
భారతీయ ఆహారంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా.. పక్కన కాస్త రోటి పచ్చడి లేదా కొద్దిపాటి చట్నీతో గానీ భోజనం పూర్తి చేయరు. ఇవి భోజనాన్ని శక్తిమంతంగా మార్చుతాయి. ఓ గొప్ప రుచిని అందిస్తాయి. అయితే మనం ఎన్నో రకాల వెరైటీ చట్నీలు చేసుకుంటాం. హాయిగా లాగించేస్తుంటాం. కానీ పోషకాల ప్రొఫెల్ పరంగా ఏ చట్నీ ఆరోగ్యానికి మంచిదనేది తెలియదు. అయితే కొన్ని చట్నీలు బరువు తగ్గేందుకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపకరిస్తాయట. వాటి పోషకాల ఆధారంగా ఆయా చట్నీలకు ర్యాంకుల ఇచ్చి మరీ వివరంగా చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా. అవేంటంటే..
చట్నీలను మాగ్జిమం సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల ఆయుర్వేద సంబంధిత మూలికలు వంటి వాటితో తయారు చేస్తుంటాం. అందువల్ల వాటి తయారీ ఆధారంగా పోషక విలువలు గణనీయంగా మారతాయని చెబుతున్నారు మల్హోత్రా. ఆ నేపథ్యంలోనే మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చట్నీలకు పోషకాల ఆధారంగా ర్యాంకులిచ్చి మరీ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అవేంటో చూద్దామా..
పుదీనా-కొత్తిమీర చట్నీ: దీనిలో విటమిన్లు ఏ,సీ, కేలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి చట్నీ: గుండె ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు (ఎంసీటీలు), ఫైబర్ అధికంగా ఉంటాయి, జీవక్రియ, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మాంగనీస్, రాగి వంటి ఖనిజాలను అందిస్తుంది.
వేరుశెనగ చట్నీ: ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. శక్తి వంతమైనది. సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
టమాటో చట్నీ: లైకోపీన్ (గుండె ఆరోగ్యానికి సంబంధించిన యాంటీఆక్సిడెంట్), విటమిన్లు సీ, ఈలు సమృద్ధిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
చింతపండు చట్నీ: విటమిన్ బీ, మెగ్నీషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎక్కు చక్కెర ఉండటం వల్ల దీన్ని అంతగా ఆరోగ్యకరమైనదిగా పరిగణించలేదు నిపుణులు.
మామిడి చట్నీ: ఇందులో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. అయితే దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి.
ఎర్ర మిరప చట్నీ: క్యాప్సైసిన్ అధికంగా ఉంటుంది,. జీవక్రియను పెంచుతుంది. అయితే మితంగానే తీసుకోవాలి.
“కారపు చట్నీలు వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ప్రకాశవంతమైన రంగును ప్రోత్సహిస్తాయి. ఇంట్లో తయారుచేసిన చట్నీలు స్టోర్-కొనుగోలు చేసిన వెర్షన్ల కంటే ఎక్కువ పోషకాలను ఉంటాయి. ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెరలు ఉండవు కాబట్టి చెబుతున్నారు మల్హోత్రా .
మితంగా తీసుకోవాల్సిన చట్నీలు
కొన్ని భారతీయ చట్నీలు అధిక కేలరీలు లేదా సోడియం కంటెంట్ కారణంగా మితంగా తినాలి అని మల్హోత్రా సూచించారు.
కొబ్బరి చట్నీ: రుచికరమైనది అయినప్పటికీ, 100 గ్రాములకు 217 కేలరీలు, 19.84 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంద., ప్రధానంగా సంతృప్త కొవ్వు నుంచి ఎల్‌డీఎల్ (LDlL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధితన సమస్యలు ఉన్నవారికి మంచిది కాదని చెబుతున్నారు
వేరుశెనగ చట్నీ: కేలరీలు అధికంగా ఉంటాయి. దీనిలో 100 గ్రాములకు సుమారు 331.78 కేలరీలు, 22.82 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్‌లను అందిస్తున్నప్పటికీ.. ఇందులో జోడించిన ఉప్పు, చక్కెర మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం.
చింతపండు చట్న: తయారీ పద్ధతులను బట్టి ఈ చట్నీలో అదనపు చక్కెరలు, సోడియం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇది ఒకరకంగా అదనపు కేలరీల తీసుకునేందుకు దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు మల్హోత్రా.
చివరగా ఈ చట్నీలన్నీ రుచి, పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆహార సమతుల్యత, ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్కువగా తీసుకోవడమే మంచిదని సూచించారు మల్హోత్రా.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యలను సంప్రదించడం ముఖ్యం.
(చదవండి: Vicky Kaushal: 'ఛావా' కోసం వంద కిలోలు దాటేసిన హీరో.. ఏ డైట్ ఫాలో అయ్యాడంటే?)
Comments
Please login to add a commentAdd a comment