IAS officers association
-
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
గాంగ్టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్ -
అవి అసత్య కథనాలు
సాక్షి, అమరావతి: ఎటువంటి ఆధారాలు, పేర్లు లేకుండా రాష్ట్రంలోని ఐఏఎస్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి పేరు పేర్కొనకుండా ‘వసూల్ రాజా’ పేరుతో రాష్ట్రంలోని ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా సత్యదూరమైన కథనాలను ప్రచురించడాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలనలో పూర్తి పారదర్శకంగా ఐఏఎస్‌ల సంఘం వ్యవహరిస్తుందని, ఈ విషయంలో మీడియా పాత్రను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నారు. కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహాజనితమైన కథనాలను ప్రచురిస్తోందన్నారు. దీనివల్ల ఇతర ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 6న సమావేశమైన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ల జనరల్ బాడీ సమావేశం ఆంధ్రజ్యోతి ప్రచురించిన వరుస వార్తా కథనాలను ఏకగ్రీవంగా ఖండించిందన్నారు. పరిపాలనలో చిత్తశుద్ధి, మంచితనంతో అధికారులు పనిచేస్తారని మరోసారి అసోసియేషన్ స్పష్టం చేస్తోందన్నారు. అలాగే ఆదివారం ప్రచురించిన ‘బెడిసి కొట్టిన భేటీ’ కథనాన్ని కూడా అసోసియేషన్ ఖండించింది. 6వ తేదీ సమావేశంలో ఈ కథనాలపై అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు లేవని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నది అవాస్తవమని, ఏకగ్రీవ నిర్ణయంతోనే అసోసియేషన్ ఈ తీర్మానం చేసిందని ప్రద్యుమ్న స్పష్టం చేశారు. -
కలెక్టర్ చెంప దెబ్బ: ఐఏఎస్‌ల సంఘం సీరియస్!
రాయ్‌పూర్ : లాక్డౌన్ నిబంధనలు బ్రేక్ చేశాడంటూ ఛత్తీస్‌ఘడ్‌లోని సురాజ్‌పూర్ జిల్లా కలెక్టర్.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, ఐఏఎస్‌ల సంఘం దీనిపై స్పందించింది. కలెక్టర్ రణ్‌బీర్ శర్మ దురుసు ప్రవర్తనను తప్పుబట్టింది. ‘‘ సురాజ్‌పూర్ జిల్లా కలెక్టర్ ప్రవర్తనను ఐఏఎస్‌ల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాని చర్య. సివిల్ సర్వెంట్స్ సానుభూతి కలిగిఉండాలి. సమాజం పట్ల అన్ని వేళలా దయ కలిగి ఉండాలి. ఇలాంటి కష్ట సమయంలో అదెంతో అవసరం’’ అని పేర్కొంది. కాగా, కొద్దిరోజుల క్రితం మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని లాక్డౌన్ విధుల్లో ఉన్న కలెక్టర్ రణ్‌బీర్ శర్మ, పోలీస్ అధికారులు అడ్డగించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్న టైంలో కలెక్టర్ మొబైల్ ఇవ్వమన్నాడు. సెల్‌ఫోన్‌ను నేలకోసి కొట్టి.. వెంటనే ఆ వ్యక్తి చెంపచెల్లుమనిపించాడు. అంతేకాదు అక్కడున్న పోలీసులకు అతన్ని చితకబాదమని ఆదేశాలివ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు చెరోవైపు అతనిపై లాఠీ ఝుళిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్‌పై బదిలీ వేటు వేశారు. -
బాబు అనుచిత వ్యాఖ్యలు ; ఐఏఎస్‌ల భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే, తన అదుపాజ్ఞల్లో ఉండే అధికారులను బదిలీ చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. నూతన సీఎస్ కోవర్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిపై కూడా బెదిరింపులకు దిగారు. కాగా, ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ హరిత హోటల్లో సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల వల్ల ఐఏఎస్ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ప్రధానంగా చర్చించనున్నారు. బాబు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్ జవహర్‌రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్, పి.ఉషాకుమారి, కరికల్ వలవన్, సునీత శామ్యూల్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. బాబు వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. (సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు) -
చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ రిటైర్డ్ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారిపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను రిటైర్డ్ ఐఏఎస్ బృందం కోరింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాల్ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. చదవండి : సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి, చీఫ్ సెక్రటరీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల అధికారిని బెదిరించడం దారుణమన్నారు. తాము ఆత్మప్రభోదం ప్రకారమే పని చేస్తామని, తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని స్పష్టం చేశారు. తాము(ఐఏఎస్‌లు) నిజాయితీగా పనిచేయడం వల్లే వ్యవస్థ సక్రమంగా నడుస్తోందన్నారు. రాజకీయ లబ్థి కోసమే చంద్రబాబు నాయుడు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుపై ఐఏఎస్‌ల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అని, సహ నిందితుడు అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎల్వీ సుబ్ర హ్మణ్యంను సహనిందితుడు అని ఎలా సంబోధిస్తారని నిలదీస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎస్‌ను కోవర్టు అని ముఖ్య టమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా అం టారు? ఇదేనా ఆయన చెప్పుకునే 40 ఏళ్ల అను భవం. రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. దాంతో అధికారులకు సంబంధం లేదు. కానీ, రాష్ట్ర అత్యున్నత అధికారిని కోవర్టు అని ముఖ్యమంత్రి అన్నాడంటే ఇంగిత జ్ఞానం కోల్పోవడమే’’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు నిలదీస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని ఐఏఎస్ అధికారుల సంఘం భావి స్తోంది. ఎల్వీ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకో వాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని అసోసి యేషన్ యోచిస్తోంది. త్వరలో అసోసియేషన్ సమా వేశమై ఈ మేరకు తీర్మానం చేసి గవర్నర్‌కు సమర్పి ంచాలని భావిస్తున్నట్లు కొందరు ఐఏఎస్ అధికారులు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే.. ఎల్వీ సుబ్మహ్మణ్యంపై సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆయనను నిందితుడు అనడం తీవ్ర తప్పిదమని ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ‘‘హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఎవరూ నింది తుడు అనడానికి వీలులేదు. సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అబద్ధాలు చెప్పి నిందారోపణలు చేయడం తగదు. అసాధారణ పరి స్థితుల్లో పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వెళ్లి సమీక్షిం చడమనేది సీఎస్ బాధ్యతల్లో ఒకటి. బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తించారే తప్ప ఎలాంటి తప్పులేదు ’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు తొత్తుల్లా పనిచేయకుండా నిరాకరించే వారంతా ఆయన దృష్టిలో కోవర్టులా? అని రిటైర్డు ఐజీ ఎ. సుందర్ కుమార్ దాస్ ప్రశ్నిం చారు. ‘‘ఆయన కంటే కోవర్టులను పెట్టుకునేవారు దేశంలో ఎవ రైనా ఉన్నారా? ఎల్వీ సుబ్రహ్మ ణ్యంను పక్కన పెట్టి జూని యరైన పునేఠాను సీఎస్‌గా ఎందుకు పెట్టా రు? తాను చెప్పి నట్టల్లా ఆడు తూ ఫైల్లో ఎక్క డ పెట్ట మంటే అ క్కడ సంతకం పె ట్టే వారే బాబు దృ ష్టిలో నిజాయతీపరు లైన అధి కారులా?’’ అని నిలదీశారు. -
మాకు న్యాయం జరగాలి
సాక్షి, హైదరాబాద్: పోస్టింగ్‌ల విషయంలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఐఏఎస్‌లు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రాధాన్యత పోస్టుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు. పోస్టింగుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పించే విధానాన్ని రూపొందించాలని కోరాలని వారు నిర్ణయించారు. ‘నా తెలంగాణలో నాకు అన్యాయమా’ నినాదంతో పోస్టింగ్‌ల వివక్షను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల్లో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఈ వర్గాలకు చెందిన 20 మంది ఐఏఎస్‌లు సోమవారం హైదరాబాద్‌లోని ఐఏఎస్ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడిగా ఐఏఎస్ అధికారి ఎ.మురళీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రభుత్వం రద్దయ్యే వరకు ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల్లో జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చించారు. ‘ రాష్ట్ర ప్రజలకు మా వంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. అ ప్రాధా న్య, మూడో తరగతి పోస్టులను మా వర్గం వారికి కేటాయిస్తోంది. పోస్టింగ్‌ల్లో అన్యాయం, వివక్షపై గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. సీఎస్‌ను కలసి విన్నవించాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంఘటితంగా ఉండాలి. పరిస్థితులను బట్టి ఒత్తిడి తేవాలి’అని నిర్ణయించారు. ఏడాదిగా అసంతృప్తి.. ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తమకు ప్రాధాన్యత ఉండటం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఐఏఎస్‌లు ఏడాదిగా అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేందుకు జూన్ 25న సమావేశమయ్యారు. అదే నెల 28న సీఎస్ ఎస్కే జోషిని కలసి విషయాన్ని వివరించారు. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ల కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోవడం లేదు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ఐఏఎస్‌లకు అన్యాయం జరుగుతోంది. ఈ వర్గాల వారికి కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వడం లేదు. అగ్రవర్ణాలకు చెందిన జూనియర్ ఐఏఎస్‌లకు జిల్లాల కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది. ఇలాంటి పరిణామాలు మా వర్గాల ఐఏఎస్‌ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది’అని వివరించారు. ఏయే పోస్టుల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయో లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ వీరికి సూచించారు. ఇదే విషయంపై సీఎస్‌కు లిఖితపూర్వకంగా వివరాలు అందజేశారు. అయినా పోస్టింగ్‌ల్లో మార్పులు లేకపోవడంపై వీరు అసం తృప్తితో ఉన్నారు. ఎన్నికల తరుణంలో వీరు మరోసారి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఐఏఎస్ అధికారులు ఆర్వీ చంద్రవదన్, ఎం.దినకర్‌బాబు, ఎల్.శర్మన్, ఎం.చంపాలాల్, బి.భారతిలక్పతినాయక్, ఎ.మురళీ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. -
‘‘టిట్లీ’’ బాధితులకు ఐఏఎస్‌ల బాసట
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు బాసటగా నిలిచారు. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. బాధితులకు బాసటగా నిలవటానికి ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు వస్తాయని ఐఏఎస్‌ల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. -
మేం సమ్మె చేయడం లేదు : ఢిల్లీ ఐఏఎస్
-
ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం
* ఏర్పాట్లు ప్రారంభించిన ఆర్అండ్బీ * ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో నిర్మాణం * అప్రోచ్ రోడ్ల కోసం ఐఏఎస్‌ల ఇళ్ల కూల్చివేత * ఇప్పటికే కొన్ని ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు * అనుమతి కోసం జీఏడీకి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అధికార నివాసం వెనకవైపు ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో కొత్త భవనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనం సిద్ధమయ్యాక అక్కడికి చేరుకునేందుకు వీలుగా కొత్తగా అప్రోచ్ రోడ్లు నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను రోడ్లు భవనాల శాఖ అధికారులు జీఏడీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే భవనాల తొలగింపు పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 25 మంది ఐఏఎస్‌ల గృహాలను ఖాళీ చేయించారు. ఇందులో ఎన్నింటిని తొలగించాలనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ముందువైపు విశాలమైన క్యాంపు కార్యాలయం, వెనకవైపు భారీ గృహసముదాయాన్ని నిర్మించారు. వాస్తులోపం అన్న కారణంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని వినియోగించడం లేదు. వెనకవైపు ఉన్న అధికారిక నివాసాన్నే ఇంటిగా, క్యాంపు కార్యాలయంగా వాడుతున్నారు. కొత్తగా ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి సేకరించిన స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఆ స్థలంతోపాటు సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌కు సంబంధించిన కొంత స్థలాన్ని కూడా వినియోగించనున్నట్టు సమాచారం. ఇక్కడ ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్య కేంద్రాన్ని ఇప్పటికే తరలించారు. ప్రస్తుతం బేగంపేట ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న క్యాంపు కార్యాలయ రహదారిని కాకుండా కొత్త క్యాంపు కార్యాలయానికి మరో ప్రధాన రహదారిని అధికారులు సిద్ధం చేయనున్నారు. ఇది గ్రీన్ల్యాండ్స్తోపాటు ఇటు బేగంపేటకు, అటు అమీర్‌పేట ప్రధాన రహదారికి వెళ్లేలా నిర్మిస్తారు. -
‘ఐఏఎస్’ అసోసియేషన్‌లో సీఎం క్యాంపు ఆఫీస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం సీఎం అధికార నివాసానికి ఎదురుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయానికి చేరనుంది. అక్కడ మూడెకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం యోచి స్త్తున్నట్టు సమాచారం. సీఎంకి గ్రీన్‌ల్యాండ్స్‌లో ఒక కార్యాలయం ఉన్నప్పటికీ కేసీఆర్ వాస్తుదోషం కారణంతో దానిని వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్యాలయ బిల్డింగ్ క న్సల్టెంట్గా సుద్దాల సుధాకర్ తేజను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే సచివాలయం లో వాస్తు అంశాలను పరిశీలించారు.