
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఫీనిక్స్ గ్రూపు కంపెనీపై ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఫీనిక్స్ కంపెనీ సహా, సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. నగరంలో 20 చోట్లకు పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. కాగా, బర్త్ డే వేడుకలకు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించారు. అలాగే, ఫీనిక్స్ సంస్థలో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఫీనిక్స్ సంస్థపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment