సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాల కలకలం రేగింది. మంగళవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఐటీ బృందాలు.మొత్తం యాభై దాకా బృందాలు 40 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రముఖంగా హైదరాబాద్‌లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు నిర్వహిస్తున్నాయి.
వసుధ ఫార్మా చైర్మన్ వెంకటరామారాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాల పై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా.. వాటి ఆధారంగా ఇప్పుడు సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment