పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు | Actor Mahesh Babu Released Sankarnthiki Vasthunnam Movie Trailer Watch Video Inside, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Sankarnthiki Vasthunnam Trailer: 'మీ ఇద్దరికి హ్యాట్రిక్ ఖాయం'.. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రిన్స్

Published Mon, Jan 6 2025 9:07 PM | Last Updated on Tue, Jan 7 2025 1:19 PM

Tollywood Hero Mahesh Babu Released Sankarnthiki Vasthunnam Trailer

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా ఈ నెల 14న  థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు అభిమానుల నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. సూపర్ స్టార్‌, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. మా పెద్దోడి మూవీ ట్రైలర్ విడుదల చేయడం అనందంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి, వెంకటేశ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. జనవరి 14న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్,  మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ట్రయాంగిల్‌ క్రైమ్‌ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌  నటించారు. వెంకటేశ్‌ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు.

కేవలం 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..

సాధారణంగా స్టార్‌ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ స్టార్‌ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

నాలుగైదు నిమిషాలే వృథా

ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే వృథా అయిందని పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' ఈ చిత్రం అనౌన్స్‌ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్‌ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్‌ సమయంలోనే ఎడిటింగ్‌ చేసేశాం. ఫలానా సీన్‌ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్‌ చేయాల్సి వచ్చింది.  ఈ మూవీకి ఎంత బడ్జెట్‌ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని  అన్నారు.

సంక్రాంతి బరిలో మూడు సినిమాలు..

మరోవైపు ఈ సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేశ్ సంక్రాంతి వస్తున్నాం మూవీతో పాటు రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన గేమ్‌ ఛేంజర్‌ జనవరి 10న విడుదల కానుంది.  బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్‌’ చిత్రం కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement