పొరుగు దేశం నేపాల్‌లో ఐదేళ్లకోమారు లక్షలాది మూగ జీవాలు బలి అవుతున్నాయి. ఈ అత్యంత ఘోరమైన చర్య బారా జిల్లాలోని గఢీమయీ దేవి జాతరలో చోటుచేసుకుంటుంది. ఈ జాతరలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ మూగ జీవాలను బలిఇస్తుంటారు. అయితే ఈసారి భారత సశాస్త్ర సీమ బల్, స్థానిక యంత్రాంగం మూగజీవాలను రక్షించేందుకు నిరంతరం శ్రమించింది.
డిసెంబరు 2న ప్రారంభమైన ఈ జాతర 15 రోజుల పాటు జరిగింది. జాతరలో డిసెంబర్ 8, 9 తేదీల్లో అంటే రెండు రోజుల్లోనే 4,200 గేదెలను బలి ఇచ్చినట్లు సమాచారం. అయితే అధికారుల చొరవకారణంగా 750 జంతువులు బలి బారినపడకుండా తప్పించుకున్నాయి. వీటిలో గేదెలు, గొర్రెలు, మేకలు ఇతర జంతువులు ఉన్నాయి. ఈ జంతువులను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వన్యప్రాణి పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.
నేపాల్‌లోని గఢీమయీ ఆలయంలో ఈ జాతరను డిసెంబర్ 2వ తేదీన నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ జాతర డిసెంబర్ 15 వరకు కొనసాగింది. డిసెంబరు 8వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించిన జనం లెక్కకుమించిన రీతిలో జంతువులను, పక్షులను బలి ఇచ్చారు. ఈ రక్తపాత సంప్రదాయానికి స్థానికుల మూఢనమ్మకాలే కారణంగా నిలుస్తున్నాయి.
265 ఏళ్లుగా గఢీమయీ ఉత్సవం జరుగుతోంది. 2019లో జంతుబలిని నిలిపివేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రపంచంలోనే అత్యధిక జంతుబలులు ఈ జాతర సమయంలోనే జరుగుతాయని అంటారు. గఢీమయీ జాతర అతిపెద్ద సామూహిక బలి కర్మగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. ఇక్కడ మొదటగా వారణాసిలోని దోమ్రాజ్ నుంచి 5,100 జంతువులను తీసుకువచ్చి బలి ఇస్తారు. జాతర జరిగే రోజుల్లో రోజుకు ఐదు లక్షలాది మంది భక్తులు వస్తుంటారని అంచనా.
నేపాల్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, భారత్ సహా పలు దేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు ఈ జాతరకు తరలివస్తుంటారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటువంటి జంతు బలులను నిషేధించారు. నేపాల్‌లో జరిగే ఈ జాతరను వ్యతిరేకిస్తూ భారతదేశం కూడా తన గొంతు కలిపింది. 2019లో నేపాల్ సుప్రీంకోర్టు ఈ జంతుబలిని వెంటనే నిషేధించడానికి నిరాకరించింది. అయితే జంతుబలిని క్రమంగా తగ్గించాలని ఆదేశించింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
Comments
Please login to add a commentAdd a comment