![Mass Maharaja MrBachchan Trailer Update Goes Viral](/styles/webp/s3/article_images/2024/08/5/bhagya.jpg.webp?itok=H-ktBc5P)
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను ఈ నెల 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు రవితేజ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.
#MrBachchan MASS MAHA TRAILER on August 7th 🔥 pic.twitter.com/pcq8kv0pVm
— Ravi Teja (@RaviTeja_offl) August 5, 2024
Comments
Please login to add a commentAdd a comment