ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ | Sankara Nethralaya musical concert grand success In Arizona state of USA | Sakshi
Sakshi News home page

ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్

Published Wed, Nov 13 2024 11:09 AM | Last Updated on Wed, Nov 13 2024 11:12 AM

Sankara Nethralaya musical concert grand success In Arizona state of USA

అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్  విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000  డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్,  రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే  వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.

ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను  ఆకట్టుకుంది.  కొంతమంది  దాతలను సత్కరించారు.  అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.

కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్‌లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.

ఈ కార్య‌క్ర‌మం విజయవంతం కావడానికి  సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్  కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపింది శంకర నేత్రాలయ.

ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్నెస్ బృందాలకు కూడా  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement