‘మేళా’తో టాలీవుడ్‌కు.. | Sai Dhansika Tollywood Entry With Mela | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 24 2018 11:43 AM | Last Updated on Sat, Mar 24 2018 11:43 AM

Sai Dhansika Tollywood Entry With Mela - Sakshi

సాయి ధన్సిక

కబాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి సాయి ధన్సిక. తాజాగా సాయి ధన్సిక సినమ్‌ అనే లఘు చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ చిత్రం కోల్‌కతా అంతర్జాతీయ కల్ట్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి తదితర 8 అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది. 

ప్రస్తుతం ఈ భామ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. మేళా అనే చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై సాయి ధన్సిక మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో ప్రముఖ రచయిత కిరణ్‌ తనను కలిసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పారన్నారు. 

యథార్థ సంఘటనల ఆధారంగా లేడీ ఓరియంటెడ్‌ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు ద్విపాత్రాభినంలా అనిపిస్తుందని, తాను ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తానని, ఒక గెటప్‌లో దెయ్యంగా కనిపిస్తానని తెలిపారు. ఇందులో తనకు జోడీ ఎవరూ ఉండరని, అయితే  తెలుగు, తమిళ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తెలుగు నటుడు సూర్యతేజ కథానాయకుడిగా, అలీ, భరత్‌రెడ్డి, మునీష్‌కాంత్, జాంగిరి మధుమిత నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో ఫైటింగ్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించానని అన్నారు. మేళా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందని ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement