phoenix
-
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
ఫినిక్స్ చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫినిక్స్ చాప్టర్‌ని నాట్స్ ప్రారంభించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాహుల్ కోనే ఫినిక్స్ చాప్టర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నాగ పడమట నాయకత్వంలో ఈ ఫినిక్స్ చాప్టర్ ముందుకు సాగనుంది. సతీశ్ గంధం, వేణు దమరచద్, కిషోర్ రావు కోదాటి, అభిలు ఫినిక్స్ చాప్టర్ సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు ఫినిక్స్‌లో జరిగిన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫినిక్స్ నాట్స్ విభాగ నాయకులను అభినందించారు. ఫినిక్స్‌లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరంగా చేసేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ అందిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు నాట్స్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. నాట్స్ ఫినిక్స్ నాయకులు నాట్స్‌ను ఫినిక్స్‌లో బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ అనుదీప్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వాన్ని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై డాక్టర్ సుధీర్ యార్లగడ్డ, కిరణ్ వేదాంతం స్థానిక తెలుగు వారికి అవగాహన కల్పించారు. ఫినిక్స్‌లో రక్షణ, భద్రత అంశాలపై స్థానిక భద్రతాధికారి క్రిష్ పెరేజ్ ఎన్నో విలువైన సూచనలు చేశారు. రామ నిఠల విద్యార్ధుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫినిక్స్‌లో తెలుగువారికి అండగా నాట్స్ ఉందనే భరోసాను ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రవి కొమ్మినేని, వెంకటేష్ ఏనుగుల, ప్రవీణ్ రెడ్డి పాటి తదితరులకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ నాయకుడు నాగ పడమట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !) -
అరిజోనాలో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగింది. ప్రవాసులు జ్యోతి వెలిగించి, డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ వేడుకకు తరలివచ్చిన ఫీనిక్స్‌లోని వైఎస్ఆర్ అభిమానులు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ సువర్ణ పాలనను గుర్తుచేసుకున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వంశీకృష్ణ ఇరువారం, చెన్నారెడ్డి మద్దూరి, సునీల్ అననపురెడ్డి, నాగరాజ్ దాసరి, రశ్వంత్ పొలవరపు , పరితోష్ పోలి, శ్రీధర్ చెమిడ్తి, లక్ష్మీకాంతరెడ్డి, శివ కొండూరు, రమేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలదని, పేదల సంక్షేమ పథకాలను నెరవేర్చడానికి మరియు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ప్రజాకర్షకమైన దీర్ఘకాలిక పథకాలను పూర్తి చేయడానికి స్థాపించబడిందని వారు పునరుద్ఘాటించారు. పలువురు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సభ్యులు రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. (చదవండి: కువైట్‌లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు) -
ఫీనిక్స్ గ్రూప్‌తో టీసీఎస్ భారీ డీల్.. రూ. 5,986 కోట్లు
ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ తాజాగా బ్రిటన్‌కు చెందిన ఫీనిక్స్ గ్రూప్‌నకు వ్యాపార డిజిటలీకరణ సర్వీసులు అందించనుంది. ఇందులో భాగంగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సేవలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 600 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 5,986 కోట్లు). ఆర్థిక సర్వీసుల సంస్థ ఫీనిక్స్ గ్రూప్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొనసాగింపని టీసీఎస్ తెలిపింది. -
ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు
-
ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఫీనిక్స్ గ్రూపు కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఫీనిక్స్ కంపెనీ సహా, సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. నగరంలో 20 చోట్లకు పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. కాగా, బర్త్ డే వేడుకలకు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించారు. అలాగే, ఫీనిక్స్ సంస్థలో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఫీనిక్స్ సంస్థపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది
-
వైరల్ : యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది
అరిజోనా : సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవడమో లేదా గాయాలపాలవడమో జరుగుతుంది. కానీ ఈ రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోనూ ఫీనిక్స్ పోలీస్ విభాగం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సిగ్నల్ దగ్గర తమ బేబీని స్ట్రోలర్‌లో పెట్టుకొని ఓ జంట రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు దాదాపు ఢీకొట్టినంత పని చేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో మరోవైపు నుంచి వస్తున్నచేవ్రొలెట్ క్రూజ్ కారు దానిని ఢీకొట్టడంతో రెండు కార్లు పక్కకు వెళ్లిపోయాయి. దీంతో రోడ్డు దాటుతున్న జంట తమ బిడ్డను తీసుకొని బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢీకొన్న రెండు కార్లలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే జంటను ఢీకొట్టబోయిన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ముగ్గురి ప్రాణాలను కాపాడిన క్రూజ్ కార్ ఓనర్, 27 ఏళ్ల షానన్ విహర్ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'ఆ దంపతులు, వారి బిడ్డ ప్రాణాలను కాపాడడానికి దేవదూతే స్వయంగా చేవ్రొలెట్ క్రూజ్ కారును పంపించిదని' పోలీసులు పెట్టిన పోస్టుకు విపరీతమైన స్పందన వస్తుంది. దేవుడే వారిని కాపాడాడని కొందరు అభిప్రాయపడుతుంటే... మరి కొందరు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘిస్తే అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. -
విష సర్పంతో సరదా.. చావును చూపించింది!
వాషింగ్టన్: సర్పాలను పట్టేవ్యక్తి వాటితో చేసిన సరదా పనే అతడ్ని చావు అంచులకు తీసుకెళ్లింది. విషసర్పం అతడి ముఖంపై కాటేసినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. విక్టర్ ప్రాట్ అనే 40 ఏళ్ల వ్యక్తి అరిజోనాలోని ఫోనిక్స్ నగరంలో నివాసం ఉండేవాడు. కొన్ని రోజుల కిందట తన కుమారుడి పుట్టనిరోజు వేడకలకు తన సన్నిహితులను ఆహ్వానించాడు. పాములను పట్టడమే కాదు వాటితో వంటకాలు చేయడం రిక్టర్కు అలవాటు. చిన్నతనం నుంచి పాములు పట్టడం, వాటితో ఆడుకోవడం తనకు అలవాటేనని స్నేహితులతో గొప్పలకుపోయాడు. తాను విషసర్పాలతో చిన్న పిల్లలతో ఆడతామో, నిద్రస్తామో అలాగే గడుపుతానని చెప్పాడు. ఆ తర్వాత ఓ విషసర్పాన్ని చేతిలో పట్టుకుని ఆటలు మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత ఆ పాము అకస్మాత్తుగా రిక్టర్ ముఖంపై కాటేయడంతో స్పృహకోల్పోయాడు. అతడ్ని స్థానిక బానర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజులపాటు డాక్లర్లు చేసిన శ్రమ ఫలించి రిక్టర్ మామూలు మనిషయ్యాడు. మరికొన్ని నిమిషాలు ఆలస్యమైతే రిక్టర్ కచ్చితంగా చనిపోయేవాడని టాక్సానమీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీవెన్ కర్రీ తెలిపారు. సాధారణంగా పాములు మనిషిని ఏదో భాగంలో కాటేస్తుంటాయి.. కానీ ముఖంపై కాటు అనేది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది ఎంతో మందికి చికిత్స ఇచ్చాం కానీ రిక్టర్ విషయంలో మాత్రం.. అతడు పాముతో ఆడుకుంటూ కాటుకు గురయ్యాడని వివరించారు. గత సోమవారం పూర్తిగా కోలుకున్న అనంతరం రిక్టర్ పలు విషయాలను ప్రస్తావించాడు. నా కుమారులు త్వరగా ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలతో ఉన్నాను. దయచేసి నాలాగా మీరు పాములు, ఇతర విష ప్రాణులతో ఆటలు ఆడవద్దు. ఇలాంటివి ప్రాణాల మీదకి తెస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని.. అదృష్టవశాత్తూ నేను చావును చూసినా బతికొచ్చానని బాధితుడు రిక్టర్ ప్రాట్ వివరించాడు. -
మసీదులో తేనెటీగల కలకలం
ఫినిక్స్ : మసీదులో ప్రార్థనలు చేసే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో కలకలంరేగింది. ఈ సంఘటన అమెరికాలోని ఫినిక్స్‌లోని మసీదులో చోటుచేసుకుంది. శుక్రవారం(భారత కాలమాన ప్రకారం శనివారం) మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడున్న వారి పై తేనెటీగలు దాడి చేశాయి. అయితే వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సేప్టీ సిబ్బంది ఫోమ్ సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కవర్లు, దుప్పట్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదులో ఉన్న తేనెతెట్టను శనివారం అక్కడ నుంచి తీసివేయాలని అనుకున్నారు. కానీ, ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలయిన 24 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 20 మందికి స్పల్పగాయాలవ్వగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
ఆ దృశ్యం ఫీనిక్స్ పక్షిని గుర్తుచేస్తుంది..
ఢాకా : బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అసువులు బాసిన అమరులను తలుచుకున్నపుడు.. తన పూర్వీకుల చితాభస్మం నుంచి కొత్త జీవితాన్ని పొందే కాల్పనిక పక్షి ఫీనిక్స్ గుర్తుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢాకా సమీపంలోని జాతీయ అమర వీరుల స్థూపాన్ని సందర్శనతో ఆయన తన రెండురోజుల బంగ్లాదేశ్ పర్యటను ప్రారంభించారు. 1971 బాంగ్లా విముక్తి పోరాటంలో అమరులైనవారికి పూల మాలలతో ఘన నివాళులు అర్పించిన మోదీ.. స్థూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఏడు మెట్లు వాటిపైన ఏడు త్రికోణాల ఆకృతిలో ఉండే బంగ్లా జాతీయ అమరవీరుల స్థూపం విశేషాలను ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఆ తరువాత బాంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ ఉర్ రహమాన్ స్మారక మ్యూజియాన్ని మోదీ సందర్శించారు. ముజీబ్ కు సంబంధించిన వస్తువులను తీక్షణంగా పరిశీలించారు. అంతకుముందు తొలిసారిగా బాంగ్లా పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ ను పక్కనపెట్టి బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంగ్లా ప్రధాని హసీనాతో మోదీ చర్చిస్తారు. ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పలువురు ఉన్నతాధికారులు కూడా బంగ్లా పర్యనలో పాల్గొంటున్నారు.