
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఖండించింది.
సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.
సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్‌ల సంఘం డిమాండ్ చేసింది.