ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’ | Pakhala: How To Make This Ultimate Odia Food So Special | Sakshi
Sakshi News home page

ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’! వేసవిలో హాయినిచ్చే వంటకం..

Published Fri, Mar 21 2025 11:27 AM | Last Updated on Fri, Mar 21 2025 11:48 AM

Pakhala: How To Make This Ultimate Odia Food So Special

భువనేశ్వర్‌: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం.  

పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు.  

కొరాపుట్‌: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. 
 

(చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement