mela
-
National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు. ఏమేమీ కావాలి.. రెజ్యూమ్ మూడు కాపీలు మార్క్షీట్లు, సర్టిఫికెట్ మూడు కాపీలు ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఎక్కడెక్కడంటే... తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్ కడప)ల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు) -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’ నిర్వహిస్తోంది. జూన్ 22 నుంచి ప్రారంభమైన ఈ మేళా, జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ మేళలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట, కూకట్పల్లి షోరూంలలో బంగారపు గాజులను(గోల్డ్ బ్యాంగిల్స్‌ను) ప్రదర్శనకు ఉంచింది. మొత్తం 200 కిపైగా డిజైన్లతో కళకళలాడుతున్న ఈ మేళలో, రోజువారీ, ఫంక్షన్లకు వేసుకెళ్లే గాజులు ఉన్నాయి. తాము బ్యాంగిల్ మేళ నిర్వహించడాన్ని ఎంతో సంతోషిస్తున్నామని, తమ ప్రదర్శనలో ఇదీ ఒకటని రిలయన్స్ జువెల్స్ సీఈవో సునిల్ నాయక్ చెప్పారు. ప్రతి ఒక్క సందర్భాన్ని వేసుకెళ్లే గాజులను అందుబాటులో ఉంచామన్నారు. భారతీయ మహిళల సంస్కృతి, సంప్రదాయాల్లో గాజులు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. నగరంలోని గాజుల అభిమానులందరికీ ఈ బ్యాంగిల్ మేళ ఎంతో ఉత్తేజకరమైన అవకాశమని పేర్కొన్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ గాజులను ఎంపిక చేసుకోవచ్చని నాయక్ చెప్పారు. రిలయన్స్ జువెల్స్ ప్రస్తుతం గోల్డ్, డైమాండ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 47 నగరాల్లో ఈ కంపెనీ 77 షోరూంలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ప్రత్యేక సందర్భంలో అద్భుతమైన డిజైన్లను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ గోల్డ్‌ను మాత్రమే రిలయన్స్ జువెల్స్ విక్రయిస్తోంది. -
హత్య చేసిందెవరు?
సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘మేళా’. కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్ కుమార్ కొంకా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హాస్య నటుడు అలీ, కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి విడుదల చేశారు. కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి మా సినిమానే నిదర్శనం. మూడు వేరియేషన్స్‌లో సాగుతుంది’’ అన్నారు. ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు సూర్యతేజ్. సిమ్రాన్, సోని చరిష్టా, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి. -
‘మేళా’తో టాలీవుడ్‌కు..
కబాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి సాయి ధన్సిక. తాజాగా సాయి ధన్సిక సినమ్ అనే లఘు చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ చిత్రం కోల్‌కతా అంతర్జాతీయ కల్ట్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి తదితర 8 అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. మేళా అనే చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై సాయి ధన్సిక మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో ప్రముఖ రచయిత కిరణ్ తనను కలిసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పారన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా లేడీ ఓరియంటెడ్ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు ద్విపాత్రాభినంలా అనిపిస్తుందని, తాను ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తానని, ఒక గెటప్‌లో దెయ్యంగా కనిపిస్తానని తెలిపారు. ఇందులో తనకు జోడీ ఎవరూ ఉండరని, అయితే తెలుగు, తమిళ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తెలుగు నటుడు సూర్యతేజ కథానాయకుడిగా, అలీ, భరత్‌రెడ్డి, మునీష్కాంత్, జాంగిరి మధుమిత నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించానని అన్నారు. మేళా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందని ఆమె తెలిపారు. -
రేపు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని హైదరాబాద్ సచివాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా(పీసీసీ)ను నిర్వహిస్తున్నట్లు పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తెలిపారు. బేగంపేట్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో ఎలాంటి రుసుము లేకుండానే బ్రాంచ్ సెక్రటెరీయెట్ అధికారులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేస్తారన్నారు. ఇటీవల రాష్ట్రం నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు డిమాండ్ పెరిగిందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొనే వారు వెబ్సైట్ www.passportindia.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంచిన స్లాట్స్‌ను బుక్ చేసుకుని సరైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని సూచించారు. 1,000 స్లాట్లు అందుబాటులో ఉంచగా ఇప్పటివరకు 250 స్లాట్లు బుక్ అయ్యాయన్నారు. -
సాధువు ఫోటో వైరల్
అలహాబాద్ : ట్రాక్టర్, లారీ లాంటి భారీ వాహనాలను తాడుతో పట్టుకుని ముందుకు లాగడాన్ని అప్పుడప్పు చూసే ఉంటాం. మరీ కొందరైతే జుట్టుతోనే లేక పళ్ల సాయంతోనో లాగడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ సాధువు మాత్రం వీటన్నింటినీ మించి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర భారతదేశంలో మినీ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మాఘ్ మేళా ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఈ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గాంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. అలహాబాద్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధిచెందిన ప్రయాగ్ లో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి ప్రర్శనలు ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో సాధువులు ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో కూడా ఓ సాధువు డజన్ ఇటుకలను తన మర్మావయవానికి కట్టుకొని ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించి ఓ వీడియో అప్పుడు వైరల్ అయింది. 2016లో కూడా కుంభమేళా సమయంలో ఓ సాధువు పెద్ద బండారాయిని తాడుసాయంతో మర్మావయవానికి కట్టుకొని ఓ ప్రదర్శన ఇచ్చారు. 2018 మాఘ్ మేళాకు సంబంధించి మరిన్ని ఫోటోలు -
థ్రిల్లర్ మేళా
సూర్యతేజ, ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, అలీ, మంజు, సోనీ చరిష్టా ముఖ్య తారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో సంతోష్ కొంక నిర్మించ నున్న ‘మేళా’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలీ మాట్లాడుతూ– ‘‘సాయి ధన్సిక మంచి నటే కాదు, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో మంచి రోల్లో కనిపించనుంది. శ్రీపురం కిరణ్ 30 ఏళ్లుగా తెలుసు. నెమ్మదిగా ఎదుగుతూ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు’’ అన్నారు. శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లో నేను చూసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘మేళా’ కథ తయారు చేశా. ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి కథను తెరకెక్కించాలంటే నిర్మాతకి ప్యాషన్ ఉండాలి. అలాంటి నిర్మాత సంతోష్‌గారు’’ అన్నారు. ‘‘రెండు నెలలు క్రితం కిరణ్‌గారు కథ చెప్పినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు సాయిధన్సిక. నిర్మాత సంతోష్, సూర్యతేజ, మాగ్నస్ మీడియా మహిధర్, మంజు, సోని చరిష్టా, కెమెరామెన్ మురళీమెహ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు తదితరులు పాల్గొన్నారు. -
26న తపాలాశాఖ మహా మేళా
- కర్నూలులో కార్యక్రమం - పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈనెల 26వ తేదీన కర్నూలులో తపాలా శాఖ మహామేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయన మంగళవారం తన ఛాంబరులో ఏఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ, సుకన్య సమృద్ధి యోజన, మైస్టాంప్స్ వంటి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మహామేళాలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అన్ని పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. మహామేళా వేదికగా సంబంధిత అధికారులు మార్కెటింగ్‌లో ప్రగతి సాధించాలని సూచించారు. మహామేళాను నగరంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పిన కేవీ సుబ్బారావు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు సి.హెచ్.శ్రీనివాస్, నాగానాయక్, ఇన్స్పెక్టర్లు నూరుల్లా, శ్రీనివాసరాజు, ఫజులుర్రహ్మాన్, విజయమోహన్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
25న కోసిగిలో పోస్టల్ మహామేళా
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోసిగిలో మహామేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. శనివారం తన చాంబరులో ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహామేళాలో తపాలా శాఖకు సంబంధించిన పథకాలను వినియోగదారులకు పరిచయం చేయడమే కాకుండా తక్షణ సేవలు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక, శాసన సభ్యులు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జయనాగేశ్వరరావుతో పాటు పీఎంజీ సంజీవ్ రంజన్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని కోరారు. -
16, 17లో 'నన్నయ' ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
పరీక్షలను వాయిదా వేసిన నన్నయ వర్సిటీ వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే దీనిని భారీ జాబ్ మేళాగా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్, ఎన్టీఆర్ ట్రస్టులతో కలసి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో విప్రో, ఇన్ఫోసిస్ వంటి వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. సుమారు ఆరు వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. అయితే శిక్షణ పొందని వారు కూడా హాజరుకావొచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్, బీటెక్, ఎంటెక్, తదితర అర్హతలున్న వారంతా హాజరుకావొచ్చన్నారు. సుమారు వంద కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు వస్తున్నందున ఉభయ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'నన్నయ' లో పరీక్షలు వాయిదా రాజమహేంద్రవరంలో జరగనున్న మెగా జాబ్ మేళాకు తమ యూనివర్సిటీ పరిధిలోని అర్హత ఉన్న విద్యార్థులు కూడా హాజరయ్యేందుకు వీలుగా గురువారం (15వ తేదీ) నుంచి వరుసగా మూడు రోజులపాటు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు తిరిగి 19వ తేదీ నుంచి జరుగుతాయని వీసీ తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశామన్నారు. -
26న నిరుద్యోగులకు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్‌స్టెప్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్సు, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారన్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ.8వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ప్రతి పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారని, ఎంపికైన వారు కర్నూలులోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు స్థానిక కల్లూరు ఎస్టేట్స్‌లోని సెట్కూరు కార్యాలయానికి ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 9177016174 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ మేళాకు విశేష స్పందన
– ఉచిత సిమ్ పథకానికి 27 వరకు గడువు పొడిగింపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నిర్వహించిన రెండు రోజుల ఉచిత సిమ్ మేళాకు విశేష స్పందన లభించింది. జీఎం పి.ఎస్.జాన్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేళా శిబిరాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు రెండు రోజుల వ్యవధిలో రెండు వేలకు పైగా సిమ్‌లు తీసుకున్నారని చెప్పారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో ఉచిత సిమ్‌లు పొందేందుకు మరో మూడురోజులు గడువు పెంచినట్లు వెల్లడించారు. దరఖాస్తులు స్వీకరించడానికి 26, 27 తేదీల్లో వినియోగదారుల సేవా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నేడు బీఎస్ఎన్ఎల్ మెగా మేళా
డాబాగార్డెన్స్: భారత్ సంచార్ నిగాం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) బుధవారం మెగా మేళా నిర్వహించనుందని జిల్లా టెలికాం సీనియర్ జనరల్ మేనేజర్ తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలోని సీతమ్మధార, మధురవాడ, ఎంవీపీ కాలనీ, భీమిలి, మల్కాపురం, బాలచెఱువు, గాజువాక, అక్కయ్యపాలెం, డాబాగార్డెన్స్, సీఆర్ఆర్, వెలంపేట, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, మాధవధార, ఎన్ఏడీ, చోడవరం, గోపాలపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచలి, పాడేరు, అరకు ప్రాంతాల్లో మెగామేళా నిర్వహించనున్నట్టు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ నిర్వహించనున్న మెగామేళాలో పాల్గొనే వినియోగదారులు పాస్‌ఫొటో, గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నెంబరులో 1800 180 1503 సంప్రదించవచ్చు. -
రేపు జాబ్‌మేళా
మర్రిపాలెం: ప్రభుత్వ పాత ఐటీఐలో సోమవారం విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం అభ్యర్థులను ఎంపిక చేస్తామని జిల్లా ఉపాధి అధికారి (క్లరికల్) ఇ.వెంకటరత్నం తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ ఓంక్యాప్ నేతత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దుబాయి, యూఏఈ దేశంలోని జజీరా ఎమిరెడ్స్ పవర్ కంపెనీలో పలు ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, అసిస్టెంట్ ఫిట్టర్ ఉద్యోగాలకు ఐటీఐలో శిక్షణ పూర్తిచేసి ఉండాలన్నారు. హెల్పర్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత కలగినవారు అర్హులన్నారు. పై అన్ని ఉద్యోగాలకు రెండు నుంచి మూడేళ్ల అనుభవం కలిగివుండాలన్నారు. వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతితోపాటు యూఏఈ లైసెన్స్ తప్పక కలిగివుండాలని సూచించారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. అభ్యర్థి పాస్‌పోర్టు కలిగిఉండాలని, ఉచిత వసతి, రవాణా సౌకర్యం సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటా, పాస్‌పోర్టు, ఒరిజినల్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో ప్రభుత్వ పాత ఐటీఐ ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8179204289, 7075340904 నెంబర్లను సంప్రదించవచ్చు. -
29న అమలాపురంలో జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ) : అమలాపురం ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.వసంతలక్ష్మి మంగళవారం తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాలలో ఎక్సైడ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేయడానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 0884–2373270 lనంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
పోలీస్ షో.. అట్టర్ ఫ్లాప్
జాతర నిర్వహణలో స్పష్టంగా కనిపించిన వైఫల్యం ఏకపక్ష నిర్ణయాలతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ‘మేడారం జాతరను తెలంగాణ కుంభమేళా అనొద్దు.. ఇది కుంభమేళా కంటే ఎన్నోరెట్లు పెద్దది’ ఈ మాటలను పదేపదే ఉటంకించింది ఎవరో కాదు.. స్వయంగా రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు. మేడారం జాతరను ఆ స్థాయిలో అభివర్ణించిన అధికారి.. తీరా బందోబస్తు నిర్వహణలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2012 జాతరతో పోలిస్తే ప్రస్తుత జాతరలో భక్తులు తీవ్ర అవస్థతకు గురయ్యారు. గంటల కొద్ది ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాసకోర్చి మేడారం చేరుకున్న భక్తులు గద్దెల వద్ద ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సామాన్య భక్తులే కాదు.. వీఐపీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇన్నేళ్ల జాతరలో పోలీసులు ఇంత అధ్వాన్నంగా బందోబస్తు నిర్వహించడం ఇదే తొలిసారి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో మేడారం జాతరలో పోలీసులను అట్టర్‌ఫ్లాప్ చేసిన ఘనత ఉన్నతాధికారులదే అని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. కోటి మంది వచ్చే జాతరకు పక్కా ప్రణాళిక లేకపోవడమే తమ వైఫల్యానికి కారణమని అంగీకరిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో కొత్తవారికి బాధ్యతలు.. భక్తులు మేడారం చేరడం.. తల్లుల దర్శనం తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్లడమంతా పోలీసుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం జాతర మార్గంలోని కీలక ప్రదేశాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు అవగాహన ఉన్న పోలీసు అధికారులను నియమించాల్సి ఉంది. ప్రతి జాతరలో ఇదే జరిగేది. ప్రస్తుత రూరల్ ఎస్పీ కాళిదాసు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారిని కాదని ఈ ప్రాంతంపై ఎలాంటి అవగాహన లేని వారికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్య తలు అప్పగించారు. హైదరాబాద్, ఖమ్మం, కృష్ణా, గుంటూ రు జిల్లాల నుంచి వచ్చిన వారికి ఈ విధులు అప్పగించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులే చెబుతున్నారు. కొన్ని రిస్క్ పాయింట్లలో అనుభవం లేనివారిని ఉంచడంతో పరిస్థి తి చేయిదాటింది. పెట్రోలింగ్ క్రమపద్ధతిలో లేకపోవడంతో ములుగు నుంచి వరంగల్ వరకు ట్రాఫిక్ జామైంది. సక్సెస్ఫుల్ అధికారుల జాడేది.. గతంలో మేడారం జాతర విధులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిం చిన అనేక మంది అధికారులకు ఈ దఫా పిలుపు అందలేదు. మేడారం జాతరను సక్సెస్ చేసిన వారిలో చాలామంది ప్రస్తుతం లూప్‌లైన్ సర్వీసు, ఇతర జిల్లాల్లో ఉన్నారు. మిగతా అధికారులను పిలిచినప్పటికీ వారిని ఆహ్వానం అందకపోవడం శోచనీయం. మేడారం జాతర విజయవం తం కావడంలో గతంలో విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులు దయానందరెడ్డి, నాగరాజు, తిరుపతి, చంద్రశేఖర్ అవధాని, సురేందర్‌రెడ్డి, రవికుమార్, జనార్ధన్, నర్స య్య, ఫణిందర్వంటి వారి సహకారం కూడా ఈసారి తీసుకోలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవలే ఎన్నికల్లో బదిలీ అయి న వారికి, అనుభవం లేని వారికి బందోబస్తు విధులు ఇవ్వడంతోనే జాతరలో పోలీసు శాఖ విఫలమైందనే అభిప్రా యం వినిపిస్తోంది. జాతర సందర్భంగా రోడ్లపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ రేంజ్ ఐజీ రవి గుప్తా, వరంగల్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు హుటాహుటిన మేడారం జాతర ప్రాంగణానికి చేరుకున్నా రు. గురువారం, శుక్రవారం అక్కడే మకాం వేశారు. వీరిద్దరు జాతర ప్రాంతానికి చేరుకోక ముందు, వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం గమనార్హం. అధికారులకు పట్టని సిబ్బంది తిండీతిప్పలు.. మేడారం జాతర బందోబస్తు విధుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వేలాది మంది పోలీసులను వినియోగించారు. వారికి సమయానికి భోజనం పెట్టడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని కిందిస్థాయి పోలీసు అధికారులే చెబుతున్నారు. కొత్త బియ్యంతో వండిన అన్నం, కూరలు వేయకపోవడం, ఉన్న నాలుగు రోజులు పప్పు, చారుతోనే సరిపెట్టారని వాపోయారు. ఈ అంశం కూడా బందోబస్తుపై ప్రభావం చూపిందని కొందరు సిబ్బంది పేర్కొన్నారు. డీఐజీ, రూరల్ ఎస్పీపై బదిలీ వేటు ? వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసుపై బదిలీ వేటుపడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా పోలీసుల వైఫల్యంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కారణంతో ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీకి రంగం సిద్ధమైందని తెలిసింది. ప్రస్తుతం పోలీస్ డిపార్టమెంట్లో ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వారి బదిలీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.