chutneys
-
చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?
భారతదేశంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రాంతాల వారీగా విభిన్న రుచులతో కూడిన ఆహారం ఆస్వాదిస్తారు. అవన్నీ సంప్రదాయాలకు అనుగుణంగా ఆరోగ్య స్ప్రుహతో ఏర్పరచుకున్న మధురమైన రెసిపీలు. అందులో ప్రముఖంగా ఆకర్షించేవి చట్నీలు, పచ్చళ్లు, పొడులు, ఆవకాయ తదితరాలు. అబ్బా..! అవి తినేందుకు ఎంతలా స్పైసీగా నోరు మండుతున్న వదులబుద్ధి కాదు. ఎన్ని కూరలు ఉన్నా.. పక్కన కొద్దిగా పచ్చడి లేదా ఏదో ఒక చట్నీ, కొంచెం పొడి ఉంటేగానే భోజనం సంపూర్ణంగా ఉండదు. ఇలా ఇన్ని రకాల పదార్థాల కలయికతో తింటే పొట్ట నిండుగా, మనసు హాయిగా ఉంటుంది. అందుకే మన విభిన్న రుచులను గుర్తించేలా ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న చట్నీ డే గా ఏర్పాటు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు విభిన్న చట్నీలతో విందులు ఏర్పాటు చేసుకుని మన పురాతన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చట్నీ, పొడులు, ఆవకాయ, పచ్చళ్ల మధ్య తేడా ఏంటో సవివరంగా చూద్దాం..!.చట్నీచట్నీ అనే పదం 'చాట్నీ' అనే పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం 'నొక్కడం'. ఇది మొఘల్ సామ్రాజ్య చరిత్రలో పాతుకుపోయింది. పాలకుడు షాజహాన్ అనారోగ్యానికి గురైనప్పుడు తొలిసారిగా ఈ చట్నీ అనే వంటకం వచ్చిందని అంటారు. ఆ సమయంలో ఆయన అనారోగ్యం నయం అయ్యేందుకు ఆస్థాన వైద్యులు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చట్నీ తినాల్సిందిగా సూచించారు. అలా వంట వాళ్లు షాజహాన్ కోసం పుదీనాతో చట్నీ చేసి పెట్టారు. అయితే బిట్రీష్ పాలనలో చట్నీ అనేదానికి వేరే అర్థాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో పండే మామిడిపండ్లు, చింతపండు వంటి వాటిని ఇంగ్లండ్‌కి ప్రిజర్వేటివ్‌గా తరలించే క్రమంలో ఒక విధమైన స్వీట్నెస్ లిక్విడ్ రూపంలో తరలించింది. దాన్నే వాళ్లు చట్నీ అనిపిలిచేవారు. ఇది యూరోపియన్ చట్నీల సంప్రదాయంగా చెప్పొచ్చు. పచ్చడి..ఇది ఉప్పునీటిలో నిల్వ ఉంచేందుకు ఉపయోగించింది కాస్త ఊరగాయ పచ్చడిగా రూపాంతరం చెందింది. మోసొటొటేమియా నాగరికత నుంచి ఈ విధమైన ఆహార సంరక్షణ ఉండేది. 'పికెల్' అనే పదం డచ్ పదం 'పెకెల్' నుంచి వచ్చింది. దీని అర్థం ఉప్పునీరు. భారత్‌లో దోసకాయ, మామిడికాయ వంటి వాటిని ఉప్పువేసి ఇలా నిల్వ ఉంచేవారు. ఆ తర్వాత వాటిని వివిధ మసాల దినుసులతో పచ్చడిగా చేయడం వంటివి చేశారు. ఆవకాయ...ఈ పదం పర్షియన్ పదం నుంచి వచ్చింది. పోర్చుగీస్ వైద్యుడు గార్సియా ఓర్టా రచనలలో ఈ పదం గురించి వినిపిస్తుంది. శరీరానికి వేడి కలిగించే వంటకంగా రూపొందించారు. అయితే దీన్ని నూనె మసాలా దినుసులతో నిల్వ చేస్తారు. ఊరగాయ పద్ధతిలోనే.. కాకపోతే ఇక్కడ అధికంగా నూనెతో భద్రపరచడం జరుగుతుంది. ఇక్కడ నూనె, వివిధ మసాలాతో తయారు చేస్తారు.పొడి..దక్షిణ భారత పాకశాస్త్ర నిపుణుల క్రియేటివిటీనే ఈ పొడిగా చెప్పొచ్చు. దీన్ని కొందరూ చట్నీగా పిలుస్తారు కూడా. ఇది విజయనగర రాజవంశం సాహిత్యం, తమిళ గ్రంథాల్లోనూ ఎక్కువగా ఈ పొడుల ప్రస్తావన వినిపిస్తుంది. 'పొడి' అనే పదానికి తెలుగు, తమిళ, మలయాళంలో అర్థం మెత్తటి పౌడర్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్‌లో నువ్వుల పొడి, కారప్పొడి ఫేమస్. వీటిని నెయ్యి లేదా నూనెతో తింటే ఉంటుంది రుచి.. అంటుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఎక్కువగా దోస, ఇడ్లీల, వేడి వేడి అన్నంలోనూ తింటుంటారు. అంతేగాదు పలుచోట్ల కాకరకాయ పొడి, బీరకాయ పొట్టు పొడి, కంది పొడి వంటి వివిధ రకాల పొడులు కూడా చేస్తుంటారు. (చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!) -
హైదరాబాద్‌లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం ఉదయం ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్‌తో పాటు వాటి యజమాని ఇండ్లలోనూ ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్‌లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
Recipes: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా!
Healthy And Quick Chutney Recipes For Idli And Dosa: అదే ఇడ్లీ... అదే దోశ.. కనీసం చట్నీలైనా మారుద్దాం. నోటికి రుచికరమైన చట్నీ లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ కూడా బోర్ కొడుతుంది. ఇడ్లీ, దోశలతోపాటు రోజూ తినే పల్లీ, కొబ్బరి, పుట్నాలు, టొమాటో పచ్చడి కాకుండా కాస్త విభిన్నంగా, హెల్దీగా ఉండే వివిధ రకాల చట్నీలు ఎలా చేసుకోవాలో చూద్దాం... మొరింగా చట్నీ కావలసినవి: ►నూనె – టీస్పూను ►మునగ ఆకులు – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►అల్లం తురుము – టీస్పూను ►నిమ్మరసం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపు కోసం: నూనె – టీస్పూను, ఆవాలు – అరటీస్పూను, జీలకర్ర – పావు టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►బాణలిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన నూనెలో పచ్చిమిర్చి, మునగ ఆకులు వేసి దోరగా వేయించాలి ►ఇప్పుడు మిక్సీజార్‌లో కొబ్బరి తురుము, వేయించిన మునగ ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, అరప్పు నీళ్లుపోసి మెత్తగా రుబ్బుకుని గిన్నెలో వేసుకోవాలి ►తాలింపు వేసుకుని ఈ మిశ్రమాన్ని చట్నీలో కలిపితే రుచికరమైన మొరింగా చట్నీ రెడీ. దోశ, చపాతీల్లోకి ఇది మంచి సైడ్ డిష్. ►చట్నీలో నిమ్మరసానికి బదులు చింతపండు లేదా పెరుగు కూడా వేసుకోవచ్చు. వాల్నట్ చట్నీ కావలసినవి: ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►వాల్నట్స్ – పావు కప్పు ►పచ్చిమిర్చి – మూడు ►అల్లం – అరంగుళం ముక్క ►చింతపండు – గోలీకాయంత ►కరివేపాకు – రెండు రెమ్మలు ►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను ►ఉప్పు– రుచికి సరిపడా. తాలింపు దినుసులు: నూనె – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, మినపగుళ్లు –పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. తయారీ: ►కొబ్బరి తురుము, వాల్నట్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తరుగు, కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరాన్ని బట్టి కొద్దిగా వేడి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఇప్పుడు తాలింపు దినుసులతో తాలింపు వేసి రుబ్బిన పచ్చడిలో కలిపితే వాల్నట్ చట్నీ రెడీ. ►ఇడ్లీ, దోశ, ఉప్మా, పన్యారంలలో ఈ చట్నీ చాలా బావుంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్ రోటీ! Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో..
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కారణంగా నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ పని చేయట్లేదు. అయినప్పటికీ ఫుడ్ రోడ్ డెలివరీ పేరుతో శ్రీనగర్‌కాలనీ వాసి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు కాజేశారు. దీంతో బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనగర్‌కాలనీలో నివసించే ఓ వ్యక్తి ఫేస్బుక్లో ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో ఉన్న ప్రకటన చూశారు. అందులో ఫోన్ నెంబర్ ఇచ్చిన నేరగాళ్లు తమకు ఫుడ్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తామని ఎర వేశారు. ఈ ప్రకటన చూసిన బాధితుడు అందులో ఉన్న ఫోన్ నెంబర్లో సంప్రదించారు. ఇతడి నుంచి ఆర్డర్ తీసుకున్న నేరగాళ్లు పేమెంట్ కోసం తాము ఓ గూగుల్ పేజీ పంపుతామని, దాన్ని పూరించాలని చెప్పారు. అలా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా నగదు చెల్లిస్తే ఆహారం డోర్ డెలివరీ ఇస్తామని చెప్పారు. అలా నేరగాళ్లు పంపిన పేజ్‌లో బాధితుడు తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సైతం నింపాడు. వీటిని వినియోగించిన సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.40 వేలు కాజేశారు. మరోపక్క చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.64 వేలు స్వాహా చేశారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయన ఆన్లైన్లోనే నిత్యావసర సరుకులు ఖరీదు చేస్తున్నారు. దీనికోసం ఆయన గ్రోసరీ యాప్‌ను వినియోగిస్తున్నారు. సరుకులు ఖరీదు చేసిన ప్రతి సందర్భంలోనూ నెట్ బ్యాంకింగ్ నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా ఈయన గ్రోసరీ యాప్‌లో ముందస్తుగా కొంత మొత్తం చెల్లించారు. ఈ మొత్తం నుంచి నిత్యావసర వస్తువులు ఖరీదు చేయగా.. ఇంకా రూ.20 వేలు బ్యాలెన్స్‌గా ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల తనిఖీ చేయగా బాధితుడికి సదరు యాప్‌లో ఆ మొత్తం కనిపించలేదు. దీంతో కంగారుపడిన ఆయన విషయాన్ని యాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు. దీనికోసం గూగుల్‌లో ఆ యాప్‌నకు సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ ఆరా తీశారు. అందులో సైబర్ నేరగాళ్లు పొందుపరిచిన నకిలీ నెంబర్‌ను అసలైందిగా భావించారు. దానికి కాల్ చేయగా... నేరగాళ్లు తాము గ్రోసరీ యాప్ నిర్వాహకులుగా మాట్లాడారు. ఆ మొత్తాన్ని మీ ఖాతాలోకి తిరిగి పంపాలంటే తాము పంపే ఎస్సెమ్మెస్‌ను ఫలానా ఫోన్ నెంబర్‌కు సెండ్ చేయాలని సూచించారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు అలానే చేశారు. అది యూపీఐ లింకునకు సంబంధించినది కావడంతో ఆయన బ్యాంకు ఖాతాకు సైబర్ నేరగాళ్ల ఫోను అనుసంధానమైంది. దీంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు కాజేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్నీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చట్నీస్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం