అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫినిక్స్ చాప్టర్‌ని నాట్స్ ప్రారంభించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాహుల్ కోనే ఫినిక్స్ చాప్టర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నాగ పడమట నాయకత్వంలో ఈ ఫినిక్స్ చాప్టర్ ముందుకు సాగనుంది. సతీశ్ గంధం, వేణు దమరచద్, కిషోర్ రావు కోదాటి, అభిలు ఫినిక్స్ చాప్టర్ సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు ఫినిక్స్‌లో జరిగిన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫినిక్స్ నాట్స్ విభాగ నాయకులను అభినందించారు.
ఫినిక్స్‌లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరంగా చేసేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ అందిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు నాట్స్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. నాట్స్ ఫినిక్స్ నాయకులు నాట్స్‌ను ఫినిక్స్‌లో బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ అనుదీప్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వాన్ని అభినందించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై డాక్టర్ సుధీర్ యార్లగడ్డ, కిరణ్ వేదాంతం స్థానిక తెలుగు వారికి అవగాహన కల్పించారు. ఫినిక్స్‌లో రక్షణ, భద్రత అంశాలపై స్థానిక భద్రతాధికారి క్రిష్ పెరేజ్ ఎన్నో విలువైన సూచనలు చేశారు. రామ నిఠల విద్యార్ధుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫినిక్స్‌లో తెలుగువారికి అండగా నాట్స్ ఉందనే భరోసాను ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రవి కొమ్మినేని, వెంకటేష్ ఏనుగుల, ప్రవీణ్ రెడ్డి పాటి తదితరులకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ నాయకుడు నాగ పడమట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !)
Comments
Please login to add a commentAdd a comment