![Odisha Food and Craft Mela to be held for three days at Shilparamam](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/shilparamam.jpg.webp?itok=1dh3vKXF)
మాదాపూర్ : హైదరాబాద్‌లో ఒడిశా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడియాఫుడ్, క్రాఫ్ట్ మేళాను శిల్పారామంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న మేళాను స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్, శిల్పారామం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రదర్శనలో ఒడిశా సంప్రదాయ వంటకాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం యాంఫీథియేటర్‌లో 5.00 గంటలకు ఒడిశా సంప్రదాయ నృత్యాలను కళాకారులు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకోనున్నారు. మూడు రోజుల ఉత్సవం సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని సంస్థ అధ్యక్షురాలు సుస్మితా మిశ్ర తెలిపారు. ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్‌పురి, బొమ్‌కై, కోట్‌ప్యాడ్ అల్లికలతో పాటు, క్లిష్టమైన పెయింటింగ్‌లు, ధోక్రా మెటల్‌వర్క్, ప్రముఖ కళాకారులచే అప్లిక్ వర్క్‌లను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒడిశా కళాత్మక వారసత్వానికి ప్రాణం పోసే ఒడిస్సీ నృత్యం, జానపద, గిరిజన నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి.
ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
ఒడిశా సంప్రదాయ వంటకాలు..
రసగొల్ల, చెనపోడ, కిర్మోహణ, ఒడియా స్ట్రీట్‌ఫుడ్ గప్‌చుప్, దహీబారా, ఆలూదమ్, ఆలూచాప్ తదితరులు వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ
Comments
Please login to add a commentAdd a comment