Pushpa 2: వెయిటింగ్‌ ఈజ్ ఓవర్‌.. పుష్ప-2 ట్రైలర్ వచ్చేసింది | Most Awaited Allu Arjun Pushpa 2 The Rule Movie Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Trailer: 'పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్‌'.. పుష్ప-2 ట్రైలర్ చూసేయండి

Published Sun, Nov 17 2024 6:04 PM | Last Updated on Sun, Nov 17 2024 9:19 PM

Most Awaited Allu Arjun Pushpa 2 The Rule Trailer Out Now

ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్‌ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్‌లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల  చేశారు. ఈ ఈవెంట్‌లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌ షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్‌ ట్రైలర్‌ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2  ట్రైలర్‌ చూసేయండి.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బన్నీ డైలాగ్స్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్‌ అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. పుష్ప అంటే నేషనల్ ‍అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ బన్నీ అదరగొట్టేశాడు. ‍‍అలాగే పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా?.. వైల్డ్‌ ఫైర్‌ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఇక ట్రైలర్‌ చూస్తే బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే పూనకాలు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement