హీరోగా చేస్తానని అనుకోలేదు: సూర్య తేజ | Surya Aelay Talk About Bharathanatyam Movie | Sakshi
Sakshi News home page

Bharathanatyam: హీరోగా చేస్తానని అనుకోలేదు

Published Wed, Apr 3 2024 6:59 PM | Last Updated on Wed, Apr 3 2024 8:06 PM

Surya Aelay Talk About Bharathanatyam Movie - Sakshi

- సూర్య తేజ 

‘దొరసాని’ ఫేం‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భరతనాట్యం’. ఈ మూవీతో సూర్య తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం,  నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో ఉన్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. 

ఈ సినిమా కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది.  

'భరతనాట్యం' ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. ఈ కథకు 'భరతనాట్యం' పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది.

కాసర్ల శ్యామ్ , అనంత శ్రీరామ్ , భాస్కర భట్ల గారు ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్ గారు చాలా ఫన్ పర్శన్. కథ వింటూ మాతో ట్రావెల్ అయ్యారు. భాస్కర భట్ల గారు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీఫుల్ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

► భవిష్యత్ లో సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు ఉన్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement