
సాక్షి, హైదారాబాద్: నగరంలో మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్స్ కలకలం రేగింది. తెల్లవారుజాము నుంచే 10 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, మూసాపేట్, కూకట్‌పల్లి ఏరియాల్లో పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కూకట్ పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 8 మంది ఐటీ సభ్యుల బృందం ఉదయం 5గం.30ని. నుంచే సోదాలు నిర్వహిస్తోంది. ఆ ఇంటి ఓనర్ ఓ మీడియా సంస్థకు ఓనర్ అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment