక దాడికి ఆహ్వానించిన వాళ్లవుతారని అన్నారు. ‘అందమైన ముఖాలు లేనప్పుడు మాత్రమే అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించాలి. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారు. తన భర్త కూడా కానీ ఒకబ్బాయితో నిర్భయ అంతరాత్రి వేళ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటివి ఎందుకు చేస్తారో అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఎజెన్సీ ప్రాంతాల్లోనే అలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుంటాయి. రాత్రిపూట నిర్భయతల్లి ఆమెను బయటకు వెళ్లనీయొద్దు. నా ఉద్దేశంలో తప్పు నిర్భయదే.. అలా చేసే అమ్మాయిలదే.. అబ్బాయిల తప్పుకాదు. ఇలాంటి సంఘటనలు ఒకవేళ అమ్మాయిలు ఎదుర్కొంటున్నారంటే అది వారు చేసిన పాపాలకు అనుభవించే శిక్ష తప్ప మరొకటి కాదు. ఏ అమ్మాయి తన శరీరాన్ని బయటకు చూపాలని ఆరాటపడుతుందో ఆ అమ్మాయిని ఒకబ్బాయి క్యారెక్టర్ లేని అమ్మాయనే అనుకుంటాడు’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పూర్తి వివరాలు తెలుసుకొని ఆ టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కూడా హామీ ఇచ్చారు. -
సన్నీ లియోన్ని ఆదర్శంగా తీసుకో!
విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన బెంగళూరు: ’బాయ్‌ఫ్రెండ్‌ను పెట్టుకో. సన్నీ లియోన్ ఆదర్శంగా తీసుకో. శృంగార సాధనాలు వాడు. నన్ను తరచూ కలుస్తూ ఉండు. నేను నీకు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాను. నా మాట వినలేదనుకో.. నీకు క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావు’ .. ఓ విద్యార్థినితో ప్రిన్సిపాల్ చెప్పిన మాటలివి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన వాడే.. దారితప్పి ఇలా విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. నగరంలోని సీవీ రామన్ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ 12వ తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 26న రాత్రి 7.20 గంటల నుంచి 8.10 మధ్య ఈ ఘటన జరిగింది. ఫిజిక్స్ టీచర్ షణ్ముగం తనను ప్రిన్సిపాల్ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్ చాక్లెట్ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది. కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూడటంతో నిపుణులు, డీపీఐ అధికారులు శుక్రవారం విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాధిత విద్యార్థినిపై లైంగిక వేధింపులకు మునుపే ప్రిన్సిపాల్‌పై పలు ఫిర్యాదులు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు అందాయి. పదో తరగతి నుంచి 12వ తరగతి అమ్మాయిలను ప్రిన్సిపాల్ కుమార్ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని కేవీ ఉద్యోగి ఒకరు చైల్డ్ హెల్ప్‌లైన్ దృష్టికి తీసుకొచ్చారు. సంచలనం సృష్టించిన ఈ లైంగిక వేధింపుల ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కుమార్ ఠాకూర్‌కు జారీచేసిన బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే నోడల్ చైల్డ్‌హెల్ప్‌లైన్ అధికారులు బెంగళూరు డీసీపీకి లేఖ రాశారు. -
వైరల్ వీడియో: ఆ ఇద్దరు అన్నదమ్ములే!
కేవీ విద్యార్థిని చితకబాదిన కేసులో అన్నదమ్ములపై ఎఫ్ఐఆర్ ముజఫర్‌పూర్: కేంద్రియ విద్యాలయం (కేవీ)లో ఓ విద్యార్థిని చితకబాదిన వ్యవహారంలో ఇద్దరు తోటి విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరగతి గదిలో ఇద్దరు అబ్బాయిలు ఓ విద్యార్థిని అతి అమానుషంగా, కిరాతకంగా చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వీడియోపై దర్యాప్తు జరిపిన పోలీసులు సెప్టెంబర్ 25న ముజఫర్‌పూర్‌లోని కేంద్రియ విద్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. 12వ తరగతి విద్యార్థులైన ఇద్దరు అన్నదమ్ములు ఈ విధంగా 11వ తరగతి విద్యార్థిని అతి అమానుషంగా కొట్టినట్టు తేలింది. ఈ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న ఓ నేరగాడికి సంబంధం ఉన్నవారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హెచ్చార్డీ శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వావా నివేదిక సమర్పించాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి.. నిందితులైన ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు కాజి మహమ్మద్పుర పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. తరగతి గదిలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఇద్దరు అన్నదమ్ములు అతి అమానుషంగా జూనియర్ విద్యార్థిపై దాడి చేసినట్టు తెలుస్తున్నదని ఆయన వివరించారు. -
కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కేంద్రీయ విద్యాలయంలో హిందీ, ఇంగ్లిష్, సాంఘిక, ప్రాథమిక తరగతులను బోధించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఈనెల 26వ తేదీన కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంటర్వూ్యలకు హాజరుకావాలని కోరారు. వివరాల కోసం వెబ్ సైట్ ఠీఠీఠీ జుఠిఠ్చీట్చnజ్చl.ౌటజలో చూడాలని తెలిపారు. -
కేవీ లో టీచర్ల వికృత చేష్టలు!
బాలికల పట్ల అసభ్య ప్రవర్తన ఫిర్యాదులు రాలేదన్న ప్రిన్సిపాల్ కర్నూలు: ఆదర్శంగా ఉంటూ విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. వికృత చేష్టలతో సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు కేంద్రీయ విద్యాలయ(కేవీ) టీచర్లు. ఐదారేళ్ల క్రితం బాలికలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఈ విద్యాలయంకు చెందిన పలువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. మరోసారి అక్కడి ఉపాధ్యాయులు అసభ్య ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. క్రమశిక్షణ పేరుతో బాలికలపై వికృత చేష్టలకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయపడుతున్నారు. 8, 9 తరగతుల బోధన ఉపాధ్యాయులపైనే ఆరోపణలు కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టులో కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ఒక్కటి నుంచి 12 వ తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ, సీబీఎస్ఈ విధానం అమల్లో ఉండడంతో కార్పొరేట్ స్థాయి కంటే మెరుగైన బోధన లభిస్తుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చదివించడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల చేష్టలతో పాఠశాలకు చెడ్డ పేరు వస్తోంది. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన బాలికలపై కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 8,9 తరగతులు చదివే విద్యార్థినులపై ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతున్నారు. కొందరు తల్లిదండ్రులకు చెప్పగా వారు ఫిర్యాదు చేసేందుకు స్కూల్‌కు వస్తే ముఖ్యాధికారులు స్పందించిన తీరు బాధాకరంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాకెవరూ ఫిర్యాదు చేయలేదు బాలికలపై ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని నాకెవరూ ఫిర్యాదు చేయలేదు. గతంలో ఉండేవి. వారందరినీ సస్పెండ్ చేసి బదిలీ చేశాం. ఇప్పుడు ఉన్నాయంటే నేను నమ్మలేకున్నా. ఇప్పటికైనా బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారణ చేయిస్తా. - అనురాధ, ప్రిన్సిపాల్ -
సిరిసిల్ల కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయంలో 2015-2016 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం చైర్మన్, కలెక్టరు నీతూప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి జూలై 3వరకు దరఖాస్తు గడువుందని, ఫారాలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సుభాష్‌నగర్, సిరిసిల్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లభిస్తాయని పేర్కొన్నారు. జూలై 7 నుంచి 10 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని, తరగతికి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయం, సిరిసిల్ల ఫోన్ నెం.08723-232244లో సంప్రదించాలని సూచించారు. -
కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని (కేవీ) జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ ఆర్.కళావతి ఇతర అధికారులు పాల్గొన్నారు. (మారిస్‌పేట) -
కేంద్రీయ విద్యాలయాల్లో 3వ భాష
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ మూడో భాషగా సంస్కృతాన్ని బోధించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు. అక్టోబర్ 27న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో జరిగిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మూడో భాషగా జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని బోధించాలని, జర్మన్‌ను అదనపు సబ్జెక్ట్‌గా విద్యార్థులకు బోధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల 500 కేంద్రీయ విద్యాలయాల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న 70 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడనుందని విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. నవంబర్ 21న ఈ పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు 27వ తేదీలోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భాష ఎంపికకు సంబంధించిన నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకే వదిలేయాలని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని, అందులోనూ విద్యా సంవత్సరం మధ్యలో దీనిపై నిర్ణయం తీసుకోవడం తగదని చెప్పారు. ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, దీనిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దీంతో విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. **