వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ | Allu Arjun Pushpa 2 The Rule Trailer Release Date Revealed | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్‌ పుష్ప-2.. ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడంటే?

Published Mon, Nov 11 2024 4:12 PM | Last Updated on Mon, Nov 11 2024 4:27 PM

Allu Arjun Pushpa 2 The Rule Trailer Release Date Revealed

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు.

తాజాాగా పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  ఈ మేరకు అల్లు అర్జున్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం 06 గంటల 03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను బిహార్‌లో పాట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.

కాగా.. పుష్ప-2లో నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పుష్ప పార్ట్‌-1 లాగే ఈ సినిమాలో ప్రత్యేక ఐటమ్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశారు. పార్ట్-1లో సమంత ఫ్యాన్స్‌ను అలరించగా.. పుష్ప-2లో కన్నడ బ్యూటీ శ్రీలీల అభిమానులను మెప్పించనుంది. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement