Harsha
-
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. సుమ తనయుడు రోషన్, హర్ష చెముడు సందడి
-
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో విషాదంశామీర్‌పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్‌న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ హర్ష
కమెడియన్ హర్ష ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్మెంట్, చికాకు, భయం, థ్రిల్.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్ చేయాల్సిందే!విడాకుల రూమర్స్‌పై క్లారిటీఅసలేదీ ఆశించకూడదు.. తర్వాత నిరాశ చెందకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు పోవడమే అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు హర్షకు ఏమైందని కంగారుపడ్డారు. కొందరైతే అతడు విడాకులు తీసుకోబోతున్నాడంటూ పుకార్లు సృష్టించారు. దీంతో హర్ష తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం సాఫీగానే ఉందని, కెరీర్లోనే చిన్న ఆటంకాలని తెలిపాడు.హ్యాపీగా ఉన్నాఈ మేరకు మరో పోస్ట్ షేర్ చేశాడు. మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకు సాగుతాం.. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు.. నా జీవితంలో యోగక్షేమాలను ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను. పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దానివల్లే ఇబ్బందులు పడుతున్నాను.చెత్త రాజకీయాలుఅయినా ఇవన్నీ ప్రతిచోటా ఉండేవే..! ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరితోనో అనిపించుకునే స్థాయికి రాకండి.. ఒంటరిగా ఒక్కరే పూర్తి చేయండి. చేయగలను అన్న విశ్వాసం ఉంచండి. ఏదేమైనా నేను బాగానే ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు. కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: 12th ఫెయిల్.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్ -
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సూర్యతేజ, మీనాక్షి, హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం భరతనాట్యం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా టాలీవుడ్ అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు.తాజాగా భరతనాట్యం చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమా రిలీజైన దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీతోనే సూర్యతేజ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో వైవా హర్ష కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్‌గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్‌గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్‌లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
అలా నిరాశపరుస్తున్న స్టార్ హీరో రవితేజ.. వరసగా రెండోసారి!
హీరో రవితేజ పేరు చెప్పగానే 'థర్ట్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 1990 నుంచి టాలీవుడ్లో ఉన్న ఇతడు.. సహాయ పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరో రేంజుకు ఎదిగాడు. హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం వరస తప్పులు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడీ విషయమై అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న రవితేజ.. ఎంతోమంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశాడు. అలానే చాలామంది యువ హీరోలకు రోల్ మోడల్ కూడా అయ్యాడు. అయితే హీరోగా చాలా పేరు సంపాదించిన రవితేజ.. కొన్నేళ్ల ముందు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ మాత్రం వరస తప్పులు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) హీరోగా రవితేజ కెరీర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. నిర్మాతగా మాత్రం వరసగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. తొలుత 'గట్టుకుస్తీ' (మట్టీకుస్తీ) అనే తమిళ-తెలుగు డబ్బింగ్ మూవీ తీశాడు కలిసిరాలేదు. ఆ తర్వాత తనే హీరోగా తీసిన 'రావణాసుర'కి నిర్మాణ భాగస్వామ్యం చేశాడు. సేమ్ రిజల్ట్. వీటి గురించి వదిలేస్తే గతేడాది 'చాంగురే బంగారు రాజా' నిర్మించాడు. ఫలితం పెద్దగా మారలేదు. తాజాగా కమెడియన్ హర్ష చెముడుని హీరోగా పెట్టి 'సుందరం మాస్టారు' అనే మూవీ తీశాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన రాలేదు. అయితే ఇన్ని సినిమాల అనుభవమున్న రవితేజ.. నిర్మాతగా ఎందుకో సరిగా కాన్సట్రేట్ చేయట్లేదా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని ఆచరించడంలో మాత్రం పూర్తిగా తడబాటు కనిపిస్తోంది. మరి ఈ విషయంలో రవితేజ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాలి? (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
అతనో కామిక్ యాక్టర్
‘‘సుందరం మాస్టర్’ ట్రైలర్ బాగుంది. కల్యాణ్ సంతోష్‌కు తొలి చిత్రమిది.. మంచి ఫలితాన్నివ్వాలి. రవితేజగారు హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్తవాళ్లని ప్రోత్సహించేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు’’ అన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. హర్ష చెముడు, దివ్య శ్రీపాద జంటగా కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సిద్ధు జొన్నలగడ్డ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘హర్షని కమెడియన్ అనడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ట్రైలర్లో చూసినట్టుగా హర్షని ఎప్పుడూ సీరియస్‌గా చూడలేదు’’ అన్నారు. ‘‘పదేళ్ల క్రితం ప్రేక్షకుల మధ్యలో ఉన్నాను. ఇప్పుడీ వేదికపై ఉన్నాను. గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం’’ అన్నారు హర్ష చెముడు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు సుధీర్ కుమార్. ‘‘ఈ సినిమా మా యూనిట్‌కి గౌరవం తెస్తుంది, ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. -
'ఆ ఊరి అమ్మాయిలకు నల్లగా ఉండే వాళ్లంటేనే ఇష్టం'..!
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోల్డెన్ మీడియా, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మెగాస్టార్ ప్రశంసలు.. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని మెగాస్టార్ అభినందించారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌తోనే నవ్వులు తెప్పిస్తోన్న ఈ చిత్రం.. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. MEGASTAR #Chiranjeevi garu launched the trailer of #SundaramMaster @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA All The Best #SundaramMasterOnFeb23rd Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/OnmGjU2hVa — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2024 -
నలుగురు స్నేహితుల కథ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విక్రమ్ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్’. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
'సద్ది.. పెట్టినోడికి లేదు బుద్ధి'.. రవితేజ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన సుందరం మాస్టర్. ఈ చిత్రానికి కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చేనెల 16న థియేటర్లలో సందడి చేయనుందని రవితేజ్ ట్వీట్ చేశారు. రిలీజ్ తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 'సుందరం మాస్టర్ అటెండెన్స్ కోసం రెడీగా ఉన్నారు.. ఫిబ్రవరి 16న థియేటర్లలో సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వైవా హర్ష కామెడీ సినీ ప్రేక్షకులను నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవన విధానం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుందరం మాస్టర్‌గా హర్ష అభిమానులను అలరించనున్నారు. Our #SundaramMaster is ready to take your attendance! Stooodents get reddie two geev attendance et thiyatars frum Feb 16th!#SM @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/SHUxokoOQ7 — Ravi Teja (@RaviTeja_offl) January 1, 2024 -
స్నేహితుల కథ
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి. -
రోటి.. కపడా.. కామెడీ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘‘వినోద ప్రధానంగా సాగే ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్.జి. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్. -
అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. అక్కను బస్సు ఎక్కించేందుకు బస్సు దగ్గరికి వెళ్లిన బాలుడు బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, జనంపల్లికి చెందిన తన్నీరు శ్రీకాంత్ పోస్ట్‌మెన్‌గా పనిచేస్తూ పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి కుమార్తె నిషిక, కుమారుడు పవన్ హర్షకుమార్(3) సంతానం. గురువారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌లోని కాండర్‌షైన్ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా అతడి కుమారుడు హర్ష కూడా బస్సు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న బస్సు అటెండర్ మల్లారెడ్డి బాలుడిని గమనించకపోవడంతో బస్సు డ్రైవర్ ఈశ్వర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును ముందుకు తీశాడు. దీంతో బస్సు ముందు చక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. దీనిని గుర్తించిన కాలనీ వాసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలోనూ పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్
సాక్షి, అమరావతి : 2024 జనవరి నుంచి విజయవాడలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివహర్ష వెల్లడించారు. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ(ఆర్పీవో) అధికారులతో శనివారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సేవా కేంద్రంగా ఉందని.. గవర్నర్‌పేటలోని ఏజీ ఆఫీస్ కాంప్లెక్స్‌లో వచ్చే జనవరి నుంచి ప్రారంభించే కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం విస్తృత సేవలు అందించనుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలోనే పాస్‌పోర్ట్ ప్రింటింగ్ సౌలభ్యం ఉందని, ఇకపై విజయవాడ నూతన కార్యాలయంలోనూ ఈ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్(పరిపాలన), పాల సీ సంబంధిత సేవలనూ విజయవాడ కార్యాలయం అందిస్తుందని తెలిపారు. దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు ఏపీలోని 15 జిల్లాలకు చెందిన పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు విజయవాడ, తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే), 13 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల(పీఓపీఎస్‌కే) ద్వారా సేవలందిస్తున్నామని, మిగతా జిల్లాలకు విశాఖ ప్రాంతీయ కార్యాలయం సేవలందిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో పాస్‌పోర్ట్, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. గతంలో పాస్‌పోర్ట్ స్లాట్ బుకింగ్‌కు నెల పట్టేదని, ప్రస్తుతం ఐదు నుంచి 12 రోజులే పడుతోందన్నారు. విజయవాడ కార్యాలయ పరిధిలో రోజుకు రెండు వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మూడు లక్షల దరఖాస్తులకు(పాస్‌పోర్ట్‌లు, పోలీసు క్లియరెన్స్) సేవలందించామన్నారు. పాస్ట్‌పోర్ట్ సేవల వినియోగానికి అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని, నకిలీ వెబ్సైట్లు, ఏజెంట్లను నమ్మొద్దని శివహర్ష కోరారు. -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్‌లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
సోషల్ టీచర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే...
హర్ష చెముడు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీ పాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, కుర్రు సుధీర్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘సోషల్ స్టడీస్ బోధించే సుందరం మాస్టర్ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్ టీచర్‌గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మనోడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
తెనాలి: తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అందివచ్చిన టెక్నాలజీతో దర్శక నిర్మాతలు వెండితెరపై అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. అదే బాటలో నవతరం సత్తాను చాటుతోంది. వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలతో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. అవార్డుల పోటీలోనూ ముందంజలో ఉంటున్నారు. ‘గతం’ సినిమా మేకర్స్ దీనికి నిదర్శనం. డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌గా తీసిన ‘ఐడీ’తో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును గెలుచుకున్నారు. సినిమా నిర్మాతల్లో ఒకరైన హర్ష ప్రతాపనేని తెలుగు వాడు...తెనాలి వాడు కావడం విశేషం! విడుదల కాకముందే అవార్డు ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీ ‘గతం’ మేకర్స్ రూపొందించిన రెండో తెలుగు సినిమా ‘ఐడీ’. టాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. చిత్రోమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తీసిన సినిమాకు కిరణ్‌రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. హర్ష ప్రతాపనేని, సృజన్ యరబోలుతో కలసి సుభాష్ రావాడ, భార్గవ పోలుదాసు నిర్మాతలుగా వ్యవహరించారు. భార్గవ పోలుదాసు, రాకేట్ గలేటే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల ఫేం శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. హాలీవుడ్ డీపీ హోరాసియో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందించగా, కాటెరినా ఫిక్కార్డో ప్రొడక్షన్ డిజైన్ పనులను పర్యవేక్షించగా, ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. విడుదల కాకముందే ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ను వెనక్కునెట్టి, ‘బలగం’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలకు దీటుగా ‘ఐడీ’ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 37 అవార్డుల్ని అందుకుంది. 31 అఫీషియల్ సెలక్షన్స్‌ను సాధించి, 5 ఆనరబుల్ మెన్షన్స్‌ను అందుకుంది. నాలుగు నామినేషన్లను పొందింది. త్వరలో కెనడీయన్ స్క్రీన్ అవార్డు (ఆస్కార్ తరహాలో)లకు క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ అయిన ప్రముఖ ఓక్విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌లో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ‘బలగం’ సినిమా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ సంగీతం’ అవార్డును అందుకోగా, ‘సీతారామం’ సినిమా ‘ఉత్తమ చిత్రం’గా అవార్డును అందుకుంది. ఐడీ చిత్రం ‘ఉత్తమ ఎడిటింగ్’అవార్డును గెలుచుకుంది. వినూత్న కథాంశం ‘మీరు ఒక రోజు నిద్రలేచాక, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోతే...’అనే విచిత్రమైన ఆలోచన ఐడీ సినిమా కథాంశం. సహ నిర్మాతగా వ్యవహరించిన హర్ష ప్రతాపనేని తండ్రి పి.వి. గణేష్ స్వస్థలం తెనాలి సమీపంలోని జంపని. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ఖమ్మంలో చేస్తున్నారు. తల్లి మంజులాదేవి గృహిణి. తండ్రి ఉద్యోగం కారణంగా వివిధ ప్రదేశాల్లో చదివిన హర్ష, హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి, అమెరికాలోని ప్రతిష్టాత్మక జేపీ మోర్గాన్స్ ఛేజ్ బ్యాంక్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తున్నారు. చదివే రోజుల్లో క్లాస్మేట్ కిరణ్‌తో కలసి లఘుచిత్రాలు తీసిన హర్ష, ఉద్యోగంలో కొనసాగుతూనే కిరణ్‌తో కలిసి ‘గతం’ సినిమా తీశారు. సహ నిర్మాత, సహ దర్శకుడు, సహ రచయితగా వ్యవహరించాడు. గతం విజయంతో ఇప్పుడు ‘ఐడీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : డెడ్ పిక్సెల్స్ నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాతలు : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా కథ : అక్షయ్ పూల్ల దర్శకత్వం: ఆదిత్య మండల సంగీతం : సిద్ధార్థ సదాశివుని సినిమాటోగ్రఫీ : ఫహాద్ అబ్దుల్ మజీద్ విడుదల తేది: మే 19, 2023(6 ఎపిసోడ్స్) ఓటీటీ ఫ్లాట్‌పామ్: డిస్నీ +హాట్‌స్టార్ నాలుగేళ్ల విరామం తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ లగుసాని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 6 ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ +హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరిస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘డెడ్ పిక్సెల్స్’ కథేంటంటే.. గాయత్రి(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లగుసాని), ఐశ్వర్య(భావన సాగి) ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. వీరిలో గాయత్రి, భార్గవ్‌కి ఆన్లైన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయంలో మాత్రమే కాదు ఆఫీస్ టైమ్‌లో కూడా ఆన్లైన్లో ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ అనే వీడియో గేమ్ ఆడుతుంటారు. విరిద్దరికి ఆ గేమ్ ద్వారలే పైలట్ ఆనంద్(వైవా హర్ష) పరిచయం అవుతాడు. (చదవండి: బిచ్చగాడు మూవీ 2 రివ్యూ) ఈ ముగ్గురికి ఆ గేమ్ తప్ప మరో ప్రపంచం ఉండదు. ఆనంద్ అయితే భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా గేమ్‌కే అడిక్ట్ అవుతాడు. ఈ ఆన్లైన్ గేమ్.. ఆ ముగ్గురిపై ఎలాంటి ప్రభావం చూపింది? గాయత్రికి ఆఫీసులో పరిచమైన రోషన్(సాయి రోణక్) కారణంగా ఆటలోనూ, నిజ జీవితంలోనూ భార్తవ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తండ్రి(రాజీవ్ కనకాల)తో భార్గవ్‌కు ఉన్న సమస్య ఏంటి? ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ గేమ్‌కి అడిక్ట్ అయిన తన స్నేహితులను రియాల్టీలోకి తీసుకురావడానికి ఐశ్వర్య ఏం చేసింది? చివరకు ఏం అయింది? అనేది డిస్నీ +హాట్‌స్టార్‌లో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే.. ఆన్లైన్ గేమ్‌కు బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అలాంటి గేమ్స్‌కి అడిక్ట్ అయితే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది కామెడీ వేలో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా చూపించారు. దర్శక, రచయితలు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. వీడియో గేమర్సే టార్గెట్‌గా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు.ఇందులో ఐశ్వర్య తప్ప మిగిలిన మూడు క్యారెక్టర్స్ వాస్తవ ప్రపంచంలో ఉండవు. యువతే కాదు పెద్దలు కూడా ఇలాంటి ఆటలకు బానిసలైపోతున్నారని వైవా హర్ష ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. భార్య పిల్లన్ని పట్టించుకోకపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది అతని పాత్ర ద్వారా తెలియజేశారు. రియాలిటీకి, ఆన్లైన్లో బతకడానికి మధ్య తేడా ఏంటో ఐశ్వర్య పాత్ర ద్వారా చూపించారు. గేమ్ ఆడేటప్పుడు నిహారిక, సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్‌ల మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. సిరీస్ మొత్తం ఇలానే కామెడీగా తెరకెక్కించినా బాగుండేది. మధ్యలో పేరెంట్స్‌ని కోల్పోయిన ఓ కుర్రాడిని, ఆన్లైన్ బాయ్‌కాట్ లాంటి సన్నివేశాలను ఇరికించారు. అవి అంతగా ఆకట్టుకోలేవు. గేమ్ ద్వారా నిహారిక, భార్గవ్ పాత్రలు చేసే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్షయ్, నిహారిక, సాయి రోణక్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీని మరింత ఆసక్తిగా చూపిస్తే బాగుండేది. ఇక ఆన్లైన్ గేమ్‌ల కంటే మైదానంలో ఆడే ఆటలు చాలా గొప్పవని రాజీవ్ కనకాల పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పాత్ర నిడివిని పెంచి ఆన్లైన్లో ఆడే ఆటలకు, రియల్‌గా ఆడే ఆటలకు మధ్య తేడాలను చూపించే విధంగా కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తే.. మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది.వీడియో గేమ్స్ ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. గాయత్రి పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. తనకు నచ్చినట్టుగా బతికే పాత్ర అది. అర్బన్ గర్ల్‌గా నిహారిక బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక గాయత్రి ఫ్లాట్‌మేట్స్ భార్గవ్, ఐశ్వర్యలుగా అక్షయ్ లగుసాని, భావన సాగి తమ పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక, అక్షయ్‌ల పాత్రలు ఆన్ గేమ్‌కి అడిక్ట్ అయితే.. వారికి హితబోధ చేస్తూ రియాల్టీలో బతికే పాత్ర భావన సాగిది. చూడడానికి అందంగా ఉండి, కాస్త తెలివితక్కువ యువకుడు రోషన్‌గా సాయి రోణక్ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. భార్య పిలల్ని వదిలేసి ఆన్లైన్ గేమ్‌కు బానిసైన పైలట్ ఆనంద్‌గా వైవా హర్ష మెప్పించాడు. ఇక సాంకేతిక పరంగా ఈ సిరిస్ పర్వాలేదనిపిస్తుంది. వరుస వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న తమడా మీడియా ప్రై.లి బ్యానర్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించింది. -
గ్రామీణ ఎఫ్ఎంసీజీ వినియోగం పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
డ్రగ్స్ కేసు; హాస్యనటికి బెయిల్
ముంబై: బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ దుమారం హిందీ చిత్రసీమలో కల్లోలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన హాస్యనటి భారతీ సింగ్, తమె భర్త హర్ష లింబాచియాలకు బెయిల్ లభించింది. ముంబై కోర్టు సోమవారం వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం వీరి ఇంటి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, భారతీ సింగ్‌తో పాటు లింబాచియాను శనివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మత్తుమందులు వాడుతున్నవారికి భయం మొదలైంది. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు వరకు ఈ వరుసలో ఉన్నారు. ఇటీవల నటుడు ఆర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో నటులు అరెస్టు కావడం నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తీరని నష్టాల మధ్య ఈ భారం మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎంత మొగ్గుచూపుతారని అర్థంకాకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జూన్ నెల నుంచి బడా హీరోయిన్లు ఎన్సీబీ కార్యలయం చుట్టూ తిరుగుతున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ మొదలుకొని దీపికా పదుకునే వంటి ఆగ్ర కథానాయికులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇప్పటికే దీపికా విచారణకు రెండుసార్లు ముంబైలోని ఎన్సీబీ కార్యలయానికి హాజరయ్యారు. సుశాంత్ మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి బైకుల్లా జైలునుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ నటిపై సుశాంత్‌తండ్రి అనేక ఆరోపణలు చేశారు. వీటి నడుమ డ్రగ్స్ కేసులో వీరి హస్తం ఎక్కువగా ఉందని తెలియడంతో అధికారులు విచారణ వేగవంతం చేసి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం మొదలు పెట్టారు. (చదవండి: అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్)