కరీంనగర్ ఎడ్యుకేషన్ : సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయంలో 2015-2016 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం చైర్మన్, కలెక్టరు నీతూప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 16 నుంచి జూలై 3వరకు దరఖాస్తు గడువుందని, ఫారాలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సుభాష్‌నగర్, సిరిసిల్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లభిస్తాయని పేర్కొన్నారు. జూలై 7 నుంచి 10 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని, తరగతికి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయం, సిరిసిల్ల ఫోన్ నెం.08723-232244లో సంప్రదించాలని సూచించారు.
సిరిసిల్ల కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Jun 13 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement