ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie Bharathanatyam Ott Streaming On This Date | Sakshi
Sakshi News home page

Bharathanatyam Movie: మూడు నెలల తర్వాత ఓటీటీకి భరతనాట్యం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Mon, Jul 22 2024 4:35 PM | Last Updated on Mon, Jul 22 2024 4:48 PM

Tollywood Movie Bharathanatyam Ott Streaming On This Date

సూర్యతేజ, మీనాక్షి, హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం భరతనాట్యం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా టాలీవుడ్ అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు.

తాజాగా భరతనాట్యం చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా రిలీజైన దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీతోనే సూర్యతేజ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో వైవా హర్ష కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంలో  హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement