సాక్షి, న్యూఢిల్లీ: సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి సిద్దిపేట కూడా ఉంది.
2017 మార్చిలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, అయితే వీటి ఏర్పాటుకు ఉచితంగా స్థలం, తరగతుల ప్రారంభానికి తాత్కాలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని నిర్ణయించింది.
దానిలో భాగంగా ఈ 13 విద్యాలయాలకు అనుమతినిచ్చారు. ఇక మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా అలోట్‌లో రెండో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నివేదించినప్పటికీ కేంద్రం మంజూరు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment