
ఆహార ప్యాకేజింగ్ లేబుల్స్‌పై ఉన్న సమాచారం నమ్మి..కొనుగోలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లతో మంచి విషయాలను ముచ్చటించే హర్ష్ గోయెంకా తాజాగా ఆహార కంపెనీలు వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నాయో వివరించే వీడియోను పంచుకున్నారు. ఇన్ని ప్రముఖ ఆహార కంపెనీలు తన ప్యాకేజీ లేబుల్‌పై ఇంతలా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నాయా..? అని తెలిసి షాకయ్యా అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకి హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..?
హర్ష గోయెంకా ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఓ సమస్యను బయటపెట్టారు. మన ఆహార కంపెనీలు మనల్ని ఎలా మోసగిస్తున్నాయో ఈ వీడియోలో సవివరంగా ఉందని, అది చూసి విస్తుపోయానంటూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఆ వీడియోలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అయిన రేవంత్ హిమత్సింగాక్ ఆహార కంపెనీలు వినియోగదారులను తప్పుపట్టించేలా చేస్తున్న మోసపూరిత వ్యూహాల గురించి మాట్లాడారు. అందులో గుడ్ డే బిస్కట ప్యాకేట్స్, కుకీలు వంటి వాటిల్లో బాదం, జీడిపప్పుల క్యాండిటీ 50-60 శాతం ఉంటాయని లేబుల్‌పై ఉంటుంది.
కానీ కేవలం బాదం 1.8 శాతం, జీడిపప్పలు 0.4 శాతం మాత్రమే ఉంటాయన్నారు. మరోక బిస్కెట్ ప్యాకెట్‌ని చూపిస్తూ..దీన్ని హోల్‌వీట్ కుకీగా ప్రచారం చేస్తుంటారు. కానీ దానిలో 52 శాతం శుద్ధి చేసిన పిండి, 19.5 శాతం మాత్రమే హోల్‌వీట్ ఉంటుందన్నారు. అలాగే హెర్బ్ కుకీగా అమ్ముడవుతున్న మరో ప్రొడక్ట్‌లో అశ్వగంధ, పసుపు, తులసి, గిలోయ్, ఆమ్లా (గూస్‌బెర్రీ) ఉన్నాయని పేర్కొంది. అవి లేబుల్లో చెప్పినంత శాతంగా కాకుండా కేవలం 0.1 శాతం మాత్రమే ఉన్నాయి.
ఇలా మనకు తెలియకుండా చాలా పెద్ద నకిలీ మార్కెట్ జరుగుతోంది. ఇది ఒక విధమైన పెద్ద సమస్య, ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వీడియోలో న్యూట్రిషన్ రేవంత్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మం గనుక ప్రొడక్ట్‌లపై ఉన్న సమాచారాన్ని నమ్మి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడటమేగాక ఆస్పత్రి పాలవ్వుతామని అన్నారు.
ఏదో రకంగా వినియోగదారుడుకి కట్టబెట్టడంలో నైపుణ్యం కలిగిన ఆహార కంపెనీలు అవి. అవన్నీ ఒక దానికొకటి పోటీ పడుతూ మనల్ని దారుణంగా తప్పుదారి పట్టించేలా మోసం చేస్తన్నాయని చెప్పారు న్యూట్రిషన్ రేవంత్. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కంటే మొక్కల ఆధారిత ఆహరానికే ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి కొనుగోలు చేసి ఒళ్లు, జేబు గుల్ల చేసుకుని వాడి లాభాలు తెచ్చిపెట్టే కంటే..ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు న్యూట్రిషన్ రేవంత్. చివరగా హర్ష గోయంకా ఆరోగ్యకరంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం అని పోస్ట్‌ని ముగించారు.
How our food companies are taking us for a ride! I was truly shocked by these revelations. pic.twitter.com/oRWTeVuYxw
— Harsh Goenka (@hvgoenka) March 19, 2025
(చదవండి: నటి రాణి ముఖర్జీ టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్యనమస్కారాలు ఇంకా..)
Comments
Please login to add a commentAdd a comment