surya teja
-
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సూర్యతేజ, మీనాక్షి, హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం భరతనాట్యం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా టాలీవుడ్ అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు.తాజాగా భరతనాట్యం చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమా రిలీజైన దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీతోనే సూర్యతేజ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో వైవా హర్ష కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. -
హీరోగా చేస్తానని అనుకోలేదు: సూర్య తేజ
‘దొరసాని’ ఫేం కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భరతనాట్యం’. ఈ మూవీతో సూర్య తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం, నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో ఉన్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. ► ఈ సినిమా కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది. ► 'భరతనాట్యం' ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. ఈ కథకు 'భరతనాట్యం' పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ► కాసర్ల శ్యామ్ , అనంత శ్రీరామ్ , భాస్కర భట్ల గారు ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్ గారు చాలా ఫన్ పర్శన్. కథ వింటూ మాతో ట్రావెల్ అయ్యారు. భాస్కర భట్ల గారు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీఫుల్ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ► భవిష్యత్ లో సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు ఉన్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి. -
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
ప్రజల గుండెల్లో నిలిచిపోయే అధికారి కావాలి
సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు. సాక్షి, అమరావతి బ్యూరో: సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవ్వటమే వాడి ఆశయం, అది నేడు సాకరమైంది... నిజాయతీ గల ఆధికారిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా కల, భగవంతుడి దయ, తన పట్టుదలతో అది నెరవేరుతుందని బలంగా విశ్వసిస్తున్నాను...’ అంటూ మంగళవారం విడుదలైన ఇండియన్ సివిల్స్ 2019 ఫలితాల్లో ఆలిండియా 76వ ర్యాంక్ సాధించిన గుంటూరు నగరానికి చెందిన మల్లవరపు సూర్యతేజ తల్లి సంధ్యారాణి “సాక్షి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె మాటల్లో... సివిల్స్‌లో మంచి ర్యాంక్‌లో సాధించాలనే నా కుమారుడి కల నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. తన కలను సాకారం చేసుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. దానికి నేడు ప్రతిఫలం దక్కింది. వాళ్ల నాన్నగారు 2014లో ఆనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆ ప్రభావం తన లక్ష్యం పైన పడకుండా జాగ్రత్తపడ్డాను. సూర్యతేజ పాఠశాల విద్య గుంటూరు నగరంలోనే సాగింది. చదువే ప్రపంచం... సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తనకు స్టడీ హాల్‌కు వెళ్లి చదవటం అంటే ఇష్టం. రోజు ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఇంటిలో కన్నా స్టడీ హాల్లోనే గత మూడు నాలుగేళ్లుగా గడిపాడు. తనకు చదువే ప్రపంచం, ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టేవాడు కాదు. -
అనుమానమే అవమానమనుకుంది
హైదరాబాద్: ప్రియుడు అనుమానించడం అవమానంగా భావించి టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా సూర్యతేజ మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో అతనికి తెలిసిన వారికి పోలీసులు ఫోన్‌చేసి విచారణకు హాజరుకమ్మని చెప్పారు. దీంతో అతడు శనివారం రాత్రి పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చారు. సూర్యతేజను పూర్తిగా విచారించిన అనంతరం అనుమానమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఝాన్సీ ఫోన్ నంబర్‌ను సూర్యతేజ బ్లాక్‌లిస్టులో పెట్టడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం, సూర్యతేజకు ఇంట్లో వేరే సంబంధాలు చూడటం కూడా ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు పేర్కొంటున్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకుని అతనిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మధు అనే అమ్మాయి ద్వారా ఝాన్సీ పరిచయం కాగా అది ప్రేమగా మారిందని పోలీసులు చెప్పారు. వేరే వ్యక్తులతో ఝాన్సీ ఎక్కువగా మాట్లాడుతుండేదని, ఇది ఇష్టం లేని సూర్యతేజ సీరియల్స్‌లో నటించడం ఆపేయాలని ఒత్తిడి తీసుకురాగా అప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సీరియల్స్‌లో నటించేందుకు ఝాన్సీ సిద్ధమైంది. దీంతో సూర్యతేజ ఆమెతో గొడవపడి ఆమె మొబైల్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఫోన్ చేయగా దానికి అతడు స్పందించలేదు. వాట్సాప్ మెసేజ్‌లు పంపగా మొబైల్ నెట్ ఆఫ్ ఉండటంతో సూర్యతేజ వాటిని చూసుకోలేదు. నెట్ ఆన్ చేసుకునే లోపు ఝాన్సీ పంపిన మెసేజ్‌లను తనే డిలీట్ చేసేసిందని తెలిపారు. అవన్నీ అవాస్తవాలు: సూర్యతేజ నాగఝాన్సీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని సూర్యతేజ పోలీసుల విచారణలో తెలిపాడు. రూ.10 లక్షలు విలువ చేసే బంగారం ఇచ్చారన్నదాంట్లో వాస్తవంలేదని, కొంత బంగారం ఇవ్వగా అది తనఖా పెడితే రూ. రెండున్నర లక్షలు వచ్చాయని, అందులో మరో రూ. రెండున్నర లక్షలు కలిపి వారు ఓ స్థలం కొనే సమయంలో ఐదు లక్షలు తానే ఇచ్చానని తెలిపారు. తన పుట్టినరోజుకు మాత్రం రూ.లక్ష పెట్టి యమహా ఆర్15 ద్విచక్రవాహనం ఇప్పించిందన్నాడు. మా ఇంట్లో తమ ప్రేమ విషయం తెలిసినప్పటికీ తన ఇంటికి వచ్చి వారం రోజులు ఉందన్నది వాస్తవం కాదన్నాడు. గొడవలు ఉన్నమాట వాస్తవమే కానీ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని సూర్య తెలిపినట్లు పోలీసులు తెలిపారు. -
ఝాన్సీ, సూర్య మధ్యలో మధు..!
-
ఝాన్సీ, సూర్య మధ్యలో మధు!
సాక్షి, హైదరాబాద్: సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఆమె ప్రియుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరకే మధు అనే సీరియల్ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది. మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్ చేశాడని సమాచారం. సూర్య మాజీ ప్రియురాలు మధునే ఝన్సీని అతనికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఝాన్సీ.. సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం. -
పోలీసులు అదుపులో సూర్య
-
పోలీసుల అదుపులో సూర్య..
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. కాగా అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. (ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం) పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఝాన్సీ తల్లీ, సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్న పోలీసులు నాని అలియాస్ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
ఇంకా తెరుచుకోని ఐఫోన్ లాక్
హైదరాబాద్: టీవీనటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన మొబైల్(ఐఫోన్) లాక్ ఇంకా తెరుచుకోలేదు. లాక్ తెరుచుకుంటే కేసు పురోగతి సాధిం చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ఆమె ప్రియుడు సూర్యతేజ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం అతన్ని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. ఝాన్సీ వినియోగించిన రెండో మొబైల్ శామ్సంగ్ ఫోన్ లాక్ తెరుచుకున్నా అందులో కీలక ఆధారాలేవీ లభించలేదు. కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేసి ఉన్నాయి. వాటిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఝాన్సీ కుటుంబ సభ్యు లు శనివారం కృష్ణా జిల్లా నుండి బయలుదేరి హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. వారి నుంచి వివ రాలు సేకరించి సూర్యతేజను అదుపులోకి తీసు కోనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఝాన్సీ ఆత్మహత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
-
మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు..
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి నాగ ఝాన్సీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సంభాషణలపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ప్రియుడు సూర్య తేజ ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝాన్సీ సెల్ ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసులు ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. మృతురాలి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురితో ఝాన్సీ చేసిన వాట్సప్ చాటింగ్, మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలను గుర్తించినట్లు పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో చివరిసారిగా ప్రియుడు సూర్య తేజకు మెసేజ్ పంపినట్లు రికార్డు అయింది. అయితే ఆమె పంపించిన మెసేజ్‌కు సూర్య స్పందించకపోవడంతో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంలో ఝాన్సీని సూర్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందంటూ, ఎవరితో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఆ వేధింపులు శ్రుతిమించడంతో నెల క్రితం కూడా ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక చనిపోయే ముందు రోజు కూడా సూర్య-ఝాన్సీ మధ్య వివాదం ఏర్పడింది. ఆ తర్వాత ఝాన్సీ అర్థరాత్రి వరకూ సూర్యకు 14 మెసేజ్‌లు పంపించింది. అంతేకాకుండా ఫోన్ చేసినా సూర్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. -
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం
-
ఫోన్ లాక్ ఓపెన్ అయితేనే గుట్టు వీడేది!
హైదరాబాద్: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న ఝాన్సీ 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ కాగా అందులో ఉన్న మెసేజ్‌ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్ చేసినట్లు గుర్తించారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో ఐ ఫోన్ లాక్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడంలేదని పోలీసులు గురువారం తెలిపారు. కాగా లాక్ ఓపెన్ అయిన ఫోన్లో పెద్దగా సమాచారం లేదు. ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఉండగా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్ లాక్ తెరిస్తే ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గత నెలలో కూడా ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది. -
హత్య చేసిందెవరు?
సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘మేళా’. కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్ కుమార్ కొంకా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హాస్య నటుడు అలీ, కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి విడుదల చేశారు. కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి మా సినిమానే నిదర్శనం. మూడు వేరియేషన్స్‌లో సాగుతుంది’’ అన్నారు. ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు సూర్యతేజ్. సిమ్రాన్, సోని చరిష్టా, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి. -
‘మేళా’తో టాలీవుడ్‌కు..
కబాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి సాయి ధన్సిక. తాజాగా సాయి ధన్సిక సినమ్ అనే లఘు చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ చిత్రం కోల్‌కతా అంతర్జాతీయ కల్ట్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి తదితర 8 అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. మేళా అనే చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై సాయి ధన్సిక మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో ప్రముఖ రచయిత కిరణ్ తనను కలిసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పారన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా లేడీ ఓరియంటెడ్ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు ద్విపాత్రాభినంలా అనిపిస్తుందని, తాను ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తానని, ఒక గెటప్‌లో దెయ్యంగా కనిపిస్తానని తెలిపారు. ఇందులో తనకు జోడీ ఎవరూ ఉండరని, అయితే తెలుగు, తమిళ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తెలుగు నటుడు సూర్యతేజ కథానాయకుడిగా, అలీ, భరత్‌రెడ్డి, మునీష్కాంత్, జాంగిరి మధుమిత నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించానని అన్నారు. మేళా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందని ఆమె తెలిపారు. -
‘పాని పూరి’మూవీ న్యూ స్టిల్స్
-
తప్పటడుగు మూవీ స్టిల్స్
-
నూటికి నూరు విజేతలు వీరు
‘వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు మా అబ్బాయి’. ఈ మాట అంటున్నది ఒకటో తరగతి విద్యార్థి తల్లి కాదు. ప్రతిష్టాత్మకమైన ఐఐఎమ్ విద్యాసంస్థలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడుగుపెడుతున్న ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎలా చదివితే ఇది సాధ్యమవుతుంది?... ఇది వేలాది తల్లిదండ్రుల మెదళ్లను తొలిచే ప్రశ్న. ‘మా అబ్బాయికి లెక్కల్లో మెళకువలు నేర్పాను’ అంటారు సూర్యతేజ తండ్రి సాయిరామకృష్ణ. ‘క్లాసులో ఫస్ట్ రావాలని చెప్పను, అయితే ఫస్ట్ రాగలిగిన సమర్థత నీలో ఉన్నప్పుడు దానిని ఉపయోగ పెట్టకపోతే అది నీ తప్పు. ఆ పొరపాటు చదువులోనే కాదు, జీవితంలో కూడా చేయరాదు’ అని మార్గదర్శనం చేశానంటారు మరో విద్యార్థి పిల్లుట్ల కృష్ణ తండ్రి విశ్వనాథం. సక్సెస్‌కు ఒకటి కాదు, వందలాది దారులు. ఏ దారిలో వెళ్లామనేది కాదు, గమ్యం చేరడమే లక్ష్యం... అని విజేతలు నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా ఇటీవల వెలువడిన కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో శిఖరాగ్రాన నిలిచిన విజేతలలో మనవాళ్లు నలుగురున్నారు. వారిలో సూర్యతేజ, కృష్ణ ఇద్దరూ పరస్పరం భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు. సూర్యతేజ తండ్రి సామర్లకోట ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. కృష్ణ తండ్రి విశ్వనాథం ప్రఖ్యాత విద్యాసంస్థల స్థాపకులు. వీరిద్దరూ తమ పిల్లలకు ‘వింటి నుంచి వదలిన బాణంలా’ దూసుకెళ్ల గలిగిన నైపుణ్యాన్ని నేర్పించారు. అవధానమే సోపానం! ‘నిజాయితీగా ఉండడం, సూటిగా మాట్లాడడం, అబద్ధం ఆడకపోవడం వంటి విలువలను నేర్పించాను. ఇంట్లో అందరం రామకృష్ణ పరమహంస బోధనలను అనుసరిస్తాం. ఆ ప్రభావం మా పిల్లల మీద ఉంది. మా వారు గణితావధానం చేస్తారు. ఒకసారి వేదిక మీద ‘అవధానం చేయడం అసాధ్యం కాదు, ఆసక్తి ఉన్న వాళ్లను అవధానిగా తీర్చిదిద్దగలను’ అన్నారు. అప్పటికి సూర్యతేజ ఎయిత్క్లాసులో ఉన్నాడు. ‘మన ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వేదిక మీద చెప్పిన దానిని ఆచరించి చూపండి’ అన్నాను. అన్నట్లుగానే నేర్పించారాయన. తేజ చిన్నప్పుడు అవధానం చేశాడు. చిన్నబ్బాయి అభిషేక్ అవధానం చేయలేదు కానీ ఆ ప్రక్రియ నేర్చుకున్నాడు. ఇప్పుడు తాను చెన్నైలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవధాన ప్రక్రియ... లెక్కల్లో మెళకువలు తెలుసుకోవడానికి దోహదం చేసింది. పిల్లలకు మాథ్స్ పరీక్ష కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం రాలేదు. - గంగా భవాని, సూర్యతేజ తల్లి నీ హండ్రెడ్ పర్సెంట్... ‘‘ఈ తరం పిల్లలు పెద్దవాళ్లు ఏది చెబితే దానిని యథాతథంగా అనుసరించడం లేదు. ప్రతి విషయాన్నీ ‘ఎందుకు’ అంటారు. అలా ఎందుకు చేయాలో చెప్పాలి. మా అబ్బాయి కృష్ణ ఐఐటి బాంబేలో బీటెక్ చదువుతూ క్యాట్‌కు ప్రిపేరయ్యాడు. బీటెక్ తర్వాత ఏ కోర్సు చదవాలనే డిస్కషన్ వచ్చినప్పుడు... ఉన్న ఆప్షన్లు ఏమిటి, వాటిలో పాజిటివ్‌లు, నెగెటివ్‌లను నా అనుభవాన్ని బట్టి విశ్లేషించి చెప్పాను. తుదినిర్ణయం దగ్గర ఎవరమూ జోక్యం చేసుకోలేదు. నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పిందల్లా... దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేయగల శక్తిసామర్థ్యాలనూ ఇచ్చాడు. మేధ, సామర్థ్యాలను ఉపయోగించడం మన బాధ్యత, ఉపయోగపెట్టలేకపోతే అది అసమర్థత. క్లాసులో ఫస్ట్ రావడం నీ లక్ష్యం కావాలనుకోవద్దు, నీ శక్తిసామర్థ్యాలను నూటికి నూరుశాతం ఉపయోగించుకోమని చెప్పేవాడిని. పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే విసుక్కోకుండా వాళ్ల డౌట్స్ క్లియర్ చేయడం అలవాటు చేశాం. అది కూడా తనకు ఉపయోగపడింది’’. - విశ్వనాథం, కృష్ణ తండ్రి సరైన దిశానిర్దేశం ఉంటే గమ్యాన్ని చేరడం సులువవుతుంది. చక్కటి నైపుణ్యంతో మెరుగులు దిద్దితే వజ్రం కాంతులీనుతుంది. ఎంత చక్కటి పథనిర్దేశకులు ఉన్నా, ఎంతటి నిపుణులు శిక్షణ ఇచ్చినా లక్ష్యాన్ని చేరాలనే తపన లేకపోతే ఎవరూ ఎవరినీ అందలం ఎక్కించలేరు. చక్కటి గెడైన్స్... కెరీర్లో దూసుకుపోవాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లకు చుక్కానిలా పనిచేస్తుంది. - వాకా మంజులారెడ్డి