
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్‌కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.
నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది
ప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.
తన 100వ విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment