
ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం ఉదయం ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్‌తో పాటు వాటి యజమాని ఇండ్లలోనూ ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్‌లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.