అరిజోనా : సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవడమో లేదా గాయాలపాలవడమో జరుగుతుంది. కానీ ఈ రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోనూ ఫీనిక్స్ పోలీస్ విభాగం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సిగ్నల్ దగ్గర తమ బేబీని స్ట్రోలర్‌లో పెట్టుకొని ఓ జంట రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు దాదాపు ఢీకొట్టినంత పని చేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో మరోవైపు నుంచి వస్తున్నచేవ్రొలెట్ క్రూజ్ కారు దానిని ఢీకొట్టడంతో రెండు కార్లు పక్కకు వెళ్లిపోయాయి. దీంతో రోడ్డు దాటుతున్న జంట తమ బిడ్డను తీసుకొని బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢీకొన్న రెండు కార్లలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే జంటను ఢీకొట్టబోయిన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు.
ముగ్గురి ప్రాణాలను కాపాడిన క్రూజ్ కార్ ఓనర్, 27 ఏళ్ల షానన్ విహర్‌ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'ఆ దంపతులు, వారి బిడ్డ ప్రాణాలను కాపాడడానికి దేవదూతే స్వయంగా చేవ్రొలెట్ క్రూజ్ కారును పంపించిదని' పోలీసులు పెట్టిన పోస్టుకు విపరీతమైన స్పందన వస్తుంది. దేవుడే వారిని కాపాడాడని కొందరు అభిప్రాయపడుతుంటే... మరి కొందరు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘిస్తే అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment