arizona
-
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా.. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
26 ఏళ్లుగా ముక్కులోనే ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ముక్క!..కట్‌చేస్తే ..!
చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్‌ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్కి. లెగో బ్రాండ్‌కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా. View this post on Instagram A post shared by 🇵🇭 Ben Havoc (@bigoompalumpia) (చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అరిజోనా (యూఎస్) కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫోటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్ చేస్తూ ‘ఉయ్ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్. -
అరిజోనాలో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగింది. ప్రవాసులు జ్యోతి వెలిగించి, డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ వేడుకకు తరలివచ్చిన ఫీనిక్స్‌లోని వైఎస్ఆర్ అభిమానులు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ సువర్ణ పాలనను గుర్తుచేసుకున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వంశీకృష్ణ ఇరువారం, చెన్నారెడ్డి మద్దూరి, సునీల్ అననపురెడ్డి, నాగరాజ్ దాసరి, రశ్వంత్ పొలవరపు , పరితోష్ పోలి, శ్రీధర్ చెమిడ్తి, లక్ష్మీకాంతరెడ్డి, శివ కొండూరు, రమేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలదని, పేదల సంక్షేమ పథకాలను నెరవేర్చడానికి మరియు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ప్రజాకర్షకమైన దీర్ఘకాలిక పథకాలను పూర్తి చేయడానికి స్థాపించబడిందని వారు పునరుద్ఘాటించారు. పలువురు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సభ్యులు రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. (చదవండి: కువైట్‌లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు) -
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
రికార్డులు ‘షేక్’!
గంటన్నరలో 266 మిల్క్‌షేక్స్ తయారుచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది యూఎస్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీ. ఆరిజోనాలోని సెలిగ్మన్లో ఓ కుటుంబం ‘స్నో క్యాప్’ ఐస్‌క్రీమ్ కంపెనీని నిర్వహిస్తోంది. మిల్క్‌షేక్స్‌లో ఫేమస్ అయిన ‘స్నో క్యాప్’... ‘మోస్ట్ మిల్క్‌షేక్స్ ఫ్లేవర్స్ ఆన్ డిస్ప్లే’గా ఈ ఘనతను సొంతం చేసుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే... ఓ 50 ఫ్లేవర్స్ చేయొచ్చేమో. కానీ ఈ రికార్డు కోసం నాచోలు, బర్గర్లు, ఇతర ఏ స్నాక్ ఫ్లేవర్‌నూ స్నో క్యాప్ వదిలిపెట్టలేదు. గంటా 35 నిమిషాల్లో 266 ఫ్లేవర్స్‌ను ట్రై చేసి ప్రదర్శించి.. శభాష్ అనిపించుకుంది. -
లోగో మారిందెలాగో..
మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లోగోల్లో ఒకటి. ఎరుపు మీద పసుపుపచ్చ రంగులో అందరికీ తెలిసిందే. కానీ.. అరిజోనాలోని సెడోనాలో ఉన్న ఓబ్రాంచ్లో మాత్రం మెక్‌డొనాల్డ్స్ లోగో నీలిరంగులో ఉంటుంది. ప్రపంచమంతటా బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే... అక్కడ మాత్రమే నీలి రంగులో ఎందుకుంది? ఎందుకో తెలుసా? సెడోనా... ఎర్రరాతి పర్వతాలు, సహజ అందాలతో అలరారే అద్భుతమైన నగరం. అలాంటి నగర ప్రశాంతతకు అంతరాయం కలిగించే ఏ నిర్మాణాలను, కట్టడాలను స్థానిక అధికారులు అనుమతించరు. నగరంలో ఏం నిర్మించాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెక్‌డొనాల్డ్స్ 1993లో సెడోనాలో తన అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా స్థానిక అధికారులు దాని పసుపురంగు లోగోపై అభ్యంతరం చెప్పారు. దానికి బదులుగా ఆహ్లాదకరంగా ఉండే నీలిరంగును వాడాలని సూచించారు. టీంతో అధికారుల ఆదేశాల మేరకు మెక్‌డొనాల్డ్స్ అలాగే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదికూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చినవారెవరూ అరుదైన ఈ లోగోముందు ఫొటో తీసుకోకుండా వెళ్లరు. -
పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఫోనిక్స్‌లో నివసించే జస్విందర్ సింగ్ నిన్నా మొన్నటి వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడతను అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఎంతో మంది అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం పని చేయడం ద్వారా అతని ఖ్యాతి ఎల్లలు దాటిందనే సందేహం వస్తోందా.... గడిచిన ఆరు నెలలుగా పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా వార్ మొదలైన తర్వాత అయితే ఆకాశమే హద్దుగా పెట్రోలు/డీజిల్ రేట్లు పెరిగాయ్. ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు భరించలేక ప్రజల నెత్తినే భారం మోపాయి. కరోనా కష్టకాలం ఆ తర్వాత ఫ్యూయల్ రేట్ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం రెక్కలు విప్పింది. ఉప్పు పప్పు మొదలు అన్నింటి ధరలు పెరిగాయ్. డిస్కౌంట్లో పెట్రోల్ అరిజోనాలోని ఫోనిక్స్ దగ్గర జస్విందర్ సింగ్ ఓ పెట్రోల్‌పంప్ (గ్యాస్ స్టేషన్) నిర్వహిస్తున్నాడు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో అన్ని వస్తువుల ధరలు పెరిగితే... జస్విందర్ బంకులో మాత్రం ప్యూయల్‌పై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో బ్యారెల్ ఫ్యూయల్ ధర 5.66 డాలర్లు ఉండగా జస్విందర్ ప్రతీ గ్యాలన్పై 47 సెంట్ల డిస్కౌంట్ ప్రకటించాడు. నష్టాలు వచ్చినా జస్విందర్ బంకులో ప్రతీరోజు సగటున వెయ్యి గ్యాలన్ల ఫ్యూయల్ అమ్ముడవుతోంది. ఈ లెక్కన ప్రతీరోజు బంకుకి 500 డాలర్ల (రూ.39 వేలు) వరకు నష్టం వస్తోంది. మార్చి నుంచి జస్విందర్ ఈ డిస్కౌంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్యూయల్ రేట్లు పెరిగినా.. తన డిస్కౌంట్ ఆఫర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కానీ ఫ్యూయల్ రేట్లు భగ్గుమంటున్నా నెలల తరబడి జస్విందర్ ఇచ్చిన మాట మీద నిలబడటంతో క్రమంగా అందరికీ జస్విందర్ నిజాయితీపై నమ్మకం పెరిగింది. అది అభిమానంగా మారింది. అమ్మనాన్నల స్ఫూర్తితో నష్టాలతో బంకును నిర్వహించడంపై ఎవరైనా జస్వంత్‌ని ప్రశ్నిస్తే... ‘ ఉన్నదాంట్లో పక్కవారికి సాయపడమంటూ మా అమ్మానాన్నలు నాకు నేర్పారు. నేను ఈ గ్యాస్ స్టేషన్ కారణంగానే జీవితంలో స్థిరపడ్డాను. పక్కవారికి సాయపడే స్థితిలో ఉన్నాను. అందుకే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయంగా ఉండాలని ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను కొనసాగిస్తున్నాను’ అని తెలిపాడు జస్వంత్. సాహో జస్వంత్ మధ్యలో నష్టాలు అధికంగా వచ్చినప్పుడు గ్యాస్ స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న స్టోరులో జస్వంత్ సింగ్ అతని భార్య ఎక్కువ గంటలు పని చేయడం ద్వారా ఆ నష్టాన్ని భరించగలుగుతున్నట్టు జస్విందర్ తెలిపారు. వ్యాపారం అంటే లెక్కలు లాభాలే చూసుకునే రోజుల్లో తోటి వారికి సాయం చేసే తలంపుతో ముందుకు సాగుతున్న జస్విందర్ గురించి తెలుసుకున్న అమెరికన్లకే కాదు యావత్ లోకం హ్యాట్సాఫ్ చెబుతోంది. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్, పాటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ.. ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. వందమందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్ అట స్పోర్ట్స్ ,వంశీ ఏరువారం, ఆర్సీ చెన్నయ్య మద్దూరి ఆర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారని తెలిపారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాలమాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి , ఋక్కు మిల, అనుదీప్ యాపల,సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి , విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి మహీధర్, కిరణ్మయి జ్యోతుల, నీరజ వ్యవరించారు. చదవండి: డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం -
టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
Grand Canyon Supai Village Interesting Facts In Telugu: అభివృద్ధి, టెక్నాలజీ గురించి ఒక నిముషం మాట్లాడమంటే మదిలో మొదటమెదిలే దేశం అమెరికా. ఎత్తైన భవనాలు, సైంటిఫిక్ కల్చరల్ లైఫ్, కొత్త కొత్త టెక్నాలజీలతో దూసుకుపోయే ప్రపంచం అక్కడి ప్రజలది. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారనడంతో సందేహంలేదు. ఇతంటి ఘన చరిత్ర ఉన్న అమెరికాలోకూడా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయా.. అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవును.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం ఉంది. ఏంటీ.. అమెరికాలో గ్రామాలా? అదీ అభివృద్ధేలేని గ్రామం.. అస్సలు నమ్మం..! అనుకుంటున్నారా? ఐతే ఇది చదవండి. 3 వేల అడుగుల లోతులో ఆ గ్రామం.. గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ అమెరికాలో చాలా ఫేమస్. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఇది ప్రసిద్ధి. ఎందుకంటే అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఈ రోజుకీ గాడిదలపైనే ప్రయాణం.. ఈ గ్రామస్తులు ఎంత వెనుకబడి ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా విభిన్న ప్రపంచంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సుపాయ్ గ్రామస్థులు హవాసుపాయి భాషను మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారట. ఈ గ్రామంలో ప్రయాణించడానికి రైలు లేదు. కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి కాలినడకన వెళ్లాల్సిందే!! లేదంటే గాడిదలపై రావాలి. అంతేకాకుండా 1, 2 గుర్రాలు కూడా ప్రయాణాలకు వినియోగిస్తారట. వీటిద్వారానే సమీపంలో ఉన్న హైవేకి వెళ్తుంటారు. ఈ గ్రామానికి, సిటీని కలిపే ఖచ్చితమైన మార్గం కూడా ఏదీ లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే సిటీలకు ప్రయాణిస్తుంటారు అక్కడి స్థానికులు. వెదురుతో బుట్టలను అల్లి.. నగరానికి వెళ్లి.. టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉందీ గ్రామం. ఐతే ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి ఏంటంటే.. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగించటం. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టపోసుకుంటారు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. ఫోన్ అంటే ఏమిటో కూడా వీళ్లకు తెలియదు! ఇంతగా వెనుక బడిన సుపాయి గ్రామానికి ఉత్తరాలేమైనా వచ్చినా.. అక్కడి ప్రజలకు సమయానికి చేరవు. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఉత్తరాలు అందజేయడానికి కూడా గాడిదలు, గుర్రాలపైనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గ్రామంలో ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్ సౌకర్యాలు అస్సలుండవు. ఇదంతా చదువుతుంటే.. పాత కాలం నవలలాగా, బ్లాంక్ అండ్ వైటు సినిమాలా అనిపించినా.. నేటికీ సుపాయి గ్రామం పరిస్థితికి అద్దంపట్టే వాస్తవాలివి. అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు ఈ ఊరుకి వెళ్లాలంటే దారంతా పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ప్రతీ ఏట వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూసేందుకు వెళుతుంటారు. ఐతే ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలి. లేదంటే లోపలికి ప్రవేశం లేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలట. నేటి ఆధునిక యుగంలో అమెరికాలాంటి దేశంలో అభివృద్ధి కన్నే ఎరుగని సుపాయి గ్రామం ఇలా పూర్తిగా వెనుకబడి ఉండటం వెనక కారణం ఏమైఉంటుందో..! చదవండి: అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా! -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్‌తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్‌లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్‌లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్‌లింక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్‌పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్‌డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై.. -
స్తంభం ఎక్కిన ఎలుగు, తనవారికోసం ఎదురుచూపులు!
వాషింగ్టన్: సాధారణంగా ఎలుగు బంట్లు అడవిలో ఉంటాయి. ఒక్కోసారి అడవిలో వాటికి ఆహారం దొరక్కగానీ లేదా దారి తప్పిగానీ మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయి. ఈక్రమంలో ఎలుగుబంట్లు మనుషులపైన దాడిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే, ఇక్కడ ఒక ఎలుగు బంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఒక విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని దక్షిణ అరిజోనా, విల్కాక్స్ పట్టణం కేంద్రంగా సల్ఫర్ స్పింగ్ వ్యాలీ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ అనే సంస్థ ఉంది. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ కార్మికులు ఒక ఎలుగు బంటి విద్యుత్ స్తంభం మీద ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఆ సంస్థ కార్మికులు వెంటనే ఆ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఒక పెద్ద క్రేన్‌ను తెప్పించారు. ఒక ఫైబర్ గ్లాస్ స్టిక్‌తో దాన్ని అదిలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగు బంటి మెల్లగా స్తంభం కిందకు దిగి, సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగుబంటి తన వారికోసం పైకెక్కి చూస్తుంది..’, ‘అయ్యో.. ఎంత పెద్ద ఆపద తప్పిపోయింది..’, ‘ హయ్.. మిత్రమా.. జాగ్రత్తగా దిగి నీ ఇంటికి వెళ్లిపో.. ’ ‘విద్యుత్ కార్మికుల చేసిన పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు “Alright, little bear. Time to get off this pole.” After being called to the scene, utility workers immediately cut the power and then helped coax this bear off a power pole in Arizona. The bear eventually climbed down safely and ran off into the desert. https://t.co/N3YkuSiGgg pic.twitter.com/FJSe51UEXD — ABC News (@ABC) June 10, 2021 -
కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు
న్యూయార్క్: పని నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్ నాటకం ఆడిన వ్యక్తి ఉద్యోగం ఊడటంతో పాటు అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. అరిజోనాలోని కూలీడ్జ్లోని ఫ్యాక్టరీ ఉద్యోగి బ్రాండన్ సోల్స్(19). పని నుంచి తప్పించుకునేందుకు తనకు తాను ఓ కిడ్నాప్ నాటకం ఆడాడు. టైర్ ఫ్యాక్టరీలో పనిచేసే సోల్స్ సమీపంలోని వాటర్ టవర్ వద్ద పడి ఉన్నాడు. నోటికి ప్లాస్టర్‌తో, అతని చేతులు బెల్ట్‌తో కట్టేసి ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్న అతడిని ఒక వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరు వ్యక్తులు తనని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తెలిపాడు. స్పృహ కోల్పోయేలా కొట్టి వాహనంలో తీసుకుపోయి వాటర్ టవర్ వద్ద పడేసినట్లు తెలిపారు. తన తండ్రి వద్ద ఉన్న డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్లుగా చెప్పాడు. ఇతని వాంగ్మూలంపై డిటెక్టివ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో సోల్స్ కిడ్నాప్ నాటకం ఆడినట్లుగా తేలింది. పని నుంచి బయటపడేందుకు తన బెల్ట్‌తో తానే కట్టేసుకుని ఈ నాటకం ఆడినట్లుగా తేలింది. దీంతో అటు ఉద్యోగం ఊడడంతో పాటు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చదవండి: 14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ -
బైడెన్ గెలుపును సర్టిఫై చేసిన ఆరిజోనా
వాషింగ్టన్: యూఎస్‌లో రెండు కీలక రాష్ట్రాలు ఆరిజోనా, విస్కాన్సిన్ సోమవారం డెమొక్రాటిక్ అభ్యర్ధి జోబైడెన్ గెలుపును సర్టిఫై చేశాయి. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. విస్కాన్సిన్లో బైడెన్ 20,700 ఓట్లతో గెలిచినట్లు గవర్నర్ టోనీ ఎవర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో రీకౌంటింగ్ జరిపారు. అయితే ఈ ఫలితాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. మరోవైపు రిపబ్లికన్లకు బాగా పట్టున్న ఆరిజోనాలో బైడెన్ 10వేల ఓట్లతో గెలిచారని గవర్నర్ డగ్ హాబ్స్ తెలిపారు. ప్రస్తుతం బైడెన్‌కు ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలని ట్రంప్ లాయర్ రూడీ గిలియాని కోరారు. కానీ ఆయన డిమాండ్ ఎవరూ పట్టించుకోలేదు. వీరంతా తప్పుడు సర్టిఫికేషన్లు చేస్తున్నారని రూడీ చెప్పుకొచ్చారు. తాజా సర్టిఫికేషన్లను ఛాలెంజ్ చేసేందుకు ట్రంప్‌నకు ఐదు రోజుల సమయం ఉంది. తాను తనకు ఓటేసిన 7.4 కోట్ల మంది తరఫున పోరాడుతున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఐరాస చీఫ్‌తో బైడెన్ చర్చలు న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుట్టెరస్తో అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ చర్చలు జరిపారు. అమెరికాకు, ఐరాసకు మధ్య బంధం బలోపేతం చేయడం, ప్రపంచ సమస్యలను కలసికట్టుగా ఎదుర్కోవడంపై వీరిద్దరూ సోమవారం ఫోన్లో చర్చించారు. ఎన్నికల్లో తన విజయానికి అభినందనలు తెలిపినందుకుగాను ఆంటోనీకి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. ఇథియోపియాలో హింస పెరగడంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారని ఐరాస వర్గాలు తెలిపాయి. బైడెన్‌తో చర్చలపట్ల ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. బైడెన్బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నాయి. ట్రంప్ హయంలో ఐరాసతో యూఎస్ సంబంధాలు పలు అంశాల్లో క్షీణించిన సంగతి తెలిసిందే. పలు కీలక ఐరాస సమాఖ్యలు, సంస్థల నుంచి యూఎస్ వైదొలిగేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, యునెస్కో, మానవహక్కుల సంఘం నుంచి యూఎస్ ట్రంప్ హయంలో బయటకు వచ్చింది. కాగా తిరిగి పారిస్ ఒప్పందంలో చేరతామని బైడెన్ ఇటీవల ప్రకటించారు. -
అరికాలి ఫొటోలతో లక్షలు ఆర్జిస్తున్నాడు
వాషింగ్టన్: ఓ వ్యక్తి తన పాదాలను ఫొటోలు తీసి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. కాలు కదపకుండా సంపాదించడం, కాలు మీద కాలేసుకుని బతికేయడం అన్న పదాలకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా మారింది. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జాసన్ స్టార్మ్ కూర్చున్న చోట నుంచే డబ్బు సంపాదిస్తున్నాడు. ఆయన చేసేదేదో పెద్ద పెద్ద పనులు కూడా కాదు. కేవలం ఆయన తన రెండు కాళ్లను ఫొటోలు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెడతాడు. వాటినెవరు కొంటారులే అనుకుంటున్నారా? కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎగబడి మరీ వీటిని కొంటున్నారు. అలా కేవలం ఫొటోల ద్వారా ఆయన నెలకు సుమారు 4 వేల డాలర్లు(2.9 లక్షలు) ఆర్జిస్తున్నాడు. (చదవండి: వైరల్: ప్రేమ ఎంత మధురమో చూడండి..) ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 5 వేల ఫాలోవర్లు ఉన్న ఆయన తన కాలి ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో షేర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఓన్లీఫ్యాన్స్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇందులో అతను షేర్ చేసే ఫొటోలు, వీడియోలను వీక్షించాలంటే ముందుగా చందా కట్టాల్సిందే. అందులో భాగంగా నెలకు సుమారు ఎనిమిది డాలర్లు, సంవత్సరానికైతే దాదాపు 81 డాలర్లు చందా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తనకు వేరే పని లేదని, కాళ్లపైనే తన జీవితాన్ని నెట్టుకొస్తున్నానని జాసన్ చెప్పుకొస్తున్నాడు. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) View this post on Instagram Welcome to your mind control session.. 🔮 You are hypnotized by my perfect smooth hypnotic soles.. 🦶🏻🦶🏻 The more you resist the deeper you fall under the control of my feet You’ve never been so mesmerized 🤤 Watch the full video and get lost in my soles ⤵️ onlyfans.com/jasonstromm A post shared by Jason Stromm (@jasons_feet) on Aug 22, 2020 at 12:09am PDT -
ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను
వాషింగ్టన్: ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడి చనిపోయే అమెరికన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన క్రమంలో కరోనా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటికే 70 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మందికి వైరస్ సోకింది. ఈ క్రమంలో కరోనా సంక్షోభం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో పాటుగా.. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా మంగళవారం అరిజోనాలో ఉన్న ఫోనిక్స్‌లో గల హనీవెల్ ఫ్యాక్టరీని సందర్శించారు. మాస్కులు తయారీ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక ఎడబాటు నిబంధనలను సడలించి... ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం వల్ల కరోనా మృతులు పెరిగే అవకాశం ఉంది కదా విలేకరులు ప్రశ్నించగా.. ‘అవును ఆ అవకాశమైతే ఉంది. మనం అపార్టుమెంటులోనో, ఇంట్లోనో లాక్ చేసుకుని ఉండలేం కదా. కరోనా ప్రభావం ఉంటుందని తెలుసు. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కూడా ముఖ్యమే’అని ట్రంప్ సమాధానమిచ్చారు. కాగా మాస్కుల తయారీ కర్మాగారాన్ని సందర్శించిన సమయంలోనూ ట్రంప్ మాస్కు ధరించకపోవడం గమనార్హం. (ట్రంప్ అవునంటే కాదనిలే!) కరోనా పోరులో ముందుండే వైద్య సిబ్బంది కోసం తయారు చేసిన మాస్కులను విలేకరుల ముందు ప్రదర్శించిన ట్రంప్.. తాను పెట్టుకునేందుకు మాస్కు ఇవ్వబోతున్న ఫ్యాక్టరీ సిబ్బందిని వారించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి కనీస జాగ్రత్తలు పాటించకుండా ట్రంప్ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. కోవిడ్-19 లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న వారికి ట్రంప్ మద్దతు ఇవ్వడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. మహమ్మారి అంతా ఓ బూటకం అని నినదిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్న వారిని ట్రంప్ ఎంకరేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. ఇదిలా ఉండగా.. శ్వేతసౌధ వర్గాలు మాత్రం మాస్కు విషయంలో ట్రంప్ వ్యవహారశైలిని వెనకేసుకొచ్చాయి. ట్రంప్ సహా ఇతర ఉన్నత అధికారులు తరచుగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకుంటున్న కారణంగా అంతగా భయపడాల్సిన పనేం లేదని చెప్పుకొచ్చాయి. (లక్ష మరణాలు.. చాలా భయంకరం: ట్రంప్) -
విచిత్రంగా అస్థిపంజరంతో కారులో ప్రయాణం
వాషింగ్టన్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పక్కనపెడితే... వాటిని ఎలా తప్పించుకోవాలన్నదానిపైనే ఆసక్తి చూపిస్తారు చాలామంది. అయితే ఇక్కడ చెప్పుకునే వ్యక్తి ఈ రెండింట్లో ఏ కోవకు చెందుతాడనేది అంతు చిక్కకుండా ఉందంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. అలా అతను కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండే హెచ్ఓవీ ప్రదేశానికి వచ్చాడు. అయితే ఆ ప్రదేశంలోకి ఎంటర్ అవాలంటే వాహనం నడిపే వ్యక్తితో పాటు మరొకరు ఉండాల్సిందే. ఒక్కరు ఉంటే మాత్రం ఆ రోడ్డు గుండా వెళ్లడానికి ఆ వాహనాలను అనుమతించరు. దీంతో అతను తనతోపాటు మనిషిని వెంట తీసుకెళ్లకుండా ఓ అస్థిపంజరాన్ని పట్టుకెళ్లాడు. దాన్ని కారులో ముందు సీటులో కూర్చోబెట్టి సీట్బెల్ట్కు బదులు తాడు కట్టి, తలకు.. కాదుకాదు.. పుర్రెకు టోపీ పెట్టి ఎంచక్కా వెళ్లాడు. ఇది అక్కడి అధికారుల కంట పడింది. అంతే.. అతని వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక అస్థిపంజరాన్ని చూసి నోరెళ్లబెట్టిన అధికారులు దాన్ని ఫొటోతో సహా ట్విటర్లో షేర్ చేసి ఈ విషయాన్నంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. కాగా ప్రయాణికుడిలా కారులో దర్జాగా కూర్చొన్న అస్థిపంజరం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు. -
యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది
-
వైరల్ : యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది
అరిజోనా : సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవడమో లేదా గాయాలపాలవడమో జరుగుతుంది. కానీ ఈ రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోనూ ఫీనిక్స్ పోలీస్ విభాగం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సిగ్నల్ దగ్గర తమ బేబీని స్ట్రోలర్‌లో పెట్టుకొని ఓ జంట రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు దాదాపు ఢీకొట్టినంత పని చేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో మరోవైపు నుంచి వస్తున్నచేవ్రొలెట్ క్రూజ్ కారు దానిని ఢీకొట్టడంతో రెండు కార్లు పక్కకు వెళ్లిపోయాయి. దీంతో రోడ్డు దాటుతున్న జంట తమ బిడ్డను తీసుకొని బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢీకొన్న రెండు కార్లలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే జంటను ఢీకొట్టబోయిన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ముగ్గురి ప్రాణాలను కాపాడిన క్రూజ్ కార్ ఓనర్, 27 ఏళ్ల షానన్ విహర్ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'ఆ దంపతులు, వారి బిడ్డ ప్రాణాలను కాపాడడానికి దేవదూతే స్వయంగా చేవ్రొలెట్ క్రూజ్ కారును పంపించిదని' పోలీసులు పెట్టిన పోస్టుకు విపరీతమైన స్పందన వస్తుంది. దేవుడే వారిని కాపాడాడని కొందరు అభిప్రాయపడుతుంటే... మరి కొందరు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘిస్తే అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. -
‘అందుకే బిడ్డ ప్రాణాలు కూడా పణంగా పెట్టాం’
న్యూయార్క్ : జీవితంలో అన్ని విధాలా నష్టపోయిన తర్వాతే తనతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం కోరుతున్న ఓ సిక్కు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తే తమకు శాశ్వతంగా దూరమైందని విలపించారు. మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలో ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ సిక్కు మహిళ కూడా న్యూయార్క్‌లో ఉన్న తన భర్తను కలుసుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. కూతురితో కలిసి అమెరికాకు బయల్దేరిన ఆమె అందరూ శరణార్థుల లాగే స్మగ్లర్ల చేతికి చిక్కారు. శరణార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్మగ్లర్లు.. వారి నుంచి కొంతమొత్తం వసూలు చేసి ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి సమీపంలో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో ఆరేళ్ల కూతురు గుర్ప్రీత్ కౌర్ దాహాన్ని తీర్చేందుకు.. చిన్నారిని తెలిసిన వాళ్ల వద్ద వదిలి ఆమె తల్లి నీటి కోసం వెదుక్కొంటూ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం, పైగా ఎడారి ప్రాంతం కావడంతో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయారు. అదృష్టవశాత్తు అమెరికా సరిహద్దు బలగాలు అక్కడికి చేరుకోవడంతో గుర్ప్రీత్ తల్లితో పాటు ఆమెతో ఉన్న మరో మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తన కూతురు ఎడారిలో వేరే చోట ఉందని చెప్పడంతో ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ చోట నిర్జీవంగా పడి ఉన్న గుర్‌ప్రీత్‌ను చూసి ఆమె తల్లి హతాశయురాలైంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అమెరికాలోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గుర్ప్రీత్ తల్లిదండ్రుల తరపున అమెరికా సిక్కు కూటమి ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. ‘ మా కూతురికి భద్రతతో కూడిన బంగారు భవిష్యత్తు అందించాలని భావించాం. అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాం. జాతి, మత, ప్రాంత, వర్ణ భేదాలకు అతీతంగా ప్రతీ తల్లిదండ్రులు తమ సంతానం కోసమే అహర్నిశలు శ్రమిస్తారని మేము భావిస్తాం. జీవితంలో పాతాళానికి పడిపోయిన తర్వాతే బిడ్డ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. మేము తీసుకున్న ఈ కఠిన నిర్ణయం మా చిన్నారిని మాకు దూరం చేసింది’ అని వారు ప్రకటనలో పేర్కొన్నారు. కూతురు పుట్టిన ఆర్నెళ్లకే... పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ తండ్రి 2013లో అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో ఆశ్రయం కోరుతూ అతడు చేసిన దరఖాస్తు న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గుర్ప్రీత్ పుట్టిన ఆర్నెళ్ల తర్వాత అమెరికాకు వెళ్లిన అతడు మళ్లీ కూతురిని నేరుగా చూడలేదు. కాగా ప్రస్తుతం అరిజోనా ఫెసిలిటీ సెంటర్లో ఉన్న గుర్ప్రీత్ తల్లిని బస్సు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. కోర్టు ముందు ఆమె హాజరు కావాల్సి ఉంది. అక్కడే గుర్ప్రీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి అమెరికాలో ఆశ్రయం కోరుతూ అరిజోనా గుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాదిలో ఇప్పటి వరకు అక్కడ 58 మంది మృత్యువాత పడ్డారని పైమా కౌంటీ ఆఫీసుకు చెందిన ఓ వైద్యాధికారి తెలిపారు. గతేడాదిలో వీరి సంఖ్య 127గా ఉందని పేర్కొన్నారు. ఇక అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూస్తున్న వారు.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సరిహద్దు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ఈ నేపథ్యంలో సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. చదవండి : అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి -
అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి
వాషింగ్టన్ : వడదెబ్బతో ఆరేళ్ల భారతీయ చిన్నారి మృతి చెందిన సంఘటన అందరిని కలచి వేస్తోంది. వివరాలు.. గురుప్రీత్ కౌర్ అనే బాలిక తన తల్లితో కలిసి మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్మగ్లర్స్ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మరో ఐదుగురు భారతీయ వలసదారులను మంగళవారం ఉదయం అమెరికా సరిహద్దులోని ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో వదిలి వెళ్లారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బాలిక తల్లి కూతుర్ని మిగతావారివద్ద వదిలి.. మరో మహిళతో కలిసి నీటి కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లింది. అలా నీటి కోసం వెళ్లిన వారు మరి వెనక్కి తిరిగి రాలేదు. వడ దెబ్బ కొట్టడంతో వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. మరుసటి రోజు బార్డర్ పెట్రోల్ ఏజెంట్ వారి పాద ముద్రల ఆధారంగా నడుచుకుంటూ వెళ్లగా ఓ చోట ఇద్దరు మహిళలు పడి పోయి ఉండటం గమనించాడు. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వివరాలు సేకరించాడు. ఇద్దరు మహిళలకు ఇంగ్లీష్ రాకపోవడంతో వారితో మాట్లడటం చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గురుప్రీత్ సైగల ద్వార తన కూతురు గురించి అధికారులకు తెలియజేసింది. తాము నీటి కోసం వెదుకుతూ.. వచ్చామని.. తన కూతురు వేరే చోట ఉందని తెలియజేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఓ మైలు దూరంలో వారికి గురుపీప్రత్ కౌర్ మృత దేహం కనిపించింది. కొన్ని గంటల పాటు నీరు లేక తీవ్రమైన ఎండలో ఉండటం మూలానా గురుప్రీత్ మృతి చెందింది. బాలిక మృతికి స్మగ్లర్స్నే నిందిస్తున్నారు అమెరికా సరిహద్దు భద్రత అధికారులు. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూశారని.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా ల్యూక్విలే అరిజోనా ప్రసిద్ధికెక్కింది. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంత వేడి వాతావరణం మూలానే సదరు బాలిక మృతి చెందిందని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది వడదెబ్బ వల్ల ఇద్దరు మృతి చెందగా వారిలో గురుప్రీత్ ఒకరు కావడం విచారం. మరి కొద్ది రోజుల్లోనే గురుప్రీత్ ఏడవ పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది. -
పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..!
-
వైరల్ : అత్యంత విషపూరితం.. అయినా సురక్షితం..!
వాషింగ్టన్ : అమెరికా ఎడారుల్లో అత్యంత విషపూరితమైన రాటిల్‌స్నేక్ దాడుల నుంచి ప్రాణాలు నిలుపుకొంటున్న కంగారూ ర్యాట్ వ్యూహాలేమిటో తెలిసిపోయాయి. రాటిల్‌స్నేక్ నోటికి చిక్కినా కూడా సరికొత్త వ్యూహాలతో తప్పించుకుంటున్న ఈ ఎలుకల చాకచక్యాన్ని చూసి జంతు శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయారు. సెకన్లో ఏడో వంతు వేగంతో పాము తలపై ఎగిరి తంతున్న కంగారూ ర్యాట్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధునాతన కెమెరాలు, పరికరాలతో అరిజోనా ఎడారిలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. అంతెత్తున ఎగిరి.. శాస్త్రవేత్త ఫ్రేమిలర్ ప్రకారం.. ఇసుకలో కూడా అతి వేగంగా కదిలే అత్యంత ప్రమాదకరమైన సర్పం రాటిల్‌స్నేక్. అయినా, వాటికి ఆహారం కాకుండా ఎస్కేప్ అవుతున్న కంగారూ ర్యాట్ ఆత్మరక్షణా యుక్తులు అద్భుతం. అందరూ అనుకుంటున్నట్టుగా ఇవి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడటం లేదు. విస్మయపరిచే వ్యూహాలతో పాములకే సవాల్ విసురుతున్నాయి. తాజా వీడియోలో.. ఎలుకను విందు చేసుకుందామనుకున్న రాటిల్‌స్నేక్ దానిమీదకి ఒక్క ఉదుటున దుమికింది. నోట కరుచుకున్నంత పని చేసింది. అయితే, పాముకన్నా వేగంగా స్పందించిన ఎలుక అంతెత్తున గాల్లోకి ఎగిరింది. పాము నోట్లో చిక్కుకుంది అనుకునే సమయంలో నింజాఫైట్ చేసింది. దాని తలపై రెండు కాళ్లతో కిక్ చేసింది. మళ్లీ గాల్లోనే గింగిరాలు తిరుగుతూ.. పాముకు అందకుండా దూరంగా పారిపోయింది. ఆ పరిస్థితుల్లో వేరే జాతికి చెందిన ఎలుకలుంటే వాటికి చావు తథ్యం అయ్యేదే. మామూలుగా అయితే, రాటిల్‌స్నేక్ చాలా వేగంగా దెబ్బకొడతాయి. కానీ, కంగారూ ర్యాట్స్ మరింత వేగంగా స్పందింస్తాయి. ఈ ఎలుకలు పరుగెత్తడానికి వీలు లేనప్పుడు నింజాఫైట్ ట్రిక్కులతో బయటపడతాయి. అయితే, పాము విషం చిమ్మితే ఎలుక ప్రాణాలు ఉంటాయా అనే ఒక సందేహం కలుగుతోంది కదా.. వేగంగా స్పందించినప్పుడు సరిపడినంత విషం పాము కోరల్లోకి రాదు. ఆ క్రమంలో కంగారూ ర్యాట్స్ ఫైట్ చేసి తప్పించుకుంటాయి. ఎలుకలు 30 నుంచి 70 మిల్లీ సెకన్లపాటు పాము నోట్లో ఉన్నా కూడా వాటికి విషం చేరదు. అంటే మనిషి కనురెప్పపాటు కాలం (150 మిల్లీ సెకండ్లు) కన్నా తక్కువ సమయంలో ఎలుక యుద్ధం చేసి విజయం సాధిస్తుందన్నమాట..!