టిట్లీ తుఫాను కారణంగా చెల్లాచెదురైన జనజీవితాలు
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు బాసటగా నిలిచారు. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. బాధితులకు బాసటగా నిలవటానికి ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు వస్తాయని ఐఏఎస్‌ల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment