వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోల్డెన్ మీడియా, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.
మెగాస్టార్ ప్రశంసలు..
ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని మెగాస్టార్ అభినందించారు.
ట్రైలర్ చూస్తే ఈ సినిమాను ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌తోనే నవ్వులు తెప్పిస్తోన్న ఈ చిత్రం.. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు.
MEGASTAR #Chiranjeevi garu launched the trailer of #SundaramMaster @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA
All The Best
#SundaramMasterOnFeb23rd
Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/OnmGjU2hVa— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2024
Comments
Please login to add a commentAdd a comment