సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్చుత్‌రావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్చుత్‌రావు, బొప్పన శ్రీనివాస రావు, బొప్పన అనుప్ ఇంట్లో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. జీ స్క్వేర్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో అన్విత బిల్డర్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇతరులను లోపలికి అనుమతించని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది. సింగపూర్, దుబాయ్‌లో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్న బొపన్న కుటుంబ సభ్యులు. విదేశాల నుండి అన్విత బిల్డర్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను ఐటీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఇక, ఇటీవలే కొల్లూరులో ఫ్రీ లాంచ్ ఆఫర్‌ను కూడా అన్విత బిల్డర్స్ ప్రకటించింది. ఇక, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment