సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్‌లో కంపెనీ చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్‌సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్‌లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్‌లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment